13-09-2024, 10:29 PM
38. నా జీవితం సందీప్ చేతుల్లో...
క్రిష్ "వశీకరణం" అని అయోమయంగా చూస్తున్నాడు.
ప్రభు "నీకు తెలియకుండానే ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నావ్..."
క్రిష్ "ఏమిటది?" అంటూ దూరంగా నిలబడ్డ పూజని చూస్తూ మళ్ళి ప్రభు వైపు చూస్తూ అడిగాడు.
ప్రభు "400 సంవత్సరాల క్రితం......... ఆంధ్ర తెలంగాణా మధ్య ఉన్న కృష్ణ నది చిన్న పాయగా ఉండే మట్టుపల్లి అనే గ్రామానికి 80 కి.మీ. నల్లమల అడవుల్లో ఒక మాంత్రికుడు ఉండే వాడు... అతన్ని అక్కడ దగ్గరలో ఉండే, ఓక తాండాలో సుమారు 50 కుటుంబాలు ఉండేవి. ఆ తాండా నాయకుడు ఆ మాంత్రికుడుని అవమానించాడని... ఆ మాంత్రికుడు వశీకరణంలోని ఒక ప్రత్యేకమైన విద్యని సాధన చేశాడు. ఆ సాధన వశీకరణం... దీని ద్వారా మనుషులను తన కంట్రోల్ లోకి తెచ్చుకొని వాళ్ళు తను చెప్పినట్టు చేయించుకుంటాడు"
క్రిష్ "ఇంటరెస్టింగ్... ఆ తర్వాత ఏమయింది?..."
ప్రభు మరియు పూజ ఇద్దరూ ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు.
ప్రభు "అతను ఆ తాండా మొత్తాన్ని అవమానించాడు. కాని ఆ వశీకరణంలో ఉన్న వ్యక్తులు మత్తులో ఉన్న వాళ్ళు లాగా పూర్తిగా వేరే వ్యక్తులుగా ప్రవర్తిస్తారు. వశీకరణం చేసిన వ్యక్తీ చెప్పిన మాట వింటారు"
క్రిష్ "ఏం చెప్పినా వింటారా..."
పూజ "సెక్స్.... మర్డర్.... సూసైడ్.... ఏదైనా..... దొంగతనం కూడా...." అని చెబుతూ కళ్ళు మూసుకుంది.
క్రిష్ "హుమ్మ్..."
పూజ "అవన్నీ కొన్నాళ్ళ తర్వాత పీడకలలుగా గుర్తుకు వస్తాయి.... కానీ... కానీ... " అంటూ ఏడ్చేస్తుంది. అలాగే నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది.
ప్రభు "ఆ వశీకరణం చేసుకున్న వ్యక్తీకి బానిస అయిపోతుంది. తనను తానూ ఎంత కంట్రోల్ చేసుకున్నా అతని కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత తన అసలు మర్చి పోయి కేవలం ఆ బానిస మాత్రమే మిగులుతుంది"
క్రిష్ "సరే... సరే... ఆ తండాలో ఏం జరిగింది"
ప్రభు "ఆ తాండా మొత్తం ఆ అవమానం గుర్తుకు వచ్చి ఆ నదిలో దూకి సూ సైడ్ చేసుకొని చనిపోయారు. ఆ మాంత్రికుడు కూడా సూ సైడ్ చేసుకున్నాడు"
క్రిష్ "ఓహ్...."
ప్రభు "కొన్నాళ్ళ క్రితం నేను ఒక గుహలో ఆ తాళపత్రలను వెలికి తీసి దాని మీద ఉన్న విద్యని ఆవరణ చేసుకున్నాను. ఆ మందు తాగిన వాడికి ఆ విద్య వస్తుంది"
క్రిష్ "వెయిట్.... అంటే ఆ మందు తాగితే హల్క్ అయిపోతారా..... కాదు కాదు డాక్టర్ స్త్రెంజ్ అయిపోతారా...."
ప్రభు "ఆ మందుని తయారు చేయడం కోసం నాకు చాలా సంవత్సరాలు పట్టింది... బిజినెస్ చేస్తున్నాను. అది తయారు చేస్తున్నాను... పెళ్లి కూడా చేసుకోలేదు.... అలా ఒక రోజు సక్సెస్ అయ్యాను"
క్రిష్ "హుమ్మ్"
పూజ కోపంగా శ్వాస పీలుస్తూ వచ్చి "నూతన్ కి యిచ్చాడు"
క్రిష్ "నూతన్ భయ్యా...."
పూజ "నూతన్ ని నువ్వు భయ్యా అని అనుకుంటున్నావ్... అతను నిన్ను శత్రువు అనుకుంటున్నాడు"
క్రిష్ "వాట్ నాన్సెన్స్..."
