25-09-2024, 05:39 PM
1. పరిచయం
“ఏందిరా పొద్దున్నే కొలిమి పెట్టినావు, అంత పని ఉంది ఏంటి?” అన్నాడు నాగన్న కొలిమి లోంచి నిప్పు తీసుకొని తన బీడీ వెలిగించు కొంటు.
“అవును మామా , వర్షాలు పడ్డాయి కదా అందుకే దుక్కి దున్నడానికి మడకలు కావాలిగా ఈ చుట్టూ పక్కల ఉన్నది మన కొలిమి ఒకటే కదా అందుకే మామా కొద్దిగా పని ఎక్కువ అయ్యింది” అన్నాడు రంగడు చేతిలోని సుత్తితో కాలిన ఇనుమును కావలసిన విధంగా సాగ దీస్తూ.
“ఒక్కడివే ఉన్నావు ఏంటి ? నా అల్లుడు ఎక్కడ , కాలజీ కి వెళ్ళాడా”
“లేదు మామా రెండు రోజుల నుంచి పంపలేదు, పని ఉంది నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు వాడే సమ్మెట కొడుతున్నాడు, అలసి పోయాడు , అందుకే కొద్దిసేపు పడుకోమని నేను లేప లేదు.”
“కొడుకంటే వాడురా , మాకూ ఉన్నాడు ఎందుకు ఇంట్లో ఒక్క పని చేయరు , దానికి తోడూ దానికి డబ్బులు ఇవ్వు , దీనికి డబ్బులు ఇవ్వు అంటూ మా చేత కర్చు పెట్టిస్తు ఉంటారు, వీడు ఉన్నాడు నువ్వు కర్చుల కు ఇచ్చిన డబ్బులు కూడా మా చెల్లికి ఇస్తూ ఉంటాడు అంట”
“ఏమో మామా వీడు అందరి లా కాకుండా వేరుగానే అనిపిస్తున్నాడు”
“ఒరే రంగా అలాంటి కొడుకు ఉన్నందుకు గర్వ పడు బామర్ది, వాడికి ఎం కాదు , చూస్తూ ఉండు మంచి ఉద్వోగాలు సంపాదించి నిన్ను మా చెల్లిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోంటాడు.”
“ఏమో మామ పాపం ఆ వయస్సు పిల్లలు సంతోషం గా ఉంటె నేను వాడిని ఇక్కడ సమ్మెటతో నా పని చేయించు కొంటున్నాను.”
“ఏంటి మామా , పొద్దున్నే మా నాయన మీద పడ్డావు?, ఎం నాయనా ఇంకా ఎంత పని ఉంది , ఈరోజు అయిపోతుందా రేపటి నుంచి నేను కాలేజీ కి వేల్లోచ్చా , నేను రెండు నిమిషాల్లో వస్తా మొహం కడుక్కొని నువ్వు కొలిమి వేడి చేసుకో” అంటూ తను లేచిన చాప , దిండు మడత పెట్టి అక్కడ ఉన్న అటక మీద పెట్టి బయట ఉన్న వేప చెట్టు దగ్గర కెళ్ళి దాన్ని నోట్లో వేసుకొని తోముకొని అక్కడ ఉన్న తొట్టి లోని నీటిని తీసుకొని మొహం కడుక్కొని తన బుజం మీద ఉన్న టవల్ తో తుడుచు కొంటు కొలిమి ఉన్న ప్లేస్ కి వచ్చాడు.
ఉరి చివర ఉన్న ఓ పెద్ద వేప చెట్టు కింద ఉంటుంది కొలిమి, అది ఓ 500 గడపలు ఉన్న ఓ చిన్న పల్లె, ఆ వేప చేట్టుకొని అనుకోని ఉన్న ఓ చిన్న బోద కొట్టం లో ఉంటారు ఆ కొలిమి నడుపుతున్న ఓనర్ రంగా, అతని బార్య మంగి అతని కొడుకు శివ.
