Thread Rating:
  • 14 Vote(s) - 1.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"."
#16
అన్నం తిని పడుకున్నాడు సంజయ్.

కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి మెలకువ వచ్చింది. కలేమో అనుకున్నాడు. మళ్ళీ మోగింది బెల్.

టైం చూసుకున్నాడు, అయిదయింది. అమ్మ వచ్చుంటుంది అనుకుంటూ లేచి బయటకి వెళ్ళాడు.

బయటున్నది అమ్మ కాకుండా ఎవరో అమ్మాయి అవ్వడంతో ఎవరా అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు.

"ఎవరు కావాలి?" అడిగాడు సంజయ్.

ఏమీ మాట్లాడకుండా ఉండి... ఏదో గుర్తుచేసుకుంటున్నట్టు అనిపించింది అమ్మాయి.

"మీ మమ్మీ పేరు మర్చిపోయాను. లక్ష్మక్క పంపించింది.. పని చెయ్యడానికి"... చెప్పి చిన్నగా నవ్వింది అమ్మాయి.

"లక్ష్మి పంపించిందా!"

తలూపింది.

"లోపలికి రా" అంటూ తలుపు తీసాడు.

లోపలికొచ్చింది.

"అంట్లున్నాయి. బట్టలు కూడా ఉన్నాయి. బట్టలు మెషీన్లో వెయ్యచ్చు. మమ్మీకి ఆఫీస్ పని చాలా ఉంది, అంట్లు తోమాలి"

తలూపింది.

తోమాల్సినవి చూపించి... ఆకలి వేస్తుండటంతో నూడుల్స్ చేసుకుని తిందామని కిచెలోకి వెళ్ళాడు సంజయ్.

కత్తెర కనబడక బయటకి నడుస్తుంటే గడప బయట అమ్మాయి కనిపించింది.

"గిన్నెలు చాలా ఉన్నాయి... స్క్రబ్ కొత్తది ఉందా..." అడిగింది.

"కొత్త స్క్రబ్ కావాలా?"

తలూపింది.

"లోపల ఎక్కడుందో మరి. ఆ గదిలో పెడుతుంది మమ్మీ... కింద షెల్ఫ్ చూడు" అంటూ కత్తెర తీసుకుని నూడుల్స్ చేసుకోవడానికి వెళ్ళాడు సంజయ్.

నూడుల్స్ ఉడుకుతుండగా... కలిపి.. బయటకి వచ్చాడు.

అక్కడే ఉంది అమ్మాయి.

"మళ్ళీ ఏం కావాలి?"

"స్క్రబ్"

"ఇంకో స్క్రబ్ కావాలా?" ఆశ్చర్యపోతూ అడిగాడు.

"ఇందాక అడిగాను కదా, మీరు ఇవ్వలేదు"

"లోపల ఉండాలి.. చూడమన్నా కదా... చూడలేదా?"

లేదన్నట్టు తలూపింది.

"ఏం?"

"లోపలికి వెళ్ళచ్చో లేదో తెలీదు"

"నేనే కదా వెళ్ళమంది"

"నేనెవరో మీకు తెలీదు కదా"

"అంటే?"

"మీ మమ్మీ ఏమన్నా అంటారేమో అని..."

"లక్ష్మి చెల్లెలివే కదా?"

తలూపింది.

"అయితే మాకు పరాయిదానివి కాదు... లోపలికెళ్ళి నీకు కావల్సినవి తెచ్చుకో"... చెప్పి నూడుల్స్ చూడటానికి వెళ్ళాడు.

లోపల గదిలో తనకి కావల్సినవి తెచ్చుకుని గిన్నెలు తోమసాగింది అమ్మాయి.

నూడుల్స్ అవ్వడంతో, ప్లేట్లో పెట్టుకుని, కిచెన్ కిటికి నించి బయటకి చూసాడు సంజయ్.

గిన్నెలు తోముతున్న అమ్మాయిని చూడగానే తనకి కూడా నూడుల్స్ పెట్టాలనిపించింది.

ఇంకో ప్లేట్ తీసుకుని అందులో కొంత పెట్టి బయటకి తెచ్చాడు.

"ఇదిగో తీసుకో"... ప్లేట్ చేతికిస్తూ అన్నాడు.

తిన్న ప్లేట్ ఇస్తున్నాడనుకుని... "ఇవి పొద్దున గిన్నెలు బాబు.. ఇప్పుడు తిన్నది కదా టేబుల్ మీద ఉంచండి.. ఇవి తోమిన తర్వాత అది తోముతాను"... తలెత్తకుండా గిన్నెకున్న మసి గట్టిగా రుద్దుతూ అంది.

"ఇది తిన్న ప్లేట్ కాదు"... అంటున్న అబ్బాయి ఇస్తున్నది చూసింది.

అర్ధంకానట్టు చూసింది.

"నూడుల్స్. నీకే"

"నాకా?"

"అవును నీకే... తినవా?"

"ఎందుకు బాబు?"

"ఎందుకేంటి... తింటానికి"

ఇంకా అర్ధంకానట్టు అలానే ఉంది.

"నేను చేసుకున్నాను. నీకు కూడా పెడుతున్నాను. లక్ష్మికి మమ్మీ పెడుతుంది. తీసుకో. డిస్పోజబుల్ ప్లేట్, తిని పారేసేదే. ఇదిగో ఫోర్క్" ఫోర్క్ కూడా ఇచ్చి లోపలికెళ్ళాడు సంజయ్.

తీసుకుని సంతోషిస్తూ ఎదురుగా ఉన్న చెట్లని చూస్తూ తినసాగింది అమ్మాయి.

