05-10-2024, 07:51 PM
(This post was last modified: 05-10-2024, 09:35 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
7. తెలిసిపోయిందా!
సుధాకర్ మరియు సందీప్ లు సుహాసిని ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటే, బంటి కారులో పడుకొని నిద్రపోతున్నాడు. అతని ఎదురుగా ఉన్న ఫోన్ లో అక్కడ జరుగుతుంది అంతా రికార్ట్ అవుతూ ఉంది.
వెంటనే ఫోన్ రావడం, బంటి కంగారుగా అటూ ఇటూ కదలడంతో ఫోన్ కింద పడింది. పైకి లేచి ఫోన్ ని కదిలిస్తూ ఉండగా... స్క్రీన్ మారిపోయి (అన్న ఇన్ వదిన) కాలింగ్ అని పడింది.
సుజాత పిలవడంతో బంటి స్పీడ్ గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
బంటి లోపలకు వస్తూనే సోఫాలో మాములుగా కూర్చొని ఉన్న అన్న(కరణ్)ని చూస్తూ పక్కనే మరో సోఫాలో కూర్చున్న వాణి, ఆమె పక్కనే కూర్చున్న సుజాతని చూస్తూ ఆలోచించుకుంటూ "ఇప్పుడు వదినలో అన్న ఉంటే, అన్నలో వదిన ఉంటుంది... అంటే ఇప్పుడు మనోడు ఆడపిల్లలా నడుస్తాడా!" అనుకున్నాడు.
బంటి "అన్నా.... అన్నా.... నన్ను గుర్తు పట్టావా!... నేను నీ ఒక్కగానొక్క తమ్ముడిని... నువ్వు ఎప్పుడూ దొంగ తనం చేసి నా మీద వేసుకోమంటే వేసుకునే వాడిని.... నీకు హోం వర్క్ ఇస్తే నా చేత చేయించే వాడివి... గుర్తు రాలేదా.... చిన్నపుడు నన్ను కొట్టి నా చాక్లెట్ లు తినేవాడివి.... ఇంకా గుర్తు రాలేదా!"
కరణ్ నుదురు పట్టుకొని ఎదో ఆలోచిస్తూ ఉన్నట్టు మొహం పెట్టాడు.
బంటి "ఏం పర్లేదు?... నువ్వు నన్ను ఎన్ని కొట్టినా తిట్టినా.... ఎంత దుర్మార్గుడివి అయినా.... ఎంత వెధవవి అయినా.... నీచ్ కమీన్ కుత్తే గాడివి అయినా నా అన్నవి.... కాబట్టి నీ కోసం నేను కస్టపడి నీ గతం గుర్తొచ్చేలా చేస్తా...." అన్నాడు.
అక్కడే ఉన్న ఇద్దరూ సుజాత మరియు వాణి ఇద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు.
కరణ్ పైకి లేచి బంటి చెవి మెలిక వేసి "ఏరా... నేను నిన్ను కొట్టానా.... నా మైండ్ దొబ్బిండా.... హా!!" అంటూ చేయి పైకి లేపి కొట్టబోతూ ఉన్నట్టు నటిస్తూ ఉండగానే... బంటి "అమ్మా.... కాపాడు..." అంటూ కేకలు పెడుతున్నాడు.
సుజాత మరియు వాణి ఇంకా పెద్దగా నవ్వుతున్నారు. సుజాత ఆపమని చెప్పడంతో ఇద్దరూ ఆగిపోయారు.
బంటి, కరణ్ ని వాణి ని ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ ఎప్పుడూ... ఎప్పుడూ... ఎప్పుడు మారిపోయారు అని అడిగాడు.
వాణి మరియు కరణ్ ఇద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకోగానే ఆ రాగి కంకణాలు పాములులాగా మారిపోయి ఒకరి చేతి నుండి మరొకరి ఎక్సచెంజ్ అయిపోయాయి. అలాగే ఇద్దరి ఆత్మలు కూడా తిరిగి యదాస్థానానికి వచ్చేశాయి.
