25-09-2024, 05:54 PM
162. పిడుగులు
లావణ్య "నన్ను అక్కడ వదిలేసి కారు తీసుకొని వెళ్ళిపోయారు... ఆ బైక్ ని ఎలా తీసుకురావాలో నాకు అర్దం కాలేదు... మేడం అందుకే మీకు ఫోన్ చేశాను"
నిషా "మ్మ్" అంది.
లావణ్య "ఆ బైక్ ని పెట్రోల్ బంక్ లో పెట్టాం కదా..... ఏం కాదా....."
నిషా నిదానంగా శ్వాస పీల్చి వదులుతూ "మ్మ్" అంది.
లావణ్య "మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది... ఈ జోరున పడే వర్షంలో ఇబ్బంది పడే దాన్ని..."
నిషా "ఓహ్"
నిషా మనసులో కాజల్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంది.
నిషా "క్రిష్ వెళ్ళింది రష్ కోసం కాదు.... నువ్వు కంగారు పడాల్సిన పని లేదు"
కాజల్ "తన కొడుకు కోసం వెళ్ళాడు.... నాకు తెలుసు"
నిషా హమ్మయ్య అని అనుకుంది.
ఇంతలోనే కాజల్ "కాని నాకు పిల్లలు పుట్టరు.... రేపు ఎప్పుడైనా క్రిష్ కి నేను భారం అనిపిస్తే..." అని అడిగింది.
ఆమె కళ్ళు కన్నీరు కార్చకపోయినా తడిగా మరియు ఎర్రగా ఉన్నాయి. అక్క ఎదో నిర్ణయం తీసుకుంది.
నిషా ఆలోచనలను చెరిపేస్తూ... లావణ్య మాట్లాడుతూనే ఉంది.
లావణ్య "ప్రభాకర్ అంటే.... మన కంపనీ లాయర్... అందుకే పని తొందరగా అయిపొయింది"
నిషా "ఓహో..." అంది.
లావణ్య "నేనే క్రిష్ కి చెప్పాను..... క్రిష్ గుర్తు పెట్టుకున్నాడు..... నీకు తెలుసా... నేను క్రిష్ కి నెలకు ఒక లవ్ లెటర్ రాసినా ఒక దానికొకటి కలిసేది కాదు...."
నిషా "మ్"
లావణ్య "అయినా ఏం చేస్తాం.... కనీసం ఓపెన్ కూడా చేయకుండా చించేసేవాడు.."
నిషా "ఓహో..." అలా నిషా సగం సగం సమాధానాలు చెప్పినా లావణ్య మాట్లాడుతూనే ఉంది.
లావణ్య "రిలేషన్ లో ఎప్పుడూ కూడా ఎక్కువ ప్రేమించిన వాళ్ళే ఎక్కువ బాధ పడతారు... పైగా వాళ్ళు అంటే అందరికి చులకనే...."
నిషా "వాట్.... ఏమన్నావ్..."
లావణ్య "నేనేమన్నాను"
నిషా "ఇప్పుడు చివరిలో ఎదో అన్నావ్ కదా....."
లావణ్య "లవ్ లెటర్స్ గురించి.... ఏం రాశాను అంటే...."
నిషా "ప్చ్... అది కాదు.... చివరిలో రిలేషన్ అని ఎదో అన్నావ్ కదా...."
లావణ్య "హా... రిలేషన్ లో ఎప్పుడూ కూడా ఎక్కువ ప్రేమించిన వాళ్ళు అంటే ఎక్కువగా తమను తాము కోల్పోతారు...."
నిషా "ఓహో..."
లావణ్య "ఏమయింది?"
నిషా "ఏం లేదు...." అంటూ తిరిగి ఆలోచనలలోకి వెళ్ళిపోయింది.
లావణ్య "నువ్వు ఏమయినా మాట్లాడుతావా!"
నిషా "హుమ్మ్..."
లావణ్య "నేనే మాట్లాడుతున్నాను, నువ్వు ఏమయినా మాట్లాడుతావా! అసలు నువ్వు ఏం చేస్తూ ఉంటావ్...."
నిషా "రాజ్ గ్రూప్ చైర్మెన్ మిస్టర్ వైభవ్ రాజ్ కి పర్సనల్ సెక్రటరీని" అంది.
లావణ్య "ఓహ్..." అని చిన్నగా "పర్సనల్ సెక్రటరీనే కదా.... ఎదో పెళ్ళాం అన్నట్టు చెబుతుంది"
ఇంతలో నిషా ఫోన్ మోగింది.
