Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
35. నా జీవితం తిరిగి సందీప్ చేతుల్లోకి 1.0





(వారం రోజుల తర్వాత)

హాస్పిటల్


హాయ్, నా పేరు రష్...

సందీప్ "నిజంగా నాకు తెలియదు.... తెలిస్తే.. నేను వచ్చే వాడిని... క్రిష్ నా దగ్గరకు రాలేదు అడగలేదు.... అడిగితే నేను ఎదో ఒక రకంగా సహాయం చేసేవాడిని" అన్నాడు.

రష్ "హుమ్మ్" అంది.

సందీప్ "క్రిష్ కి ఇంత ఈగో అని అసలు అనుకోలేదు. నాని చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా ఈ ఈగో ఎందుకో..."

రష్ "క్రిష్ కి డబ్బులు వచ్చాయి" అంది.

సందీప్ "కాని లాస్ట్ నిముషంలో కదా..."

రష్ "క్రిష్ అన్ని చోట్లా ప్రయత్నించాడు"

సందీప్ "స్స్... నో.... ఇలా జరిగి ఉంటుందా.... స్స్... నేను తప్పు చేశాను.... సారీ రష్..... సారీ..."  

రష్ "ఏమయింది?"

సందీప్ "మొన్న క్రిష్ తో కోపంలో నిర్వేద్ నా కొడుకు అని చెప్పాను... అందువల్ల అంత సీరియస్ గా లేడు అంటావా...."

రష్ బిత్తరపోయింది ఆమె నోరు కేవలం "వాట్" అనే మాట మాత్రమే వచ్చింది.

సందీప్ "నన్ను క్షమించు... నన్ను క్షమించు... రష్... నేను నిన్ను కలవకూడదు.... సారీ..... సారీ..... నేను వెళ్తాను" అని వెళ్లి పోయాడు.

రష్ దూరంగా వెళ్తున్న సందీప్ ని చూస్తూ క్రిష్ గురించి ఆలోచిస్తూ ఉంది. మనసులో "క్రిష్ నా గురించి నిజంగా నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నాడా!"






హాయ్, నా పేరు క్రిష్...

దూరం నుండి చూస్తే సందీప్ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు. 

ఈ సందీప్ హాస్పిటల్ దగ్గర ఏం చేస్తున్నాడు. వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ అమ్మ నన్ను పిచ్చి తిట్లు తిట్టింది. వీడు కూడా ఏమి మాట్లాడకుండా మాములుగా కూర్చున్నాడు. చెత్త వెధవ...

చూస్తూ ఉండగానే... సందీప్ కుర్చీలో కూలబడ్డాడు.

వీడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని అనుకోని బయటకు వెళ్లిపోతాడు.


కొద్ది సమయం తర్వాత

క్రిష్ వెనక్కి హాస్పిటల్ కి వచ్చి రష్ ని చూశాడు.

రష్ మరియు సందీప్ ఇద్దరూ హాగ్ చేసుకుని ఉన్నారు.

క్రిష్ "రష్... " అని అరిచాడు. కాని అతని గొంతు ఎవరికీ కూడా వినపడలేదు. అది అతని గొంతులోనే ఆగిపోయింది.







హాయ్, నా పేరు రష్...

యాక్సిడెంట్...

సందీప్ ఇంట్లో అందరూ కారులో ఎదో ఊరు వేల్లారంట, సందీప్ మగాడు కాదు అని తెలిశాక అతన్ని అవుట్ హౌస్ లో ఉంచి భోజనానికి మాత్రమే పిలుస్తున్నారు, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళు మాత్రమే కలిసి తిరుగుతున్నారు.

కారులో ఉన్న అందరూ నిద్ర పోతూ ఉన్నారు. ఆ రోజు వర్షం పాడడంతో సునీల్ (సందీప్ తమ్ముడు) డ్రైవ్ చేస్తూ ఉంటే లారీ వచ్చి గుద్దేసింది. అందరూ చనిపోయారు. సందీప్ వాళ్ళ అమ్మ మాత్రమే, బ్రతికి ఉంది కాని కేవలం కోమాలో ఉంది. 

నేను ఎంతగా ద్వేషించినా.... పాపం భర్త కొడుకు, మనవరాళ్ళు చనిపోవడం అంటే చాలా కష్టం.

సందీప్ వచ్చి హత్తుకున్నాడు. మొదట్లో తత్తరపడ్డాను, కాని సందీప్ మగాడు కాదు అని తెలుసు మాములుగా అతని వీపు మీద చిన్నగా తడుతూ ఒదారుస్తున్నాను.

క్రిష్ మమ్మల్ని చూస్తాడు అని నేను అనుకోలేదు.