సుజాత "అయింది లే.... కాని పదా భోజనం చేయండి" అంటూ తీసుకొని వెళ్ళింది. నలుగురు హోటల్ లో లోకి వెళ్తున్నారు.
కరణ్ తిరిగి హాల్ లోకి వస్తూనే వాణి చేయి పట్టుకున్నాడు. వాణి వెనకే వస్తున్న సుజాతని గమనించి వాణి అతని చేయి నెట్టేసింది. వాణి నిజానికి సుజాత అసిస్టెంట్...
కరణ్ ఇక ఉండబట్టలేక, సుజాతకి కళ్ళతోనే చెప్పి... వాణిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు.
బంటి పరిగెడుతూ ఉంటే, సుజాత అక్కడితో ఆపేసింది.
బంటి "కాని అమ్మా.... వదిన తనని ఇష్టపడడం లేదు.... ఆ డైరీ చదివాడు కదా...."
సుజాత "ఎవరూ చెప్పారు ఇష్టపడడం లేదు అని.."
బంటి "కాని డైరీ లో రాయలేదు కదా...."
సుజాత చిన్నగా నవ్వి ఊరుకుంది.
బంటి, సుజాత ఇద్దరూ చూస్తూ ఉండగా కొద్ది దూరంలో వాణి మరియు కరణ్ ఇద్దరూ నిలబడి ఉన్నారు.
వాళ్ళు ఉన్న చోట చిన్న వర్షం పడుతుంది. సిల్క్ సారీలో సన్నగా అందంగా తెల్లగా కనిపిస్తూ ఉంటే, కరణ్ చెప్పాలా వద్దా అని ఆదుర్దాలో చూస్తూ కనిపించాడు.
కరణ్ అటూ ఇటూ తిరిగి మొత్తానికి కళ్ళు మూసుకొని తన మనసులో ఉన్న మాట బయట పెట్టాడు.
కరణ్ "వాణి..... పెళ్లి చేసుకుందాం...."
వాణి నోరు తెరిచి మాట్లాడకుండా దూరంగా నిలబడి ఉన్న సుజాత వైపు చూసింది.
సుజాత నవ్వుతూ థమ్స్ అప్ సింబల్ చూపించింది. వాణి కూడా సంతోషంగా నవ్వేసింది.
కరణ్ ఇబ్బంది పడుతూ "వాణి పెళ్లి చేసుకుందాం... నేను నిన్ను బాగా చూసుకుంటాను"
వాణి ముందుకు వచ్చి తన చేతులు జాపి కరణ్ ని హాగ్ చేసుకుంది. ఆమె మెత్తటి శరీరం తనకు తాకుతూ ఉంటే కరణ్ కి గూస్ బంప్స్ వచ్చేశాయి.
వాణి అతని చాతి మీద తల ఉంచి, పెరుగుతున్న అతని గుండె వేగం వింటూ నవ్వుకుంటూ ఉంది.
బంటి చిన్న సైజ్ డాన్స్ చేస్తూ "మా అన్న గాడి పొలంలో మొలకలోచ్చాయ్" అంటూ నవ్వుతున్నాడు.
కరణ్ మరియు వాణి ఇద్దరూ కొద్దిసేపు అలానే ఉండి, తిరిగి నవ్వుకుంటూ ఒకరి చేయి మరొకరు పట్టుకొని తిరిగి సుజాత మరియు బంటి దగ్గరకు వచ్చారు.
నలుగురు కూర్చొని భోజనం చేస్తున్నా... కరణ్ మరియు వాణి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు.
బంటి మాత్రం వాళ్ళ అన్నని ఆట పట్టిస్తూ... ఉన్నాడు.
బంటి "వదినా.... మా వోడికి సెక్స్ ప్యాక్ ఉంది, తెలుసా..."
వాణి "లేదు... అయినా హేల్తిగా ఉంటే చాలు.... ఏ ప్యాక్ లు అవసరం లేదు" అంటూ కరణ్ ని చూసింది.