నిషా "హలో... సర్ " అంది
వైభవ్ "సర్... ఏంటి? సర్.... హస్బెండ్ ని ఎవరైనా సర్ అని పిలుస్తారా...." అన్నాడు.
నిషా ఫోన్ కట్టేసింది. మళ్ళి ఫోన్ రావడంతో స్విచ్ ఆఫ్ చేసేసింది.
కాజల్ మాటలు గుర్తుకు వచ్చాయి, "నిషా, క్రిష్ ని రెండో పెళ్లి చేసుకుంటా అని నాకు మాటివ్వు..." అంది.
లావణ్య "మేడం... మేడం... "
నిషా "ఏమయింది?"
లావణ్య "మనం వేరే రూట్ లో వెళ్తున్నాం"
నిషా చుట్టూ చూడగా వైభవ్ ఇంటి ముందు ఉంది. వైభవ్ బాల్కనీలోకి వచ్చి కోపంగా తన ఫోన్ నుండి నిషా ఫోన్ కి ఫోన్ చేస్తూ స్విచ్ ఆఫ్ వచ్చే సరికి కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. మళ్ళి తనలో తానే నవ్వుకుంటూ ఎదో మెసేజ్ పెట్టాడు. నిషా అదంతా చూస్తూ ఉంది.
నిషా వెంటనే ఫోన్ స్విచ్ ఆన్ చేసి మెసేజ్ కోసం వెతికింది.
ఫోటో వచ్చింది.... అది.... ఇద్దరూ కలిసి దిగిన కపుల్ ఫోటో... వెంటనే మరో ఫోటో వచ్చింది. ఎమోషనల్ అయి తిరిగి వైభవ్ ని చూసింది. కారు దిగి వెళ్లి అతన్ని కలవాలని అనుకుంది. కాని ఇంతలో లావణ్య "మేడం... మేడం..." అని పిలవడంతో తిరిగి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కారుని తిరిగి తన ఇంటికి తిప్పింది.
నిషా మనసులో "రిలేషన్ అంటే ప్రతి సారి హస్బెండ్ & వైఫ్ మాత్రమే కాదు. ఒక్కో సారి అమ్మ-కూతురు, నాన్న-కొడుకు, బ్రదర్-సిస్టర్, అక్క-చెల్లెలు కూడా" అని అనుకుంటూ ఇంటికి వచ్చింది.
కాజల్ ఫోన్ లో "హలో, క్రిష్ మీతో ఉన్నాడా! ఫోన్ చేస్తే ఎత్తడం లేదు"
నిషా "లేదు, ఉండు ఎవరికైనా కాల్ చేస్తాను"
కాజల్ "వద్దు... నాకు ఎక్కడ ఉన్నాడో తెలుసు..."
కారు అలా చిల్ద్రెన్ పార్క్ దగ్గర ఆగింది. క్రిష్ ఒక సిమెంట్ బల్ల మీద కూర్చొని తల దించుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆకాశంలో పెద్దగా పిడుగు శబ్దం వినిపించింది.
ఆకాశం అంతా చిక్కటి చీకట్లు కమ్ముకున్నాయి. ఆకాశంలో చంద్రుని మరియు నక్షత్రాల వెలుతురూ రాకుండా మేఘాలు కమ్మేశాయి. భూమి పై గాలికి కరెంట్ పోయింది.
సన్నటి చినుకులు మొదలయ్యాయి. పిడుగు మీద పిడుగు పడుతూ ఉంది. అతి పెద్ద వర్షం పడబోతుంది అని తెలుస్తుంది.
ఇదంతా తనకు తన జీవితంలా పడుతున్న ఒక్కో పిడుగులా అనిపించింది.
తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని పూర్తిగా తడవడం కోసం సిద్దంగా ఉన్నాడు.
పెద్దగా వర్షం పడింది. కాని తను తడవలేదు, కళ్ళు తెరిచి చూడగా, తనపై గొడుగు వచ్చింది. వెనక్కి తిరిగి చూడగా కాజల్ కనిపించింది.
ఇంట్లోకి వెళ్ళగానే క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ ఏం మాట్లాడుకోకుండా సోఫాలో కూర్చొని ఉన్నారు. నిషా మరియు లావణ్య ఇద్దరూ వాళ్ళను చూస్తూ ఉన్నారు. అందరూ సైలెంట్ గా ఉన్నారు, ఎవరూ ఏం మాట్లాడడం లేదు.
