Thread Rating:
  • 10 Vote(s) - 3.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం
#30
3.1.సాహసం
“నాయనా , నేను కూడా  వస్తా ఈ సారి  పందుల వేటకు”
“అది చిన్న పిల్లలు  ఆడుకొనే అట కాదు” 
“అమ్మా , నాకు తెలుసులే , నేనేం  ఇంకా చిన్న పిల్లవాడిని కాదులే”
“నేను చెప్తే వింటావా ,మీ నాన్న  తీసాక పోతాను అంటే వెళ్ళు ,  అబ్బా కొడుకు ఇద్దరు వెళ్ళండి” .
“అవును శివా, నిన్న రాత్రి  సినిమాకు వెళ్ళినప్పుడు అక్కడ గొడవ పడ్డారా ఎవరితో నన్నా”
“గొడవ అంటే గొడవ కాదు నాన్నా,  మన మల్లేసు గాడు లేడు, అదే నాన్నా రాజా రెడ్డి మామ డ్రైవర్,    ఆయత్తా పిల్లలతో కలిసి  సినిమాకు వచ్చినారు ,   అక్కడ  తురకొల్ల పిల్లోల్లు  ఎదో కొట్లాట పెట్టుకొని అత్తా వాళ్ళను కారు ఎక్క నీకుండా అడ్డం పడ్డారు ,  గమ్మున పొండిరా అని చెప్పినా , కానీ పోకుండా  మీద మీదకు వచ్చినారు,  ఆడికీ  రెండు దెబ్బలు వేసారు , గమ్మున ఉండ మని చెప్పినా వినలేదు అందుకే  రెండు పీకినా , ఈలోపు నా తోడుగాళ్ళు    వచ్చి తలా రెండు ఎట్లు వేసినారు ,  సినిమా మానేజరు వచ్చి  వాళ్ళను బైటికి తరిమి నాడులే”
“మనకు గొడవ ఎందుకప్పా ,  వాళ్ళ దావన  వాళ్ళు పోతారులే,  గొడవకు పోకు ఇంక ముందు”
“పాపం అత్త  అక్కడ కూతుర్లతో  ఇబ్బంది పడుతూ ఉంటె అట్టా  ఎట్లా  చూత్తా ఉంటా నాన్నా, నా వళ్ళ కాదు”
“వాళ్ళు నీమీద పగ బట్టి  రేపు కాలీజీ కి వెళ్ళినప్పుడు మీద పడితే”
“తంతే  తన్నిచ్చు కుంటా , లేదంటే నేనే నాలుగు తన్ని వత్తా”
 
“సరేలే  బువ్వ  తిని కొద్ది సేపు పడుకో , నేను తెపుతా వెళ్ళేటప్పుడు”
“నీకు ఎవ్వరు చెప్పినారు” అంది మంగి
“ఇంకెవ్వరు , ఆ రాజా రెడ్డి మామే  ఎపమాని కింద కూచొని  అందరికీ చెప్తున్నాడు”
“మనోడు మంచి పనే చేసినాడు గదా ఎందుకు నువ్వు వాని మీద అరుత్తున్నావు”
“నేనేం అరవడం లేదు , ఆ ఉరోల్లు  ఈడు వంటిరిగా దొరికితే ఏమైనా చెత్తారు ఏమో అని భయం అంతే”
“ఆ మాటే  రాజి రెడ్డి అన్నతో అనక పోయావా”
“అది కూడా  అయ్యింది,  అప్పుడే  ఫోన్ చేసి  C.I  తో మాట్లాడాడు వాళ్ళు ఎవ్వరో కనుక్కో , ఇంకో సారి మా జోలికి  గానీ , మా ఉరి  వాళ్ళ జోలికి గాని వస్తే  వాళ్ళ జాతిని మొత్తం  ఆ టౌన్ లో లేకుండా చెత్తం  అని వార్నింగ్ ఇంచ్చిండు.   ఆ  C.I   భయపడుతూ , నేను చుసు కుంటా రెడ్డి  మీ వరకు రానీయను లే  అని చెప్పాడు మా ముందరే.”
“మరి ఇంకా  భయం ఎందుకు”
“నీకు తెలియదు , వాడికి మనం  ఇటువంటి వాటిలో తోడూ ఉన్నాము అని  తెలిస్తే వాడు  ఇంకా  చదువు చదవడు ఇలా గోడవలతో  సరిపోతుంది వాడి జీవితం , మనకు వద్దు అలాంటి జీవితం , వాడు చదువుకొని పెద్దోడు ఆవ్వాలి”
వాళ్ళ  నాయన  పడుకో అనంగానే  చాప మీద పడుకొని రగ్గు కప్పెసుకొన్నాడు,  వెంటనే నిద్ర పెట్టేసింది ,కొడుకు నిద్ర పోయాడు అని  రంగా అతని పెళ్ళాం  వాడి గురించి మాట్లాడు కొన్నారు.
