02-10-2024, 10:23 PM
(This post was last modified: 02-10-2024, 10:26 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
5. బంటి
నా కొత్త రూమ్ లో ఉన్న కొత్తగా కొన్న మంచం పై పడుకొని డిజైనర్ చేత చేయించబడ్డ రూమ్ ని చూస్తూ కూడా నా ఆలోచనలలో నేను ఉన్నాను.
సుజాత మేడం చెప్పిన మాటలు కూడా నన్ను ఆకట్టుకోలేకపోతున్నాయి.
నాకు వస్తున్నా ఆలోచన అల్లా ఒక్కటే.... ఎవరు?
బహుశా మర్చిపోయిన నా మెమరీలో ఆ పేరు ఉందా...
ఆలోచిస్తూ ఉండగానే ఎదురుగా కనిపిస్తున్న లాప్ టాప్ ని చూసి ఓపెన్ చేశాను.
ఎక్కడ ఏం వెతకాలో కూడా నాకు అర్ధం కావడం లేదు. హిస్టరీ కూడా క్లియర్ గా ఉంది. కొత్త లాప్ టాప్ లా ఉంది అసలు...
షట్ డౌన్ చేసి పక్కన పెట్టాను. ఫోన్ ఓపెన్ చేసి చూసినా సేం.... అంతా క్లియర్ చేసి ఉంది. బహుశా ఇవి కూడా గతం మర్చిపోయాయా.....
నా సోషల్ మీడియా హ్యాండిల్స్ సంగతి ఏంటి? మెయిల్ ఓపెన్ చేసినా నాకు గుర్తు రావడం లేదు. ఆఫీస్ సిస్టం ముందు కూర్చుంటే అన్ని ఆటోమేటిక్ గా వచ్చేశాయి.
నా చేతులు నా మాట వినకుండానే పాస్వర్డ్ నోక్కేసాయి. దీని అంతటికి ఒకటే సమాధానం, ఇవి నావి కావు.....
ఆలోచించ డానికి ప్రయత్నించి తల నొప్పి తెచ్చుకొని అలానే పడుకొని నిద్ర పోయాను.
పొద్దున్నే నిద్ర లేచాక ఆఫీస్ కి బయలు దేరే సమయంలో బంటి అనే వ్యక్తీ కారు డ్రైవర్ తో పాటు వచ్చాడు.
అతన్ని చూస్తూ ఉంటే ఎదో గుర్తుకు వస్తుంది. కాని నా వల్ల కావడం లేదు.
బంటి "నా పేరు బంటి మేడం... ఇక నుండి నేను మీ అసిస్టెంట్ ని...." అని నవ్వాడు.
నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడు, నేను ముందే తెలుసా... నాకు ఈ ఫ్యామిలీ కాక ఫ్రెండ్స్ ఎవరూ లేరా! వాళ్ళు ఎవరు? ఎక్కడ ఉన్నారు? ఎలా కలవాలి?
బంటి నన్నే చూస్తూ నోటికి చేతిని అడ్డం పెట్టుకొని నవ్వుతున్నాడు.
వాణి "ఎందుకు నవ్వుతున్నావ్?"
బంటి "ఏం లేదు మేడం"
వాణి "ఆఫీస్ కి వెళ్దాం పదా...."
బంటి "ఇవి ఏంటి? మేడం...."
వాణి "అంత ఆత్రం ఎందుకు చెబుతాను కదా.... దారిలో చెబుతాను పదా..."
కారులో
వాణి "బంటి.... ఈ ఫోన్, ఈ లాప్ టాప్..... డాటా అంతా ఫార్మాట్ అయింది... రికవర్ చేయించగలవా...."
బంటి "నేను చేస్తా మేడం..."
వాణి "ఎవరైనా ప్రొఫెషనల్ చేత చేయించు...."
బంటి "నేను ప్రొఫెషనల్ నే మేడం...."
వాణి, అతన్ని పైకి కిందకు చూస్తూ... "అచ్చా.... నువ్వు ప్రొఫెషనల్ వా...."
