30-09-2024, 06:53 PM
(This post was last modified: 30-09-2024, 07:24 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
4. రాగి కంకణం
చుట్టూ ఎవరు మాట్లాడుతున్నా వినకుండా వేగంగా మెట్లు దిగి వెళ్ళిపోతున్నాను. నాన్న, అమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయాను. వాళ్ళు కూడా నా వెనక వస్తూనే ఉన్నారు. డోర్ వరకు వస్తూనే అమ్మ బిపి అనిపించి సోఫాలో కూలబడిపోయింది. వెనక్కి తిరిగి వెళ్లాను.
ఆమె నావైపు చూస్తూ "వాణి..." అంటూ ఎదో చెప్పబోయి ఆగిపోతుంది. ఆమె పెదవులు ఎన్నో సార్లు తెరుచుకొని ఏం చెప్పాలో అర్ధం కాక ఆగిపోయాయి.
వాణి "మిస్సెస్ సుహాసిని..... మీరు నన్ను దత్తత తీసుకొని పెంచారు. మీరు మీ కొడుకుతో సమానంగా నన్ను పెంచాల్సిన అవసరం కూడా లేదు, నేను అర్ధం చేసుకున్నాను. నాకు మీ మీద ఏ విధమైనా ద్వేషం లేదు, కాని మీరు ఎందుకు ఇంతలా నా గురించి ఆలోచిస్తున్నారు"
సందీప్ "అలా మాట్లాడకు అక్కా... నిజానికి నువ్వే మా నుండి దూరంగా ఉండే దానివి..... నువ్వే ఎప్పుడూ నన్ను, మా అందరిని ఇబ్బంది పెడుతూ ఉండేదానివి... అందుకే అమ్మ వాళ్ళు నిన్ను కొంచెం తక్కువగా చూశారు అంతే కాని.... నువ్వంటే మా అందరికి చాలా ఇష్టం..."
వాణి "వెరీ గుడ్.... ఇక నుండి మీకు ఏ ఇబ్బంది లేదు.... నేను వెళ్లి పోతాను... నా బ్రతుకు నేను బ్రతుకుతాను... ప్లీజ్.... నన్ను వదిలిపెట్టండి" అంటూ తన చేతిని పట్టుకొని ఉన్న సుహాసిని చేతులవైపు చూసింది.
సుహాసిని మళ్ళి టెన్షన్ గా వాణిని వదిలిపెట్టకుండా పట్టుకొని ఉంది.
ఆ పూట అంతా అలానే ఉన్న, సుధాకర్ మరియు సందీప్ వచ్చి వెళ్తూ ఉన్నారు. డాక్టర్ వచ్చి సుహాసినికి ఇంజెక్షన్ ఇవ్వడమో ఆమె నిద్రలోకి జారుకుంది.
వాణి ఆ పూట అలానే ఉండి తెల్లారి ఫ్రెష్ అప్ అయి తన గదిలో ఉన్న ఒక జత బట్టలలోకి మారిపోయి ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా బయటకు అడుగుపెట్టింది.
అదే రోజు పొద్దున్నే కొట్టిన మెయిడ్ సాజిద తన భర్త మరియు అతని మనుషులతో వచ్చి ఆమెను ఫాలో అవుతూ ఉంటారు.
అయితే సందు తిరగగానే వాణి కనపడదు. సాజిద భర్త మరియు అతనితో వచ్చిన ఇద్దరూ స్టన్ అయి చుట్టూ చూసి తల గోక్కొని వెళ్ళిపోతారు.
మరుసటి రోజు పొద్దున్నే వాణి కనపడక పోవడం సుహాసిని లేచి "వాణి...." అని పెద్దగా అరుస్తూ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటే, వాణి కిచెన్ లో నుండి వచ్చి "అమ్మా... అమ్మా... అమ్మా... ఆగూ.... ఆవేశ పడకు... నేను ఎక్కడకు పోలేదు... రిలాక్స్ అవ్వు" అని కూర్చోబెడుతుంది. అలాగే తిరిగి కిచెన్ లోకి వెళ్లి వంట చేయబోతూ ఉంటే, సుహాసిని కూడా తనతో పాటే ఫాలో అయి వెళ్లి కూతురు వంట చేయడం చూస్తూ ఉంటుంది. మొత్తం అయిపోయాక అక్కడే కిచెన్ లోనే ఇద్దరూ తినేస్తారు.
సుహాసిని "నీకు వంట చేయడం గుర్తు ఉందా...."
వాణి "నేను గతం మర్చిపోయాను.... అంతే... పిచ్చి దాన్ని అయిపోలేదు"
సుహాసిని ఇబ్బందిగా చూస్తే, వాణి నవ్వేస్తుంది అలా ఇద్దరూ నవ్వేస్తారు.
సుహాసినిని చూడడం కోసం వచ్చిన డాక్టర్ ఆమెను టెస్ట్ చేసి అంతా నార్మల్ అని చెబుతాడు అలాగే వాణిని, ఆమె తలకు ఉన్న కట్టు చూస్తూ కోలుకుంటుంన్నావ్.... వేరే ఏ గొడవలు పెట్టుకోవద్దు అని చెబుతాడు. అతని మాటల్లో ఉన్న చిన్నచూపు వాణి గుర్తు పట్టేస్తుంది.
