17-09-2024, 05:43 PM
44. నా జీవితం డెవిల్ చేతుల్లోకి
కొన్ని నెలల తర్వాత.....
రష్ ఈ సారి కళ్ళు తెరుచుకొని చూస్తుంది. కటినంగా క్రుయాల్ గా మారిపోయింది.
చుట్టూ చూసుకుంది. ఈ ఆస్తి మొత్తం రేపు నానికి దక్కాలి, నాని గౌరవంగా పెరగాలి అంటే... నేను కొన్ని కటినమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంది.
గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సందీప్ వాళ్ళ అమ్మ గది దగ్గరకు వచ్చింది. ఆమెకు పెట్టిన ఆక్సిజన్ పైప్ ని తీసేసి ఆ రోజు సాయంత్రం వెళ్లి ప్రాణం పోయింది అని అనుకున్న తర్వాత మళ్ళి ఆక్సిజన్ మాస్క్ పెట్టింది.
తర్వాత రోజు పొద్దున్న వచ్చిన నర్సు చెక్ చేసి డాక్టర్ కి ఫోన్ చేసింది. కాని వచ్చి చూశాకా ఏముంది? ఆమె పై తెల్లటి దుప్పటి కప్పేసాడు.
సందీప్ ఏడుస్తూ ఉన్నాడు. రష్ మనసులో నా కొడుకుని చంపాలని చూసిన దానికి ఇన్నాళ్ళు నా చేత సేవలు చేయించావు.... ఇప్పుడు అనుభవించు అనుకోని అందరికి ఫోన్ లు చేసి కార్యక్రమాలు పూర్తీ చేసింది.
సందీప్ ఆస్తులు అన్నింటికీ లెక్క చూసుకుంటూ అలాగే కంపనీ వ్యవహారాలలో తన ఆజమాయిషీ వచ్చేలా చూసుకుంది.
ఇక్బాల్, రష్ ని ఒక సారి రాంగ్ గా తాకడంతో రష్ పెద్దగా అరిచేసి పడిపోయింది.
ఇక్బాల్ భయపడి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. ఇక్బాల్ ని ఎక్కువ సేపు అలా వదిలేయలేదు.
బాగా ఆలోచించి ఒక రౌడి ద్వారా ఇక్బాల్ ని కారుతో గుద్దేలా చేసి అతని ప్రాణాలు కూడా తీసేసింది.
ఒక రోజు రోడ్ మీద బస్సులో ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టె వ్యక్తీ కనిపించాడు. అతన్ని పట్టించలేక ముందు ఉండే అమ్మాయి బాధగా ఏడ్చినా రోజు గుర్తు చేసుకుంది.
మరో కారు యాక్సిడెంట్....
తనను దాచి ఉంచిన వరంగల్ వ్యభిచార గృహం.. కొన్ని నెలల క్రితం కిడ్నాప్ చేసిన మనుషులు అందరిని యటాక్ చేయించింది.
మొదట్లో అన్ని బాధలు భరించి మంచిగానే ఉంది కాని ఎప్పుడైతే.... సందీప్ తల్లికి బాగు అవుతుంది అని తెలిసింది నానిని తలుచుకొని ఆమెని చంపేసింది అక్కడ నుండి మొదలు చంపడం చంపించడం మొదలు పెట్టింది.
నిజానికి సందీప్ తల్లి చనిపోవడంతో ఆమె లైట్ గా PTSDలోకి వెళ్ళిపోయింది. ఆ మెంటల్ డిస్త్రేస్ తోనే అన్ని చేసింది.
ఎక్సాం లో చీటింగ్ కి అలవాటు పడ్డ స్టూడెంట్ లా ప్రతి సమస్యకు మనీ దొంగతనంగా పంపడం, ఆ మనిషిని చంపడం లేదా చంపించడం చేస్తుంది.
సందీప్ ఇదంతా గమనించాడు. ఒక్క సారిగా తన తల్లి తన లవర్ ఇక్బాల్ ఇద్దరూ చనిపోవడంతో రష్ మీద పగబడతాడు.
రష్ నిద్రపోతూ ఉండగా, ఒక ఫోన్ వచ్చింది.
రష్ కంగారుగా హాస్పిటల్ దగ్గరకు వెళ్ళింది, అక్కడ రష్ వాళ్ళ నాన్న, పిన్ని మరియు చెల్లెలు... మరియు కొంత మంది చుట్టాలు అందరూ హాస్పిటల్ ICU లో ఉన్నారు.
కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అయింది అని అలాగే అందరూ ప్రమాదం నుండి బయట పడ్డా ఇంకా ICU లోనే ఉండాలి అని చెప్పారు.
రష్ కోపంగా ఇదంతా చేసింది ఎవరూ అంటూ కోపంగా ఎంక్వయిరీ చేయిస్తుంది. అయితే తను చూసిన సాక్ష్యాలు చూసి తనకే మైండ్ బ్లాక్ అయింది అన్ని సాక్ష్యాలు క్రిష్ వైపు చూపిస్తున్నాయి.
సందీప్ కూడా క్రిష్ దీని వెనక ఉన్నాడు అని చెప్పడంతో రష్ కోపంగా మారిపోయింది.
సందీప్ కూడా ఆమెకు చాలా రోజుల నుండి ఆమె మెంటల్ గా పాడయిపోయేలా మెడిసెన్ తినిపించడంతో రష్ కూడా సరైనా నిర్ణయం తీసుకోలేక పోతుంది.