“నాన్న ఇదిగో రాత్రి కలిపిన సద్దన్నం కొద్దిగా తిని ఆ తరువాత పని లోకి వెళ్ళు , నీకు మీ నాన్నకు ఓ సారి పనిలోకి దొరికితే ఆకలీ దప్పికా ఎం తెలీవు ” అంటు శివ వాళ్ళ అమ్మ ఓ ముంత తెచ్చి శివ చేతిలో పెట్టింది, ఇంకో చేతికి ఓ ఉల్లి పాయి , మిరప కాయ ఇస్తూ.
“నాయన తిన్నాడా అమ్మా”
“నువ్వు తింటూ ఉండు , మీ నాన్నకు కుడా తెత్తాండ” అంటూ ఇంట్లోకి వెళ్లి మరో ముంత తెచ్చి ఇచ్చింది రంగాకు.
“ఆన్నా , ఇంకో ముంత ఉంది నీకు కుడా తెస్తున్నా ఉండు” అంది నాగన్న వైపు చూస్తూ
“వద్దు తల్లీ , నేను పొద్దున్నే తిని వచ్చా ఇంట్లో” అన్నాడు నాగన్న.
వాళ్ళ అమ్మ ఇచ్చిన ముంతను రెండు నిమిషాల్లో కంప్లీట్ చెసి , ముంతను ఇంతకూ ముందు తను మొహం కడుక్కొన్న తొట్టి దగ్గరుకు వెళ్లి కడిగి వాళ్ళ అమ్మకు ఇచ్చాడు. వాళ్ళ నాన్న తన ముంత లోని అన్నం తింటూ ఉండగా శివ కొలిమి దగ్గరకు వచ్చి అందులోని కొద్దిగా బొగ్గులు సరిగా వేసి , అక్కడ ఉన్న గాలి కొట్టే తిత్తిని కొద్ది వేగంగా కదుపుతూ కొలిమిలో ఉన్న ఇనుమును, పట్టకర్రతో తిప్పుతూ దాన్ని పూర్తిగా వేడెక్కించాడు. ఈలోపున వాళ్ళ నాన్న తన చేతిలోని ముంతను ఖాళీ చేతి కొడుకు చేతిలోని పట్టకర్ర తీరుకొని ఆ ఇనుము ను తన చేతిలోకి తీసుకొని , “నువ్వు సమ్మేట తీసుకో నాన్న” అంటూ వేడెక్కిన ఇనుమును అక్కడున్న ఇనుప దిమ్మి మీద పెడుతూ దాన్ని అటు ఇటు తిప్పుతూ తన చేతిలోని చిన్న సుత్తితో కొడుతూ దానిని తనకు కావలసిన రీతిగా మలుచు కో సాగాడు. ఈ లోపున తన బుజం మీద ఉన్న టవల్ ని తలకి చుట్టుకొని , అక్కడున్న సమ్మెట తీసుకొని రంగా పెట్టిన ఇనుము మీద రిథమిక్ గా దెబ్బలు వెయ సాగాడు, అంతకు ముందు తన వంటి మీద ఉన్న టవల్ ఇపుడు తన తల మీదకు వెళ్ళడం వల్ల తన బనియన్ లోంచి ఉబికి బయటకు వస్తున్న కండలు , సమ్మెట కొడుతూ ఉన్నప్పుడల్లా శివా భుజాలు , అతని కండలు చూసి , “రంగా, అల్లుడు పెద్దోడు అవుతున్నాడు” అన్నాడు ఇంకో బీడీ వెలిగిస్తూ.
“ఇంటర్ రెండో సంవత్సరానికి పెద్దోడు ఎలా అవుతాడులే , వాడు అంతా మా నాయన శివన్న పోలిక , మా నాయన పొయే నాటికి కుడా , చాల ఆరోగ్యంగా ఉండేవాడు. ఆయన ఆరడుగుల పైన ఉండే వాడు. వీడికే అదే పోలిక వచ్చింది, అందుకే అయన పేరు పెట్టుకొన్నా ” అన్నాడు సమ్మెటతో పలుగు గా తయారు అవుతున్న ఇనుము కమ్మీ మీద వెట్లు వేస్తున్న కొడుకును మురిపంగా చూస్తూ.