లావణ్య "రాత్రి అయింది కదా.... నేను ఇక్కడే ఉండేదా!"
అందరూ సైలెంట్ గా ఉండే సరికి తన ప్రశ్నకు తానే సమాధానం చెప్పుకుంది.
లావణ్య "థాంక్స్ క్రిష్... నువ్వు ఇంత మంచి వాడివి అనుకోలేదు"
క్రిష్, కాజల్ వైపు తిరిగి "బేబి.... ఐ వాంట్ టూ డ్రింక్.. " అన్నాడు.
లావణ్య, నిషాతో "ఏంటి పర్మిషన్ అడుగుతున్నాడు" అంటూ నోటి మీద చేయి పెట్టుకొని "కామిడీగా లేదు" అంటూ పెద్దగా నవ్వుతుంది.
నిషా తనని పట్టించుకోకుండా ముందుకు నడిచింది.
క్రిష్ "ప్లీజ్" అన్నాడు.
కాజల్ తల ఊపింది.
క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు వాళ్ళ ముందు అయిదు బీర్ బాటిల్స్ ఉన్నాయి. నిషా కాజల్ పక్కనే కూర్చొని ఓక బాటిల్ పట్టుకొని ఉంది. లావణ్య తల స్నానం చేసి నిషా బట్టలలో ఎదురుగా కూర్చొని జుట్టు ఆరబెట్టుకుంటూ చిన్నగా క్రిష్ ముందు ఉన్న ఒక బాటిల్ తీసుకుంది. కాని ఎవరూ పట్టించుకోలేదు. పెద్దగా నవ్వుతూ "ఎప్పుడూ తాగేసావ్... అప్పుడే ఒక బాటిల్ అయిపొయింది" అంది. ఎవరూ పట్టించుకోలేదు సైలెంట్ గా ఉన్నారు. తిరిగి అక్కడే పెట్టింది. ఎవరూ పట్టించుకోలేదు.
క్రిష్ ఓపెనర్ తో బాటిల్ ఓపెన్ చేసి నిషాకి ఇచ్చాడు. ఇంకో బాటిల్ ఓపెన్ చేసి కాజల్ కి ఇచ్చాడు. కాజల్ తాగుతూ చేదు గొంతులోకి పోవడంతో మొహం అదోలా పెట్టి తిరిగి క్రిష్ కి యిచ్చింది. ఎదురుగా ఉన్న మంచింగ్ తింటూ ఉంది.
క్రిష్ రెండూ సార్లలో బాటిల్ మొత్తం తాగేసి మరో బాటిల్ ఓపెన్ చేసి కాజల్ కి ఇచ్చాడు.
నిషా వీళ్ళకు సంబంధం లేకుండా తన బాటిల్ ఓపెన్ చేసుకొని చిన్న చిన్నగా తాగుతూ గాల్లోకి చూస్తూ ఆలోచించుకుంటూ ఉంది.
క్రిష్ ఆలోచిస్తూ మనసులో నానిని ఊహించుకుంటూ ఎమోషనల్ గా ఉన్నాడు.
కాజల్ అతన్నే చూస్తూ ఉంది.
క్రిష్ "పార్క్ అంటే చాలా ఇష్టం.... వెళ్దాం అనగానే ఇక్కదిక్కడే గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు.... చిన్న చిన్న చేతులు కాళ్ళు వేసుకొని నడుస్తూ బయట నుండి నేను తెచ్చే చిన్న చిన్న బ్యాగ్ లు తీసుకొని వెళ్లి వాళ్ళ అమ్మకు ఇచ్చే వాడు... ఏంజెల్ ల అనిపించేవాడు... కష్టంగా ఉండేది... చాలా కష్టంగా ఉండేది.... ఒక పక్క చదువు... మరో పక్క చిన్న బిజినెస్... మరో వైపు జాబ్... ఇంట్లో పనులు.... అన్ని కూడా వాడిని చూడగానే మాయమైపోయేవి" అన్నాడు.
లావణ్య ఎదో మాట్లాడబోతూ ఉంటే నిషా సీరియస్ గా చూసింది. లావణ్య ఆపేసింది.
కాజల్ ఓపెనర్ తో బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చింది.
క్రిష్ రెండూ ఒక్క సారి ఎత్తి మొత్తం తాగేశాడు.
