04-10-2024, 07:38 PM
(This post was last modified: 05-10-2024, 01:10 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
170. హనీమూన్
హాల్ లోని సోఫాలలో అందరూ కూర్చొని ఉంటారు. పిల్లలు టీవీలో కార్టూన్ చూస్తూ ఉంటే, పెద్ద వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు.
క్రిష్ సౌండ్ చేస్తూ ఆవలిస్తూ బలవంతంగా మెళుకువతో ఉండడం కోసం ఫోన్ చూస్తూ ఉంటాడు.
అతని పరిస్థితి అర్ధం చేసుకొని నిషా క్రిష్ ఫోన్ కి మెసేజ్ పంపిస్తుంది.
నిషా "ఏమయింది? నిద్ర వస్తుందా!"
క్రిష్ "హుమ్మ్... కాఫీ పెట్టవే నీకు పుణ్యం ఉంటుంది"
నిషా "నోరు తెరిచి అడుగు.... మెసేజ్ ఎందుకు చేస్తావ్...."
క్రిష్ "అప్పుడు అందరూ నీకు ఎందుకు చెబుతున్నావ్.... నీ పెళ్ళాన్ని అడుగు అంటారు...."
నిషా "అడగని..."
క్రిష్ "మీ అక్క పెట్టిన కాఫీ తాగితే.... మా అమ్మ వాళ్ళు ఇటూ నుండి ఇటే ఇంటికి వెళ్ళిపోతారు"
నిషా నవ్వుకొని క్రిష్ ని చూసి "మరేం చేద్దాం... పోనీ నువ్వు పెట్టు...."
క్రిష్ "నేనే పెడుదును.... మా అమ్మ వాళ్లకు అప్పటికే నేను పెద్ద వయస్సు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని చేసుకున్నా అని కొంచెం కోపం ఉంది... అదే, నేను వంట చేస్తూ ఇంటి పట్టున ఉంటున్నా అని అనిపిస్తే.... ఇంకేమైనా ఉందా...."
నిషా "నీ లాంటి రిచ్ పర్సన్ కూడా ఇలా మాట్లాడితే ఎలా...."
క్రిష్ "ఓహో..... అయితే నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అని మీ అక్కకి చెప్పేస్తా...."
నిషా "చెప్పుకో...."
క్రిష్ "అందరికి చెప్పేస్తా....."
నిషా "చెప్పుకో...."
క్రిష్ "అమ్మా, తల్లి నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నా.... కొంచెం కాఫీ ప్రసాదించు తల్లి.... నిద్ర తూలీ పోతుంది..."
నిషా "..."
ఒక నిముషం తర్వాత...
నిషా "ఆల్రైట్ భక్తా..... కోరిక మన్నించాం.... వెళ్తాం..."
కాజల్ ఆవలిస్తూ కిచెన్ లోకి వెళ్ళిన నిషా పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ క్రిష్ కి సైగ చేసింది. క్రిష్ ఆమె సైగలు అర్ధం చేసుకొని గబా గబా కిచెన్ వైపు పరిగెడతాడు.
మధ్యలోనే క్రిష్ వాళ్ళ వదిన ఆపి... "మరిది గారు.... రాత్రి వరకు, కాస్త ఓపిక పట్టండి" అంటూ ఆటపట్టిస్తుంది.
క్రిష్ "అది కాదు వదినా కాఫీ తాగుదాం అని...."
లావణ్య కూడా ఎర్రని కళ్ళు వేసుకొని ఆవలిస్తూ ఎదురు వచ్చి "కిచెన్ లో మీ ఇద్దరూ ఏం ఏం చేస్తారో మాకు తెలుసు...."
క్రిష్ కోపంగా లావణ్యని చూస్తూ ఉంటే, లావణ్య అదేం పట్టించుకోకుండా "మీరు వచ్చిన రోజు వీళ్లు ఇద్దరూ కిచెన్ లో....."
నిషా "లావణ్య నీ ఫోన్ మోగుతుంది...."
లావణ్య "ఎక్కడ.... ఎవరూ...." అంటూ వెళ్ళింది.
నిషా "ఓహో నీది కాదు రింగ్ అయింది.... సర్లే..."
లావణ్య వచ్చి ఫోన్ ముందు వేసుకొని కూర్చొని సెటిల్ అయిపోతుంది.
క్రిష్ తన వదినని తప్పించుకొని వెళ్ళే లోపే, కాజల్ కాఫీ ట్రే పట్టుకొని బయటకు వచ్చేస్తుంది.