బంటి "ఇప్పుడు చెప్పూ.... నీకు ఎలా తెలుసు.... లేదని... ఓహో తన బాడీలో ఉన్నప్పుడు మొత్తం చూసుకున్నావా!" అన్నాడు.
కరణ్ కోపంగా "రేయ్..." అని అరవడంతో బంటి ఆగిపోయాడు.
బంటి తల వంచుకుని నవ్వుకుంటూ ఉన్నాడు.
కరణ్ "ఏమయింది?" అని రెండూ మూడు సార్లు అడిగాడు.
బంటి "వదినా.... మా వాడికి... ఎక్సర్సైజు అంటే చాలా ఇష్టం... నువ్వు నిద్ర లేవలేదనుకో నే బాడీలోకి తను వచ్చి నీ ఎక్సర్సైజు చేస్తాడు. నువ్వు నిద్రపోతూ కూడా ఫిట్ నెస్ మైంటైన్ చేసుకోవచ్చు" అంటూ నవ్వాడు.
సుజాత "బంటీ..." అని అనడంతో ఆగి పోయి తల దించుకున్నాడు.
కరణ్ మరియు వాణి ఇద్దరూ ఒకరినొకరు దొంగతనంగా చూసుకుంటూ భోజనం చేస్తూ ఉన్నారు.
బంటి "అమ్మా, నీకు ఎలా తెలుసు.... వదిన ఒప్పుకుంటుంది అని..."
సుజాత "మీ అమ్మని కదా.... నాకు తెలుస్తుంది లే... " అంది.
బంటి "అంటే ఎలా...."
సుజాత "ఎక్సపీరియన్స్ రా....." అంది.
బంటి "అవునూ.... వదిన..... నీ వెనక మా వాడు హచ్ కుక్కలా తిరిగాడు కదా... నీకు లవ్ చేయాలని అనిపించలేదా.... పోనీ ఎక్కడేక్కడే బురదలో తిరిగి ఎండలో ఎండిన పిచ్చి కుక్క అనుకున్నావా...."
కరణ్ కోపంగా "ఒరేయ్...." అన్నాడు.
వాణి "నువ్వు అలా మాట్లాడకు బంటి... తను మీ అన్నయ్య...."
కరణ్ "నన్ను లవ్ చేయాలని ఎందుకు అనిపించలేదు"
వాణి తల దించుకొని ఉంది.
బంటి "కుక్కలా నువ్వు వెంట పడుతున్నావు అని నచ్చలేదేమో...."
వాణితో పాటు కరణ్ ఇద్దరూ "బంటి..." అని పిలిచారు.
బంటి సైలెంట్ అయ్యాడు.
సుజాత కూడా "అయిందా!" అనడంతో బంటి తల దించేసుకున్నాడు.
వాణి "నాకు నువ్వంటే ఇష్టం..." అంది, బంటి మరియు కరణ్ ఇద్దరూ తననే చూస్తూ ఉంటే, వాణి "ఏమయింది?"
బంటి "అబద్దం చెప్పకు వదినా.... మా వొడికి అందరూ ఆడపిల్లలు పుట్టారనుకో... ఆస్తి మొత్తం నా కొడుకులకు ఇవ్వాల్సి వస్తుంది"
కరణ్ కూడా అబద్దం అన్నట్టు నవ్వుతున్నాడు.
వాణి "ఏమయింది మీకు.... నాకు కరణ్ అంటే మొదటి నుండి ఇష్టమే...."
కరణ్ "ఓకే.... ఓకే.... "
బంటి "నమ్మాము లే వదిన...."
వాణి కోపంగా కూర్చుంది.
బంటి "వదినా.. అన్న హ్యాకర్ అని తెలుసు కదా..... మనోడు నీ ఆన్లైన్ డైరీ చదివాడు.... అందులో మా వాడి గురించి ఒక్క సారి కూడా రాయలేదు" అన్నాడు.
