27-09-2024, 01:44 PM
3.2
సాదారణంగా ఈ వేట రెండు రకాలుగా ఉంటుంది , ఒకటి పందులను వేటాడం , రెండు వాటిని పంటలకు దూరంగా తరిమేయడం, రెండో వేట పంట పొలం లో ఉన్నప్పుడు చేస్తారు, రెండో టైపు వేటాడేటప్పుడు , కొండ కింద నుంచి డప్పులు కొడుతూ , అడివిలోకి దూరంగా తోలతారు పందులను, కానీ మొదట రకం వేటాడేటప్పుడు , మొదట కొండ మీదకు వెళ్లి అక్కడ నుంచి పందులు ఎక్కడ కిందకు దిగుతాయో తెలుసుకొని ఆ జాగాల్లో మనుషులను పెట్టి , అప్పుడు పై నుంచి డప్పులు కొట్టు కొంటు పందులను కిందకు తోలుతారు , ఆ ప్రత్యేకమైన జాగాలో ఉన్న వాళ్ళు వాటిని వేటాడాలి, కొందరి దగ్గర తుపాకులు ఉంటాయి , మరి కొందరు చేతిలోని బల్లెలతో వాటిని వేతాడతారు.
ఈరోజు వేట కొండ మీద నుంచి కిందకు జరుగుతుంది. దారిలో నడుస్తూనే ఎవ్వరు ఎక్కడ ఉండాలి అనేది మాట్లాడేసుకొని వారి ప్లేస్ దాగ్గరకు రాగానే అక్కడే నిలబడి పోయారు , చివరగా డప్పులతో ఉన్న వారు మాత్రమె కొండ మీదకు వెళ్లి డప్పులు కొట్టు కొంటు కిందకు రాసాగారు. పూర్వ కాలం యుద్ధం చేయడానికి కొన్ని వ్యూహాలు ఉండేవి , మన కురుక్షేతం లో పద్మవ్యూహం, బాహు బలిలో అదేదో ఉంటుంది చూడు అలాగా , ఇక్కడ కుడా ఓ పద్దతి ఉంటుంది డప్పుల వాళ్ళు అంతా ఒకే చోట కాకుండా తిరగ బడ్డ U ఆకారం లాగా విడిపోయి , డప్పులు కొట్టు కొంటు వాటిని మిగిలిన వాళ్ళు ఉన్న ప్లేస్ లకు వచ్చే విదంగా నడుస్తూ , వాటిని బెదిరిస్తూ వస్తారు, అప్పుడు అవి భయపడి ఓ దారిలో పారిపోతూ ఉంటాయి ఆ దారిలోనే మిగిలిన వాళ్ళు కాపు కాసి వాటిని చంపడానికి రెడీ గా ఉంటారు.
అడివి పందులు , చాలా కోపంగా ఉంటాయి , ఆ సమయం లో వాటికి దొరికితే ఇంకా అంటే సంగతులు. వాటి కోరలు కత్తుల్లా మొహానికి రెండు వైపులా ఉంటాయి , తనకు ఎదురుగా ఉన్న వాళ్ళ మీద అటాక్ చేసేప్పుడు అవ్వి తల కిందకు వంచి తన మొహాన్ని అటు ఇటు తిప్పుతాయి ఆ కోరలు పొరపాటున మనిషి శరీరం లో కి దిగబడ్డాయా దిగబడ్డ బాగం ముక్కలు ముక్కలుగా విడిపోయి బయటకు వస్తుంది శరీరం లోంచి , అందుకే వేట గాళ్ళు పందులకు అందకుండా వాటిని వేటాడుతూ ఉంటారు.
శివా , రంగడు వాళ్లకు తోడుగా మరో 4 ఉన్నారు వేళ్ళకు కేటాయించిన ప్లేస్ లో అది కొండ మీద నుంచి కొండ కిందకు వర్షం నీళ్ళు వచ్చే దారి , దాన్నే నారవ అంటారు, నారవకు అటువైపు ముగ్గురు , వాళ్ళకు ఎదురుగా కొద్దిగా కింద వైపు శివా , రంగా , బాల్ రెడ్డి ఉన్నారు , బాల్ రెడ్డి చేతిలో నాటు తుపాకి ఉంది, దానికి తూటా లోడ్ చేసి రెడీగా పట్టుకొని ఉన్నాడు , కొడితే మొదటి తూటా తోనే పడగొట్టాలి రెండో తూటా లోడ్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది ఈ లోపల అవ్వి అందకుండా పోతాయి, లేదా మీదకైనా వస్తాయి.
