Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
152. సింగిల్ - మింగిల్






కాజల్ "ఈ నెల రోజులు ఎలా ఉన్నావ్..."

క్రిష్ "బాగానే ఉన్నాను..."

కాజల్ "మిస్ అయ్యాను అని చెప్పొచ్చు కదా...."

క్రిష్ "హహ్హహ్హ మిస్ అయ్యాను"

కాజల్ "నిద్రపోవడం కోసం ఏం చేశావ్...."

క్రిష్ షాకింగ్ గా కాజల్ వైపు చూశాడు. 

కాజల్ తల దించుకొని నాకు తెలుసు అన్నట్టు చూసింది.

క్రిష్ నిజం చెప్పకూడదు అని అనుకుంటూ "నిన్ను గుర్తు తెచ్చుకొని ఊపుకొని పడుకునే వాడిని, తర్వాత నిద్ర పట్టేసేది" అన్నాడు.

కాజల్ కోపంగా చూస్తూ క్రిష్ భుజం మీద గిచ్చింది.

క్రిష్ "అబ్బా" అని రుద్దుకుంటూ ఉన్నాడు.

కాజల్, క్రిష్ దగ్గరకు జరిగి క్రిష్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని అతని చేతి వేళ్ళలో తన వేళ్ళతో బంధించి అతని భుజం పై వాలిపోయింది.


[Image: anime-couple-sitting-log-fall-leaves-gen...-35516.jpg]


ఇద్దరి మధ్య నిముషాలు క్షణాలులాగా గడిచిపోయినా ఇద్దరికీ అలానే ఉండిపోవాలి అని అనిపించింది.

క్రిష్ "నువ్వు గుర్తు వచ్చే దానివి.... ప్రతి రోజు... ప్రతి రాత్రి..." అన్నాడు.

కాజల్ పైకి లేచి, క్రిష్ కళ్ళలోకి చూస్తూ "సెక్స్ రిలేటడ్ చెబితే మూతి పగలకోడతా...."

క్రిష్ "హహ్హహ్హ"  అని చాలా సేపు నవ్వాడు, కాజల్ తల పైకెత్తి అతని నల్లటి కళ్ళలో తన ప్రతి బింబం చూసి, దూరం జరగాలని అనుకున్నా క్రిష్ తనని దగ్గరకు లాక్కున్నాడు.

కొద్ది సేపటి తర్వాత... కాజల్ "చెప్పూ... ఎప్పటి నుండి నువ్వు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నావ్"

క్రిష్ సైలెంట్ గా చాలా సేపు ఉన్నాడు, ఆమె వైపు చూసి అదేం లేదు అని చెబుదాం అనుకున్నాడు కాని ఆమె వదిలేలా లేదు అని అర్ధం అయింది.

కాజల్ "రష్ వల్లే కదా..."

క్రిష్ షాకింగ్ గా చూస్తూ "నీకు ఏం తెలుసు..."

కాజల్ "విన్నాను"

క్రిష్ చిన్నగా నవ్వి మళ్ళి మామూలు అయిపోయాడు. అతని కళ్ళలో వచ్చి వెళ్ళిన పెయిన్ ని ఆమె గమనిస్తూనే ఉంది.

క్రిష్ "ఐ మిస్ హిమ్..." అన్నాడు.

అతని కళ్ళలో వచ్చిన తడిని వెంటనే కవర్ చేసుకుంటూ దూరం జరగబోయాడు, కాని కాజల్ వెళ్ళ నివ్వలేదు.

క్రిష్ సరే అనుకుంటూ ఆమె వైపు చూస్తూ "ఉదయాన్నే ఇంట్లో వస్తువుల కోసం వెళ్ళే వాడిని, ఫోన్ లో షేర్స్ గురించి చూసుకుంటూ కస్టమర్స్ తో కాంటాక్ట్ అయ్యే వాడిని, సాయంత్రం వేరే వర్క్ చేసుకొని అలిసి పోయి ఇంటికి వస్తే నా కోసం ఇంట్లో ఎదురు చూసే ఒక భార్య.... నన్ను చూడగానే నాన్న అనుకుంటూ వచ్చే నా కొడుకు...." అన్నాడు.

కాజల్ అతన్నే చూస్తూ ఉంది.

క్రిష్ "చిన్నప్పటి నుండి ఆమెను చూస్తూ ప్రేమించాను, కాని బయటపెట్టలేను... తనకు పెళ్లి అయి వెళ్ళిపోయాక అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ అంటూ రోమాన్స్ అంటూ పిచ్చి పనులు అన్ని చేసి నిత్య చేతిలో చిక్కాను"

కాజల్ "ఆమెను ఇంకా ప్రేమిస్తున్నావా!"

క్రిష్ చిన్నగా ఒక పొడి నవ్వు నవ్వి "తను నన్ను వదిలి వెళ్లిపోయినా నేను అర్ధం చేసుకున్నాను కాని నానిని నాకు దూరం చేసింది... ప్రేమ... ఆ ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది"

కాజల్ అతని చేతుల నుండి తన చేతిని తీసేయబోయింది.

