Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మై డియర్ కిడ్నాపర్
#15
2. అంతేగా....  అంతేగా....  






రిజల్ట్స్ డే.....

శరణ్య

నేను తల దించుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాను, రిజల్ట్స్ వచ్చాయి. ఫోన్ లో నా రిజల్ట్ చూడగానే మంచి మార్కులు వచ్చాయి కాని నాకు టెన్షన్ వచ్చేసింది. వరసగా కొన్ని నెంబర్స్ అన్ని చెక్ చేశాను.  అందరూ కూడా నా కంటే తక్కువ మార్కులు వచ్చాయి. "హమ్మయ్యా నా ఫ్రెండ్స్ కి నాకంటే తక్కువ మార్కులు వచ్చాయి" హాయిగా బయటకు వచ్చి ఫోన్ తీసి ఒక్కొక్కళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి "హాయ్ ఆంటీ  బాగున్నారా!, నేను బాగున్నాను ఆంటీ, XXXXXXX కి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు.... ఎన్ని మార్కులు వచ్చాయి..... ఓహ్ నాకా... నాకు XXX వచ్చాయి... సరే ఆంటీ బాయ్.." అని చెప్పి వరసగా రెండో నెంబర్ కి ఫోన్ చేశాను. కొన్ని నెంబర్లు ఎత్తలేదు. కాసేపు ఆగి మళ్ళి కాల్ చేసి విషయం చెప్పాక గాని నాకు కడుపులో ఆకలి అవుతుంది అని గుర్తుకు రాలేదు.

డిన్నర్ చేస్తూ ఉంటే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను కంగ్రాట్స్ చెబుతూ మెసేజ్ చేశారు. "మా అమ్మకి ఫోన్క్ చేశావ్" అంటూ నాకు కంగ్రాట్స్ చెబుతూనే చిన్న సైజ్ వార్నింగ్ యిచ్చారు. "నేను భయపడతా అనుకున్నారు" అని నవ్వుకుంటూ, నా మేడలో ఉన్న గొలుసుకు కట్టిన చిన్న ఉంగరం చేతితో పట్టుకొని చిన్నగా నవ్వుకున్నాను.




(కొన్ని సంవత్సరాల తర్వాత)

కార్ షాప్..... 

కస్టమర్ "ఈ కార్ ఎంత?" 

కస్టమర్ 20+ సం|| కుర్రాడు, మాములు బట్టలలో సాధారణంగా ఉన్నాడు.

సేల్స్ గర్ల్ "ఆ కారు కాస్ట్ ఇరవై లక్షలు అండి, ఇందులో ...."  అంటూ దాని గురించి మొత్తం చెబుతుంది.

అంతలో మరో సేల్స్ గర్ల్ వచ్చి "ఆ కస్టమర్ చూశావా! ఎలా ఉన్నాడో.. అలాంటి వాడు కొనగాలడా!" అంది.

ఇంతలో మొదటి సేల్స్ గర్ల్ కూడా ఆ కస్టమర్ తో అంటి ముట్టనట్టు ఉంది.

ఆ కస్టమర్, ఆ సేల్స్ గర్ల్ పక్కకు వచ్చి "నా దగ్గర నిజానికి డబ్బు ఉంది.... నాకు కారు చూపించు నేను కొంటాను" అని చెప్పాడు

సేల్స్ గర్ల్ "మా సీనియర్ నాకంటే బాగా చెబుతుంది"

కస్టమర్ "నువ్వు అమ్మితే నీకు కమీషన్ వస్తుంది"

సేల్స్ గర్ల్ "కాని ఎందుకు? మీరు డైరక్ట్ గా కొనుక్కోవచ్చు కదా"

కస్టమర్ "నువ్వు అందంగా ఉన్నావ్... ఫోన్ నెంబర్ ఇస్తావ్ అని" అన్నాడు.

సేల్స్ గర్ల్ మొదట కోపంగా, తర్వాత నవ్వుతూ, ఆ తర్వాత సిగ్గుగా చూసింది. 

కస్టమర్ డబ్బు లేని వాడు లాగా, ఆ సేల్స్ గర్ల్ ఓపిక ఉన్న ఒక మంచి సేల్స్ గర్ల్ లాగా నటించారు.

ఆ సీనియర్ సేల్స్ గర్ల్ కోపంగా ముగ్గురు సరైనా పాత్రలు పోషించారు. 

ఆ కస్టమర్ మరియు ఆ సేల్స్ గర్ల్ ఇద్దరూ "డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్" అని చెప్పి కారులో వెళ్లాలని ఆ కొటేషన్ మనసులో బట్టి కూడా పట్టారు.