బాల్రెడ్డి కి 45 ఉంటుంది వయస్సు , ఎన్నో పందులను చంపినా అనుభవం ఉంది.
“ఎంది , రంగన్నా కొడుకును కూడా తెచ్చినావు ఈ తురి”
“ఎం లేదన్నా, వాడే వద్దన్నా వస్తా వస్తా అంటా వెనక పడ్డాడు, ఇంక తప్పలేదు అందకే రమ్మన్నా”
“ఇది ఊర్లో అడే క్రికెట్ అట కాదు, ఎమారామా పందులు నంజు కుంటాయి , రోంత ఏరిక గా ఉండు”
ఈలోగా డప్పులతో పాటు కేకలు వెనబడాయి ఎగువ వైపు “రేయి రెండు పెద్దవి , మూడు చిన్నవి” అంటూ అరుస్తున్నారు. వీళ్ళ కంటే ముందు రెండు చోట్ల మనుసులు ఉన్నారు , వీళ్ళ కింద ఇంకో గుంపు ఉంది. మొత్తం 4 గుంపులు. పైన తప్పోతే కింద వాళ్ళు రెడీ గా ఉండాలి. 5 నిమిషాలకు పైన కేకలు వినబడ్డ “ఒకటి దొరికింది మిగితావి తప్పిచ్చు కొన్నాయి” అన్న అరుపు వినబడ్డది.
ఆ తరువాత డప్పులు కేకలు “అమ్మా, కుమ్మేసింది రో” అంటూ అరుపు , దాని వెంటనే “ డాం” అంటూ తుపాకి శబ్దం “ఇంకోటి దొరికింది , మిగతావి కిందకు వత్తాన్నాయి”
“శివా , నువ్వు బాల్రెడ్డి అన్న వెనుక ఉండు , నేను కొద్దిగా కింద ఉంటా” అంటూ రంగడు వాళ్ళకు కొద్దిగా కింద వైపుకు వెళ్ళాడు.
బాల్రెడ్డి కి వెనుక , తన ఎడం చేతిలోకి బరిసేను తీసుకొని కుడి చేతిలోకి నడుం కు వేలాడుతున్న గొడ్డలిని తీసుకొన్నాడు.
“నేను ఉన్నాలేబ్బీ , నీకు వాటిని ఉపయోగించే అవసరం రానీయను లే”
“వత్తాన్నాయి, సుసుకోండి” అంటూ వెనుక నుంచి కేకలు.
ఓ 8 కేజీల బరువు ఉన్న గున్న ఒకటి మొదట అగుపించింది. అది కనబడ గానే బాల్ రెడ్డి కొద్దిగా ముందుకు జరిగి గన్ తో కాల్చాడు, కాల్చాక తన తప్పు తెలుసుకొన్నాడు, దాని వెనుకే రెండు పెద్దవి వస్తున్నాయి ఎప్పుడైతే బాల్రెడ్డి ముందు వైపుకు వెళ్ళాడో సరిగ్గా వాటి దారికి దగ్గరగా జరిగాడు , తన గన్ వెటుకు ముందు వచ్చింది పడిపోయింది , కానీ దాని వెనుక ఉన్న రెండింటి చూపు బాల్రెడ్డి మీద పడింది. ఆ తొందరలో తన లుంగీ జారి పోవడం చూసుకోలేదు, వెనక్కు పరిగెత్త పోతూ ఉంటె లుంగీ కాళ్ళకు అడ్డపడి వెల్లకిలా పడ్డాడు. ఒకటి బాల్రేద్ద్ కాలును టార్గెట్ చేసింది , రెండోది బాల్రెడ్డి తల వైపుకు రాసాగింది. బాల్రెడ్డి తన ప్రాణం పొయ్యింది అనుకొన్నాడు, ఆయన వెనుక ఉన్న శివా గురించి మరిచి పోయాడు , తన తప్పు సరిదిద్దుకోనెంతలో వీటికి బలై పోతానే అనుకొంటూ , కాళ్ళు పైకి లాక్కోవడానికి ట్రై చేయసాగాడు. తనకు ఆ అవసరం లేకుండా వెనుక నుంచి క్యాటర్ పల్ లోంచి ఉడి పడ్డ రాయిలా , ఓ చేత్తో గొడ్డలి ఇంకో చేత్తో బరిసేతో బాల్రెడ్డి దూకాడు శివ, దూకగానే తన రెండు చేతులకు పని చెప్పాడు , కాళ్ళ మీద తన విసురుతున్న పెద్ద పంది మీద గొడ్డలి తో దాని మొహాన్ని