నూడుల్స్ తీసుకుని కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో చూస్తూ తినసాగాడు సంజయ్.

గంట గడిచింది.

"బాబూ"

ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించి బయటకి వచ్చాడు.

గుమ్మం తలుపు దగ్గర పనిపిల్ల.

"అన్నీ కడిగేసాను బాబు. బట్టలు ఉంటే రేపొద్దున వచ్చి ఉతుకుతాను. మమ్మీకి చెప్పండి రేపు వస్తానని"

తలూపాడు.

"రేపు మర్చిపోకుండా రా. నీ ఫోన్ నెంబర్ తెలీదు కదా, రాకపోతే ఫోన్ చేసి రమ్మని చెప్పడానికి"

"వస్తాను బాబు"

"ఏం చదువుతున్నావు?"

"డిగ్రీ"

తలూపాడు.

బయటకి వెళ్ళింది అమ్మాయి.

"ఆగు"... వెళ్తున్న అమ్మాయిని పిలిచాడు.

ఆగి వెనక్కి వచ్చింది.

"నీ పేరేంటి? ఇంత వరకూ నేను అడగలేదు, నువ్వు చెప్పలేదు. నీ పేరు తెలీకపోతే మా మమ్మీకి నువ్వు వచ్చినట్టు చెప్పాలంటే లక్ష్మి చెల్లెలు అని చెప్పాలి"

తల దించుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుంది అమ్మాయి.

పేరడిగితే మాట్లాడట్లేదేంటి అనుకుంటూ... "నీ పేరేంటంటే మాట్లాడవేంటి?" మళ్ళీ అడిగాడు.

ఇంకా అలానే తల దించుకుని ఉంది అమ్మాయి.

'ఇదేంటి... ఇలా ఉంది' అనుకుంటూ అమ్మాయి వైపే చూడసాగాడు.

"చుక్క. చుక్కమ్మ అంటారు."

"ఏంటి?"... ఏం విన్నాడో సరిగా అర్ధంకాక అడిగాడు.

"నా పేరు చుక్క బాబు. చుక్కమ్మ అని పిలుస్తారు."

"చుక్కా?"

తలూపుతూ బయటకి నడిచింది.

"అమ్మాయి పేరు చుక్కా?... జోక్ చేస్తోందా ఏంటి... చుక్కేంటి.. అదొక పేరా.. ఎవరన్నా అలాంటి పేరు పెట్టుకుంటారా" అనుకుంటూ లోపలికెళ్ళాడు.

తన జీవితంలో ఎన్నో సార్లు ఎంతో మంది ఈ ప్రశ్న అడగటం, తను చెప్పిన మాట విని వాళ్ళు అర్ధంకానట్టు ఉండటం, తనకి కాస్త నవ్వు, కాస్త బాధ, కాస్త ఆశ్చర్యం కలుగుతూ రకరకాలుగా ఉండటం అలవాటైనా ఇదంతా ప్రతి సారి కొత్తగా అనిపిస్తూ ఉండి ఇంటి వైపు నడవసాగింది చుక్క.
[+] 9 users Like earthman's post
Like Reply


Messages In This Thread
"." - by earthman - 02-08-2024, 08:31 AM
RE: "." - by earthman - 02-08-2024, 08:36 AM
RE: "." - by sri7869 - 02-08-2024, 10:55 AM
RE: "." - by earthman - 03-08-2024, 08:49 PM
RE: "." - by Haran000 - 03-08-2024, 11:31 PM
RE: "." - by earthman - 29-09-2024, 04:36 PM
RE: "." - by Paty@123 - 03-08-2024, 09:19 PM
RE: "." - by Paty@123 - 05-08-2024, 11:59 AM
RE: ". - by Haran000 - 05-08-2024, 12:03 PM
RE: "." - by sravan35 - 27-09-2024, 12:20 PM
RE: "." - by earthman - 29-09-2024, 04:39 PM
RE: "." - by Uday - 29-09-2024, 06:26 PM
RE: "." - by Haran000 - 29-09-2024, 07:09 PM
RE: "." - by Uday - 30-09-2024, 01:48 PM
RE: "." - by earthman - 29-09-2024, 07:28 PM
RE: "." - by earthman - 29-09-2024, 08:44 PM
RE: "." - by earthman - 29-09-2024, 08:50 PM
RE: "." - by sri7869 - 29-09-2024, 11:22 PM
RE: "." - by BR0304 - 29-09-2024, 11:56 PM
RE: "." - by krish1973 - 30-09-2024, 06:53 AM
RE: "." - by MKrishna - 30-09-2024, 08:16 AM
RE: "." - by MrKavvam - 30-09-2024, 09:31 AM
RE: "." - by Uday - 30-09-2024, 01:42 PM
RE: "." - by earthman - 02-10-2024, 08:11 PM
RE: "." - by MKrishna - 04-10-2024, 01:04 PM
RE: "." - by earthman - 04-10-2024, 01:57 PM
RE: "." - by earthman - 04-10-2024, 02:09 PM
RE: "." - by MKrishna - 04-10-2024, 02:59 PM
RE: "." - by Ghost Stories - 04-10-2024, 05:55 PM
RE: "." - by sri7869 - 04-10-2024, 10:20 PM
RE: "." - by sravan35 - 24-10-2024, 07:09 AM
RE: "." - by earthman - 25-10-2024, 06:15 PM
RE: "." - by Uday - 24-10-2024, 01:36 PM
RE: "." - by Uday - 26-10-2024, 11:42 AM
RE: "." - by utkrusta - 26-10-2024, 06:52 PM



Users browsing this thread: 2 Guest(s)