Thread Rating:
  • 16 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: 'నూతన్' పరిచయం
#65
24. పిచ్చెక్కిన మాస్టర్ 







షాపింగ్ మాల్ లోకి తెల్లటి గౌన్ లో ఒక అమ్మాయి లోపలకు వచ్చింది. అందరిని అన్నింటిని చూస్తూ నవ్వుతుంది, చుట్టూ అందరూ తనని చూసి తప్పుకుంటున్నారు. ఆమె వాళ్ళను చూసి నవ్వుకుంటూనే ఉంది. ఫ్యాషన్ సిల్క్స్ అనే షాప్ లోకి వెళ్లి రంగురంగుల బట్టలు అన్ని ఆప్యాయంగా చూస్తూ ఉంది. ఆమె కళ్ళు మెరుస్తూ ఆరుతూ ఎదో తెలియని ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

సేల్స్ గర్ల్ "ట్రై చేస్తారా మేడం" అని అడిగింది.

మేఘ చిన్నగా నవ్వుతూ ఉంది ఆమె నవ్వు చిన్నగా ఆమె మొహం మీద పెద్దది అవుతూ ఉంటే, ఆ సేల్స్ గర్ల్ కి భయం వేసి ఆమెకు గూస్ బంప్స్ కూడా వచ్చేశాయి. 

అయినా మేఘ చిన్నగా నవ్వుతూనే అక్కడ నుండి బయటకు వచ్చి చుట్టూ చూస్తూ ఉంది. రంగు రంగుల లైట్స్.... చుట్టూ సందడిగా ఉన్న జనాభా... పెద్ద పెద్ద టీవీలలో ప్లే అవుతున్న యాడ్ లు చూస్తూ ఉండగా, చిన్న చిన్న పిల్లలు ఎగురుతున్న బెలూన్స్ ని పట్టుకొని తన ముందుగా పరిగెడుతూ ఎస్కలేటర్ ఎక్కారు.

మేఘ కూడా వాళ్ళను ఫాలో అవుతూ ఎస్కలేటర్ ఎక్కుతూ సరదాగా ఉండడంతో మొత్తం అన్ని ఫ్లోర్ లకు ఎక్కి చుట్టూ చూసింది. కింద ఫ్లోర్ లో కంటే ఎక్కువ సందడి లేకపోయినా మాములుగా ఉంది. ఒకమ్మాయి తనని చూస్తూ ఫోన్ లో మాట్లాడుతూ ఐస్ క్రీం తింటూ ఉంది.

చూడడానికి వైష్ణవి చైతన్యలా కనపడుతుంది.

ఆ అమ్మాయి ఐస్ క్రీం ని చూపిస్తూ "తింటావా!" అని అడిగింది.

మేఘ ఆమెను, ఆమె చేతిలో ఉన్న ఐస్ క్రీం ని చూస్తూ "మ్మ్" అని తల ఊపింది.

ఆ అమ్మాయి నవ్వుతూ మళ్ళి "కావాలా!" అని అడిగింది.

మేఘ చేయి ముందుకు జాపి జాలిగా మొహం పెట్టింది.

ఆ అమ్మాయి పగలబడి నవ్వుతూ "హహ్హహ్హ" అంటూ ఐస్ క్రీం మొత్తం తినేసి వెస్ట్ డబ్బా లో వేస్తున్నట్టు మేఘ మీద వేసింది.

మేఘ తన డ్రెస్ కి అంటుకున్న ఆ ఐస్ క్రీం చూస్తూ ఆ అమ్మాయిని చూసింది.

అమ్మాయి "ఏంటి? సారీ చెప్పాలా!"

అని నవ్వేసి మళ్ళి మాట్లాడుతూ

అమ్మాయి "ఆ డ్రెస్ పైకి లేపి నాలుక మీద రుద్దుకో తియ్యగుంటుంది" అంటూ మళ్ళి నవ్వేసి వెనక్కి తిరిగి వెళ్ళబోయింది.

ఇంతలో మేఘ వాయిస్ "ఓయ్..... లంజ" అని వినపడింది.

ఆ అమ్మాయి కోపంగా వెనక్కి తిరిగి మేఘ దగ్గరకు వస్తూ "ఎవరినే అంటున్నావ్.... ఎవరిని అంటున్నావ్" అంటూ వచ్చి, పిడికిలి బిగించి మేఘ భుజం మీద కొట్టింది.

మేఘ కదలకపోవడంతో వేలు చూపిస్తూ బూతులు తిడుతూ వెనక్కి తిరిగి వెళ్ళింది.

మేఘ "ఇటూ తిరుగూ..." అంది.