నరికేశాడు. రెండో చేత్తో గుడ్డిగా తల వైపు వెళుతున్న దాని డొక్కలో బల్లెం గుచ్చాడు. రంగన్న ,పొలానికి అవసరం అయ్యే పనిముట్లే కాదు తను తయారు చేసే ఆయుధాలు కూడా ఎంత పదునుగా ఉంటాయో ఆ బల్లెం దిగిన తీరు తెలుస్తుంది. అది వచ్చిన ఫోర్సు కి , శివా చేతుల్లోని శక్తినంతా ఉపయోగించి దించాడు బల్లెన్ని దాని డొక్కలో దూరి కింద మట్టిలో గూటం కొట్టిన మేకులా నెలలో దిగింది బల్లెం , అయినా దాని బరువుకు కింద నెలలో ఈడుస్తూ బాల్రెడ్డి చేతి దగ్గరకు వచ్చింది బల్లెం దిగిన పంది , కానీ అంతకంటే ముందుకు కదల కుండా బల్లెన్ని నెలలోకి గుచ్చాడు శివ. గొడ్డలి దెబ్బకు సగం తెగిన ముట్టేతో వాళ్ళ నుంచి తప్పించు కొని ముందుకు పరిగెత్తింది సగం ముట్టే కిందకు వేలాడుతూ ఉండగా.
“నాయనా , వత్తాంది , దాని ముట్టే తెగింది , చూడు” అంటూ శివా గట్టిగా కేక వేశాడు వాళ్ళ నాన్న కు వినబడేట్లు. ఈ లోపల నారవకు ఆపక్కన్న ఉన్న వాళ్ళు కూడా ఈ పక్కకు వచ్చి వారి బల్లెలతో దాన్ని నొక్కి పట్టారు, బాల్రెడ్డి ఆ సందులో లేచి లుంగీ సర్దుకొని తుపాకి లోడు చేసుకొని కింద వైపు పరిగెత్తాడు. కానీ అక్కడి కి వెళ్లి తను చేసింది ఎం లేదు , సగం తెగిన ముట్టెతో వచ్చిన దాన్ని తన బల్లెం తో నొక్కి పట్టి ఉంచాడు రంగడు. శివా రెడ్డి తోపాటు వచ్చిన ఇంకో ఇద్దరు వాళ్ళ బల్లెల తో గుచ్చి దాన్ని కింద పడేశారు.
మరో 5 నిమిషాలకు అంతా అక్కడ గుమి కూడారు.
“నీ కొడుకును ఎందుకు తీసుకొని వచ్చావు అని అన్నాను చూడు , నా మాటను వెనక్కు తీసుకొంటున్నా రా రంగా, నా పాణం పొయ్యింది అనుకొన్నారా , యముని పాశానికి అడ్డం పడే వాడిలా నా ముందుకు దుంకినాడు. పిల్లోడు నా వెనుక ఉండు అని నేను ఎగతాలో చేసినాను కానీ ఆ పిల్లోడి రెండు చేతులు పని చేసాయి ఒకే సారి లేదంటే నా కాలో లేదా గొంతో పోయింది అనుకొన్నా , వాడేమ్మా ఎంత ఉన్నాయో చూడు , ఈ మద్య కాలంలో ఇంత పెద్ద దున్నలను మన వేటాడ లేదు. బుల్లెట్ కూడా దిగుతుందో లేదు అనేంత మందం ఉంది దీని చెర్మం , వీడు పొడిచిన పొడుపుకి ఆ బల్లెం భూమి లోకి ఎంత దిగబడిందో అక్కడ చూడండి , అది వచ్చిన తీరుకి నా పానాలు పైనే పోయినాయి , సాదారణమైన పోటు పొడిచినా అది నన్ను మాత్రం నంజు కొనేది , వాడి బల్లెం దాన్ని ముందుకు రాకుండా ఆపింది, ఏమో అనుకొన్నారా నీ కొడుకుని మొన్న ఊర్లో అంతా అంటూ ఉంటె చెరువులో ఈ పక్క నుంచి అపక్కకు ఈదుకొని వచ్చినాడు అంటే , పిల్లగాడు వయస్సు మీద ఉన్నాడు అనుకొన్నా , కానీ ఇప్పుడు తెలుత్తాంది వీడి భలం ఏమిటో , ఒరే శివా , నచ్చావురా , ఈ బాల్రెడ్డి కి నచ్చేసావు” అంటూ ఎత్తేశాడు శివాని.