“వీడు కూడా , మీ నాన్న లాగా బాగా చదువుకుంటాడులే”
“మా నాయన ఎక్కువ చదువుకోలేదులె , ఆ కాలంతో SSLC చదువుకొన్నాడు , సర్కారోల్లు ఉద్యోగం ఇచ్చినా వద్దు అని కోలిం పనే చేసేవాడు, అప్పట్లో నో ఏవో కొత్త కోత్త పరికరాలు తయారు చేసేవాడు వ్యవసాయానికి అవసరం అయ్యేట్లు, వీన్ని ఈ పనిలోకి రావద్దు అంటున్న , టౌన్ కి వెళ్లి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి , ఈ గొడ్డు చాకిరీ నా తోనే ముగిసిపోవాలి” అన్నాడు.
“ఏందిరా రంగా , మొన్న తోనిక్కట్టెలు చేయమని ఇచ్చాను , చేసినావా” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన రాజా రెడ్డి.
“రాత్రే అయ్యింది మామా పొద్దున్నే నేనే వచ్చి ఇద్దాము అనుకొన్నా , కాకా పొతే కొద్దిగా పని ఎక్కువ ఉంది, అదిగో ఆ గుంటక పక్కన పెట్టినా చూడు తీసుకో” అన్నాడు తన ద్యాస కొడుకు కొట్టే సమ్మెట మీద నుంచి మార్చ కుండా, ఆ సమ్మేటకు అనుగుణంగా పట్టకారుతో ఆ ఇనుప కమ్మీని తిప్పుతూ.
చేతిలోని తోనిక్కట్టెలు తీసుకొని వాటిని ఓ మారు చెక్ చేసి
“చుసినావురా నాగ్గా , ఈ తోనిక్కట్టేలతో చెండ్లో గడ్డి కాకుండా ఎవరినన్నా ఎసేయాలన్నా ఒక్క దెబ్బ చాలురా , ఒరే మా నాయన చెప్పేటోడు , ఇనుమ్మీద మీ నాయన చెయ్యి పడితే, గుడిలో వరాలిచ్చే దేవత లాగా అయన మాట ఇని , ఆయనకు కావలసినట్లు తయారు అయ్యేవంట పనిముట్లు, మీ నాయన చేసిన బలి కత్తి ఇప్పటికీ మా ఇంట్లో అటక మీద ఉంది, నువ్వు మీ నాయనకు ఎ మాత్రం తీసుపోవురా, ఏంటి నీ కొడుకును నీ లాగే తయారు చేత్తున్నావా ఎంది , మొన్న మా యమ్మి చదివే కాలేజీ లో చూసినా వీన్ని , కాలేజీ కి పోలేదా ఎంది” అన్నాడు.
“పని ఎక్కువగా ఉంది అని , నేనే పంపలేదు మామ , రేపట్నుంచి పోతాడులే”
“సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకొని పో”
“తీసుకొంటాలె , నీ దగ్గర ఎక్కడ పోతాయి డబ్బులు”
“వీనికి పని చేసేది వచ్చు డబ్బులు ఎలా అడగాలో కూడా తెలీదు , మొన్నటి సారి బండికి ఇరుసు పొతే ఎసిచ్చినావు దాని డబ్బులు కూడా తీసుకోలా , ఒరే అబ్బీ నువ్వన్నా వచ్చి తీసుకొని పో అవ్వీ ఇవ్వీ అన్నీ కలిపి” .
“అలాగే మామా” అన్న శివా వైపు చూస్తూ తోనిక్కట్టెలు తీసుకొని వెళ్ళాడు రాజా రెడ్డి.