క్రిష్ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. కాజల్ తత్తర పడి ఆల్మోస్ట్ అతని ఒళ్లో పడి మళ్ళి లేచి కూర్చుంది.

క్రిష్ "నేను ఏం రివెంజ్ ఏం ప్లాన్ చేశానో చెప్పేదా!"

కాజల్ "చెప్పూ..."

క్రిష్ "అందరి కంటే బాగా సక్సెస్ అయి, రేపు ఎప్పుడైనా... వాళ్ళకు అవసరం వచ్చి నా దగ్గరకు వస్తే..."

కాజల్ "హుమ్మ్, వస్తే..."

క్రిష్ "వ్వేవ్వేవే.... అని వెక్కిరిస్తా"

కాజల్ పెద్దగా నవ్వేసింది.

క్రిష్ కూడా నవ్వేశాడు.

ఇద్దరూ సుమారు అయిదు నిముషాలు వెక్కిరించు కుంటూ నవ్వుకున్నాక....

క్రిష్ "జీవితంలో మళ్ళి నవ్వుతా అనుకోలేదు... హ్యాపీగా నిద్రపోతా అని అనుకోలేదు... అన్నింటికీ మించి తిరిగి ప్రేమిస్తా... పెళ్లి చేసుకుంటా అని అసలు అనుకోలేదు" అన్నాడు.

కాజల్ చిన్నగా నవ్వింది.

క్రిష్ "నువ్వు నిజంగా నా ఏంజెల్ వి" అంటూ ఆమెను కిస్ చేశాడు.

ఇద్దరూ అలా కిస్ చేసుకుంటూ ఉన్నారు.


[Image: 84cc7ed59d3776b74960149c0840aa20.jpg]





నిషా "అయిపోయిందా...."

క్రిష్ "కుళ్ళుబోతు మొహం వచ్చేసింది"

నిషా పళ్ళు నూరుతూ "పెళ్లి ఎప్పుడూ...."

కాజల్ "రేపు... క్రిష్ ఆల్రెడీ మాట్లాడాడు అంట... పొద్దున్న అలా వెళ్ళడం... అంతే"

నిషా "నీ ఎక్సామ్స్ ఎప్పుడూ"

కాజల్ "అవునూ నీ ఎక్సామ్స్ ఎప్పుడూ..."

క్రిష్, కాజల్ చేతి పట్టు నుండి దూరం జరిగి అవలించాడు.

కాజల్ "క్రిష్" అని పిలిచింది.

క్రిష్ తల దించుకొని "ఆల్రెడీ జరుగుతున్నాయి... ఈ వారంలో అయిపోతాయి... తర్వాత..."

నిషా "తర్వాత... "

క్రిష్ "హనీమూన్" అని నవ్వాడు.

కాజల్ "నెక్స్ట్ ఎక్సాం ఎప్పుడూ..."

క్రిష్ "ఎల్లుండి...."

నిషా "ఎల్లుండి ఎక్సాం పెట్టుకొని రేపు పెళ్లి చేసుకుంటున్నావా!"

క్రిష్ "అవునూ... రేపు పెళ్లి, రాత్రికి శోభనం.... ఎల్లుండి ఎక్సాం..."

కాజల్ "తప్పితే నా వల్లే అంటావ్... కదా..." అంటూ క్రిష్ వైపు కోపంగా చూసింది.

క్రిష్ "అదేం లేదు..."

నిషా "పెళ్లి పోస్ట్ పోన్ చేద్దాం"

క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ ఒకే సారి "నో" అని అరిచారు.

నిషా "మరి ఏం చేస్తారు"

క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని సైగలు చేసుకున్నారు.

నిషా కోపంగా "ఏం చెప్పుకుంటున్నారు? నాకు కూడా చెప్పండి" అంది.

క్రిష్, కాజల్ ని గట్టిగా హత్తుకొని "డేట్ కి వెళ్దాం అనుకున్నాం" అన్నాడు.




కొద్ది సేపటికి నిషా, కాజల్ ఇద్దరూ ఒక వైపు కూర్చుంటే... క్రిష్ మరో వైపు కూర్చున్నాడు.


నిషా "నేను కొన్ని ప్రశ్నలు అడగాలి"

నిషా క్రిష్ ఫ్యామిలీ గురించి, లవ్ గురించి ఫ్యూచర్ గురించి అడిగింది.

ఆ రాత్రికి ఇంటికి వెళ్ళాక... 

నిషా "ఇవ్వాళ మీ ఇద్దరూ సింగిల్.... రేపు కావాలంటే ఏమయినా చేసుకోండి"

నిషా వద్దు వద్దు అంటున్నా కాజల్ ని తన గదిలోకి తీసుకొని వెళ్లి విలన్ లా నవ్వుతూ తలుపు వేసుకుంది.






















[Image: qmTGW.jpg]


[+] 15 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 19-09-2024, 08:47 PM



Users browsing this thread: 24 Guest(s)