02-10-2024, 06:20 PM
మీరు రచయితలు అని పిలిచినందుకు నేను కూడా ఒక రచయితనే అనే భావనతో మాత్రమే ఇక్కడ స్పందిస్తున్నాను మరో విధంగా అనుకోకండి.
గట్టిగా చూస్తే తెలుగు సెక్షన్ లో పూర్తి అయిన కథలు ఇన్సస్ట్ ఫోరంతో కలిపి ఒక్క 50 కూడా ఉండవు. అందులో జనాదరణ పొందినది పాతికకి మించవు. పట్టి పట్టి చూస్తే అందులో ఉన్న వాటిని సినిమా లాగానో వెబ్ సిరీస్ లాగానో తీయడం కోసం అనువైన కథలు వేళ్ళ మీద లెక్కపెట్టి అన్ని కూడా ఉండవు ఒకటి రెండు తప్ప అయినా కూడా ఎవడి కథ వాడికి బాహుబలి లాంటిది అన్న ఫీలింగ్ దాన్ని తప్పు పట్టడం ఎందుకు .
వీటి గురించే మీరు ఇంతగా ఫీల్ అయిపోతే ఒక్కసారి Literotica సైట్ లో ఉన్న ఇంగ్లీష్ కథలు గాని iss సైట్ లో ఉన్న హిందీ కథలు గానీ పూర్తయినవి, అన్ని జానర్లలో రాయబడ్డవి మొత్తం కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. అది కూడా చాలా పెద్ద పెద్ద కథలు. మరి వాటి సంగతేంటి. మీకు రాయాలనిపిస్తే రాయండి లేకపోయినా ఏం పర్వాలేదు ఇక్కడ ఎవ్వరు ఎవ్వరిని బలవంత పెట్టడం లేదు అలాగే ఎవ్వరూ ఎవ్వరి కథకు భరోసా ఇవ్వడం లేదు. ఏదో మన ఆత్మ సంతృప్తి కోసం ఇంకా మనకంటే ముందు తరం పెద్దవాళ్లు పెద్ద పెద్ద రచయితలు చాలా ముందుచూపుతో ఎంతో ఆలోచించి తిరిగి ఎవ్వరి నుండి ఏదీ ఆశించకుండా మనకు ఇచ్చిన శృంగార జ్ఞానాన్ని మనం మన ముందు తరాలకు కూడా ఏ ఫిల్టర్లు లేకుండా అందివ్వాలని మాత్రమే ఇక్కడ కథలు రాస్తున్నాము. నా వరకు నేనైతే కథలు రాయాలని అనుకుంటున్నది మాత్రం ఏ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మాత్రమే. ఎంతోమంది రచయితల నుండి చాలా నేర్చుకున్నాను మన వంతుగా మనం కూడా ఎంతో కొంత మంచితో కూడిన శృంగారాన్ని అందివ్వాలని అన్నదే ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే ఇక్కడ కథలు రాసే వారి సంఖ్య వాటిని చదివి స్పందించే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతూ ఉన్నది. మిగిలిన కొంతమంది కూడా వారి క్రియేటివిటీకి రెస్ట్రిక్షన్స్ పెట్టుకునేలా భయపెట్టకండి.
మీ భాయిజాన్