Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
37. నా జీవితం సందీప్ చేతుల్లోకి 3.0







సందీప్ కోమాలో ఉన్న తన తల్లి దగ్గర కూర్చుంటాడు, ఆమెతో మాట్లాడుతూ "నిర్వేద్(నాని) జోలికి వెళ్లొద్దు అని మీకు చెబుతూనే ఉన్నాను. పసి పిల్లాడు అయినా సునీల్ పంపించి మెట్ల మీద నుండి తోయించి చనిపోయేలా చేశావ్.... హుమ్మ్.... కాని మరునాడే యాక్సిడెంట్ లో మొత్తం ఫ్యామిలీ అందరూ చనిపోయారు.... ఒకానోకందుకు మంచే జరిగిందిలే... ఆ విషయం అడ్వాంటేజ్ తీసుకొని.. రష్ ని నా దగ్గరే పెట్టేసుకున్నాను. ఇప్పుడు తను నా మనిషి.... వింటున్నావా అమ్మా.... తను నా మనిషి" అంటూ నవ్వుతున్నాడు.

కోమాలో ఉన్న తన తల్లిని చూసుకోవడం కోసం నర్సు వచ్చింది. సందీప్ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు.


బయట రష్ సోఫాలో తల వాల్చి పడుకొని నిద్ర పోతుంది. సందీప్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను చూస్తూ మనసులో "ఒకప్పుడు నిన్ను తక్కువ చేశాను... ఇప్పుడు అలా కాదు.. బాగా చూసుకుంటాను.... నువ్వు నా గౌరవం" అనుకుంటూ బయటకు వెళ్తాడు.

రష్ "సందీప్.... నాకు తల నొప్పిగా ఉంది" అంటుంది.


మరు క్షణం హాస్పిటల్ లో ఉంటారు.

అన్ని రకాల టెస్ట్ లు చేసినా ఆమెకు అప్పుడప్పుడు వచ్చే ఆ తల నొప్పికి కారణం కనుక్కోలేక పోతారు.

సుమారు అన్ని హాస్పిటల్స్ చూసిన ఎవరూ సమాధానం చెప్పలేక పోతారు.


రష్ కి అప్పుడు గుర్తుకు వస్తుంది. రష్ క్రిష్ కళ్ళలోకి చూస్తూ ఉంటే అతని మైండ్ లో ఏమనుకుంటున్నది తెలుస్తుంది. 

ఆ రోజు సందీప్, క్రిష్ తల పై కొట్టేడపుడు అతని కళ్ళలోకి చూస్తూ అతని నొప్పిని కూడా ఫీల్ అయింది కాని ఎప్పుడూ ఇలా నొప్పి రాలేదు కాని క్రిష్ దెబ్బలు తిన్న ఇదే ఇంటికి రావడం వల్ల మళ్ళి తన తల నొప్పి తిరగబెట్టింది.




రామ్మోహన్ గిల్టీ ఫీలింగ్ తో వాళ్ళ అమ్మానాన్న కి క్రిష్ సంగతి చెప్పి క్షమాపణ అడుగుతాడు. కాని క్రిష్ వెళ్లి పోయాడు, రామ్మోహన్ మరియు కేశవ్ లు ఎంత వెతికినా క్రిష్ మళ్ళి కనిపించడు.... 


..... గోవా .....

క్రిష్ బీచ్ లో తన ఫోన్ లో రష్ నుండి వచ్చిన మెసేజ్ "గుడ్ బాయ్ క్రిష్.... బాగా చదువుకో.... మనం జీవితంలో మళ్ళి కలవద్దు" చూస్తూ నడుస్తున్నాడు.

వెనక నుండి పూజ అతని వీపు మీద చరిచి "ఎన్ని రోజులు అని అదే మెసేజ్ చూస్తావ్... నా మనుషులతో కిడ్నాప్ చేయించేదా... పోనీ" అంటుంది.

పూజ ఫ్రెండ్ మరొకరు "వదిలేయండి బ్రో.... ఎంజాయ్ చేయండి.... ఇక్కడ పూజ ఫ్యామిలీకి చాలా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయ్... ఎంజాయ్ చేద్దాం..."

పూజ "అవునూ... పాస్ట్ ని క్షమించి... ఫ్యూచర్ ని ఎంజాయ్ చేయాలి..."

