04-10-2024, 02:09 PM
"నువ్వు ఇంట్లోనే ఉంటావు కదరా".. తల్లి అడిగిన ప్రశ్నకి తల ఊపాడు సంజయ్.
"ఉంటావా లేదా సరిగా చెప్పు. నువ్వు వెళ్తాను అంటే నేను బయట తలుపు లాక్ చెయ్యకుండా ఉంటాను, నిన్న వచ్చిన అమ్మాయి వచ్చి అంట్లు తోముతుంది, ఈ విషయం లక్ష్మికి చెప్పాలి కూడా" గట్టిగా అడిగింది మృదుల.
"లేదమ్మా, ఇంట్లోనే ఉంటా. పనుంది నాకు" బదులిచ్చాడు సంజయ్.
"నీ పనులు బయట కదరా ఉండేది. ఇంట్లో పనులేముంటాయి"... నవ్వుతూ అడిగింది.
"కంప్యూటర్ పని అమ్మా. ఇంట్లోనే ఉంటా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా" అన్నాడు.
"అయితే సరే. జాగ్రత్త"... అంటూ ఆఫీసుకి వెళ్ళింది మృదుల.
పనిపిల్ల కోసం వెయిట్ చేస్తున్నాడు సంజయ్.
'ఏంటి ఈ పిల్ల ఇంకా రాలేదు. పేరేంటంటే చుక్క అంది, అది అయ్యిండదు పేరు, ఇంకేదో అయ్యింటుంది. కనుక్కోవాలి'... అనుకుంటూ అటూ ఇటూ నడుస్తున్నాడు.
ఇంతలో గేట్ చప్పుడయింది. గేట్ బయట పనిపిల్ల.
"తీసే ఉంది... లోపలికి రా"
తలూపూతూ లోపలికి వచ్చింది.
"అంట్లు బయట పెట్టింది అమ్మ, అన్ని బయటే ఉన్నాయని చెప్పమంది"... పిల్లతో చెప్పాడు.
తలూపింది.
"బట్టలు బాబు?"
"ఉతకాలి.. ఉతుకుతావా. నిన్ను కనుక్కోమంది అమ్మ"
"ఉతుకుతాను బాబు. సాయంత్రం వస్తాను బట్టలకి. మీరు తడిపి ఉంచండి"
తలూపాడు.
అమ్మాయి కూర్చుని అంట్లు తోమసాగింది.
కంప్యూటర్ ముందుకెళ్లాడు సంజయ్. కాసేపు ఏదో చేశాడు.
బయటకి వచ్చాడు.
కాఫీ తాగాలనిపించింది.
"కాఫీ తాగుతావా?" అడిగాడు.
"ఏంటి బాబు?"... తోముతున్న గిన్నె పక్కనపెట్టి అడిగింది.
"కాఫీ తాగుతావా?"
"లేదు బాబు"
"అసలు తాగవా, ఇప్పుడు వద్దా?"
"కాఫి అలవాటు లేదు బాబు"
"టీ?"
తలూపింది.
"నాకు టీ పెట్టడం రాదు. ఇప్పటికి కాఫీ తాగు"
"వద్దు బాబు. మీరు తాగండి"... లేస్తూ అంది.
"కాఫీ ఇష్టం లేదా?"
"మీరు అన్నీ నాకు కూడా ఇవ్వడం ఎందుకు బాబు, మీరు తాగండి"
"అన్నీ ఏంటీ?"
"నిన్న నూడిల్స్ ఇచ్చారు, ఇప్పుడు కాఫి"
"ఈ మాత్రానికే అన్నీ ఏంటి. లక్ష్మి ఉంటే లక్ష్మికి ఇస్తాం. నువ్వు ఉన్నావు, నీకు ఇస్తాను"
ఏమీ మాట్లాడకుండా అలానే ఉన్న అమ్మాయిని చూస్తూ... "తెస్తాను చేతులు కడుక్కో".. అంటూ లోపలికి వెళ్లాడు సంజయ్.
'లక్ష్మక్క చెప్పినట్టు మంచివాళ్ళు' అనుకుంది అమ్మాయి మనసులో.
రెండు నిముషాల్లో బయటకి వచ్చాడు.
"ఇక్కడ కూర్చో" మెట్లు ఎక్కాక ఉండే గది గుమ్మం వైపు చూపించాడు.
"పర్లేదు బాబు. బయట తాగుతాను"
"పనుంది. కూర్చో" అంటూ లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చాడు.
"ఇదిగో ఈ కప్ నీకు. తాగి, కడిగి బయటే పెట్టు. రేపు మళ్ళీ ఇదే కప్ వాడచ్చు. కొత్త కప్ తీశాను. నేను కూడ ఇలాంటి దాన్లోనే తాగేది"... చెప్తూ కప్ ఒకటి చేతికిచ్చాడు.
"తెలుసు బాబు. బ్లూ కలర్ కప్"
"కలర్ నీకెలా తెలుసు?"... ఆశ్చర్యపోతూ అడిగాడు.
"రాగానే ముందు కడిగింది ఆ కప్ బాబు"... చిన్నగా నవ్వుతూ చెప్పింది.
నవ్వాడు.
"ఏం చదువుకున్నావు?"
"డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి"
"అవునా. ఇంకా చదువుకుంటున్నావా"... ఊహించనది విన్నట్టు ఆశ్చర్యపోయాడు.
"అవును బాబు. బీ.కాం"
"అవునా"... అంటూ తలూపాడు.
"మీరు ఇంజనీరింగ్ కదా బాబు"
తలూపాడు.
"అంటే నువ్వు నా కన్నా పెద్దదానివి"
తలూపింది.
"నేనింకా ఇంటర్ చదివి ఆపేసావు, ఇలా ఏదో అనుకున్నా"
కాదన్నట్టు అడ్డంగా తలూపింది.
"కాలేజ్ లేదా?"
"సిలబస్ చెప్పేసారు బాబు. అప్పుడప్పుడు ఇలా ఏదన్నా పని ఉంటే వెళ్ళను. లక్ష్మక్క చాలా చెప్పింది మీ ఇంటి పని చెయ్యమని. అందుకే వచ్చాను"
"మంచి పని చేసావు. అమ్మకి ఆఫీసులో చాలా పని ఉంది. నువ్వు రాకపోతే కష్టమయ్యేది. థ్యాంక్ యూ"
"అయ్యో. దీనికి థ్యాంక్స్ ఏంటి బాబు. చేస్తున్నది సాయం కాదు బాబు, పని. లక్ష్మక్క బదులు నేను వచ్చా అంతే"
"నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది"... అన్నాడు.
నవ్వింది.
"అన్నిటి కన్నా పెద్ద ఆశ్చర్యం నీ పేరు. నీ అసలు పేరేంటి చెప్పు నాకు"
"చుక్క బాబు"... మళ్ళీ అదే పేరు చెప్పింది.