Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం
#19
2.  పందెం
“మీ  కాలీజీ  గొడవ  ఆపుతారా  , ఈరోజు  ఈ మూల నుంచి ఆ మూలకు  ఎవ్వరు ముందు వెళతారో  చూద్దాం” అన్నాడు  మబ్బోడు ,  రాము  కు మేము పెట్టు కొన్న  పేరు.
“ఏందిరా , వీడికి ఇప్పటికి  వేలుకవ  వచ్చింది  , వచ్చీ  రాగానే  పందెం అంటాఉన్నాడు ,  ఎరా మబ్బు ఏమైనా కల కన్నావా ఎంది  నిద్రలో” అన్నాడు అది  నవ్వుతు.
“నీ యక్కా ,  ముందు  పందెం గెలిచి ఆ తరువాత  చెప్పు ఎవ్వరు మబ్బో”  రాము.
“ ఒరే  , ఈ పందేలు అవ్వీ ఎందుకు గానీ,  రోంచేపు  ఈత కొట్టి పోదాం పదండి” శివ
“లేదురా ,  పాపం  వాడు  మాట్లాడక మాట్లాడక ఓ మాట మాట్లాడితే అలా తీసేస్తే ఎలారా ,  ట్రై చేద్దాం” చంద్రా.
“నువ్వే చెప్పరా , ఎంది  పందెం ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లి రావాలి” మోహన్.
“ఆపక్క  తెల్ల  రాయి ఉంది చూడు దాన్ని తాకి  ఇక్కడికి రావాలి”
“ఒరే  , ఆపక్క పోయ్యేదానికే పిత్తుల్లు  ఆడతాయి , ఇంకా అక్కడ నుంచి  ఇక్కడికి  తిరిగి రావడం  కూడానా?”
“మీలో  ఎ  ఒక్కరూ  ఈ పక్కకు వచ్చినా , రేపు రాత్రికి మీకు అందరికీ   సినిమాకు నేను కర్చు పెట్టుకొని తీసుకొని పోతా, మద్యలో  తినడానికి , డ్రింక్స్  కి అంతా నేను పెట్టుకుంటా  అది పందెం , లేదంటే మీరు  నన్ను తీసుకొని పొండి, నాకు కావాల్సిన వన్నీ కోనీయండి” అన్నాడు నవ్వుతు.
 
“ఓరి , ఈ డెబ్బ  పెద్ద ఫిట్టింగ్  పెట్టడురా ,  వీడికి సినిమా ఎలాగైనా  చుపించొచ్చు  , మద్యలో  వీడు తినే తిండికి     మా నాయన   ఓ  ఎకరం   ఎగవ చేను అమ్ము కోవల్ల  , నేను డ్రాప్” అన్నాడు  మోహన్.
“మీరు వత్తాంటే  మీతో పాటు వచ్చినా  గానీ, నావల్ల  గాదు  ఈ పందేలు”  అన్నాడు చంద్రా.
“ఒరే  అదిగా , నా దగ్గర డబ్బులు లేవు గానీ , నేను ట్రై చేస్తా ,  నువ్వు కూడా  రా నాతొ పాటు చూద్దాం” అన్నాడు శివ  లుంగీ  తీసి అప్పుడే విప్పిన బనీన్ మీద పడేస్తూ.
“ఏందిరా  శివా , జిమ్  గానీ వెళుతున్నావా ఏంది మాకు తెలీకుండా , ప్రబాస్ అన్న లాగా నీక్కూడా  6 పాక్స్  వస్తున్నాయి చూడు”.
“వాడికి ఎసుకోవడానికి  సరిగ్గా చెప్పులు లేవు  ఇంకా జిమ్  ఎం వెళతాడు,  వాడి చేసే పని చూసినావా, పొద్దున్న  ఎత్తిన  సమ్మెట  ,  మద్యలో బువ్వకే  దించుతాడు  ఆ తరువాత రాత్రి కే , అందుకే  వాడి బాడీ అలా ఉంది”  మోహన్  గాడు.      