క్రిష్ రొప్పుతూ కొద్ది సేపు అలానే ఉన్నాడు. మంచింగ్ తీసుకొని అతని నోటికి అందించింది. క్రిష్ అపుడే కాజల్ వైపు చూశాడు ఆమె కళ్ళు కూడా ఎర్రగా అనిపించాయి.
క్రిష్ "నాకు తనను చూడాలని అనిపించింది... కనీసం ఒక్క సారి ఒక్క సారి అయినా.... కానీ.... కానీ.... " అంటూ మరో సిప్ వేసి కింద పెట్టి "నేను దగ్గరకు వెళ్తేనే సూ సైడ్ చేసుకుంటా అంది. పైగా ఒక సారి చేయి కూడా కోసుకుంది, నానిని కూడా... నానిని కూడా... " అంటూ ఆగిపోయాడు.
కాజల్ అతన్ని హాగ్ చేసుకుంది.
నిషా చిన్నగా తల పైకి కిందకు ఊపుతూ ఉంది.
లావణ్య కూడా ఏడ్చేసింది "అప్పుడు నేను రాసిన లవ్ లెటర్ చదివి ఉంటే.... మోటివేషనల్ గా ఉండేది కదా..." అని అంది.
నిషా ఓపెనర్ తీసుకొని లావణ్య తల మీద కొట్టి సైలెంట్ అంటూ నోటి మీద వేలు పెట్టుకొని చూపించింది. లావణ్య "ఆహ్" అని నోటి మీద వేలు వేసుకొని సైలెంట్ గా ఉంది.
క్రిష్ "తన కోసం నేను నా ఫ్యామిలీని వాళ్ళ పుట్టింటి వాళ్ళను, మెట్టినింటి వాళ్ళను అందరిని ఎదిరించినా ఎందుకు నేను కనిపించలేదు..... ఎందుకని? అసలు నేనేం తప్పు చేశాను?" అన్నాడు.
లావణ్య నోరు తెరిచి "అది ఎందుకంటే... రిలేషన్ లో ఎక్కువ..."
నిషా, లావణ్య తోడ మీద చరిచి "షట్ అప్" అంది. లావణ్య అలిగినట్టు మొహం పెట్టి అక్కడే కూర్చుంది.
కాజల్ ఎదో మాట్లాడదాం అనుకున్నా... ఏం మాట్లాడాలో అర్దం కాలేదు.
క్రిష్ "సక్సెస్ అయ్యాను.... తన కంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని సక్సెస్ అయ్యాను" అంటూ కాజల్ మీద పడి ముద్దు పెట్టబోయాడు.
నిషా "ప్చ్..." అని తన అసహనాన్ని తెలియజేసింది. క్రిష్ తన పెదాలు ముందుకు పెట్టి ఆమె మీద మీద పడిపోతున్నాడు.
కాజల్ సీరియస్ గా క్రిష్ చెంప మీద కొట్టింది. క్రిష్ ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి "బేబి..." అని అంటూ ఉండగానే అతని రెండో చెంప మీద కూడా కొట్టింది.
క్రిష్ మళ్ళి మాట్లాడబోతే మళ్ళి కొట్టింది. ఈ సారి క్రిష్ మాట్లాడకుండా షాక్ గా కాజల్ ని చూస్తూ ఉన్నాడు. ఆమె అతని రెండూ చెంపలు కొడుతూ పైకి లేచి గదిలోకి వెళ్ళిపోయింది.
క్రిష్ పైకి లేచి ఆమెను ఫాలో అవుతూ ఉంటే, లావణ్య అడ్డం వచ్చి "అయ్యో క్రిష్..." అంటూ ఉంటే ఆమెను పక్కకు తోసేసి కాజల్ వెళ్ళిన డోర్ దగ్గరకు వెళ్లి తలుపు కొట్టాడు.
చాలా సేపు కొట్టినా పిలిచినా ఆమె తలుపు తీయలేదు.
నిషా "వెళ్లి డాబా మీద పడుకో.." అంది.
క్రిష్ సరే అంటూ వెళ్ళిపోయాడు.
లావణ్య "అదేంటి? నేను ఆ బెడ్ రూమ్ లో పడుకుందాం అనుకున్న, నువ్వేంటి క్రిష్ ని పంపావ్... " అంది.
నిషా, లావణ్య చేతిని లాక్కొని తన గదిలోకి వెళ్ళింది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them