బంటి "అవునూ మేడం... కావాలంటే మీ ఇంట్లో ఉండే cc కెమెరాలు హ్యాక్ చేసి మీరు ఎప్పుడూ కావాలంటే అప్పుడు మీ ఫోన్ లో చూసుకునేలా ఏర్పాటు చేయనా...."
వాణికి ఒక్క సారి మైండ్ బ్లాక్ అయింది...
వాణి "వాట్...."
బంటి ఎదో చెప్పుకుంటూ పోతున్నాడు.
వాణి "ఏయ్... ఆపూ.... వీటిని చేయించి..... ఆఫీస్ లో కనపడు...."
బంటి నవ్వేసి "అలాగే భయ్యా.... ఛీ అలాగే మేడం" అంటాడు.
వాణి ఇబ్బందిగా చూస్తూ కారు దిగి ఆఫీస్ లోకి వెళ్తుంది.
సుజాత "మీ వదినలో ఉన్న మీ అన్న ఏం చెప్పాడు.... సిగ్గు పడుతున్నాడా!" అంటూ నవ్వుతుంది.
బంటి నవ్వేసి "అసలు ఆ నడక చూడు ఎదో పొడిచేసినట్టు నడుస్తాడు... వీడియో తీసి రేపు వదినకు చూపిస్తే చీల్చి చండాడుద్ది"
సుజాత నవ్వేసింది.
బంటి "ఇదిగో ఈ ఫోన్ మరియు లాప్ టాప్ యిచ్చి రికవర్ చేయమన్నాడు"
సుజాత "చేస్తున్నావా!"
బంటి "లేదు... వేరే వాళ్లకు ఇచ్చాను.... వాళ్ళ ఇంట్లో cc కెమెరా హ్యాక్ చేయబోతున్నా..."
సుజాత "అవునా...."
బంటి "హుమ్మ్"
సుజాత "ఏది? నన్ను కూడా చూడనివ్వు.."
బంటి "అప్పుడే కాదు..... ఇంకా టైం పడుతుంది"
వాణి, బంటి రికవర్ చేయించి పంపించిన లాప్ టాప్ ని ఓపెన్ చేసి చూస్తూ ఆన్ లైన్ డైరీ చదువుతూ ఆశ్చర్య పోయింది.
వాణి "వాట్... నేను దత్తత బిడ్డని కానా! సొంత బిడ్డనా..." అంటూ ఆశ్చర్య పోతూ DNA రిపోర్ట్ చూసింది.
బంటి నుండి వచ్చిన లింక్ ఓపెన్ చేసి ఇంటి యొక్క cc కెమెరా చూస్తూ ఉంది.
మరో వైపు బంటితో కూర్చొని సుజాత కూడా చూస్తూ ఉంది.
ఇంట్లో.........
సందీప్ "అలా అనకండి..... ఎవరం అనుకోలేదు..... అమ్మ కూడా సంతకం పెట్టడానికి సిద్ద పడింది..... సడన్ గా దెయ్యం లేచినట్టు లేచింది."
సందీప్ "హా!!"
సందీప్ "హా!!"
సందీప్ "ఈ సారి పక్కా... చంపేసి ఆమె గుండె నాకు... మిగిలిన బాడీ పార్ట్స్ నువ్వు అమ్ముకో..."
సందీప్ "హా!!"
సందీప్ "హా!!"
సందీప్ "ఇవ్వాళే.... ఇవ్వాళే.... ప్లాన్..."
సుజాత మరియు వాణి ఇద్దరూ వేర్వేరు చోట కూర్చొని ఉన్నా ఒకేలా షాక్ అయ్యారు.
బంటి "ఈ సాక్ష్యం సరిపోతుంది కదా...."
సుజాత "మీ అన్నని అడిగి చూడు... అలాగే ఆ ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడాడో డీటెయిల్స్ కనుక్కో..."
బంటి "అయిపొయింది..... పేరు సరళ.... కిడ్నీ పేషెంట్...."
సుజాత "వాట్...."
బంటి "నువ్వు ఊహించిందే..."