పూజ ఫ్రెండ్ "అవునూ బ్రో... పెద్ద మనసు చేసుకొని క్షమించు ...."

పూజ ఫ్రెండ్ మరొకరు "అలాగే మాకు షేర్స్ లో లాభాలు తెచ్చి పెట్టు" అంటూ నవ్వుతారు.

క్రిష్ "I am not forging type... If you hurt me.... I'll hurt you.... If you hurt me more.... I'll hurt you more...." అని అంటాడు.

అందరూ తనని చూస్తూ ఉంటారు.

క్రిష్ "నేను రివెంజ్ ప్లాన్ చేశాను.... గ్రేట్ సక్సెస్ ఈజ్ మై రివెంజ్..." అని పెద్దగా అరుస్తాడు.

అందరూ చీర్స్ చేస్తారు.

పూజ మాత్రం క్రిష్ చెప్పిన "I'll hurt" అనే మాట దగ్గరే ఆగిపోతుంది.

ఇంతలో తన ఫోన్ మోగింది "నూతన్ కాలింగ్"


పూజ "హలో"

నూతన్ "కొత్త టాస్క్... ఆఖరి టాస్క్..."

పూజ "ఏంటి?"

నూతన్ "సింపుల్...... క్రిష్ కి గర్ల్ ఫ్రెండ్ గా మారు... ఆ తర్వాత అతని నుండి విడిపో..." అని అంటాడు.

పూజకి నూతన్ మాటలు వింటూ ఉంటే చమటలు పడుతున్నాయి.

నూతన్ "ఆ తర్వాత ఫ్రీడం ఇస్తాను" 

పూజ "సరే" అని అంటుంది.

మనసులో "ప్రతి సారి ఇదే ఆఖరి టాస్క్ అంటున్నాడు. అసలు నేను ఇందులో నుండి బయట పడగలనా.... ఇప్పటికే చాలా తప్పులు చేశాను..." అని ఆలోచిస్తూ ఉంది.

క్రిష్ తన దగ్గరకు నవ్వుతూ వస్తున్నాడు. పూజ కూడా నవ్వుతూ పలకరించింది.




(మూడు నెలల తర్వాత)

పూజ "లెట్స్ బ్రేక్ అప్..." అని మెసేజ్ పంపింది.

క్రిష్ కోపంగా కంపనీ టెర్రస్ పై నిలబడి పెద్దగా "ఆ!" అని అరిచాడు.


కంపనీ సీఈఓ క్రిష్ ని ప్రత్యేకంగా పిలిపించాడు. నూతన్ కి అంకుల్ మిస్టర్ ప్రభు వయస్సు 50 సంవత్సరాలు. క్రిష్ కూడా అంకుల్ అని పిలుస్తాడు. రష్ గురించి తెలిసి క్రిష్ కి చదువుకుంటూనే డబ్బు సంపాదించుకునే మార్గం చూపించాడు. అలాగే చాలా హెల్ప్ చేశాడు. అతని కంపనీ సుమారు 2000 కోట్ల వర్త్. అలాగే 8000 కోట్లు అమౌంట్ క్లయింట్ మనీ ఉంది. దాంతో కంపనీలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు.

క్రిష్, ప్రభు ఆఫీస్ గదిలోకి "అంకుల్" అనుకుంటూ వెళ్ళాడు.

దూరంగా పూజ నిలబడి ఉంది.

ప్రభు మాట్లాడుతూ "వశీకరణం గురించి ఎప్పుడైనా విన్నావా..." అని అడిగాడు.

క్రిష్ "వాట్..."

ప్రభు "అది వశీకరణం కూడా కాదు.... అది ఒక శాపం లాంటిది..." అన్నాడు.

క్రిష్ "వశీకరణం" అని అయోమయంగా చూస్తున్నాడు.

ప్రభు "నీకు తెలియకుండానే ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నావ్..."

క్రిష్ "ఏమిటది?" అంటూ దూరంగా నిలబడ్డ పూజని చూస్తూ మళ్ళి ప్రభు వైపు చూస్తూ అడిగాడు.

ప్రభు "400 సంవత్సరాల క్రితం........."





















[+] 7 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 13-09-2024, 06:59 PM



Users browsing this thread: 39 Guest(s)