వాణి "వాట్.... నా డైరీ హ్యాక్ చేశావా..." అని కరణ్ వైపు చూసింది.
కరణ్ ఇబ్బందిగా చూడడంతో వాణి వెంటనే కూల్ అయి "సర్లే..... అయినా నేను డైరీలో మీ అన్న గురించి ఎప్పుడూ రాయలేదు" అంది.
బంటి "అయితే ఒప్పుకున్నట్టే కదా.... నువ్వు లవ్ చేయలేదు అని...."
వాణి "లేదు..."
బంటి "అదేంటి?"
కరణ్ "హా.... అదేంటి?"
వాణి "నా ల్యాప్ టాప్ తీసుకొని రండి..."
వాణి ల్యాప్ టాప్ ఓపెన్ చేసి ఆన్ లైన్ డైరీలో id పాస్వర్డ్ కరణ్ చూస్తూ ఉండగా ఎంటర్ చేసింది.
కరణ్ అది చూసి షాక్ అయ్యాడు.
పాస్వర్డ్ "కరణ్ I L U"
కరణ్, వాణిని హాగ్ చేసుకున్నాడు. వాణి నవ్వేస్తుంది.
బంటి వాళ్ళను చూసి నవ్వుకుంటూ బయటకు వచ్చి వాణి వాళ్ళ అమ్మని ఉంచిన చోట ఉన్న సీక్రెట్ కెమెరా ఓపెన్ చేసి చూశాడు.
సుధాకర్ "ఎక్కడకు వెళ్ళింది"
సుహాసిని "తెలీదు"
సందీప్ "గట్టిగా పట్టుకొని ఉండొచ్చు కదా అమ్మా..."
సుహాసిని "నాకు అదే అర్ధం కావడం లేదు రా.... ఎంత ప్లాన్ చేసి మీకు ఎక్కడ ఉన్నానో పంపిస్తున్న.... మీరు వచ్చే లోపే ప్లేస్ మార్చేస్తుంది"
సందీప్ "మనం త్వరగా వాణి అక్కని ఆ హాంకాగ్ బ్యాచ్ కి అప్పగించేస్తే... నాకు హార్ట్, నాన్నకి లివర్... ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ కి కిడ్నీ ఇస్తారు. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు..."
సుధాకర్ "అవునూ... అసలు మనం చిన్నప్పటి నుండి అందుకే కదా పెంచాం...."
సుహాసిని అటూ ఇటూ తిరిగి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న బొమ్మని చూస్తూ అందులో ఉన్న సిక్రెట్ కెమెరా చూసింది.
దాన్ని దగ్గర నుండి చూస్తూ వికృతంగా నవ్వుతూ "అయితే..... తెలిసిపోయిందా!"
సందీప్ "అయ్యో ఇప్పుడెలా..."
సుహాసిని "తెలిస్తే.... తెలియనివ్వు... అడ్డం వచ్చిన అందరిని చంపేద్దాం..."
బంటి కి చల్లగా చమటలు పట్టేశాయి. సుహాసిని ఆ కెమెరాని తీస్కోని వచ్చి వాటర్ సింక్ లో వేసేసింది.
బంటి తిరిగి రూమ్ లోకి వస్తూ ఉంటే.....
వాణి మాటలు వినపడ్డాయి.. త్వరలో మా అమ్మకి ఈ విషయం చెప్పాలి. చాలా సంతోషిస్తుంది....
బంటి రూమ్ లోకి వెళ్ళగా అందరూ నవ్వుకుంటూ ఉన్నారు.
బంటి మోహంలో బాధని చూసి వాణి "సారీ.... బంటి ఏమయినా అంటే... ఫీల్ అవ్వకు.... ప్లీజ్" అంది.
కరణ్ "అవునూ.... ఫైవ్ స్టార్ కొనిపెడతాను"
బంటి "రెండూ కావాలి" అన్నాడు.
అందరూ నవ్వేశారు.
ఇంకా నాలుగు లేదా అయిదు ఎపిసోడ్స్ మాత్రమే....