ఆఫీస్ కి వెళ్తున్నా అని చెప్పి రెడీ అయి ఆఫీస్ కి వెళ్తుంది. కాని అక్కడ ఏ వర్క్ చేయాలో తెలియదు కానీ... సుజాత మాత్రం వాణిని జాగ్రత్తగా ఉండమని బాగా తినమని చెబుతుంది. అలాగే వాణిని పదే... పదే... ఎలా ఉన్నావ్.. ఏదైనా ఉంటే అడుగు అని చెబుతూ ఉంది. వాణి "నాకు ఏమవుతుంది" అని అనుకుని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది.
అయితే అప్పుడే వాణి తల మీద ఒకరు దాడి చేస్తారు. వాణి ఒక్క సారిగా కింద పడుతుంది. ఆమె మొహం అంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది. సుజాత ఫోన్ లో అలార్మ్ సౌండ్ రావడంతో కంగారుగా ఇంటికి వెళ్తుంది.
వాణి చుట్టూ ముగ్గురు నిలబడి ఆమెను మళ్ళి కొట్టబోతారు. అయితే వాణి గబా గబా పక్కకు జరిగి పోయింది.
ఆ ముగ్గురు వాణి మీదకు వస్తూ ఉంటే, వాణి తప్పించుకోక పోగా.... వాళ్ళ మీద ఎగబడి యటాక్ చేసి ముగ్గురుని పిచ్చి పిచ్చిగా కొడుతుంది. దూరం నుండి కూతురుని ఇంటికి తీసుకొని వెళ్ళడం కోసం వచ్చిన సుహాసిని , తల్లికి డ్రైవర్ గా వచ్చిన సందీప్, వాణి ఆ ముగ్గురుని కొట్టడం చూసి షాక్ అవుతారు.
వాణి ఏ మాత్రం ఒక అమ్మాయిలా కాకుండా ఒక ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ లా కొడుతుంది.
ఆ రోజు ఎప్పటిలా వాణి తన తల్లి సుహాసినితో పాటు ఇంటికి వెళ్ళినా మరుసటి రోజు సుజాత చెప్పిన అడ్రెస్ కి వెళ్తుంది.
వాణి ఇంట్లోకి వెళ్తూనే బెడ్ పై పడుకుని ఉన్న కరణ్ కనిపించాడు. కాని అతని చేతికి కూడా తన చేతికి ఉన్నట్టుగానే రాగి కంకణం చూసి ఆశ్చర్య పోతుంది.
ఇంతలో సుజాత అక్కడకు ఒక నర్సుని తీసుకొని వచ్చి తన వంటి మీద ఉన్న అన్ని గాయాలు పాతవి, కొత్తవి అన్నింటిని పరిశీలించి మందు ఇస్తారు.
వాణి అనుమానంగా బెడ్ పై కోమాలో ఉన్న కరణ్ ని చూస్తూ ఉంది. అతని వంటి మీద ఏ దెబ్బ లేదు కాని అతను కోమాలో ఉన్నాడు. యాక్సిడెంట్ అబద్దమా అని ఆలోచిస్తూ ఉంది.
సుజాత "బ్రెయిన్ డేడ్ అయి కోమాలో ఉండిపోవాల్సిన నువ్వు బ్రతికి వచ్చావు... బాగుండాల్సిన నా కొడుకు కోమాలో ఉన్నాడు..."
వాణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.
సుజాత "మీ చేతికి ఉన్న కంకణాలు మీ జీవితాలు.... నువ్వు గాయపడితే నా కొడుకు కూడా ఆ నొప్పి అనుభవిస్తాడు" అంటూ ముందు రోజు అతని హెల్త్ రీడింగ్ లు చూపిస్తుంది.
తనకు దెబ్బ తగిలిన సమయంలో కరణ్ ఆ నొప్పిని అనుభవించాడు.
సుజాత "నీకు ముప్పై రోజుల సమయం ఉంది... ఆ సమయం తర్వాత నువ్వు నీకు నచ్చినా నచ్చక పోయినా తిరిగి కోమాలోకి వెళ్లిపోతావ్..."
సుజాత "నువ్వు నాకు మూడు విషయాలలో మాట ఇవ్వాలి"
సుజాత "మొదటిది..... నువ్వు గాయ పడకూడదు, చావకూడదు"
సుజాత "రెండూ..... నీ ఫ్యామిలీలోనే ఒకరు నిన్ను చంపాలని చూస్తున్నారు, అది నువ్వు కనిపెట్టాలి"
సుజాత "మూడు.... నువ్వు నీ హేల్తిగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ టైం కి తీసుకోవాలి... అలాగే అన్ హేల్తి ఫుడ్ తిన కూడదు... "
సుజాత "డీల్..."
వాణి "నేను ఒప్పుకోకపోతే..."
సుజాత వెనక్కి నడుచుకుంటూ వెళ్లి కొడుకు చేతి మీద ఎదో చేసింది.
వాణి నొప్పితో విలవిలలాడి పోయింది.
అప్పుడే గుర్తు వచ్చింది ముందు రోజు తల మీద దెబ్బ తగిలినా కూడా నొప్పి కలగలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా నొప్పిగా అనిపించింది.
సుజాత "నువ్వు బయట అందరికి రాక్షసివి కావచ్చు కాని నా ముందు కాదు నీ వేషాలు..... రేపు పొద్దున్నే నీ ఇంటి ముందు నా కారు వస్తుంది ఆఫీస్ కి టైం రా..." అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.
వాణి అక్కడే నిలబడి కొద్ది సేపూ కరణ్ ని చూసింది.
కరణ్ ని చూస్తూ ఉంటే ఎదో గుర్తు వస్తుంది కానీ అర్ధం కావడం లేదు.
వాణి తల అడ్డంగా ఊపేసి వెనక్కి వెళ్లిపోయింది.