సుజాత "ఏంటి? నేను ఊహించింది"
బంటి "కిడ్నీ టచింగ్ లవ్ స్టొరీ"
వాణి గొంతు పెద్దగా "ఇప్పుడు వాళ్ళ లవ్ స్టొరీ ఎవరు అడిగారు...." అని వినపడింది.
బంటి మరియు సుజాత ఇద్దరూ షాక్ గా వెనక్కి తిరిగి చూశారు.
వాణి "ఏంటి? అమ్మా కొడుకులు ఇద్దరూ నన్నే చూస్తున్నారు"
బంటి "నీ... నీ... నీకు ఎలా తెలుసు..."
వాణి అతని మొహం మీద చేయి పెట్టి చూపిస్తూ.... "నీ మోహంలో మీ అన్న కనిపిస్తున్నాడు... నీ గొంతులో మీ అమ్మ వినిపిస్తుంది" అంది.
బంటి, సుజాత వైపు తిరిగి "మెమరీ దొబ్బింది కాని బ్రెయిన్ దొబ్బలేదు" అన్నాడు.
సుజాత నవ్వేసింది.
వాణి ఇబ్బందిగా చూసి బంటి కూర్చున్నా కంప్యూటర్ ని చూస్తూ ఉంటే..... ఎదో గుర్తుకు వస్తుంది.
వాణి "ఒక్క సారి పైకి లే...." అని అతన్ని లేపి తను కూర్చొని కంప్యూటర్ ని కంట్రోల్ లోకి తీసుకుంది.
బంటి "ఇదంతా హ్యాకింగ్ స్టఫ్.... అవన్నీ అలా క్లోజ్ చేయకు..."
వాణి వాటిని చూస్తూ ఉంటే... నీళ్ళలోకి ఎంటర్ అయిన చేపలా ఫీల్ అయింది.
వాణి చకా చకా ఆడిస్తూ రెండూ కెమెరాలు ఓపెన్ చేసి చూశాడు.
ఎదురుగా కనపడుతున్న దృశ్యం చూసి అక్కడున్న ముగ్గురు షాక్ అయ్యారు.
సందీప్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, అతని మాటలు వింటూ చిన్నగా నవ్వుకుంటున్న అతని తండ్రి సుధాకర్ కాఫీ తాగుతూ కనిపించాడు.
విడి విడిగా చూస్తూ ఉంటే, మములుగా కనిపిస్తున్నాడు. కాని రెండూ పక్క పక్కన ఉంటే అర్ధం అవుతుంది.
సందీప్ మాటలు సుధాకర్ కి ఏ ఇబ్బంది కలిగించ లేదు. పైగా కన్వర్సేషన్ తర్వాత వచ్చి సందీప్ భుజం తట్టాడు.
బంటి "అంటే...."
సుజాత "అంత స్పష్టంగా కనిపిస్తుంటే... ఇంకా ఏంటి?"
వాణి "నో...."
సుజాత "ఏమయింది?"
వాణి "అమ్మ సుహాసినికి యాక్సిడెంట్ అయింది"
సుజాత "అయ్యో..... ఇప్పుడు ఎక్కడ ఉన్నారు"
వాణి "నా తర్వాత, సూటబుల్ హార్ట్ తనదే..." అంటూ ఎదురుగా ఇంటి లైవ్ cc కెమెరా ఫుటేజ్ చూస్తుంది.
స్క్రీన్ పై హాస్పిటల్ నుండి వచ్చిన ఫోన్ మాట్లాడి ఇద్దరూ సందీప్ మరియు సుధాకర్ ఇద్దరూ హై ఫై ఇచ్చుకోవడం కనిపించింది.
వాణి "అమ్మ.... మా అమ్మ" అంటూ కన్నీళ్ళు పెట్టుకొని బయటకు పరిగెత్తింది.
సుజాత, అమ్మ అని వినపడి వాణి వైపు చూసినా.... తను బయటకు పరిగెత్తడం చూసి ఎమోషనల్ అయింది కాని కవర్ చేసుకొంది.