ఊర్లో  అంతా సందడగా ఉంది ,  వయస్సుకు వచ్చిన వారు అందరు ఎదో ఒక ఆయుధం తీసుకొని , కొందరు డప్పులు  తీసుకొని రెడీ అయ్యారు,    రంగడు శివాను  లేపకుండా వెళదాం అనుకొన్నాడు ఊర్లో  వాళ్ళు  బయలు దేరగానే, కానీ  శివ ఓ  కునుకు తీసి  లేచి   అటక మీద  ఉన్న  బల్లెం ( ఈటె ) తీసుకొన్నాడు ,  దానికి తోడూ   శివా  15 ఏట  వాళ్ళ నాన్నతో స్పెషల్ గా  ఓ  గొడ్డలి  తయారు  చేయించుకొన్నాడు,   తన మేన మామ  మిలిటరీ నుంచి ఒక నెల సెలవుల కోసం వస్తూ ఉంటాడు , వచ్చినప్పుడల్లా   ఓ  రెండు వారాల పాటు మేనల్లుడిని తన దగ్గర పెట్టుకొని , తనకు తెలిసిన కొన్ని విద్యలు నేర్పిస్తూ ఉంటాడు.   అందులో ముఖ్యంగా  బాక్సింగ్  లో కొన్ని పట్లు ,  చేతిలో కత్తి ( కొడవలి, గొడ్డలి లాంటివి ) ఉంటె దాన్ని ఎలా వాడాలో  మామ  మిలటరీ కి వెళ్ళగానే  అప్ప్డుడప్పుడు  ప్రాక్టిసు చేస్తూ ఉంటాడు  వాళ్ళ నాన్నకు తెలీకుండా.   చిన్నప్పటి నుంచి తన  నాన్నతో కొలిమిలో పని చేస్తూ  సమ్మెట కొడుతూ ఉండడం వళ్ళ తన చేతుల్లో పవర్  తనకు తెలీనంతగా  పెరిగింది.   కానీ  దానిని ఎప్పుడూ  ఉపయోగించే  అవసరం రాలేదు.
ఉరి లోంచి  వాళ్ళ నాన్న  వచ్చే  సరికి తన ఆయుధాలతో ,   వాళ్ళ  నాన్న  అడివిలోకి ప్రత్యేకంగా చేయించిన చెప్పులతో( అడివిలో  ముల్లులు  చెప్పుల్లో దురకుండా  కింద గట్టి  చర్మంతో  తయారు చేయించాడు  కొడుకు మీద ప్రేమతో ) రెడీ గా ఉన్నాడు.
 “వాడు  పడుకోన్నాడా”
“ఎక్కడ పడుకొన్నాడు , నువ్వు ఊర్లోకి  వెళ్ళగానే  అటక మీద ఉన్నవి తీసు  వాటి దుమ్ము దులిపి రెడీ అయ్యాడు, తీసుకొని వెళ్ళండి,  అలవాటు అవుతుంది పెద్దాడు అవుతున్నాడుగా ”
“సరే లే , నా పక్కనే ఉండమని చెప్తాను”  అంటూ    కొడుకుని  కేకేశాడు.
“నేను రెడీ”  నాన్నా అంటూ   నడుం కి  గొడ్డలి చేతిలో బల్లెం , ఇంకో చేతిలో  చిన్న  టార్చ్ లైట్  తో ,     వంటి మీద పొడుగు నిక్కర ,  బనీను  బుజం మీద టవల్  ఇది శివా  అవతారం.
“యుద్దానికి  పోయే వాడిలాగా రెడీ అయ్యినావుగా, సరే పద అందరు  బయలు దేరారు” అంటూ  తను కూడా   సుర్లో ఉన్న  బల్లెం తీసుకొని బయలు దేరాడు.
ఉరిలోంచి అడివి లోకి పోవాలి అంటే ,  చుట్టూ పొలాల లోకి జంతువులూ  వెళ్ళకుండా  కంచే ఏర్పాటు చేశారు , దానినే  ఉరి బాషలో దొంక  అంటారు ,  ఆ దొంక   వీళ్ళ  కొలిమి  దగ్గర నుంచే మొదలు అవుతుంది.   ఊర్లోంచి  ఒక్కరొక్కరే  వచ్చి  ఆ కొలిమి దగ్గర  గుమి కూడారు,   దాదాపు  ఓ  25  మంది జమ కూడా గానే  , రాత్రి  10.30  అవుతూ ఉండగా  అందరు  కలిసి కట్టుగా  చేతిలో ఉన్న టార్చ్ లైట్స్ దారి చూపుతూ ఉండగా  అడివిలోకి బయలు దేరారు,
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 9 hours ago



Users browsing this thread: aghori123, RACHAKONDA, venkat1979, 26 Guest(s)