ఆ అమ్మాయి వెనక్కి "నీ యమ్మా...." అని అంటూ ఉండగానే... మేఘ చిటికే వేసింది.

ఆ అమ్మాయికి ప్రపంచం అంతా చీకటిగా కనిపిస్తూ ఉంది. ఎదో తెలియని ఒక బందీకానాలో బంధి అయినట్టు అనిపిస్తుంది.

ఒక కొత్త పర్సనాలిటీ తనలో అప్పటికేప్పుడే పడుతూ ఎదురుగా కనిపిస్తున్న మేఘని చూసి గౌరవంగా తల దించి ఆమెను చూస్తూ "మాస్టర్" అని పిలిచింది.

మేఘ చిన్నగా నవ్వి నీ చేతిలో ఉన్న ఫోన్ ని కిందకు విసిరేయ్ అంది. ఆ అమ్మాయి ఏ మాత్రం ఎదురు చెప్పకుండా వేసేసింది.

ఆ ఫోన్ గాల్లో కొద్ది సేపు ఉంటూ నేల మీద పడి ముక్కలు అయింది. 

అందరూ పైకి చూశారు. అందరి కంటికి ఆ అమ్మాయి కనిపిస్తుంది.

మేఘ "10 లెక్కపెట్టి ఆ తర్వాత దూకేసేయ్" అంది.

ఆ అమ్మాయి లెక్కబెడుతూ ఉండగానే మేఘ అక్కడ నుండి చిన్నగా వెళ్లి ఆమే పర్సులో నుండి డబ్బులు తీసి ఐస్ క్రీం కొని ఆమెను చూస్తూ ఉంది.

పది పూర్తీ అవ్వగానే ఆ అమ్మాయి రైలింగ్ ఎక్కి కిందకు దూకేసింది.

అందరూ కంగారుగా "అయ్యో" అంటూ దగ్గరకు వెళ్లి చేస్తూ ఉండగా, మేఘ చైర్ లో కూర్చొని ఐస్ క్రీం తింటూ ఉంది.




ఇంతలో పెద్ద వాయిస్ కేశవ్ "మేఘ.. అక్కడే ఆగూ" అని వినపడింది.

మేఘ పైకి లేచి తన వైపు వస్తున్న కేశవ్ ని చూసి కంగారుగా అక్కడ నుండి పరిగెత్తింది. ఎటూ పరిగేడుతుందో ఏం చేస్తుందో తెలియకుండా పరిగెడుతుంది.

సుహాస్ వచ్చి కేశవ్ తో "కనపడ్డప్పుడు అరవకుండా ఉంటే దొరికేది కదా...."

కేశవ్ "పరిగెత్తకుండా ఉంటుంది అని..." అన్నాడు.

సుహాస్ "నువ్వు ఇటూ నుండి వెతుకు... నేను అటూ నుండి వెతుకుతా...." అన్నాడు.

సూపర్ మార్కెట్ లో అన్ని ర్యాక్స్ అన్ని చోట్లా వెతుకుతూ పక్కనే ఉన్న మరో షాప్ లో వెళ్తూ వెతుకుతూ ఉన్నారు.

కేశవ్ ఒక్కో షాప్ వెతుకుతూ మేఘ ఇంకేం చేస్తుందో అనుకుంటూ భయంభయంగా వెతుకుతూ ఉన్నాడు.

సుహాస్ కి ఎదో ఐడియా వచ్చి అక్కడే ఉన్న సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్లి పోలిస్ అని చెప్పి cc కెమెరాలు చూశాడు.

వెంటనే ఫోన్ చేసి "కేశవ్... నువ్వు ఉన్నా షాప్ లోనే ఉంది... ఆ బట్టల మధ్య దాక్కుంది"

మేఘ దాక్కున్నా అనుకుంటూ ఉండగానే సడన్ గ కేశవ్ పట్టేసుకోవడంతో భయపడి "ఆ!" అని పెద్దగా అరిచి ఆ షాప్ నుండి బయటకు పరిగెత్తే ప్రయత్నం చేసింది.

కేశవ్ మీదకు వస్తున్నా విడి జనాన్ని చూస్తూ "తను క్రిమినేల్ నేను... సెక్యూరిటీ అధికారి" అని చెప్పాడు.

ఇంతలో మేఘ కేశవ్ పట్టు నుండి విడిపించుకోవడం కోసం మెలికలు తిరుగుతూ కలపడింది.

ఆడపిల్ల కావడంతో కేశవ్ కూడా సరి అయిన బలం చూపించలేక పోతున్నాడు.

కాని మేఘ వెనక్కి తిరిగి కేశవ్ ని చూస్తూ చిటికే వేసింది.