కారుని చూపించారు. ఆ సేల్స్ గర్ల్ కి సీనియర్ ఎంత చెప్పినా చూపిస్తూనే ఉంది. 

సీనియర్ "నేను ఆ కస్టమర్ పాన్ కార్డ్ చెక్ చేశాను. చాలా లోన్స్ ఉన్నాయి... క్రెడిట్ స్కోర్ కూడా లేదు... అతను కారు కొనే వాడు కాదు" అని చెప్పింది.

అయినా సరే ఆ సేల్స్ గర్ల్ అతి పోయి మరీ కారు గురించి ఉన్నవి లేనివి అన్ని చెప్పింది.

అరగంట పాటు సాగిన వాళ్ళ డ్రామా తర్వాత ఆ కస్టమర్ స్టైల్ గా కార్డు బయటకు తీసి స్వైప్ చేసుకోండి అన్నాడు.

సీనియర్ స్వైప్ చేస్తూ ఉండగానే... ఆత్రం ఆపుకోలేక  "డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్" అని ఇద్దరూ కలిసి అని నవ్వుతున్నారు.

ఇంతలో సీనియర్ "డిక్లైన్" అంది. కస్టమర్ "మీకు స్వైప్ చేయడం రాదు ఏమో" అని నవ్వాడు. 

సేల్స్ గర్ల్ "అంతేగా....  అంతేగా....  " కస్టమర్ మరియు ఆ సేల్స్ గర్ల్ ఇద్దరూ పెద్దగా నవ్వారు.

సేల్స్ గర్ల్ "ఇంత అనుభవం ఉండి ఉపయోగం ఏంటి?"

సీనియర్ మళ్ళి చెక్ చేసి "డిక్లైన్..... ఈ కార్డు మీది కాదు, దేని మీద మణి అనే పేరు ఉంది.... చూస్తూ ఉంటే, కార్డుని బ్లాక్ చేసినట్టు ఉన్నారు"

ఇద్దరి మొహాలు పాలిపోయాయి

సీనియర్ "నా అనుభవంతో చెబుతున్నాను.... ఇక పై మీ ఇష్టం"

కస్టమర్ బయటకు వెళ్లి కాల్ చేశాడు. 

కాలింగ్  ..... టూ సన్నీ (మణి చేసుకోవలసిన అమ్మాయి)....

సన్నీ కాలింగ్ టూ  మణి...




మణి "హా! చెప్పండి మిస్..."

సన్నీ "డార్లింగ్.... నువ్వు ఇచ్చిన కార్డు పని చేయడం లేదు"

మణి "బ్లాక్ చేస్తే పని చేయదు కదా...."

సన్నీ కోపం వచ్చి "బ్లాక్...." అని మళ్ళి కూల్ అయి  "బ్లాక్.... ఎందుకు చేశావ్ డార్లింగ్" 

మణి "నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నా కాబట్టి నీకు కార్డు ఇచ్చాను... వాడు నీ మిండ గాడు కాబట్టి వాడికి ఇచ్చావ్... అందుకే బ్లాక్ చేశాను డార్లింగ్"

సన్నీ కోపం ఆపుకొని పిడికిలి బిగించి "ఏం నాన్సెన్స్ మాట్లాడుతున్నావ్ బేబి...."

మణి "నీకు కొన్ని ఫోటోస్, వీడియోస్ పంపుతున్నాను చూడు.... నీ మిండ గాళ్ళు మొత్తం లిస్టు పంపుతున్నా.... కొంత మందిని నువ్వు మర్చి పోయి కూడా ఉంటావ్...."

సన్నీ "డార్లింగ్.... అది కాదు... అదంతా నా పాస్ట్....." అంటూనే ఫోన్ కట్ అయింది.

సన్నీ "హలో.. హలో.. హలో.. ఆహ్!" అని పెద్దగా అరిచింది.




మణి "ఈ పెళ్లి జరగదు.... చూశారా ఆ అమ్మాయి ఎలాటిదో.... నేను మెంటల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యాను.... నాకు కొన్ని కొన్ని రోజులు రెస్ట్ కావాలి.... నన్ను ఇప్పట్లో పెళ్లి, పెళ్లి చూపులు అని పిలవకండి"

మణి ఫాదర్ "ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటపుడే నీకు తెలుసు కదా...."

మణి "ఏం.... ఏం.... ఏం మాట్లాడుతున్నావ్ నాన్న"

మణి ఫాదర్ "అరేయ్... అబద్దాలు ఆడకు...."

మణి "ఏది ఏమయినా... నాకు ఇప్పట్లో పెళ్లి, పెళ్లి చూపులు అని పిలవకండి..., నేను మెంటల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యాను.... నాకు కొన్ని కొన్ని రోజులు రెస్ట్ కావాలి...." అన్నాడు.

