20-09-2024, 08:32 PM
(23-02-2024, 10:10 PM)gudavalli Wrote: కథ మధ్యలోనే వుందిగా బ్రదర్ త్వరలో అప్డేట్ అని కూడా అన్నావు
1 చైర్మన్ గా విలన్ల ను పట్టుకోవాలి.
2 హీరోయిన్ ఎవరో తేల్చలేదు
3 బొంబాయి పీఏ కి కోర్కె సరిగా తీర్చలేదు.
(17-09-2024, 12:58 AM)Rishabh1 Wrote: రచయిత గారు దయచేసి ఈ కింది ప్రశ్నలకి మీరు ఒక నాలుగు వాక్యాల్లో సమాధానం చెప్తే కథ కి ముగింపు లభిస్తుందని నా అభిప్రాయం, మా అందరి కోసం దయచేసి స్పందించండి.
1) లాస్య వాళ్ళ నాన్న కష్టపడి ఇన్ని బిజినెస్ లు బిల్డ్ చేసినట్టు చెప్పారు, సో తను ఎవరికీ హాని చేయలేదు మరి ఆయన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు?
2) హీరో ఫాదర్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఎదో వూళ్ళో ఉంటూ అప్పులు/బిజినెస్ అంటే భయపడే వ్యక్తి కి ఇలా వరల్డ్ వైడ్ బిజినెస్ చేసే టాలెంట్ ఎలా సాధ్యం ? అందరు అతనికి ఎందుకు భయపడుతున్నారు ? వాళ్ళకి అతని గురించి ఏం తెలుసు?
3) హీరో మరియు వాళ్ళ నాన్న, చైర్మన్ సీట్ కొట్టేయటమే లక్ష్యం గా పని చేసినట్టు చెప్పారు, అలాగే వాళ్ళ నాన్న ఒంటిపోకడ నిర్ణయాలు అతనికి నచ్చుతున్నట్టు లేదు అన్నట్టు కూడా చూపించారు. ఇక్కడ హీరో మంచి వాడా, చెడ్డవాడా? ఒక వేళ చెడ్డవాడైతే వాళ్ళ నాన్న ప్రవర్తన చూసి మార్పు వస్తోందా తన లో? వాళ్ళ నాన్న ని ఎలా కట్టడి చేస్తాడు?
4) హీరో ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు లాస్య నా? లేక రాశి నా?, ఇద్దరి ప్రేమలో న్యాయం ఉంది కాకపోతే తక్కెడ కొంచం రాశి వైపే మొగ్గుతున్నట్టుంది!!?
(17-09-2024, 09:54 AM)gudavalli Wrote: మీ ప్రశ్నలకు సమాధానం వస్తే చదివే అందరికీ కూడా ఎంతో కొంత తృప్తి కలిగినట్లే.....
మిత్రులారా
ఈ ప్రశ్నలకు పాఠకులుగా మీ ఆలోచనలను (మీకు తోచిన సమాధానాలను) తెలియపరిచితే వాటితోనే పిడిఎఫ్ పూర్తిచేస్తాను.