28-09-2024, 10:16 PM
2. Welcome to my darkside
సుజాత "ఏమయింది?"
కరణ్ "వాణి చిన్నప్పటి నుండి, బేసిక్ నీడ్స్ తోనే పెరిగింది. సందీప్ మరో వైపు రిచ్ గా వాళ్ళ అమ్మా, నాన్నల డబ్బుతో పెరిగాడు...."
సుజాత "వాణి వాళ్ళ సొంత కూతురు కాదు"
కరణ్ "వాణికి ఆన్లైన్ డైరీలో ప్రతి విషయం రాసే అలవాటు ఉంది. అదే అలవాటుగా తను రాస్తున్న గతంలో రాసిన డైరీ చూస్తూ ఉన్నాను"
సుజాత "అయితే...."
కరణ్ "వాణి వాళ్ళ సొంత కూతురు...."
సుజాత "వాట్... అంటే..."
కరణ్ "అవునూ.... వాళ్లకు పెళ్లి కాక ముందు పుట్టింది.... పెంచలేక ఆమెను కొన్ని సంవత్సరాల క్రితం అనాధ శరణాలయంలో వదిలేశారు. మూడు సంవత్సరాలు తర్వాత పెళ్లి అయ్యాక కూడా వాళ్లకు పిల్లలు పుట్టకపోవడంతో చాలా కస్టపడి వాణిని వెతికి తెచ్చుకున్నారు"
సుజాత "ఇదంతా ఎలా తెలుసు..."
కరణ్ "DNA టెస్ట్ చేసింది.... తనను అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ నిజానికి సొంత పేరెంట్స్.... "
సుజాత గుటకలు మింగుతూ "సరే" అంది.
కరణ్ "వాణి పేరెంట్స్ ఆమెను ద్వేషిస్తున్నారు"
సుజాత "ఎందుకు?"
కరణ్ "తెలియదు"
సుజాత "..."
కరణ్ "వాణి, ఎవరితో గొడవ పడ్డా, ఏం చేసినా పాస్ అయినా, ఫెయిల్ అయినా ఎప్పుడూ పట్టించుకోలేదు... కొన్నాళ్ళ తర్వాత తనకు వంటి మీద ఏమయినా దెబ్బలు తగిలితే... గొడవ చేసేవాళ్ళు"
సుజాత "అంటే..."
కరణ్ "సందీప్ చిన్నప్పటి నుండి హార్ట్ డిసీజ్ తో ఉండడంతో, వాణి అతనికి అక్క కావడంతో అతన్ని ఎప్పుడూ బాగా చూసుకునేది కాని, ఆమె పక్కకు వెళ్ళాక తన గురించి బ్యాడ్ గా మాట్లాడుకునే వాడు"
సుజాత "అతనికి సొంత అక్క అని తెలియదు"
కరణ్ "ఆరు నెలల క్రితం సందీప్ కి హార్ట్ ఎటాక్ వచ్చింది"
సుజాత "వాణి, తనని టైం హాస్పిటల్ లో జాయిన్ చేసింది.... విన్నాను"
కరణ్ "అప్పటి నుండి ఆమె మీద అటాక్స్ జరుగుతున్నాయి... ఫైనల్ గా ఇప్పుడు... వాణికి యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో కోమాలో ఉంది. బ్రెయిన్ డేడ్ గా ప్రకటిస్తే.... ఆమె గుండెని సందీప్ కి పెడతారు"
సుజాత "వాట్..."
కరణ్ "..."
సుజాత "నో... నువ్విలా చేయడానికి నేను ఒప్పుకోను"
కరణ్ ఏం మాట్లాడకుండా నవ్వుతూ బయటకు వెళ్ళాడు.
తన బాడీ గార్డ్స్ ని రావద్దని చెప్పి, ఒక కొండ మీద ఉండే ఒక ఆశ్రమంలోకి వెళ్ళాడు
స్వామిజి దగ్గరకు వెళ్లి ఒక పూజ చేయించాడు.
పాప్ మ్యూజిక్ వింటూ పని చేసుకుంటూ ఉన్న నర్సు, వాణి గదిలో అన్ని రికార్డింగ్స్ నోట్ చేసుకుంటూ ఉంది.
సడన్ గా వాణి కళ్ళు తెరిచి తననే చూడడంతో "ఆ!" పెద్దగా అరిచి గదిలో నుండి బయటకు పరిగెత్తింది. ఆమె చేతిలో ఉన్న ఫోన్ కి పెట్టిన ఇయర్ ఫోన్స్ కింద పడడంతో పెద్దగా మ్యూజిక్ వినపడుతుంది.
"Welcome to my darkside" అనే పాట వినపడుతుంది.