సందీప్ "క్రిష్ మనల్ని చూసి వెళ్ళిపోయాడు"

క్రిష్ వెళ్ళిపోయాడు అని సందీప్ కంగారు పడుతున్నాడు. కాని అతని ఫోన్ లో క్రిష్ కి కాల్ వెళ్ళింది. 

రష్ "పర్వాలేదు లే... అయినా క్రిష్ కి కోపం వస్తే, వెళ్లి మెట్ల మీద కూర్చుంటాడు, కోపం తగ్గగానే వచ్చేస్తాడు" అంది.







హాయ్, నా పేరు క్రిష్...

సందీప్ కాలింగ్

క్రిష్ ఫోన్ ఎత్తి "హలో" అన్నాడు.

రష్ వాయిస్ "పర్వాలేదు లే... అయినా క్రిష్ కి కోపం వస్తే, వెళ్లి మెట్ల మీద కూర్చుంటాడు, కోపం తగ్గగానే వచ్చేస్తాడు" అని వినపడింది.

క్రిష్, రష్ మాటలు విని కుర్చీలో కూలబడిపోయాడు.

రష్ కోసం... తన ఫ్యామిలీతో గొడవపడ్డాడు, వాళ్ళ ఫ్యామిలీతో గొడవపడ్డాడు, వరంగల్ వెళ్లి గొడవపడ్డాడు, సందీప్ ఫ్యామిలీతో గొడవ పడ్డాడు, ఆఖరికి ఇదా నాకు దక్కింది, అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు.

ఎదురుగా పూజ కనపడింది. ఆమె నడుచుకుంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది.

పూజ "నువ్వు చూశావా..."

క్రిష్ తనని తానూ కవర్ చేసుకుంటూ "ఏంటి?" అని అడిగాడు. అతని మొహం మీద చమట స్పష్టంగా కనిపిస్తుంది.

పూజ, క్రిష్ చేతిని హత్తుకొని "నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి"

క్రిష్ ఏమి మాట్లాడలేదు.

పూజ "నీ వైఫ్ ఎక్స్ హస్బెండ్..... ఫ్యామిలీ మొత్తం చనిపోయారు"

క్రిష్ "వాట్.... అవునా..." అని షాక్ అయ్యాడు.

పూజ "సందీప్..... రష్ ని తిరిగి తనతో రావాలని అడిగాడు"

క్రిష్ "అలా జరగదు"

పూజ చిన్నగా నవ్వి "క్రిష్... నువ్వంటే నాకు ఇష్టం..."

క్రిష్, పూజ మనసులో ఉన్న సంగతి తెలుసు కాని ఇలా బోల్డ్ గా ప్రపోజ్ చేస్తుంది అని అనుకోలేదు. తను ముందుగా అనుకున్న సమాధానం "నాకు పెళ్లి అయిపొయింది" అని చెప్పేశాడు.

పూజ "ఆల్రైట్.... అయితే రష్ వెళ్ళిపోయే దాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను... తర్వాత నేను నీ వెంట పడతాను.... అప్పటి వరకు కనపడను" అని వెళ్ళిపోయింది.

క్రిష్ తల దించుకోని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా జరగదు, రష్ తనని వదిలి వెళ్ళదు అని గర్వంగా చెప్పలేక పోతున్నాడు.

రష్ ఎప్పుడూ బాగా చదువుకొని, డబ్బు బాగా సంపాదించు అని చెబుతుంది.

రష్ ఎప్పుడూ కూడా నాని పేరు చెప్పలేదు.

రష్ మరియు నా గురించి చుట్టాల్లో ఎవరికీ తెలియదు.

చూస్తూ ఉంటే.... రష్ మనసులో ఎప్పటికైనా నన్ను వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తుందా...

క్రిష్ తల నొక్కుకుంటూ ఉన్నాడు.








హాయ్, నా పేరు రష్...

సందీప్ "నీకొక ముఖ్య విషయం చెప్పాలి"

రష్ "ఏమిటది?"

సందీప్ "నాతొ రా.." అని తీసుకొని వెళ్లి 

పూజ, క్రిష్ ని సైడ్ నుండి హాగ్ చేసుకోవడం చూపించాడు.

రష్ కి గుండె ఆగినంత పని అయింది. 

సందీప్ "రష్... ఇప్పుడు నేనే ఆ ఇంటికి యజమానిని... నువ్వు నాతో వస్తావా... యజమానురాలిగా... నువ్వు ఎప్పుడూ పిలిస్తే అపుడు తీసుకొని వెళ్ళిపోతా...." అని అడిగాడు.

