Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
160. గెట్ టూ గెదర్











కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. రష్ నన్ను వదిలి వెళ్ళేటపుడు కనీసం మాట్లాడకుండా ఒక లెటర్ మీద "Good Bye..!" అని రాయడం, దానికి బరువుగా నేను కట్టిన తాళిబొట్టుని పెట్టడం గుర్తుకు వస్తూ ఉంటే, గట్టిగా అరవాలని అనిపించింది. పిడికిలి బిగించి నన్ను నేను ఆపుకున్నాను.

నూతన్ మా ఇద్దరినీ కావాలని విడకోట్టాడు అని తెలిశాక, రష్ దగ్గరకు వెళ్లాను. కనీసం నానిని చూడాలని అనుకున్నాను. కానీ రష్ కోపంగా కత్తితో తన చేతి మణికట్టు మీద కోసుకొని "ఇంకో అడుగు ముందుకు వేస్తె గొంతు కోసుకొని చనిపోతాను.... వెళ్ళిపో... మా జీవితాల నుండి" అని అరవడం గుర్తుకు వచ్చింది.

చుట్టూ పెళ్లి సందడి.... అందరూ సంతోషంగా ఒకరినిఒకరు పలకరించుకుంటూ, సంతోషంగా ఉన్నారు. సింగర్స్ పాటలు పాడుతూ, డాన్సర్స్ డాన్స్ చేస్తూ ఉన్నారు.

ఒక్క నేనే డిజైనర్ సూట్ వేసుకొని కూడా ఒక కుర్చీలో కూర్చొని తల దించుకొని గతం గుర్తు తెచ్చుకొని బాధ పడుతూ ఉన్నాను.

రష్ కోసం అప్పట్లో మా ఫ్యామిలీని, సిటికి వస్తే హెల్ప్ చేస్తా అని చెప్పిన మా మామ ఫ్యామిలీకి దూరం అయ్యాను కాని ఆమె నన్ను వదిలి వెళ్లి పోయింది.

మా అమ్మ, నాన్న, అన్న, వదిన వాళ్ళ ఇద్దరి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి.

ఇంతలో నా పక్కనే ఒక వ్యక్తీ వచ్చి నా భుజం మీద చేయి వేశారు. కళ్ళు మూతలు వేసి కన్నీళ్ళు బయటకు రాకుండా చేసుకొని పక్కకు తిరిగి నా పక్కనే ఉన్న వ్యక్తిని చూశాను. 

మా అమ్మ...

ఇక నన్ను నేను ఆపుకోలేక ఆమెను హత్తుకొని "నేను తప్పు చేయలేదు అమ్మా" అని పదే పదే చెబుతూ ఏడ్చేస్తూ వున్నాను. 

మా అమ్మకూడా నా భుజం మీద నిమురుతూ "నువ్వు చేయవు...." అంటూ చెబుతూ ఉంది.

రెండూ నిముషాల తర్వాత మా ఫ్యామిలీ అందరూ నా ముందుకు వచ్చేశారు, మా నాన్న నన్ను చూసి తల ఊపాడు. 

మా అన్న నన్ను చూసి నా మెడ చుట్టూ చేతులు వేసి "సూట్ వేసుకుంటే బాగున్నావ్ రా...." అన్నాడు. గట్టిగా హత్తుకున్నాను.

అలా అలా మాట్లాడుతూ ఎంత సమయం గడిపానో నాకే తెలియలేదు. ఎమోషనల్ అయిపోయాను.

అందరికి కాజల్ ని పరిచయం చేశాను. ఏమనుకుంటారో అనుకున్నాను కాని అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు.

మా మామ రామ్మోహన్ వచ్చి హాగ్ చేసుకొని "మీ అమ్మకి నిజం చెప్పాను" అని చెప్పాడు.

నేను తనను చూసి నవ్వాను.

రామ్మోహన్ "నన్ను ఇప్పటికైనా క్షమిస్తావా!"

మా అమ్మ కూడా నన్ను చూస్తూ ఉంది.