ఆ కాఫీ చూసి క్రిష్ భయపడ్డాడు. క్రిష్ రియాక్ట్ అయ్యేలోపే, అందరూ ఆత్రంగా కాఫీ అందుకొని తాగుతున్నారు.
క్రిష్ కూడా కొంచెం తాగగానే బాగుంది, నిషా వైపు చూశాడు. నిషా నవ్వుతూ ఫోన్ లో మెసేజ్ చేసింది.
క్రిష్ కూడా వెళ్లి ఫోన్ చూడగానే నిషా "ఆల్రెడీ చేసి పెట్టాను... మా అక్కకి నేను ఉంటాను రా... బాధపడకు..."
క్రిష్ "ఎంతైనా రంకు పెళ్ళాం అనిపించావే!"
నిషా "కాఫీ బాగుందా రంకు మగడా..."
క్రిష్ "వద్దు.... ఆగిపో... అక్కడే! నాకు పెళ్లయింది... నీకు కూడా పెళ్లయింది....."
నిషా నవ్వుకొని "బావా... పైకి రా... బ్యాటింగ్ ఆట ఆడుకుందాం"
క్రిష్ మెసేజ్ చూసి తిరిగి నిషా వైపు చూశాడు, నిషా నవ్వుతూ ఉంది.
క్రిష్ "నీకు దండం పెడతాను.... ఇలాంటివి పంపకే తల్లి...."
నిషా సైలెంట్ గా నవ్వుకుంటూ ఉంది.
క్రిష్ వాళ్ళ అన్న వచ్చి క్రిష్ మెడ చుట్టూ చేతులు వేసి "గోవాకి వెళ్ళండి రా... హనీమూన్ కి.... ట్రైన్ టికెట్స్ చేయిస్తాను"
లావణ్య "అదేం కుదరదు... ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను"
కాజల్ వచ్చి, క్రిష్ పక్కనే కూర్చొని "నాకు ట్రైన్ లో వెళ్లాలని ఉంది"
క్రిష్, కాజల్ చెవిలో "నువ్వు కూడా నేను ఆలోచిస్తుందే ఆలోచిస్తున్నావా!"
కాజల్ మొహం సిగ్గుతో ఎర్రగా అయిపోయి దూరం జరిగింది.
క్రిష్, లావణ్యని చూస్తూ "ఏం చూస్తున్నావ్?.... ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చెయ్... ట్రైన్ టికెట్ బుక్ చేయడం లో హెల్ప్ చెయ్...."
లావణ్య "కాని చాలా అమౌంట్ వెస్ట్ అవుతుంది" అని విసుక్కుంది.
క్రిష్ "మిస్ లావణ్య..."
లావణ్య "హుమ్మ్"
క్రిష్ "రాజ్యాంగం అందరికి మాట్లాడే స్వేచ్చ ఇచ్చింది, నువ్వు ఆ స్వేచ్చని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నావా! ఇచ్చేస్తాను..."
లావణ్య షాకింగ్ గా చూసింది. ఇన్ డైరక్ట్ గా జాబ్ నుండి పీకేస్తా అని వార్నింగ్ ఇస్తున్నాడు. క్రిష్ కి లావణ్య ఎప్పుడూ నచ్చదు. కాని కాజల్ ముందు మరియు ఫ్యామిలీ ముందు బయట పడలేక పోతున్నాడు.
క్రిష్ నవ్వుతున్నాడు కాని భయపెడుతున్నాడు.
లావణ్య క్రిష్ ని చూస్తూ "సర్" అంది.
క్రిష్ నవ్వేసి "ఉమ్మ్ " అంటూ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు.
గదిలో ఉన్న అందరూ వాళ్ళ ఇద్దరినీ చూస్తూ ఉన్నారు.
క్రిష్ "ఏం డిసైడ్ అయ్యావ్..."
లావణ్య "ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసి, ట్రైన్ టికెట్ బుక్ చేయడం లో మీ బ్రదర్ కి హెల్ప్ చేస్తాను"
క్రిష్ ఫోన్ పక్కన పడేసి ఆమెనే చూస్తూ ఉన్నాడు.
లావణ్య తల దించుకొని దవడలు బిగించి తల దించుకొని "సర్" అని ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది.
అందరూ తననే చూస్తూ ఉన్నారు.
క్రిష్ వాళ్ళ అన్నయ్య మాత్రం, క్రిష్ వీపు మీద కామిడీగా చరిచాడు. క్రిష్ పట్టించుకోకుండా నవ్వాడు.
కాజల్ నోరు తెరుచుకొని చూస్తూ "ఒరేయ్..... నువ్వు కాలేజ్ లో ర్యాగింగ్ చేస్తావ్ కదా... నిజం చెప్పూ...." అంది.
