03-10-2024, 05:19 PM
2. నేను ఇవ్వను
సురభి "అత్తయ్యా... మావయ్యా..... మీ అబ్బాయి" అంటూ ఏడుస్తూ "విడాకులు ఇస్తా అంటున్నాడు" అంటూ ఏడ్చేసింది.
వరుణ్ వాళ్ళ అమ్మానాన్న ఇద్దరూ సురభిని చూసి ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు.
సురభి వణికిపోతూ.... వాళ్ళ అత్తమామల కాళ్ళు పట్టుకొని వదలడం లేదు.
ఆమెను సముదాయించి.... వరుణ్ తో మాట్లాడతాం అని చెబితే, సురభి కూల్ అయి ఏడుపు ఆపింది.
ఆమెను ఇంట్లోకి తీసుకొని వెళ్లి అన్నం పెట్టి పడుకోబెట్టారు.
సురభి తల్లిదండ్రులు లేకపోవడంతో వరుణ్ ని పెళ్లి చేసుకున్నాక వరుణ్ తల్లిదండ్రులనే సొంత పేరెంట్స్ లాగా ఫీల్ అవుతూ ఉంది.
కాని కొంత మంది మనుషుల విధానం ఎలా ఉంటుంది అంటే, తమను అన్ కండీషనల్ గా ప్రేమించే వాళ్ళ మీద చిన్న చూపు ఉంటుంది.
అలాగే వరుణ్ మరియు అతని తల్లిదండ్రులు సురభిని తక్కువ చేసి చూశారు. సురభి చిన్న జాబ్ చేసుకుంటూ అటూ తన ఇంట్లో పని చేస్తూ ఉంది.
అలాగే అత్తమామలకు కూడా హెల్ప్ చేస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడైనా సూటి పోటి మాటలు అంటున్నా తల వంచుకొని అలానే ఉండేది.
పెళ్ళైన మొదట్లో మా ఆవిడ బంగారం... అదీ ఇదీ అంటూ ముద్దు చేసిన మొగుడు కొన్నాళ్ళ తర్వాత ఏమి అనకుండా మాములుగా ఉన్నాడు.
కాని ఈ సారి మాత్రం నల్లగా ఉన్నావ్, అలా ఉన్నావ్ ఇలా ఉన్నావ్ అంటున్నాడు. మొదట్లో ముద్దోచ్చిన పెళ్ళాం ఇప్పుడు నల్లగా కనిపించిందా...
నెలా నెలా... నా దగ్గర డబ్బు తీసుకునేటపుడు నల్లగా ఉన్నా అని గుర్తు రాలేదా....
అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.
అత్తయ్య "అమ్మా, సురభి..... వరుణ్ వచ్చాడు రా...." అంటూ లేపింది.
సురభి భయపడుతూ పైకి లేచింది. గదిలోకి వస్తూనే వరుణ్ ని చూస్తే వరుణ్ కోపంగా చూస్తూనే ఉన్నాడు అతన్ని చూస్తే భయం వేసింది.
వరుణ్ కోపంగా వచ్చి సురభి చెంపలు వాయించి "మా అమ్మనాన్నకి చెబుతావా!" అంటూ బూతులు తిట్టడం మొదలుపెట్టాడు.
అత్తమామలు ఎంత చెప్పినా వినకపోవడంతో విడాకులు ఇవ్వక తప్పదని తేల్చారు.
సురభి "విడాకులు ఇవ్వనంటే ఇవ్వను" అని గొడవ చేసింది.
వరుణ్ కు కోపం వచ్చి ఐరన్ రాడ్ తీసుకొని కొట్టబోతే... వరుణ్ వాళ్ళ నాన్న ఆపాడు.
వరుణ్ వాళ్ళ అమ్మ సురభిని పక్క గదిలోకి తీసుకొని వెళ్లి "మాట్లాడదాం" అంటూ నచ్చజేప్పింది.
ఆ రాత్రి వరుణ్ మరియు అతని తల్లిదండ్రులు ముగ్గురు కూర్చొని విడాకులు ఇవ్వకపోతే చంపేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు.
పొద్దున్నే నిద్ర పోవడం తో రాత్రి నిద్ర పట్టకు అటూ ఇటూ తిరుగుతూ ఉంది. వాళ్ళ మాటలు వినపడి సురభి వణికిపోతుంది.
వరుణ్ "ఆఖరి సారి అడుగుతా, ఇప్పుడు తన ఉన్న ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తాను, లేదా చంపేద్దాం...... డబ్బు వచ్చాక అప్సరస లాంటి అమ్మాయి వస్తుంది" అని చెప్పుకుంటూ ఉంటారు.
తన గది నుండి బయటకు వచ్చిన సురభి వాళ్ళ మధ్యలోకి వచ్చి కన్నీళ్లు తుడుచుకొని నిలబడింది.
వరుణ్ తో విడాకులుకి ఒప్పుకుంది.
ఆమె దీన స్థితిని చూసి జాలిపడి, వరుణ్ మరియు అతని తల్లిదండ్రులు తాము ఉంటున్న మరియు ఇప్పుడు వరుణ్-సురభిలు ఉంటున్న ఇల్లు అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ లో సగం ఇచ్చేందుకు సిద్ద పడతారు.
అనుకున్నట్టుగానే నోటరీ చేసి కేసు కోర్టుకు వెళ్ళిపోతుంది.
రెండూ నెలల తర్వాత పూర్తీ విడాకులు వచ్చేశాయి.
సురభి ఆఖరి సంతకం పెట్టేటపుడు ఏడుస్తూ వరుణ్ వైపు చూస్తుంది.
వరుణ్ కరిగిపోయి సురభిని హాగ్ చేసుకుని "ఏడవకు.... ఎటూ అదే ఇంట్లో ఉంటావ్ కదా.... నేను వేరే పెళ్లి చేసుకున్నా..... నీ కోసం నీ దగ్గరకు అప్పుడప్పుడు వస్తా..." అంటాడు.
సురభి సంతకం పెట్టేస్తుంది.
విడాకులు మంజూరు అయ్యాయి.