నేను మామ చేతిని పట్టుకొని తల ఊపాను.

అందరం హ్యాపీగా ఉన్నాం.... 
 
కాజల్ "ఎలా ఉంది? ఎక్సైటింగ్ గా అనిపించిందా" అంది.

[Image: wp7251421.jpg]

క్రిష్ "అంటే తను చెప్పిన ఎక్సైట్మెంట్ అంటే ఇదా...."

కాజల్ "అవునూ... నువ్వు ఏమి అనుకున్నావ్" అంది.

నా చూపు చూడగానే, తనకు కోపం వచ్చింది.

తనను కూడా హాగ్ చేసుకోవాలని అనుకున్నాను కాని అందరి ముందు బాగోదు అని తన చేయి గట్టిగా పట్టుకున్నాను.

అందరిని కలిశాక నాకు రష్ గుర్తుకు వచ్చింది వెనక్కి తిరిగి చూశాను. ఆమె మొహం అస్సలు బాగోలేదు. భోజనం కూడా చేయకుండా నానిని తీసుకొని బయటకు వెళ్తుంది.

కాజల్ సరదాగా నా ఫ్యామిలీతో మాట్లాడుతుంది.

నేను పైకి లేచి కంగారుగా ఎగ్జిట్ వైపు వెళ్ళడం చూసి నిషా వచ్చి "ఏమయింది?" అని అడిగింది.

కాజల్ కూడా అక్కడకు వచ్చింది.

క్రిష్ "నేను తనని అప్రోచ్ అయితే సూ సైడ్ చేసుకుంటా అంది... ఒక సారి అలాగే చేసింది" అన్నాను.

నిషా "అలా కనిపించడం లేదు.."

క్రిష్ "రష్ గురించి నీకు తెలియదు.... చాలా పట్టుదల మనిషి..."

నిషా, నన్ను ఆపుతూ "వెనక్కి వెళ్లి మీ ఫ్యామిలీని కలువు అక్క, వారం నుండి మీ ఫ్యామిలీని కలిసి చాలా కష్టపడింది"

నేను కాజల్ వైపు చూశాను. తన వైపు, రష్ వెళ్ళిన వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాను.

కాజల్ "ఒక వైపు నేను, మన ఫ్యామిలీ.... మరో వైపు రష్ ప్రాణాలు.... అంతేనా" అంది.

నిషా "నాన్ సెన్స్..."

కాజల్ "వేళ్ళు... నేను మ్యానేజ్ చేస్తా.." అంది.

నిషా "నువ్వు కొంచెం ఆపుతావా!" అని అపుడే భోజనం చేసి కిళ్ళి నములుతూ నడుచుకుంటూ వస్తున్నా లావణ్యని చూసి "భోజనం చేశావా...." అంది.

లావణ్య తల ఊపుతూ "సూపర్ ఉన్నాయ్" అంది.

నిషా "మంచిది.... ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పార్కింగ్ లో ఉంది నీ కార్ వేసుకొని వెళ్లి ఆమెను ఫాలో అవ్వు... సరేనా!" అంటూ రష్ ఫోటో చూపించింది.

లావణ్య నవ్వుతూ "నేను నీకు కాదు, క్రిష్ కి పర్సనల్ సెక్రటరీని " అంది.

నిషా కూడా నవ్వి "నువ్వు రాసిన లవ్ లెటర్స్ ఎందుకు చించే వాడో తెలుసా..... " అని అడిగింది.

లావణ్య ఇబ్బందిగా తల దించుకుంది. కాజల్ కోపంగా నా వైపు చూసింది.

క్రిష్ "తను నాకు ఇంపార్టెంట్ మనిషి.... ప్లీజ్ వేళ్ళు..."

లావణ్య తల పైకెత్తి "నువ్వు నా లెటర్స్ ఎందుకు చించేవాడివి" అని అడిగింది.

క్రిష్ "నీకు తర్వాత చెబుతాను.... ప్లీజ్ తనని ఫాలో అవ్వు..." అని దండం పెట్టాను.