నిషా "అక్కా..." అంటూ చుట్టూ చూపించింది.
కాజల్ సర్దుకొని "చెప్పండి..." అని కవర్ చేసింది.
క్రిష్ నవ్వి "లేదు" అంటూ తల ఊపాడు.
కాజల్ "లావణ్యా..." అంటూ పిలిచి "మీరు క్లాస్ మేట్స్ కదా... ఏం చేసేవాడు చెప్పూ"
అందరూ లావణ్యని చూస్తూ ఉన్నారు.
క్రిష్ "కాదు.... కాదు.... తను వేరే బిల్డింగ్ నేను వేరే బిల్డింగ్ అస్సలు కలవం..."
లావణ్య "సెకండ్ ఇయర్ మొదట్లో కొంత మంది ఫస్ట్ ఇయర్ వాళ్ళను ర్యాగింగ్ చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు అని తెలిసింది. కాలేజ్ మొత్తం అదే చెప్పుకున్నారు" అని క్రిష్ ని చూస్తూ ఉంది.
క్రిష్ ఫ్యామిలీ అందరూ ఇబ్బందిగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ వరకు క్రిష్-నిషా ల ఫ్లాష్ బ్యాక్ అంత మంచిది కాదు. క్రిష్ లైఫ్ స్పాయిల్ అయిపొయింది ఇక పెళ్లి కాదు అనుకున్నారు. కాని క్రిష్ పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి సంతోషించారు. అందరి ముందు మరో సారి పెళ్లి చేయాలని లేదా రిసెప్షన్ చేయాలని అనుకుంటున్నారు. కాని ఆమె ముందు ఇలా రష్ విషయం బయట పడితే ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
కాజల్ నవ్వేసి "నాకు తెలుసు.... ఆమె పేరు రష్..." అని నవ్వేసింది.
లావణ్య ముందుకు వంగి కాజల్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ "నిజంగా అంతా తెలుసా..." అని అడిగింది.
క్రిష్ "ఏం చేస్తున్నావ్..."
కాజల్ ఒక్క నిముషం తత్తర పడి తిరిగి క్రిష్ మీద నమ్మకంతో "నాకు క్రిష్ మీద నమ్మకం ఉంది" అంది.
నిషా "లావణ్య..... క్రిష్ కి పెళ్లి అయిందని పిల్లలు ఉన్నారని తెలిసి కూడా లవ్ లెటర్స్ రాశావా....." అని అడిగింది.
కాజల్ "వాట్.... నువ్వు క్రిష్ కి లవ్ లెటర్స్ రాశావా...." అంటూ ఏమి తెలియనట్టు అడిగింది.
లావణ్యకి ఏం చెప్పాలో అర్ధం కాక అటూ ఇటూ చూస్తుంది.
క్రిష్ "నువ్వు వేళ్ళు...." అని చెప్పడంతో లావణ్య అక్కడ నుండి వెళ్ళిపోయింది.
అక్కడ ఉన్న అందరు ఇబ్బందిగా ఉండడం చూసి నిషా ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పడంతో లావణ్యకి చెప్పకుండానే అందరూ రెడీ అయి వెళ్ళిపోయారు.
లావణ్య ఒక్కతే కూర్చొని బాధ పడుతూ ఉంది.
వెంటనే ఫోన్ మోగింది.. అది చూసి నవ్వుతూ....
లావణ్య నవ్వుతూ "నూతన్ భయ్యా...." అంది.
నూతన్ " *** "
లావణ్య "భయ్యా నువ్వు ఇచ్చే మందు కలుపుతున్నాను అయినా క్రిష్ నాతొ ప్రేమలో పడడం లేదు"
నూతన్ " *** "
లావణ్య "అలాగే భయ్యా.... ఒపికపడతాను..."
నూతన్ " *** "
లావణ్య "ఇంకేం కొత్తగా లేదు భయ్యా....."
నూతన్ " *** "
లావణ్య "హుమ్మ్..... మర్చిపోయాను... క్రిష్ తన కొత్త భార్యతో గోవాకి హనీమూన్ వెళ్తున్నాడు"
నూతన్ " *** "
లావణ్య "సరే భయ్యా... ఇంకేమైనా ఉంటే గుర్తు తెచ్చుకొని తర్వాత చెబుతాను... నువ్వు టైం కి భోజనం చెయ్... ఆరోగ్యం జాగ్రత్త"
లావణ్య "ఫోన్ కట్టేశాడు ఏంటి?..... సర్లే...." అనుకుంటూ వెళ్ళిపోయింది.