రష్, క్రిష్ దగ్గరకు వెళ్లి ఎప్పటిలా గొడవ చేయాలని అనుకోలేదు. సందీప్ చెప్పిన మాటలు కూడా వినలేదు.

వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి నాని దగ్గర ఉండిపోయింది. 

రష్, నానికి ఫుడ్ పెట్టి అక్కడే కూర్చుంది.

కొద్ది సేపటి తర్వాత....

క్రిష్ కూడా వచ్చాడు కాని, రష్ ఇంతకు ముందులా ఉండలేక పోయింది. క్రిష్ కూడా ఇంతకు ముందులా ఉండలేకపోయాడు.

సందీప్ వచ్చాడు. సందీప్ ని చూడగానే రష్ నవ్వింది, అది చూసి క్రిష్ గుండెల్లో నొప్పి వచ్చి నంత పని అయింది.

సందీప్ వచ్చి నానితో కొద్ది సేపు ఆడుకొని, రష్ తో మాట్లాడి వెళ్ళిపోయాడు. అలాగే కొంత డబ్బు కూడా యిచ్చాడు.

క్రిష్ బయటకు వెళ్ళబోతూ డబ్బు ఇస్తే.... రష్ విసుగ్గా చూస్తూ "నా దగ్గర ఉన్నాయ్" అంది.








హాయ్, నా పేరు క్రిష్...

రష్ చూపు.... 
నా దగ్గర ఉన్నాయ్.... 
ఆ చూపు..... ఆ మాట.... నాకు పదే పదే కనిపిస్తూ పదే పదే వినిపిస్తూ ఉన్నాయి.

సాయంత్రానికి హాస్పిటల్ కి వెళ్లి చూసేసరికి, రష్ కాని నాని కాని కనపడలేదు.

నర్సులు డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. క్రిష్ ఇంటి నుండి వచ్చాడు అక్కడ ఉండే అవకాశం లేదు

హాస్పిటల్ లో గొడవ చేస్తే... హస్బెండ్ వచ్చి తీసుకొని వెళ్ళారు అని చెబుతారు.

అలాగే నాని ఉండే బెడ్ పై ఒక చిన్న లెటర్ రాసి ఉంటుంది. దానికి ఒత్తుడుగా తను రష్ కి కట్టిన తాళిబొట్టు ఉంది.

"గుడ్ బాయ్.... మా ఫ్యామిలీ వచ్చింది నేను వెళ్ళిపోతున్నా.... బాగా చదువుకో...."

క్రిష్ కి ఆ లెటర్ చూసి చేతులు చమటలు పట్టేశాయి. ఆ హాస్పిటల్ బెడ్ పైనే కూర్చుండి పోయాను.

ఇట్స్ ఓవర్.... తన అవసరం తీరిపోగానే వెళ్లి పోయింది.







హాయ్, నా పేరు రష్...

రష్ "నిజం.... చెప్పూ... ను... ను.... నువ్వు ఏం చూశావ్..."

వాచ్ మెన్ "మీ హస్బెండ్, నాని కింద పడ్డప్పుడు.. నానికి బ్లడ్ రావడం చూశాడు, కాని వెళ్ళిపోయాడు... తర్వాత నేను వెళ్లి చూసే సరికి నానిని చూసి పిల్లల చేత కబురు పెట్టాను"

పూజ మాటలు గుర్తుకు వచ్చాయి "మీ ఇద్దరూ తనకు బరువు..... నాని మాత్రమే నీకు క్రిష్ మద్య ఉన్న బాండ్... తను లేకపోతే.... కచ్చితంగా నన్నే సెలక్ట్ చేసుకుంటాడు"

సందీప్ మాటలు గుర్తుకు వచ్చాయి "నాని నా బిడ్డ అని చెప్పను.... క్రిష్ అందుకే పట్టించు కోలేదా..... స్స్... తప్పు చేశాను"


రష్ కి ముందు వరకు క్రిష్ తనకు అన్నింటి కంటే ఎక్కువ..... ఎప్పుడైతే.... నానికి దెబ్బ తగిలిందో... తన ప్రిరియారిటి మారిపోయింది. 

నా కొడుకు నాని కంటే తనకు ఇంకేం ఎక్కువ కాదు. క్రిష్ కూడా నాకు ఎక్కువ కాదు.

ఫోన్ ఓపెన్ చేసింది. సందీప్ నెంబర్ కి కాల్ చేసింది.. "నన్ను తీసుకొని వెళ్ళిపో.." అంది.

గుడ్ బాయ్.... క్రిష్.....

ఇక నుండి నీకు మా బరువు లేదు....

గుడ్ బాయ్....





















[+] 5 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 13-09-2024, 05:21 PM



Users browsing this thread: 10 Guest(s)