13-09-2024, 06:21 PM
(This post was last modified: 16-09-2024, 07:10 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
36. నా జీవితం సందీప్ చేతుల్లోకి 2.0
హాయ్, నా పేరు కేశవ్...
ఎస్సై కేశవ్ వరంగల్ లో ఒక కేసుకి సంబంధించి ఒక హాస్పిటల్ లో తొమ్మిది నెలల క్రితం CC కెమెరా చూశాడు. అందులో క్రిష్ మరియు రష్ ఆరు నెలల నానిని హాస్పిటల్ లో చూపిస్తూ ఉన్నారు.
ఆ రోజు అందరూ క్రిష్, రష్ ని లేపుకు పోయాడు అని అందరూ క్రిష్ ని చేచ్చేలా కొట్టారు. కాని చూస్తే నానికి ఒంట్లో బాగోకపోతే ఇద్దరూ హాస్పిటల్ లో చూపిస్తూ ఆ రాత్రి అంతా గడిపారు.
కాని వరంగల్ లో ఎందుకు? తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు మొత్తం కదిలింది. చాలా నిజాలు తెలిసాయి.
సందీప్ మగాడు కాదు.
సందీప్ కి ఇక్బాల్ కి మధ్య రిలేషన్ ఉంది.
ఇక్బాల్, సందీప్ భార్య రష్ కావాలని అడిగాడు.
రష్ ఒప్పుకోకపోవడంతో ఇక్బాల్ ఆమెను కిడ్నాప్ చేసి బ్రోతల్ హౌస్ కి అమ్మేశాడు.
క్రిష్ వెళ్లి ఆమెను కాపాడాడు. అలాగే నానిని హాస్పిటల్ లో జాయిన్ చేశాడు.
రష్ విషయం తెలిస్తే అందరూ తప్పుగా అనుకుంటారు అని ఆ రోజు అందరి ముందు దెబ్బలు తిన్నాడు.
సందీప్ తన విషయం బయటకు రాకూడదు అని క్రిష్ ని చంపడానికి చూశాడు.
కేశవ్ కి నిజాలు అన్ని విని ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. క్రిష్ మరియు రష్ ఇద్దరూ తనకు చాలా సొంత మనుషులు అలాంటిది అంత పెద్ద కష్టం తనకు తెలియకుండా వాళ్లిద్దరే అనుభవించారు అంటే బాధగా అనిపించింది.
ముందుగా రామ్మోహన్ కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు.
పిన్ని మాట్లాడుతూ నానికి ఒంట్లో బాలేదు అని రెండూ లక్షలు ఉంటే బ్రతుకుతాడు అని, కాని రామ్మోహన్ ఇవ్వలేదు చెబుతుంది.
కేశవ్, రామ్మోహన్ ని తిట్టి నాని ఉన్న హాస్పిటల్ కి వెళ్తాడు.
రామ్మోహన్ తన కూతురు అంత సమస్యలోనూ తనకు కాకుండా క్రిష్ కి ఫోన్ చేసింది అనిపించి బాధగా అనిపిస్తుంది. క్షమాపణ చెప్పి అమౌంట్ తీసుకొని హాస్పిటల్ కి వస్తారు.
కాని హాస్పిటల్ లో ఎవరూ ఉండరు.... హాస్పిటల్ బయట.. క్రిష్ తాళిబొట్టు చేతులో పట్టుకొని రష్ రాసిన లెటర్ మరో చేత్తో పట్టుకొని కూర్చున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
రామ్మోహన్ మరియు కేశవ్ వచ్చి క్రిష్ ని రష్ గురించి నాని గురించి అడిగారు. క్రిష్ ఏమి మాట్లాడకుండా లేచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
రామ్మోహన్ కోపంగా క్రిష్ చేతిని పట్టుకొని లాగుతూ "రష్ ని ఎక్కడ దాచి పెట్టావ్ చెప్పూ" అని అడుగుతాడు.
క్రిష్ కూడా కోపంగా "ఇంకో సారి నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి డిమాండ్ లు తేవద్దు.. నీ కూతురు ఎక్కడ ఉందొ నాకు ఏం తెలుసు.... వెళ్లి నీ అల్లుడిని అడుగు...." అంటాడు.
రామ్మోహన్ బిపి వచ్చి అక్కడే కూర్చుంటే అతని భార్య టాబ్లెట్ ఇస్తుంది అది వేసుకొని రొప్పు తీసుకుంటూ ఉంటాడు.
కేశవ్ వచ్చి క్రిష్ పక్కనే కూర్చొని విషయం ఏమిటి అని అడగగా కేశవ్ ని హాగ్ చేసుకొని ఏడ్చేస్తాడు.
ఆ తర్వాత అందరి వైపు తిరిగి జరిగిన విషయం అంతా చెబుతాడు. సందీప్ ఫ్యామిలీ చనిపోవడంతో అతని భార్య స్థానంలో రిచ్ పర్సన్ గా బ్రతకడం కోసం వెళ్లి పోయింది అని చెబుతాడు.
కేశవ్, క్రిష్ ని తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు.
తెల్లారి చూస్తే క్రిష్ కనిపించడు....
సందీప్-రష్ ల ఇంటి ముందు నిలబడి ఉంటాడు. రష్ ని, నానిని చూడాలని వచ్చా అని చెబుతాడు.
రష్ వాచ్ మెన్ తో అతడిని వెయిట్ చేయ మని చెబుతుంది. ఒక గంట, ఒక పూట, ఒక రాత్రి అంతా క్రిష్ వర్షంలో బయట అలానే నిలబడి ఉంటాడు.
రష్ కూడా ఇంట్లో అడ్డం డోర్ నుండి క్రిష్ ని చూస్తూ నిలబడి ఉంటుంది.
రష్ "నా కొడుకుని చంపాలని అనుకున్నావ్ క్రిష్.... నీకు ఈ పనిష్మెంట్ చాలదు...." అని అనుకుంటుంది.
కేశవ్ వచ్చి క్రిష్ ని తీసుకొని వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు.
రష్ రామ్మోహన్ మరియు కేశవ్ లు అందరితో కటినంగానే మాట్లాడుతుంది. వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోతారు. క్రిష్ ని అసలు గడప కూడా తొక్కనివ్వదు.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them