“వాడి అరిచెయ్యి  చూడు ఎలా ఉందొ  , మొన్న ఎప్పుడో ఊర్లో వేపమాని కింద పందేలు  వేస్తుంటే ఈ అది గాడు రెచ్చ గొట్టాడు వీన్ని  , టెంకాయ పగల కొట్టమని  వీడు  మొదలు పెట్టక ముందు చానా మంది ట్రై చేసి   సచ్చారు   ఓ  టెంకాయిని పగల గొట్టే దానికి వీడు అలా దాని మీద చేయి వేశాడో  లేదో  అది   పిచ్చిలు పిచ్చలు అయిపొయింది  సుత్తితో కొట్టిన మాదిరి”.
“ఆరోజు నా చెయ్యి బాలేదు గానీ  లేకుంటే నేనే గెలిచే వాడిని” అదిగాడు.
“సరేలే  వాయి , ఇప్పుడు ఇది ఈది చుపిచ్చు , నీకు వీడితో ఎప్పుడు పోటీనే  గదా” మోహన్.
“ఒరే పందేలు తరువాత , మొదట నీళ్ళల్లో  దిగండి” అంటూ మోహన్ గాడు  అరవ గానే అందరు ఒక్కరి తరువాత ఒక్కరం నీళ్ళల్లో  దుకారు.
“చెప్పానా , మనకు చెప్పడు వాడు ,  చూడు వాడు ఈత కొట్టేది ,  వాడి చూపు అంతా  ఆ తెల్ల రాయి మీదనే ఉంది , వోరే మబ్బు  ,  మీ నాయన దగ్గర  డబ్బులు కొట్టేసి  రేపు రాత్రికి రెడీగా ఉండు ,  శివా గాడు  ఈదుకొని  వస్తాడు చూడు”  రాము.
శివా, ఆది, మబ్బోడు    అటువైపు గట్టుకు ఈద  సాగారు , మిగిలిన ఇద్దరు  అక్కడ  అక్కడే ఈదుతూ , వాళ్ళ ఇద్దరినీ గమనించ  సాగారు.
కొద్ది దూరం వెళ్ళాక , మబ్బోడు  వెనక్కు మల్లాడు , మిగిలిన  ఇద్దరు  ఆ గట్టుకు ఈద  సాగారు.
ఓ  30 నిమిషాలు పట్టింది  , వాళ్ళు  అటువైపు చేరే సరికి,  ఆ చివర ఉన్న   బండను తాకి శివా  వెంటనే వెనక్కు  ఈదడం  మొదలు పెట్టాడు ,  అది  ఓ నిమిషం పాటు అక్కడే కూచొని  శివా ఈదడం చూసి వాడు కుడా నీళ్ళలో దిగి ఇటువైపు   శివా వెనుక ఈదడం మొదలు పెట్టాడు. 
మరో  20 నిమిషాలకు  శివా ఇటువైపు వచ్చాడు ,  అది గాడు  మద్యలో  కొద్ది గా ఈది , తన వల్ల కాదు అనుకోని అటువైపు  గట్టుకే  ఈది , కట్ట మీద నుంచి నడుచుకొంటూ  వీళ్ళు ఉన్న వైపు రాసాగాడు.
“మాకు తెలుసురా ,  ఇక్కడ  ఈదే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే నువ్వేరా, ఒరే  మబ్బోడా  ఎప్పుడన్నా  పందెం కట్టే టప్పుడు , శివా గాడు లేనప్పుడు కట్టు  , వాడు ఉన్నాడు అంటే నీ నోట్లో మట్టే”  మోహన్.
 “ఒరే   ఊర్లో  ఎవ్వరు ఇంత వరకు  ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళిన వాళ్ళే ,  తిరిగి వచ్చిన వాళ్ళు  ఎవ్వరు లేరంట , అప్పుడు ఎప్పుడో మన నాయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు  శివా గాడి తాత  ఈదాడు  అని మా నాయన చెప్పినాడు , అందుకే  పందెం కట్టినా , ఎవ్వరు  ఈద లేనప్పుడు వీడు కూడా  ఈదలేడని , కానీ ఈడు  వీళ్ళ తాతను మించి పోయట్లు  ఉన్నాడు,  ఒరే  దీంట్లో ఒక దాంట్లో నేనా ,  లేక అన్నింట్లో మీ తాత పోలికలు వచ్చినాయా  నీకు  ఏంది?” అన్నాడు మబ్బోడు.