సుహాస్ చూస్తూ ఉండగానే.... కేశవ్ అడుగులు వేస్తూ బిల్డింగ్ మీద నుండి దూకేస్తున్నాడు.





సుహాస్ "కేశవ్... కేశవ్... " అని అరుస్తు వెళ్లి ఆఖరి నిముషంలో కేశవ్ ని పట్టుకొని రైలింగ్ నుండి ఇవతలికి లాగేశాడు.

అయినా కేశవ్ సుహాస్ ని తోసేసి పైకి ఎక్కే ప్రయత్నం చేయడంతో సుహాస్, కేశవ్ మొహం మీద పిడికిలి గుద్దులు గుద్దాడు.

కొన్ని దెబ్బలకు కేశవ్ స్పృహలో నుండి బయటకు వాచినట్టు వచ్చి కళ్ళు తెరిచి "సుహాస్" అన్నాడు.

అయినా సుహాస్, కేశవ్ మొహం మీద మరికొన్ని పిడికిలి గుద్దులు గుద్దడంతో కేశవ్ స్పృహ తప్పాడు.

చూడడానికి కేశవ్ ఆరు అడుగుల ఎత్తులో బలంగా కనిపిస్తాడు. సుహాస్ అయిదున్నర ఎత్తులో అతనిలో సగం ఉన్నట్టు ఉంటాడు. అలాంటిది సుహాస్, కేశవ్ ని స్పృహ తప్పేలా కొట్టడం చూసి అందరూ ఆశ్చర్య పోతారు.

సుహాస్ వెనక్కి తిరిగి చూడగా.... మేఘ అక్కడ నుండి వెళ్ళిపోయింది.

సుహాస్ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి తిరిగి cc కెమెరాలు చూసి మేఘ కనపడకపోవడంతో మరో ఫ్లోర్... మరో ఫ్లోర్... చూస్తూ ఉండగా... ఒక షాప్ లో డబ్బులు తీసుకుంటూ కనిపించింది.

సుహాస్ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా అక్కడ మేఘ కనిపించాదు... సుహాస్ భయం భయంగా చుట్టూ చూస్తూ ఉండగా.... మేఘ నవ్వు వినపడి చిటికే సౌండ్ వినపడింది.

సుహాస్ ఆమె కంట్రోల్ లోకి వెళ్ళలేదు. అది చూసి ఆమెకు భయం వేసి తన చేతిలో ఉన్న వస్తువులు అన్ని సుహాస్ మొహం మీద విసిరి ఆ షాప్ నుండి బయటకు పరిగెత్తి మరో షాప్ లోకి వెళ్ళింది.

అక్కడ నుండి అన్ని షాప్ ల ముందు నుండి పరిగెడుతూ ఉండగా సుహాస్ ఆమె దగ్గర దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాడు. ఇంతలో సుహాస్ కాలుకు ఎదో తగిలి కింద పడ్డాడు.

సుహాస్ "అబ్బా, అమ్మా" అని అంటూ ఉండగా.... కేశవ్ పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించాడు.

ఇంతలో మేఘ చిటికే వేయడం చూస్తూ కేశవ్ అడుగులు పడడం దూరం లోనే ఆగిపోయాయి.

సుహాస్ "వేయ్.... చిటికే వేయ్.... నేను నీ కంట్రోల్ లోకి రానూ" అన్నాడు.

మేఘ పెద్దగా నవ్వుతూ చిటికే వేసింది.

సుహాస్ "నేను నేనుగానే ఉన్నాను" అన్నాడు.

ఇంతలో తన పక్కనే ఉన్న నలుగురు మేఘ ని చూసి "మాస్టర్" అన్నారు.

సుహాస్ తేడా గుర్తు పట్టి మేఘని పట్టుకునే లోపే... మేఘ చెప్పినట్టుగా సుహాస్ ని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతున్నారు.

కేశవ్ పరిగెత్తుకుంటూ వచ్చి సుహాస్ ని పట్టుకున్న వాళ్ళ దగ్గరకు రాగానే... తనని మరో నలుగురు పట్టుకున్నారు.

వాళ్ళ పట్టు నుండి బయట పడదాం అనుకునే లోపే... ఆ ఇద్దరిపై సుమారు... పది పది మంది పడ్డారు.

సుహాస్ గాలి కూడా ఆడక నొప్పితో "ఆ!...." అని మూలుగుతూ ఉన్నాడు.

మరో వైపు కేశవ్ వాళ్ళ అందరి నుండి తప్పించుకోవడం ప్రయత్నిస్తూ ఉన్నాడు.
















[+] 12 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: 'నూతన్' పరిచయం - by 3sivaram - 28-09-2024, 08:55 PM



Users browsing this thread: 16 Guest(s)