28-09-2024, 06:04 PM
(This post was last modified: 28-09-2024, 08:24 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
1. ఆన్ లైన్ డైరీ
ఇది థ్రిల్లర్ కధ.....
అమ్మ : సుజాత
కొడుకు : కరణ్
ప్రేమించిన అమ్మాయి : వాణి
కరణ్ "నేను నీతో మాట్లాడాలి"
సుజాత "చెప్పూ కన్నా"
కరణ్ "సీరియస్ విషయం...."
సుజాత అప్పటి వరకు చదువుతున్న కంపనీ యాన్యువల్ రిపోర్ట్ పక్కన పెట్టేసి "చెప్పూ" అంటూ తననే తత్తరపడుతూ చూస్తున్న కొడుకు చేతిని ఆప్యాయంగా పట్టుకుంది.
కరణ్ తల దించుకొని కొద్ది సేపు ఉండి మళ్ళి పైకి లేపి దీర్గంగా శ్వాస తీసుకొని వదులుతున్నాడు. ఎదో మాట్లాడడం కోసం అతని పెదవులు కదులుతున్నాయి కాని ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు.
సుజాత, కొడుకు తల మీద చేయి "ఏ విషయం అయినా చెప్పూ పర్లేదు" అని అభయం ఇచ్చింది.
కరణ్ "వాణి..."
సుజాత, ఇలాంటిది ఎదో ఉంటుంది అని తెలుసు అన్నట్టుగా మొహం పెట్టి "మ్మ్" అంది.
కరణ్ తల పైకెత్తి, తల్లి వైపు చూశాడు, ఆమె చెప్పూ నాకు వినాలని ఉంది అన్నట్టు మొహం పెట్టింది.
కరణ్ "వాణి అంటే నాకు ఇష్టం..."
సుజాత "గుడ్..." అంటూ అతని రెండో చేతిని కూడా పట్టుకుంది.
కరణ్ "వాణి గతంలో నా క్లాస్ మేట్, గెట్ టూ గెదర్ లో కలిశాను. మన కంపనీలో పని చేస్తుంది"
సుజాత "5 సంవత్సరాలుగా చేస్తుంది, హుమ్మ్.... తర్వాత..." అంటూ చిన్నగా నవ్వు మొహం పెట్టింది.
కరణ్ "తన గురించి తెలుసుకోవాలని అనుకున్నాను."
సుజాత "వెరీ గుడ్"
కరణ్ "తనకు ఆన్లైన్ డైరీ రాసే అలవాటు ఉంది"
సుజాత "ఓహ్... మంచి అలవాటు.. నిజానికి అది మంచి ప్రొఫెషనల్ అలవాటు... తనకు నేనే నేర్పాను"
కరణ్ "నన్ను కొంచెం మట్లాడ నిస్తావా!"
సుజాత "ష్.... చెప్పూ"
కరణ్ "నేను.... నేను...."
సుజాత "నువ్వు.... నువ్వు...."
కరణ్ "..." తల దించుకొని ఎలా చెప్పాలో అర్ధం కాక ఆలోచిస్తూ ఉన్నాడు.
సుజాత "అరె.... చెప్పూ.... నేనేమి అనను..... ఆ అమ్మాయి నాకు కూడా నచ్చింది. "
కరణ్ "నన్ను కొంచెం మట్లాడ నిస్తావా!"
సుజాత "ష్.... చెప్పూ"
కరణ్ "నేను తన ఆన్లైన్ డైరీని హ్యాక్ చేశాను. నా గురించి ఏం రాసిందో తెలుసుకోవాలని అనుకున్నాను. తను నా గురించి అసలు ఏం రాయలేదు. అలా అని వేరే లవ్ కూడా ఏం లేదు."
సుజాత "ఫస్ట్ అఫ్ ఆల్..... హ్యాక్ చేయడం తప్పు.... ఆమెతో నేను మాట్లాడతాను.... తను వేరే ఎవరిని ప్రేమించలేదు కదా.... సమస్య ఏముంది? దేవ్ ఫ్యామిలీ పెద్ద కూతురు తను... నేను సంబంధం మాట్లాడుతాను... నువ్వు అసలు బాధ పడాల్సిన పని లేదు"
కరణ్ సీరియస్ గా పైకి లేచి "అసలు నేను చెప్పేది వింటావా.... లేక నీకు తోచింది చెప్పూ కుంటూ పోతావా!" అని అన్నాడు.
సుజాతకి కొడుకు మీద కోపం వచ్చినా కూల్ అయి, కరణ్ కి కూడా వాటర్ ఇచ్చింది.
కరణ్ కూల్ అయి తల్లి పక్కనే కూర్చున్నాడు.
సుజాత "మ్మ్ చెప్పూ..."
కరణ్ "దేవ్ ఫ్యామిలీ, దంపతులకు చాలా కాలం వరకు పిల్లలు పుట్టకపోవడంతో వాణిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకు సందీప్ అనే కొడుకు హార్డ్ డిసీజ్ తో పుట్టాడు."
సుజాత "వాణి నాకు నచ్చింది. మంచి అమ్మాయి.... దేవ్ ఫ్యామిలీ తన మీద ఎక్కువ కేర్ చూపించడం లేదు అని నాకు కూడా తెలుసు..... ఆ సందీప్ హార్ట్ పేషెంట్ కావడంతో తనపై ఎక్కువ కేర్ చూపిస్తున్నారు. పుట్టడానికి ధనవంతుల కుటుంబం అయినా ఆ అమ్మాయి చాలా కష్టాలు పడింది.... అయినా మన ఇంటికి వస్తే ఆ కష్టాలు తీరి పోతాయి"
కరణ్, సుజాత ని హాగ్ చేసుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది.