“కోసింది  చాల్లే  గానీ ,   పదండి ఇంటికి పోదాము నాకు బాగా ఆకలి గా ఉంది”  అన్నాడు శివా  
బట్టలు కట్టుకొని అందరు ఇంటి దారి పట్టారు.
“రేయి  రేపు రాత్రికి అందరు రెడీ గా ఉండండి  , సెకండ్ షో  కు వెళదాం  టౌన్ కి”
“ఒరే  సెకండ్ షో అంటే లేట్ అవుతుంది రా , మనకు రావడానికి ఎం దొరకవు.”
“నేను మా నాయన్ను  అడిగి బైక్ తెస్తా , ఇంకో  బైక్ ఉంటె ఎలాగో  మేనేజ్  చేయచ్చు”  అన్నాడు  చంద్రా.
“రేపు గదా ,  ఎలాగో  ఇంకో బైక్  సంపాదిద్దాములేరా, మీ  రైతే  రెడీగా ఉండండి”అన్నాడు మబ్బోడు.
“ఎంది రా  ఇంత సేపు పోయినావు ,   ఆకలి వెయ్యాలా ?”  అంది శివా  అమ్మ  ప్లేట్  లో  రాగి ముద్దా,  బెండకాయ పులుసు వెస్తూ
“బాగా ఆకలిగా ఉంది,   మబ్బోడు చిన్న పందెం పెట్టినాడు, అందుకే లేట్ అయింది”
“ఎం పందెం  నాయనా ? ఎం చేసినారు ఏంటి?”
“ఎం లేదు నాయనా  చెరువులో  ఈపక్కనంచి ఆపక్కకు వెళ్లి  మళ్ళీ  ఈ పక్కకు రావాలి”
“అబ్బో  మీ పిల్ల నాయాళ్ళ  వళ్ళ ఎం అవుతుంది , అప్పుడు ఎప్పుడో మా నాయన వయస్సులో ఉన్నప్పుడు ఓ  సారి  ఈదాడంట, ఆ తరువాత ఎవ్వరు  ఆ పని చేయల్లేదు” దిండుకు అనుకోని  కళ్ళు ముసుకొన్న రంగడు.
ముసి ముసిగా నవ్వుతు  రాగి సంగటి ని  చిన్న ముద్దలు  గా చేసి   పులుసులో  దొర్లించి ఆ ముద్దలు  నోట్లో వేసుకోంటున్న  కొడుకును చూసి  “ఎం  మీ నాయన ఒకడేనా అంత  పోటుగాడు , నా బిడ్డ  తక్కువ ఎం కాదు” అంది  శివా  అమ్మ.
గప్పున  లేచి సరిగ్గా కుచోంటు,  “శివా , నిజంగా ఈదావా ?   నిజమా ,  చెప్పు బిడ్డా , నిజంగా ఈదినావా ఏంది?” అంటూ పట్టి పట్టి అడగ  సాగాడు.
“వాడి నవ్వు చూస్తే  తెలీడం లేదు ,  ఈదాడో లేదో , అంత  డౌట్ గా ఉంటె   వాని  తోడూ గాళ్ళను అడుగుపో చెపుతాడు , నా బిడ్డ మనసులో ఎం ఉందొ నాకు  తెలుసు” అంటూ   కుండ లోని పులుసు ను  గరిటతో   శివా ప్లేట్ లో వేస్తూ.
“నాకు నమ్మకం లేదు , ఉండు నేను కనుక్కొని వస్తా” అంటూ  తను పడుకొన్న  చోట నుంచి లేచి  ఊర్లో కి వెళ్ళాడు.
శివ మాట్లాడ కుండా, అమ్మ పెట్టిన  ముద్ద తిని  చేతులు కడుక్కొని   వాళ్ళ నాయన  లేచి  వెళ్ళిన  చాప మీద పడుకొని “ అమ్మా  నాన్న  పనిలోకి  వెళ్ళగానే లేపు , నేను  రోంచేపు పడుకుంటా” అంటూ కునుకు తీశాడు.  
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 26-09-2024, 11:38 AM



Users browsing this thread: 96 Guest(s)