గదిలోకి వచ్చిన పేరెంట్స్ ని చూసి వాణి బిత్తర మొహం వేసి "ఎవరు మీరు?" అని అంది.
వాళ్ళు ఇద్దరూ కంగారు పడి "డాక్టర్... డాక్టర్... " అంటూ కేకలు వేశారు.
డాక్టర్ వచ్చి CT స్కాన్ తీసి రిపోర్ట్ చూస్తూ ఈమ బ్రెయిన్ లో చిన్న బ్లడ్ క్లాట్ అయింది. దాని అంతటా అదే క్యూర్ అవుతుంది. అది అయినపుడు ఆమెకు మొత్తం తిరిగి గుర్తుకు వస్తుంది.
తనను చూడడానికి వచ్చిన సందీప్ ని మరియు తల్లి దండ్రులను చూస్తూ ఉంది. వాళ్ళ అమ్మ తల నిమరడం కోసం చేయి జాపితే, వాణి తల పక్కకు తిప్పుకుంది. ఆమె బాధ పడి భర్త గుండెలపై వాలిపోయి ఏడుస్తుంది.
సందీప్ "అక్కా.... ఏమయినా గుర్తు ఉందా..." అని అడిగాడు.
వాణి "నువ్వు నాకు తమ్ముడువా..." అంది.
సందీప్ "అవునూ..... నువ్వంటే నాకు చాలా ఇష్టం... నీకు కూడా నేనంటే చాలా ఇష్టం...."
వాణి వాళ్ళను అయోమయంగా చూస్తూ "నాకు మీ మీద నమ్మకం లేదు.... ఫోటో ఏమయినా ఉందా..." అని అడిగింది.
ముగ్గురు ఫోన్ లు ఇంట్లో అన్ని చోట్లా వెతికినా ఎక్కడా నలుగురు కలిసి దిగిన ఫోటో కనిపించలేదు.
వాణి వాళ్ళ నాన్న "మన చుట్టాలు చాలా మంది ఉన్నారు.... వాళ్ళు సాక్ష్యం చెబుతారు"
వాణి "వాళ్ళను ఎలా నమ్మను.... వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కదా.."
ఇంతలో సుజాత "వాణి" అనుకుంటూ అక్కడకు వచ్చింది.
సుజాతని అయోమయంగా చూస్తూ "నేను కోమాలో ఉన్నప్పుడు నాకు మీ గొంతు వినపడింది... నాకు గుర్తు ఉంది..." అంది.
వెంటనే ముగ్గురు సుజాతతో పేరెంట్స్ అని చెప్పమని అడుగుతారు.
వాణి "నేను కోమాలో ఉన్నప్పుడు మీరు నా పక్కన లేరా!" అని అడుగుతుంది.
ముగ్గురు ఏం చెప్పాలో అర్ధం కాక అటూ ఇటూ చూస్తూ ఉంటే... సందీప్ "అంటే అక్క నాకు... హార్ట్ ఎటాక్ రావడంతో అమ్మ వాళ్ళు నా దగ్గరే ఉన్నారు"
వాణి "అంటే వాళ్ళు నీకు పేరెంట్స్... నాకు పేరెంట్స్ లా అనిపించడం లేదు"
సుజాత "నిన్ను అడాప్ట్ చేసుకున్నారు"
వాణి "అందుకే నా మీద ప్రేమ లేదా... పర్లేదు... నేను కూడా ఎక్సపర్ట్ చేయను"
వాణి వాళ్ళ అమ్మ "అదేం లేదు.... అదేం లేదు.... మాకు నువ్వంటే చాలా ఇష్టం"
వాణి "నాకు మీరెందుకో అబద్దం చెబుతున్నట్టు అనిపిస్తుంది" అంది.
వాణి వాళ్ళ అమ్మ బిత్తరపోయి ఏడుస్తూనే ఉంది.
వాణి "నాకు తల నొప్పిగా ఉంది"
నర్సు అందరిని బయటకు పంపింది.
వాణి పడుకొని, నర్సుని చూస్తూ "ఆ పాట మళ్ళి పెట్టు...." అని అడిగింది.
నర్సు ఫోన్ లో పాట ప్లే చేయడంతో వాణి అందంగా నవ్వుకుంటూ ఉంది.
"Welcome to my darkside" అనే పాట వినపడుతుంది.
అక్కడ కింద పడ్డ నీటి మడుగులో వాణి నవ్వు దెయ్యం నవ్వులా భయంకరంగా కనిపిస్తుంది.
వాణి డిశ్చార్జ్ అయి తన ఇంటికి వెళ్తుంది.
తన ఫోన్ లో "Welcome to my darkside" పాట ప్లే అవుతూ ఉండగా... ఒక్కతే నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది.