Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం
#20
ఉరి మద్యలో   ఓ పెద్ద  వేప మాను ఉంది  ఆ వేప మానుకు వెనుక   ఆ ఉరి  గంగమ్మ  గుడి ఉంటుంది , ఆ గుడి ముందు  కుచుకోవడానికి బండలు వేసి ఉంచారు.   సాదారణంగా   ఊర్లో ప్రజలు ఆ బండల మీద కూచొని లోకాభి రామాయణం  మాట్లాడుతూ ఉంటారు ,  ఊర్లో రాజకీయాల దగ్గర నుంచి ప్రపంచ ఆర్థిక   పరిస్తితి వరకు  అక్కడ చర్చలు జరుగుతూనే ఉంటాయి.   
శివా  నాన్న ఇంట్లోంచి బయలు దేరి అక్కడి కి వచ్చింది అందుకే. 
“ఎరా  రంగా ,నీకొడుకు  చెరువు  ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్లి వచ్చాడంటగా,  ఏంట్రా  మీ నాయన లాగా తయారు అవుతాడా ఏంటి ?  కొంచెం జాగ్రతా గా చూసుకో రే”
“ఇంటికి వచ్చి  వాళ్ళమ్మకు చెప్పాడు , నాకు నమ్మకం దొరక్క   ఇక్కడ కొచ్చాను, నిజమా కాదో తెలుస్కోందాము  అని”
“ఇప్పుడే   చంద్రా చెప్పాడు ,  మబ్బోడు  వాళ్లతో పందెం కట్టాడు అంట , వాడు అది గాడు ఉన్నాడుగా , వాడు  అపక్కకు వెళ్ళాడు  ,  ఈ పక్కకు రాలేక పోయాడంట, మీ వాడు పోయినప్పుడు ,30 నిమిషాలు పట్టింది అంట ,  వచ్చేటప్పుడు , 20 నిమిషాలకే  వచ్చాడంట”
“నిజంగా ఈదాడంటావా అన్నా” అన్నాడు ఆశ్చర్యంగా.
 
“ఒరే  వాడు నీ కొడుకురా , వేరే వాళ్ళు ఎవరన్నా  అబద్దం చెపుతారు ఏమో,   వీడు అబద్దం చెప్పడని ఊర్లో ఎవరిని అడిగినా చెపుతారు”.
“అదే రా ,అంత  నిజాయితీ గా ఉంటె  ఎలా బతుకుతాడో  అని భయంగా ఉంది”
“ఒరే,  జీవితం  అంతా నేర్పిస్తుంది లేరా ,  మంచికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది , నీ బిడ్డ  వజ్రం రా , వాడికి ఎం కాదు , ధైర్యంగా ఉండు” అన్నాడు అక్కడ ఉన్న  ఉరి కి పెద్దైన  అప్పిరెడ్డి.
మరో 30  నిమిషాలు అక్కడ  కూచొని  వాళ్లతో మాట్లాడి, ఇంటికి వచ్చాడు.
శివ పడుకొని  ఘాడమైన నిద్రలో ఉన్నాడు ,  తన భార్య   ఇంట్లో పని చేసుకొంటూ ఉంది.   
ఇంటికి వచ్చిన రంగడు , కొడుకును చూసి , కొడుకు  కాళ్ళ దగ్గర కూచొని  వాడి కాళ్ళు నొక్క సాగాడు.
“ఎంది , ఎప్పుడు లేనిది , వాడి కాళ్ళదగ్గర కూచొని వాడి కాళ్ళు నొక్కుతున్నావు”
“ఊర్లో నీ బిడ్డను  గురించి ఎం మాట్లాడు కొంటున్నారో  తెలుసా”
“ఎం మాట్లాడుతున్నారు ఏంటి”
“మా నాయన  ఉడి పడ్డాడు అంట,  మా నాయన ధైర్యం , మా నాయన చదువు , మా నాయన తెగింపు , అన్నీ మా నాయన్ని  మించి పోయేలా ఉన్నాడు అంటున్నారు.”
“నీ కొడుకును తరువాత పోగుడుదువు  గానీ , సాయంత్రం నీకు పని అప్పగించిన వాళ్ళు వస్తారు పనిముట్లు  ఇవ్వమని అప్పుడు , వాళ్ళకు నీ కొడుకు గొప్ప గురించి చెపుతూ ఉండు సరిపోతుంది”.
వీల్ల మాటలకు  అప్పుడే మెలుకవ వచ్చిన శివా “ఏంటి నాన్నా,  నువ్వు కాళ్ళు పిసుకుతూ ఉన్నావు,  లే పద , పని ఉంది అన్నావుగా, పద తోందరగా అవ్వకొడదాము , నాకు  రేపటి నుంచి కాలేజీ ఉంటుంది” అంటూ  వాళ్ళ నాన్నను లేపి  కొలిమి దగ్గరకు వచ్చాడు.