మణి ఫాదర్ కోపంగా చూస్తూ ఉన్నాడు.

మణి "అమ్మ బ్రతికి ఉండి ఉంటే నన్ను అర్ధం చేసుకునేది...."

మణి ఫాదర్ "మీ అమ్మ ఉండి ఉంటే నీ పీక పిసికేసేది"

మణి నెమ్మదిగా అక్కడ నుండి లేచి వెళ్లి పోయాడు.

వెనక వాళ్ళ ఫాదర్ అరుస్తూనే ఉన్నా పట్టించుకోకుండా వెళ్లి పోయి తన రూమ్ లో కి వెళ్లి సేఫ్ లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న చిన్న ఉంగరం చూసి మళ్ళి క్లోజ్ చేసి లాక్ చేశాడు.




సేల్స్ గర్ల్ "మేడం నా జాబ్ పోయినట్టేనా...."

సీనియర్ "అంతేగా....  అంతేగా....  "




మణి "ఈ అమ్మాయి గురించి వెతకండి... నాకు ఎక్కడ ఉన్నా తెలియాలి? అర్జెంట్..... "

డిటెక్టివ్ "ఎవరూ సర్...."

మణి "మా నాన్న నాకు ఆరు నెలల లోపు పెళ్లి చేసుకోమని వార్నింగ్ ఇచ్చాడు.... తను నేను చేసుకోవాల్సిన అమ్మాయి"

డిటెక్టివ్ "సరే సర్, కనుక్కుంటాను.... డీటెయిల్స్ చెప్పండి...."

మణి "అందంగా ఉంటుంది... పదేళ్ళు క్రితం ఈ హైట్ లో ఉంటుంది"

డిటెక్టివ్ "కనుక్కున్నాను... సర్..."

మణి "మీ పర్సనల్ సెక్రటరీ.... అదిగో వస్తుంది చూడండి"

మణి "ఛీ...  పో...."




శరణ్య "సర్... ఈ ఫైల్స్ మీద మీ సిగ్నేచర్ కావాలి..."

మణి "మ్మ్"

శరణ్య అతన్నే చూస్తుంది. మణి చూడగానే మొహం తిప్పుకుంది.






లేడీ డిటెక్టివ్ "మీరు నాకు ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తే కనుక్కుంటాను"

మణి "ఇవిగోండి ఫైల్"

రెండూ రోజుల తర్వాత....

లేడీ డిటెక్టివ్ "ఒక క్లూ దొరికింది..."

మణి "వస్తున్నా...."

లేడీ డిటెక్టివ్ "వద్దు సర్... నేనే వస్తున్నా"

మణి "తను దొరకలేదా..."

లేడీ డిటెక్టివ్ "త్వరలో దొరుకుతుంది"

మణి మరియు లేడీ డిటెక్టివ్ ఇద్దరూ హాగ్ చేసుకున్నారు.




శరణ్య "బ్లడీ మణి.... నీ కోసం పెద్ద పెద్ద జాబ్ ఆఫర్స్ వదులుకొని నీకు PA గా వస్తే నన్ను గుర్తు పట్టనది కాకుండా వేరే అమ్మాయిని హాగ్ చేసుకుంటావా! సచ్చావ్ రా....."




మణి నిద్ర లేస్తూ "కాఫీ" అని అరిచాడు.

శరణ్య, మణి ఎదురుగా నిలబడి కాఫీ పట్టుకొని ఉంది.

మణి "నువ్వేంటి మా ఇంట్లో ఉన్నావ్... ఆఫీస్ లో కదా నాకు కాఫీ ఇవ్వాలి"

శరణ్య "నేను నిన్ను కిడ్నాప్ చేశాను"

మణి "ఏం నాన్సెన్స్ మాట్లాడుతున్నావ్...."

అంటూ చుట్టూ చూశాడు.

మణి "ఇది నా ఇల్లు కాదు..."

మణి "అమ్మో నా చేతులు కట్టేసావ్"

మణి "అమ్మో  నా కాళ్ళు కూడా కట్టేసావ్.... "

మణి "నో...,మ్మ్.... "

శరణ్య నోటికి ప్లాస్టర్ వేసింది.

మణి "మ్మ్మ్మ్మ్మ్...."


శరణ్య "ఇంకో సారి అరిస్తే.... నోటికి కుట్లు వేసేస్తాను"

మణి "మ్మ్మ్మ్మ్మ్...."




[Image: depositphotos_198492352-stock-photo-wedd...ground.jpg]
[+] 7 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: మై డియర్ కిడ్నాపర్ - by 3sivaram - Yesterday, 10:43 PM



Users browsing this thread: 11 Guest(s)