14-09-2024, 10:10 PM
(14-09-2024, 08:57 PM)Mahesh12345 Wrote: ఇన్ని రోజులు నీ కథ నీ ఎందుకు చదవలేకపోయానా అని చింతిస్తున్నాను.
ఇంత మంచి కథ నీ ఇన్ని రోజులు ఎక్కడ దాచావయ్య బాబు. ఏమైనా రాసావా అసలు.
మైండ్ పోతుంది అనుకో. ఆ సూర్య క్యారెక్టర్ ఏంటి ఆ పైథాన్ తో ఫైట్ ఏంటి అసలు ఆ ఎలెవేషన్స్ ఏమైనా ఇస్తున్నావా.
ఎమ్ తాగి రాస్తూన్నవయ్య. ఒక్కొక్క సన్నివేశం అబ్బో అబ్బో
నీ కథ చదివాక దేవుడిని వేడుకున్న వచ్చే జన్మ లో నన్ను సూర్య గా పుట్టించమని.
నేను నీ కథ కి డై హార్డ్ ఫ్యాన్ నీ గురు.
మిగతా వారి గురించి నాకు తెలీదు కానీ నేను మాత్రం నీ కథ కి ఫ్యాన్ నీ అయ్యాను.
ఐన గంజాయి వనంలో తులసి మొక్క లాంటిది నీ కథ
అందరికీ తెలీదు నీ కథ గురించి కానీ తెలిసిన వాడు మాత్రం నీ కథ నీ వదలడు. నిజానికి ఎక్కువ చెప్తున్నాను అని అనుకోకపోతే ఒక మాట చెప్పనా ఇది సినిమా తియ్యాల్సిన కథ. కనీసం సినిమా తియ్యకపోయిన ఒక పుస్తకం లాగా రాసి ప్రచురించాల్సిన కథ ఇది.
ఇంకెప్పుడూ నీ కథ కి గుర్తింపు రాలేదు కామెంట్స్ రాలేదు అని అనుకోవద్దు.కానీ ఇప్పటినుంచి నీ కథ కి నేను ఫ్యాన్ అయిపోయాను.
ఈ ఫోరమ్ లో అన్ని కథలూ ఆపేసిన కూడా గూగుల్ లో వీడియోస్ రూపం లో దొరుకుతాయి కానీ నీ కథ మాత్రం గూగుల్ లో కూడా దొరకదు.
నీ కథ నీ దసరా కాంటెస్ట్ లో రాయి గురు. ఎందుకంటే నీ కథ ఆ కాంటెస్ట్ కి సరిపోయే కథ.నీ కథ లో ఆ దమ్ము ఉంది.
ప్రస్తుతానికి నాకు జాబ్ లేదు బట్ నాకు నాకు జాబ్ వచ్చి ఉంటే నేను నీ కథ కి బహుమతి పంపేవాడిని అంత బాగుంది కథ.
నువ్వు మాత్రం నీ కథని ఆపకుండా అప్డేట్స్ త్వరగా ఇవ్వు నేను మాత్రం నీకు బహుమతి ఇచ్చే స్థితి లో లేకపోయినా నిన్ను మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేసే పని లో ఐతే మాత్రం ఉంటాను.
నీ కథ లో నాకు బాగా నచ్చే సన్నివేశాలు ఏంటో తెలుసా సూర్య ఎలివేషన్స్.
ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చెప్పాల్సింది అజయ్ గర్ల్ ఫ్రండ్ నీ చెల్లి నీ అక్క నీ ఎమ్ చేశాడు. అంజిలి వైష్ణవి నీ ఎలా పడేసాడు. ఆఫ్గనిస్తాన్ ఎందుకు ఒంటరిగా వెళ్ళాడు. ఇంకా అగర్వాల్ కూతురిని ఎలా కాపాడాడు.ఈ టర్కిష్ పిల్ల ఇంకో కొత్త పిల్లని ఎలా పడేసాడు. అసలు చాలా చాలా కథ ఉంది. అసలు సూర్య ఫ్యామిలీ ఎక్కడ ఉంది. నువ్వు కథ లో చాలా దాచేసావు గురు. నిజం చెప్పాలి అంటే నాకు తెలిసి కథలోకి ఇంకా ఎంటర్ కాలేదు అనుకుంటా మనం. ఏమంటావు నువ్వు దీనికి
తొందరగా తొందరగా అప్డేట్స్ పెద్ద పెద్ద అప్డేట్స్ ఇవ్వు గురు. ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు కానీ నేను మాత్రం నీ కథ కి బాగా కనెక్ట్ అయిపోయాను.
నమస్కారం మహేష్ గారు..
నా కథ మిమ్మల్ని ఇంతలా ప్రభావితం చేసిందంటే నమ్మలేక పోతున్న నిజంగా.
'సూర్య' స్టోరీ ఆలోచన మొత్తం నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు చదివిన పుస్తకాలు...
ఎప్పటినుంచో కథ రాయాలి అని అనుకున్న..
సుమారు 2011 లో మొదటి సారి 'సూర్య' ఆలోచన వచ్చింది.. నా ఫ్రెండ్స్ కి చెప్తే వారికి కూడా నచ్చింది ఐడియా..
ఆ ఐడియా గురించి అలోచించి ఒక స్క్రీన్ ప్లే రాసి సినిమా స్టోరీ రాయాలి అనుకున్నాను. సినిమా లో సూర్య కి న్యాయం చేయడం కష్టం అనిపించింది
అనుభవం లేకపోవడం, సినిమా ఇండస్ట్రీ మీద ఇంటరెస్ట్ లేకపోవడం, బాధ్యతలు పెరిగడం, సంపాదన మీద ద్రుష్టి పెట్టడం లో "SURYA" కథ ఆలోచన పక్కకెళ్ళింది.
అసలు "సూర్య" స్టోరీ కి, మెయిన్ కథ కి ఇన్స్పిరేషన్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచే తీసుకున్నాను.
సూర్య స్టోరీ రాయడానికి బలమైన ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ 90 లలో జరిగింది. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్న స్టోరీ నా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు.
ఆ స్టోరీ ఇంకో 20+ అప్డేట్ల తరువాత PARIS లో మొదలవుతుంది.. అప్పటివరకు ఇదంతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లాంటిది అనుకోండి.
ఇక మీ డౌట్లు.. అంజలి, వైష్ణవి కధలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. మలేక్, షాహినా స్టోరీస్ లో సూర్య లోని ఒక డిఫరెంట్ సైడ్ చూస్తారు.
సూర్య ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ కాదు.. అతను ఒక మిస్టరీ అంతే.. అజయ్ ఫ్యామిలీ గురించి తర్వాత ఎపిసోడ్స్ లో తెలుస్తాయి..
సూర్య కి నేను ఎలేవేషన్స్ ఏమి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నది కాదు.. ముందు ముందు సూర్య ఎదుర్కో బోయే చిక్కులు మనిషిని ఊపిరి ఆడనివ్వవు.
నాకు డైలీ రాయాలని ఉంటుంది.. కాని రాయడానికి టైం దొరకదు.. నెలకి కనీసం రెండు అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.
మీరు ప్రోత్సహించినట్టే ఎంతో మంది నన్ను మేచ్చుకున్నారు.. ముఖ్యంగా హారన్ బ్రో.. సుష్మ గారు,
కొంత మంది ప్రైవేట్ మెసేజ్ చెసి నన్ను నా కథ ని బాగా మేచ్చుకున్నారు.. వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు ?❤️