18-09-2024, 02:40 PM
(This post was last modified: 18-09-2024, 02:41 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-09-2024, 10:43 PM)Sushma2000 Wrote: Antha clear ga cheppaka ardham kakunda vuntundaa..super explanation
విజయ్ తన తమ్ముడు కరణ్-పూజ పెళ్ళికి వచ్చాడు అక్కడకు వచ్చిన అందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు.
విజయ్ తల్లిదండ్రులు చనిపోవడంతో అతను మాత్రమే బ్రతికాడు, అది కూడా చాలా సంవత్సరాలు బ్రతికాడు.
కారణం రాజ్ సొల్యూషన్స్ లాంటి పెద్ద కంపనీకి అతను యజమానిగా పనికి రాడు కాబట్టి మాత్రమే.
విజయ్ ఒక పార్టీ ఎంజాయింగ్ వ్యక్తీ, ఒక సారి ఫ్రెండ్ అడిగాడు అని ఫారెన్ వెళ్లి అతనికి కావాల్సిన వైన్ తెచ్చాడు.
అక్కడ నుండి తెప్పించచ్చు కదా అంటే... ఓహో అలా కూడా చేయొచ్చా అంటాడు.
విజయ్ రఫ్ గా ర్యాష్ గా ఎప్పుడూ పబ్ లు పార్టీలు అంటూ ఉంటాడు. తన ఆస్తుల విషయాలు కూడా ఎప్పుడూ పట్టించుకోడు.
ఇప్పుడు తన తల్లిదండ్రుల మరణానికి కారణం అయిన తన బాబాయి(ప్రభాకర్) కొడుకు పెళ్ళికి వచ్చాడు,
అలాగే తన బాబాయి కాళ్ళ మీద పడ్డాడు అని అందరూ నవ్వుకున్నారు. కాని ఎవరూ నోరు తెరిచి చెప్పే ఆలోచనలో లేరు.
కరణ్ పెళ్లి నుండి పారిపోవడంతో పూజ ఒక్కతే పెళ్లి మండపంలో మిగులుతుంది.
పూజ తన ఫ్యామిలీ బిజినెస్ లో మేనేజింగ్ డైరక్టర్ గా చేస్తూ ఉన్న ఒక పవర్ ఫుల్ మహిళ, కరణ్ ఆమెను నేను హ్యాండిల్ చేయలేను అని లెటర్ రాసి మరీ వెళ్లి పోయాడు.
పూజ తల్లిదండ్రులు కోపంగా ప్రభాకర్ ని బెదిరిస్టారు. పూజ కోపంలో విజయ్ ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేస్తుంది. విజయ్ అమాయకుడు, పడి ఉంటాడు అనేది ఆమె ఆలోచన.
ప్రభాకర్ కి ఎక్కువ ఆలోచించే టైం లేక, ఓకే చెప్పేస్తాడు కాని విజయ్ కి పూజ తోడూ అయితే ఏదైనా తేడా జరుగుతుంది అని భయపడతాడు, కాని ఏం కాదులే అనుకుంటాడు.
విజయ్ సరదాగా సరసాలు ఆడుతూ ఉండడం ఆమెకు నచ్చదు. విజయ్ ఏ విషయం సీరియస్ గా తీసుకోడు. తనని ఆమె కంపనీలోనే ఎంప్లాయ్ గా చేస్తుంది.
విజయ్ వేరే అమ్మాయిలతో సరసాలు ఆడే సరికి కోపంగా విజయ్ తన భర్త అని ప్రకటించేస్తుంది. విజయ్ వర్క్ చేస్తే శోభనం లేదు అంటే లేదు అని చెబుతుంది.
విజయ్ పని చేయడం చూసి నవ్వుకుంటుంది. అలా అలా విజయ్ రొమాంటిక్ నేచర్ కి, పూజ సీరియస్ నేచర్ కి జత కలిసి వాళ్ళ రోమాన్స్ లైఫ్ వికసిస్తుంది.
అతన్ని ఇంకా ఉడికించాలి అని "నో" చెబుతుంది. అయితే అనుకోకుండా విజయ్ సీక్రెట్ డైరీ చూసి షాక్ అవుతుంది.
విజయ్ యొక్క పార్టీ క్యారక్టర్ నిజానికి, అతను తన బాబాయి మీద పగ తీర్చుకోవడం కోసం పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. అని అర్ధం అవుతుంది.
అనవసరంగా వీళ్ళ మధ్యలో వచ్హాను అని అర్ధం అవుతుంది. విజయ్ అమాయకంగా, పార్టీ నేచర్ గా నటిస్తూ, తేర వెనుక అత్యంత క్రూరంగా తన పనులు తానూ చేసుకుంటూ ఉంటాడు.
విజయ్ కి అంత సీన్ లేదు కాబట్టి ఇదంతా పూజ చేస్తుంది అని ప్రభాకర్ అనుకుంటాడు.
పూజ "ఓహ్ షిట్"
-
ఈ ఐడియా ఎలా ఉంది.