ఇద్దరు కలిసి , సాయంత్రం వరకు  కస్టపడి, ఇవ్వాల్సిన సామాన్ల  అన్నిటిని తయారు చేశారు.
“రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళు , నేను అమ్మా చేసుకొంటాములే” అన్నాడు  రంగడు.
“సరే నాన్నా, రేపు నేను  మా ఫ్రెండ్స్ తో కలిసి రెండో ఆటకు  సినిమాకు వెళతాము”
“అంత రాత్రి ఎలా ఎనక్కు వత్తారు”
“వాళ్ళు బైక్  లో పోదాము అన్నారు  లే   బైక్ లోనే ఇంటికి   వస్తాములే, నేను ఊర్లోకి  పోతున్నా   అన్నం తినే టైం కి వస్తా”  అంటూ   ఊర్లోకి  వెళ్ళాడు.
ఊర్లో తన స్నేహితులని కలిసి శివ ,  వాళ్లతో రేపు ఎ టైం కి వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకొని రాత్రి అన్నం తినే టైం కి  ఇంటికి వచ్చి తిని  నిద్రపోయాడు.
ఉదయం  నిద్ర లేచి  కాలేజీకి  వెళతాడు తన స్నేహితులతో  కలిసి.   ఆ ఉరి నుంచి దాదాపు  15  నుంచి  ఓ  20 మంది దాగా  పక్కన ఉన్న టౌన్ కి   రక రకాల చదువుల కోసం  పోతూ ఉంటారు,  కొందరు  బుస్సులోను , మరి కొందరు  అటో లోను , ఉన్న వాళ్ళు  తమ స్వంత బైకు  ల లోను వెళుతూ ఉంటారు. 
శివా  బస్సు పాస్  తీసుకొని బుస్స్ లో  వెళుతూ వస్తు ఉంటాడు.     ఆ రోజు బస్సులో చాల మంది  మన వాణ్ణి  చాలా మంది, స్పెషల్ గా చూస్తారు  తను చేసిన ఘన కార్యం  ఊర్లో అందరికే తెలుస్తుంది.  వీడు మాత్రం అదేమీ  పట్టించుకోకుండా  తన పని తను చేసుకొంటూ పోతాడు. కొందరు  తనకు కంగ్రాట్స్ చెపుతారు , మరి కొందరు  వాళ్ళల్లో  వాళ్ళే  గోనుక్కొంటు ఉంటారు.
జీనియర్ కాలేజీలో  పెద్దగా స్పోర్ట్ లేకపోయినా,  సంవత్సరం చివర జరిగే పోటీల్లో  శివ  కుడా  కొన్నింటిలో  పాల్గొని  తను పాల్గొన్న  అన్నింటి లోనూ  తప్పకుండా ఏదో ఒకటి ప్రైజ్  గెలుచుకొని వస్తు ఉంటాడు,   సాదారణంగా   రన్నింగ్  లోనే  ,  లాంగ్ జంప్ ,  హై  జంప్  లోను పాల్గోంటు ఉంటాడు.
ఆ రోజు   కాలీజీ లో    సర్కులర్  వచ్చింది ,  ఈ సంవత్సరం  లో జరిగే  స్పోర్ట్స్ మీట్  కు పాల్గొనే  వాళ్ళు , పేర్లు ఇమ్మని  మరో రెండు రోజులలో మాత్రమె టైం ఉంటుంది అని దాని సారాంశం. 
శివా , తన ఫ్రెండ్స్ తో కలిసి   తన పేరు కూడా  ఇస్తాడు ఎప్పటి లాగే.
సాయంత్రం ఇంటికి రాగానే   “నాన్నా  , మీ మామ  అదివారం ఉరికి రమ్మని చెప్పాడు, మనల్ని అందరినీ  అక్కడ  ఊర్లో గంగమ్మకు   మొక్కు తీర్చు కొంటున్నారు దానికి యాటలు  కొడుతూ ఉన్నారు ,  మనల్ని కూడా  రమ్మన్నారు”
“నాన్న కూడా  వస్తున్నాడా అమ్మా”
“ఏమో అడుగు” అంది  పక్కనే ఉన్న మొగుణ్ణి చూస్తూ.