లావణ్యని చూసి నవ్వుతూ, నిషా తన భుజం మీద చేయి వేసి లిఫ్ట్ వైపు నడిపిస్తూ "ఆమె క్రిష్ మొదటి భార్య....." అంది.

లావణ్య నమ్మలేదు, నవ్వేసింది. నిషా కూడా నవ్వేసింది. ఇంతలో వాళ్ళ మధ్యలో లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యాయి.




కాజల్ తో తిరిగి ఫ్యామిలీని కలిశాను. 

కేశవ్ - ఇషా ల పెళ్ళిలో కలిసిపోయి సరదాగా గడిపాను.

లావణ్య వెళ్ళింది కాబట్టి నాకు కాస్త కంగారు కూడా తగ్గింది.






కొద్ది సేపటి తర్వాత....

లావణ్య నుండి ఫోన్ వచ్చింది.

క్రిష్ "హలో..."

లావణ్య "సర్... రష్ కిడ్నాప్ అయింది.... చూస్తూ ఉంటే ప్లాన్ చేసి ఆమె కారుకు అడ్డం పెట్టి ఆమెను మెకానిక్ షాప్ అని తీసుకొని వెళ్లి కిడ్నాప్ చేశారు" అంది.

క్రిష్ "నాని?"

లావణ్య "నాని ఎవరూ?"

క్రిష్ "చిన్న పిల్లాడు..."

లావణ్య "తను కూడా వాళ్ళతోనే ఉన్నాడు"

క్రిష్ "లొకేషన్ షేర్ చెయ్...." అన్నాను.

నా కళ్ళలో సీరియస్ నెస్ చూసి కాజల్ కూడా "ఏంటి?" అని అడిగింది.

ఆమె ఫోన్ కి మెసేజ్ పంపి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటకు వెళ్లాను.

కాజల్ ఫోన్ మెసేజ్ చూసి కంగారుగా నిషాని "ఏం చేద్దాం..." అడిగింది.

నిషా దగ్గరకు వెళ్లి కేశవ్ చెవిలో విషయం చెప్పడంతో... క్రిష్ కి తెలియకుండానే, కొంత మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా ఫాలో అవుతున్నారు.

కేశవ్ ఫోన్ లో "ఎక్కడున్నావ్.... వెనక్కి రా...."

క్రిష్ "బయట పెట్టిన బైక్ తీసుకొని వెళ్తున్నా?"

కేశవ్ "పెళ్లి అయ్యాక ఇప్పుడు ఆ బైక్ మీద ఫోటోస్ ఉంటాయి"

క్రిష్ "నువ్వు ఇషాతో డేట్ కి వెళ్ళడానికి బైక్ ఇచ్చాను గుర్తు లేదా...."

కేశవ్ "అందుకోసం ఇప్పుడు బైక్ అడుగుతున్నావా! కార్ ఉంది కదా..."

క్రిష్ "ఐ హేవ్ ఏ డేట్....."

కేశవ్ "నువ్వు రష్ ..." అని మాట్లాడుతూ ఉండగా....

క్రిష్ "నా కొడుకుతో...." అంటూ కాల్ కట్ చేశాను. 

ఇది నాకు చాలా ముఖ్యమైన విషయం.... ఎందుకంటే ఆరు నెలల తర్వాత నానిని కలవబోతున్నాను. నా కొడుకుని మళ్ళి కలవబోతున్నాను.

రామ్మోహన్ "ఏమయింది? వస్తున్నాడా!"

కేశవ్ తల అడ్డంగా ఊపి తిరిగి రామ్మోహన్ వైపు చూస్తూ "గెట్ టూ గెదర్ విత్ హిస్ సన్..."















[Image: images-q-tbn-ANd9-Gc-Q40z3g-Q525r-XOQb3s...6-gw-s.jpg]

[+] 13 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 25-09-2024, 11:39 AM



Users browsing this thread: 21 Guest(s)