సుజాత "ఎందుకు రా..... ఏమయింది అని అలా ఉన్నావ్.... కరణ్ అంటే ఏంటి? నీ వెనక, ముందు ఇంత మంది జనాన్ని పెట్టుకొని సొంతంగా రెండూ కంపనీలను మైంటైన్ చేస్తూ నా కంపనీలో కూడా తోడూ ఉంటున్నావ్... ఎందుకు భయపడుతున్నావ్...."
కరణ్ "అమ్మా.... ఇది చాలా పెద్ద విషయం...." అంటూ హాగ్ చేసుకునే చెప్పాడు
సుజాత "అరేయ్.... నీకు ఆ అమ్మాయి ఇష్టమని నేను ఎప్పుడో పసిగాట్టాను.... నేను తన గురించి తెలుసుకుంటునే ఉన్నాను.... మంచి సమర్డురాలు... నిన్ను కంట్రోల్ పెడుతుంది అలాగే బాగా చూసుకుంటుంది" అంటూ అతని మూడ్ ని కూల్ చేయడం కోసం నవ్వించాలని చూసింది.
కరణ్ "నేను తన డైరీ చదవగా నాకు ఒక విషయం అర్ధం అయింది"
సుజాత "ఏం అర్ధం అయింది?"
కరణ్ "వాణిని ఎప్పుడో వాళ్ళు... ఆ దేవ్ దంపతులు.... వాణిని ఎప్పుడూ... కూతురులా చూడక పోవడానికి కారణం.... సందీప్..."
సుజాత "వాట్..."
కరణ్ "అవునూ..... వాణిని వాళ్ళు చంపాలని అనుకుంటున్నారు"
సుజాత "వాట్... పిచ్చి పట్టిందా.... ఏం మాట్లాడుతున్నావ్..."
కరణ్ " వాణిని వాళ్ళు కూతురులా కాదు... సందీప్ కి హార్ట్ రిప్లేస్ చేయడం కోసం పెంచుతున్నారు... సందీప్ కి సమస్య వచ్చాక, అతని కోసం వాణిని ఆమె హార్ట్ కోసం చంపుతారు"
సుజాత "ఏం మాట్లాడుతున్నావ్ కన్నా...."
కరణ్ "ఆమె డైరీ చదివాక మొత్తం ఎంక్వయిరీ చేస్తే నాకు అర్ధం అయిన లెక్క ప్రకారం విషయం అదే..."
సుజాత "నువ్వు ఎదో పొరపాటు పడుతున్నావ్... నీ లెక్క తప్పు అవ్వొచ్చు కదా...."
కరణ్ "లేదు అమ్మ..."
ఇంతలో ఫోన్ మోగింది.....
సుజాత "హలో" అని ఫోన్ మాట్లాడుతుంది. మధ్య మధ్యలో కొడుకు వైపు చూస్తుంది.
ఇంతలో కరణ్ ఫోన్ కి కూడా మెసేజ్ వచ్చింది.
వాణికి యాక్సిడెంట్ అయి తలకు దెబ్బ తగిలింది. అందువల్ల కోమాలోకి వెళ్లిపోయింది.
దేవ్ ఫ్యామిలీ కొడకు సందీప్, తన చెల్లికి జరిగిన విషయం తెలుసుకొని, తట్టుకోలేకపోయాడు. అందువల్ల అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది.
అక్కా-తమ్ముడు ఇద్దరూ ఒకే హాస్పిటల్ లో జేరారు.
సుజాత టెన్షన్ నిండిన కళ్ళతో కరణ్ వైపు చూసింది.
కరణ్ సీరియస్ గా ఎదో నిర్ణయం తీసుకున్నట్టు చూశాడు.
సుజాత "కన్నా..... వద్దు...." అంటూ కొడుకు చేతిని పట్టుకుంది
కరణ్ ఆమె చేతిని నెట్టేసి వెళ్ళబోయాడు.
సుజాత "అరె.... ఆ అమ్మాయి నిన్ను ప్రేమించను కూడా లేదు రా..... నువ్వు ఎందుకు?"
కరణ్ "కానీ... నేను ప్రేమించాను కద అమ్మా...."
....నెల రోజుల తర్వాత....
సుజాత తన కంపనీలో పని చేసే అమ్మాయి కావడంతో వాణికి స్పెషల్ డాక్టర్ లను పిలిపించి... చూపిస్తుంది.
డాక్టర్ పేషెంట్ దగ్గరకు వచ్చే ముందే... నర్సు ఎదురు వచ్చి "కోమాలో ఉన్న పేషెంట్ వాణి లేచింది..."
దేవ్ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్ రూమ్ ముందు... ఎదురు చూస్తున్నారు.
దేవ్ ఫ్యామిలీ ని చూసినా ఎవరిని చూసినా వాణి ఒకటే మాట "అసలు ఎవరూ మీరు అంతా... నేను ఎవరిని?" అంటుంది.
డాక్టర్... "ఆమె మెదడులో బ్లడ్ లైట్ క్లాత్ అయింది కాబట్టి టెంపరరీ అమ్నేషియా వచ్చింది" అని చెబుతాడు.
అందరూ బయటకు వెళ్ళాక వాణి మొహం చిన్న నవ్వు విరిసింది "ఆట మొదలయింది?"
మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను....
ఇది సుమారు 10 ఎపిసోడ్స్ కధ...
సెక్స్ ఉన్నా విడమరిచి ఉండదు... కాని స్టొరీ బాగుటుంది, మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.
ఇది థ్రిల్లర్ కధ.....