“నేను రాలేను లేరా , అమ్మా నువ్వు  వెళ్ళండి, నాకు పనులు ఉన్నాయి లే,  ఆదివారం  ఉండి  సోమవారం వచ్చేయండి, నీకూ  కాలేజీ ఉంటుంది గా, పోయి అక్కడే ఉండి  పోతారా ఏంటి”
“వచ్చేస్తాము లే,  ఎందుకు ఉంటాము ,  మా తమ్ముడు రమ్మన్నాడని వెళుతున్నాము”
“సరే  శుక్రవారం వెళ్ళండి, సోమవారం వచ్చేయండి”
“సరే నాన్నా” అంటూ  శుక్రవారం  వాళ్ళ అమ్మతో కలిసి  తన మేన మామ ఇంటికి వెళ్ళడానికి  రెడీ అయ్యాడు.
మరుసటి రోజు యదా విధిగా కాలేజీకి వెళ్ళాడు.
 
ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్స్ తో కలిసి రెండు బైకుల రెండవ ఆటకు సినిమాకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళే సరికి  మొదటి అట  సినిమా అప్పుడే  వదిలి నట్లు ఉన్నారు,  అంతా బయటకు వస్తూ ఉన్నారు.   వెళ్ళు సరిగ్గా లోపలికి వెళ్ళే సరికి  అక్కడ ఎదో గొడవ జరుగుతూ ఉంది.  కారు  పక్కన   ఇద్దరు అమ్మాయిలూ , ఓ పెద్దావిడా నిలబడి ఉన్నారు ,  డ్రైవర్  ఎవరితో నో  మాట్లాడుతూ ఉన్నాడు , కానీ  అటువైపు వాళ్ళు   6  మంది వన్ని కొట్టడానికి  వచ్చినట్లు ఉన్నారు.  వాడు చెప్పేది వినకుండా  వాడి మీద మీదకు వస్తు ఉన్నారు.   చూస్తే  ఆ  డ్రైవర్  వీళ్ళ ఉరి  వాడే ,  “ఒరే  మల్లేసు  ఏమైంది రా ,  ఎవరు వాళ్ళు ఎందుకు నీ మీదకు వత్తా ఉన్నారు” అంటూ ముందుకు దూకాడు  డ్రైవర్ కు   వాళ్ళ  మధ్యకు.
“ఎ  కౌన్  రే  బీచ్ మే  మారో  సాలె కో”  అంటూ  శివా మీదకు   రావడానికి   ముందుకు వచ్చారు.
“శివా , వాళ్ళు కావాలనే  గొడవ పెట్టు కొంటున్నారు , ఇందాక థియేటర్ లో   అమ్మాయి గారి సీటు మీద కాళ్ళు పెట్టారు , దానికి వాళ్ళను  మేనేజర్ తో చెప్పి   వార్నింగ్ ఇప్పించారు అమ్మాయి గారు , అది  మనసులో పెట్టుకొని ,  వాళ్ళ బైక్ లు  తెచ్చి కారుకు  అడ్డం పెట్టి , నేను కారుతో డాష్ ఇచ్చాను అని   గొడవ పెడుతూ ఉన్నారు” అన్నాడు మల్లేసు శివా  వెనుక నిలబడి.
“ అన్నా , అయ్యింది ఎదో అయ్యింది,  పోనీయండి , వదిలేయండి”అన్నాడు శివ
“ఏందిరా  వదిలేది” అంటూ మీద మీదకు రా సాగారు , వాళ్ళు  6 మంది ఉన్నారు ,  అది వాళ్ళ  ఉరు అని ఓ ధీమా.
“కొట్లాట వద్దన్నా  మీరు వెళ్ళండి, ఒరే మల్లేసు , నువ్వు సీట్లో కుచ్చో  ,  అత్తా  నువ్వు కార్లో కుచ్చో , మీరు కూడా  అన్నాడు అమ్మాయిల వైపు చూస్తూ”
“ఏందిరా  , వాళ్ళను వేల్లనిచ్చేది , ముందు వీడిని వెయ్యండి రా” అంటూ  బాగా దిట్టంగా ఉన్నాడు  శివా మీదకు చెయ్యి ఎత్తాడు.
“అన్నా , వద్దు  ఆ తరువాత  బాగుండదు” అన్నాడు చేతికి చెయ్యి అడ్డం పెడుతూ.
“సాలె ,  నాకే అడ్డం పెడతావా” అంటూ  ఇంకా రెచ్చి పోతూ  బైక్ లోంచి  రాడ్డు  తీసి శివా మీదకు రాబోయాడు.
“శివా , ఈ నా కొడుకులు చెపితే వినర్రా , ఎయ్యి నా కొడుకుల్ని” అన్నాడు  వెనుకగా బైక్ లో వచ్చి అప్పుడే పార్క్ చేస్తున్న  బైక్ లోంచి కిందకు దిగిన  ఆది గాడు.