పూజ "నూతన్ నన్ను వశీకరణం చేసుకుని ఆడుకున్నాడు. ఏ హాస్పిటల్, ఏ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ నన్ను కాపాడలేదు... అతను చెప్పిన పని చేస్తే నన్ను వదిలిపెడతా అన్నాడు కాని ఇప్పుడు మోసం చేశాడు"
క్రిష్ "నూతన్ కి నీకు అఫైర్ ఉందా..... అందుకే నాకు బ్రేక్ అప్ చెప్పావా..."
పూజకి కోపం వచ్చి "చెబితే అర్ధం కాదా... నూతన్ చెప్పాడు కాబట్టి నిన్ను ప్రేమించాను... నూతన్ చెప్పాడు కాబట్టి నీతో విడిపోయాను.... అసలు అంత ఎందుకు నూతన్ చెప్పాడు కాబట్టి నిన్ను నీ వైఫ్ రష్ ని విడగోట్టాను... ఆ రోజు నీకొడుకు నానికి తగ్గిపోయింది... అయినా డాక్టర్ కి హాస్పిటల్ డైరక్టర్ చేత చెప్పించి 2 లక్షలు ఇస్తే కాని తగ్గదు అని ఇంకా నీ చేత చాలా ఖర్చు పెట్టించాను. ఇంకా ఇంకా చాలా చేశాను.... దీని అంతటికి నూతన్ కారణం" అని ఏడుస్తూ అరిచేసింది.
క్రిష్ "నాన్ సెన్స్... నీకు పిచ్చి పట్టింది..."
ప్రభు పైకి లేచి పూజ భుజం మీద చేయి వేశాడు.
పూజ ఏడుస్తూ పక్కకు తిరిగింది.
ప్రభు ల్యాండ్ ఫోన్ నుండి తన సెక్రటరీ ని పిలిచాడు.
క్రిష్ ముందే ప్రభు అతని సెక్రటరీని వశం చేసుకొని క్రిష్ కి నమ్మకం వచ్చాక ఆమెను వదిలేస్తాడు.
ఆమె బయటకు వెళ్ళిపోతుంది.
క్రిష్ షాకింగ్ గా చూస్తూ "ఇదంతా నాటకం కాదు కదా...." అని అడుగుతాడు.
పూజ "నీ అయ్యా..." అంటూ కోపంగా పైకి లేచి క్రిష్ ని కొట్టడం కోసం వస్తుంది.
ప్రభు, పూజని వెనక్కి పెట్టుకొని "ఇది ఎలా ఉంటుంది అంటే.... నేను ఒకరిని వశం చేసుకుంటే వాళ్ళు పూర్తిగా నా కంట్రోల్ లో ఉంటారు... ఎక్కువ మందిని వశం చేసుకుంటే... కంట్రోల్ ఎక్కువ ఉండదు.."
పూజ "అందరిని వశం చేసుకోలేరు... వాళ్ళ కంటే మెంటల్ స్త్రెంత్ ఎక్కువ ఉంటే వాళ్ళను వశం చేసుకోలేరు"
క్రిష్ "ఓకే.."
ప్రభు "నూతన్ ని నేను నా వారసుడుగా తీసుకొని వచ్చాను. వాడికి అన్ని పనులు నేర్పాను. ఆ వశీకరణం మందు కూడా యిచ్చి ఆ విద్య నేర్పాను"
క్రిష్ "నూతన్ భయ్యాకి కూడా వచ్చా..."
పూజ "భయ్యా కాదు" అని అరుస్తుంది.
క్రిష్ "ఏమయింది నీకూ.... భయ్యాకి సూపర్ పవర్స్ ఉంటే నాకు హెల్ప్ చేస్తాడు"
పూజ "నూతన్ హేట్స్ యు..."
క్రిష్ "వాట్"
పూజ "నూతన్ నిన్ను కంట్రోల్ చేసుకోలేక పోయాడు. అందుకే నీ మీద అతను చాలా ప్రయోగాలు చేశాడు."
క్రిష్ "ఎందుకు?"
పూజ "తెలియదు... నువ్వు అతని లవ్ ఎదో చెడగొట్టావ్"
క్రిష్ "అబద్దం.... ఆ పవర్ ఉంటే తను ఎవరితో అయినా నన్ను చంపేయొచ్చు"
ప్రభు "అందుకే... నూతన్ ని నేను నా వారసుడుగా ఒప్పుకోవడం లేదు"
క్రిష్ "అదేంటి అంకుల్ ఇన్ని రోజులు నూతన్ భయ్యాని వారసుడు అని ఇప్పుడు కాదు అంటున్నారు"
ప్రభు "నూతన్.... ఒక పిచ్చి వాడు... ఒక సైకో లాంటి వాడు..."