వాడు  విసిన రాడ్డు కు  ఎడం చెయ్యి అడ్డం పెట్టి  కుడి చేత్తో  వాడి గుబ మీద ఒక్కటి పీకాడు  శివ  , ఆ దెబ్బ  కు  వాడు అలాగే నెలకు కరుచుకొని పోయాడు  ,  ఓ నిమిషానికి వాడి చెవి లోంచి రక్తం కార సాగింది.  వాడు కింద పడక ముందే  మరు ఇద్దరు మరో  వైపు నుంచి శివాను  కమ్ము కొన్నారు.  
వాడి గుబ మీద  ఇచ్చిన  చేత్తో  రెండో  వాడి  గడ్డం కింద  లాగి  మేచ్చేత్తో  ఒక్కటి పీకాడు,   వాడి  కింద పళ్ళు , పై  పెదవిలో ఇరుక్కొని పోగా   వాడు కింద పడి  పోర్ల  సాగాడు.  ఈ లోపల  మబ్బోడు ,  అదిగాడు   శివాకి తోడుగా వచ్చారు    ముగ్గురు   కలిసి  మిగిలిన నలుగుర్ని   రెండు నిమిషాల్లో పడుకో పెట్టారు.   ఈ లోపల  మేనేజర్  వచ్చాడు “ఎంది  గొడవ  అంటూ” .
కారు లోంచి మల్లేసు  దిగి , అక్కడ వాళ్ళు అడ్డం వచ్చిన దగ్గర నుంచీ  చెప్పాడు,  వేళ్ళకు  లోపలే బుద్ది  వచ్చింది  అనుకోన్నానే “మీరు మంచి పని చేశారు  అబ్బాయిలు,  వీళ్ళను , నేను చూసుకుంటా , మీరు వెళ్ళండి”
“వాళ్ళు  ఇప్పుడే వచ్చారు సారూ , మా ఉరి వాళ్ళు , ఇక్కడ  ఈ నా కొడుకులు అమ్మగారిని కారు ఎక్కనీ కుండా ఆడ్డం  పడుతూ ఉంటె   మా శివా  వచ్చి నాలుగు పీకాడు” అంటూ మా గురించి చెప్పాడు.
అక్కడున్న  watchమెన్  ని పిలిచి  “వీళ్ళకు నేను చెప్పాను అని  బాల్కనీ లో కుచో పెట్టు , ఈ నా కొడుకుల్ని  పంపించి వస్తా , మీరు టికెట్  కొనద్దు , నా తరపున ఈ రోజు మీకు ఫ్రీ , ఇలాంటి  వాళ్ళ  వళ్ళ  మా కస్టమర్స్  కి ఇబ్బంది కలగొద్దు  , మీరు మంచి పని చేసినారు”  అంటూ   అక్కడున్న  సిబ్బంది తో  వాళ్ళను బైటకు  నెట్టి వేయమని చెప్పాడు.
“శివా, నేను  పోతున్నా,  వాళ్లు   ఏమన్నా సినిమా అయ్యాక  వాళ్ళ వాళ్లతో వత్తారేమో  జాగ్రత్తగా రెండి  ఇంటికి” అంటూ మల్లేసు కారును  ధియేటర్  బయటకు  తిప్పాడు.
శివా తన  ఫ్రెండ్స్  తో కలిసి సినిమాకు  వెళ్ళాడు. “ఒర్ మబ్బోడా , నీ డబ్బులు మిగిలిచ్చాడు  శివా , వాటితో   కావలసినవి  కొనుక్కొని రాపో” అంటూ లోపలికి వెళ్ళగానే  వాణ్ని బయటకు తరిమారు అందరు కలిసి. సినిమా చూసి , మబ్బోని జేబులు ఖాళీ చేయింది  రాత్రి  2  కి ఇంటికి చేరుకొన్నారు. 
మరుసటి రోజు లేట్ గా లేవడం వల్ల  కాలేజీకి వెళ్ళలేక పోయాడు.   వర్షాలు దండిగా  కురవడం వల్ల అందరు పొలాలు రెడీ చేసుకొన్నారు  విత్తనాలకు  వేయడానికి. కానీ  కొండ దగ్గర ఉండడం వల్ల  పందుల బెడద ఎక్కువగా ఉంటుంది .  పంటలు వేయడానికి ముందు ఊరంతా  కలిసి  డప్పులతో  పందులను బెదిరిస్తూ,  వాటి ని వేటాడతారు,   రెండు  నెలలకు ఓ సారి జరుగుతూ ఉంటుంది ఈ వేట పంటలుకోసి ఇంటికి చేర్చెంత వరకు. ఆ తరువాత  తిరిగి పంటలు వేసేంత వరకు వాటి జోలికి వెళ్లరు.
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 26-09-2024, 11:41 AM



Users browsing this thread: 44 Guest(s)