క్రిష్ "వాట్"
ప్రభు "నూతన్ నిన్ను ఫ్రెండ్ లాగానో... తమ్ముడు లాగానో చూడడం లేదు.... నిన్ను ఒక శత్రువులా చూస్తున్నాడు"
క్రిష్ "...."
ప్రభు "నీకు వర్క్ నేర్పించాడు... నీకు వర్క్ ఇప్పించాడు... నీకు హెల్ప్ చేశాడు.... అలాగే నీకు కస్టాలు క్రియేట్ చేసాడు.... నీకు నీ భార్యకి మధ్య సమస్యలు సృష్టించాడు... నిన్ను పూజని కలిసేలా చేశాడు... అలాగే విడకోట్టాడు... అతను నువ్వు నరకం చూడాలని అనుకుంటున్నాడు"
క్రిష్ "నేను నమ్మను"
పూజ ఒక ఆడియో ఫైల్ ప్లే చేసింది.
అందులో నూతన్ క్రిష్ ని నాశనం చేయాలి అన్నట్టు మాట్లాడడం వినపడింది.
క్రిష్ షాక్ అయి చూస్తూ ఉన్నాడు.
అంతలోనే గది డోర్ ఓపెన్ చేసుకొని నూతన్ గదిలోకి వచ్చాడు.
క్రిష్ ని చూస్తూ, నూతన్ "నిజం తెలిసి పోయిందా" అని నవ్వుతూ వచ్చి క్రిష్ ని చూస్తూ నవ్వాడు.
క్రిష్ పిడికిలి బిగించాడు. అది చూసి నూతన్ తన వెనక ఉన్న ఇద్దరినీ వశం చేసుకొని క్రిష్ మీదకు పంపాడు.
ప్రభు ఆ ఇద్దరినీ న్యూట్రల్ చేసేశాడు.
నూతన్ కోపంగా "అంకుల్" అని అరిచాడు.
ప్రభు "నూతన్.... నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావ్.... నువ్వు ఇలాంటి వాడివి కాదు కదా...."
నూతన్ "వీడి ఒక్కడిని చంపేస్తాను.... ఆ తర్వాత మంచి వాడిని అయిపోతాను... ప్లీజ్ అంకుల్" అని అడిగాడు.
ప్రభు "ఇప్పటికే నీ వల్ల చాలా మంది సూ సైడ్ చేసుకున్నారు" అన్నాడు.
నూతన్ "కమాన్ అంకుల్... అది జస్ట్ ప్రాక్టీస్.... నీ లాగా నేను కూడా చీటింగ్ చేసి బిజినెస్ చేయాలి కదా.."
ప్రభు "నేను చీటింగ్ చేయలేదు"
నూతన్ "దొరికితేనే దొంగ కదా..... అర్ధం అయింది... అందుకే చెప్పేది నేను మోసం చేసిన వాళ్ళు అందరిని చంపేస్తాను. ఆ తర్వాత మంచి వాడిని అయిపోతా... అప్పుడు వచ్చి మన కంపనీని నా చేతుల్లోకి తీసుకుంటాను"
ప్రభు "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు..."
నూతన్ "హహ్హాహ్హా" అని నవ్వాడు.
ఇంతలో అతని నవ్వు చాలా నవ్వులుగా వినపడింది.
చాలా మంది ఆ గదిలోకి వచ్చారు.
నూతన్ "వాడి తల మీద కొట్టు"
పూజ పైకి లేచి ఒక చైర్ తీసుకొని క్రిష్ తల మీద కొట్టింది.
క్రిష్ కింద పడగానే.... పూజ నవ్వుతూ "కరక్ట్ గా చేశానా మాస్టర్" అని అంటూ వెళ్లి నూతన్ ని కిస్ చేసింది.
ప్రభు (50y), మరియు క్రిష్ (22y) ఎదురుగా సుమారు బాడీ బిల్డర్స్ లా ఉన్న ఐదుగురు ఉన్నారు.
నూతన్ "ఇద్దరినీ చంపేయండి" అని ఆర్డర్ వేశాడు.
ఆ అయిదుగురు ఇద్దరి మీదకు పరిగెత్తుకొని వచ్చారు.
![[Image: desktop-wallpaper-cool-anime-iphone-cool...-fight.jpg]](https://i.ibb.co/SBZvyPF/desktop-wallpaper-cool-anime-iphone-cool-anime-fight.jpg)
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them