Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
33. నా జీవితం క్రిష్ చేతుల్లో 23.0






హాయ్, నా పేరు రష్

పరుగు లాంటి వేగంతో క్రిష్ హాస్పిటల్ లోకి వచ్చాడు. ఏమర్జన్సీ వార్డ్ దగ్గర రెడ్ లైట్ వెలుగుతూనే ఉంది. రష్ టెన్షన్ తో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఆమె చేతులు ఒణికిపోతూ ఉన్నాయి.  ఈ మధ్య పూజ గురించి అతిగా ఆలోచించి నానిని పట్టించుకోలేదు. సారీ నాని.... సారీ కన్నా.... అనుకుంటూ క్షమాపణ చెప్పుకుంది. 


హాయ్, నా పేరు క్రిష్

సారీ నాని... రోజు మెట్ల మీద నానిని కూర్చోబెట్టుకొని కూర్చోవడం అలవాటు... ఈ మధ్య డబ్బు అనుకుంటూ తిరిగే సరికి నానితో ఎక్కువ సమయం గడపలేక పోతున్నాను. ఒక వేళ వచ్చినా అలిసి పోవడమో, సందీప్-రష్ ల గురించి ఆలోచించి ఉండిపోవడమో చేశాను. నా కోసం వచ్చి మెట్ల మీదకు వచ్చినట్టు ఉన్నాడు. సారీ నాని.... ఈ ఒక్క సారి క్షమించు... ఈ సారి మీ నాన్న నిన్ను బాగా చూసుకుంటాడు.



క్రిష్ వెళ్లి టెన్షన్ గా ఉన్న రష్ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. ఆమె చేతులు చమటలు పట్టేసి వణుకుతున్నాయి. అప్పటి వరకు టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. క్రిష్ కనిపించగానే ఏడుస్తూ అతని భుజం పై వాలిపోయి సైడ్ నుండి హత్తుకుంది. క్రిష్ ఆమెను ఓదారుస్తూ కూర్చోబెట్టి వాటర్ తెచ్చి యిచ్చాడు. ఏడుస్తూ అలిసిపోయి కనిపించింది. కొద్దిసేపటికి  ఎమర్జన్సీ వార్డ్ లైట్ ఆగిపోయింది. నర్సు బయటకు వచ్చి మీ అబ్బాయిని ICUలో ఉంచాము, అని చెప్పింది. 

ఇద్దరం పరుగున  ICU దగ్గరకు వెళ్లి చూశాము, నాని ఇప్పుడు బాగానే ఉన్నాడు తలకు కట్టుకొట్టి ఉంది. పక్కనే మేడికల్ మిషిన్స్ అన్ని నార్మల్ గా ఉన్నాడు అన్నట్టు కొట్టుకుంటూ ఉన్నాయి. సెలైన్ పెట్టి చేయి కదలకుండా ఉండడం కోసం అన్నట్టు చిన్న వెదురు బద్దలు కట్టారు. డాక్టర్ వచ్చి "అంతా బాగానే ఉంది.... మత్తు ఇచ్చాం.... కుట్లు పడ్డాయి..... రేపు పొద్దున్న నిద్ర లేస్తాడు" అని చెప్పి వెళ్ళిపోయాడు. రష్ చాలా సేపు మాట్లాడింది. ఇప్పుడు ఆమె మొహం కాస్త కళ వచ్చింది. నర్సులను ఎంత బ్రతిమలాడినా ICUలో ఉంచడం లేదు బయట వెయిటింగ్ హాల్ లో ఉండమన్నారు. రష్ కి తినడం కోసం ఫుడ్ తెచ్చి కొంత డబ్బు అవసరానికి యిచ్చి నేను బయటకు వెళ్ళాను.



హాయ్, నా పేరు రష్

క్రిష్ వచ్చే వరకు నాకు ప్రాణం పోతున్నట్టు అనిపించింది,ఎప్పుడూ ఏ మాట వినాలో అని భయం వేసింది . క్రిష్ రాగానే అతని మీద వాలిపోయాను, కొంతలో కొంత దైర్యంగా వచ్చింది. నానికి బాగుంది అనేవరకు నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది, ఇప్పుడు కొంచెం పర్లేదు. ICUలో నానిని చూస్తే నాకు ఏడుపు తన్నుకొచ్చింది. నాని ఎప్పుడూ నవ్వుతూ తిరుగుతూ హుషారుగా ఉంటాడు అలాంటిది స్పృహ తప్పి పడుకుని ఉంటే నాకు బాధ అనిపించింది. ఆంటీ అంకుల్ మరియు ఇంటి దగ్గర చాలా మంది వచ్చి చూసి వెళ్ళారు. క్రిష్ బ్రేక్ ఫాస్ట్ తీసుకొని వచ్చి యిచ్చి బయటకు వెళ్ళాడు. ఎక్కడకు వెళ్ళాడు అని అడగలేదు. 

కౌంటర్ లో డబ్బులు కడితే, నర్సులే మొత్తం చూసుకుంటున్నారు. ఒక రోజు మొత్తం అక్కడే క్రిష్ తో కలిసి పడుకుంది.

క్రిష్ నానిని చూసి బ్రేక్ ఫాస్ట్ యిచ్చి మళ్ళి బయటకు వెళ్ళాడు. నాని నిద్ర లేచాడు, నవ్వుతున్నాడు... బాగానే ఉన్నాడు. 

రెండో రోజుకి నాకు కొంచెం హుషారు వచ్చింది.

బయటకు వచ్చి చూశాను, హాస్పిటల్ చాలా పెద్దది. చుట్టూ చూస్తూ ఉన్నాను. మా అపార్టమెంట్ నుండి వేరే ఆంటీ వాళ్ళు కూడా హాస్పిటల్ లో ఉన్నారు అంట, వెళ్లి చూసి వచ్చాను. 

అక్కడ నుండి వెళ్తూ ఉంటే, మనీ కట్టే కౌంటర్ కనపడింది. క్రిష్ కౌంటర్ లో నిలబడి డబ్బు కడుతున్నాడు. పాపం, చాలా కష్ట పడుతున్నాడు అని జాలి పడింది.

ఇంతలోనే ఒక్క సారిగా పెద్ద షాక్ తగిలింది, క్రిష్ పక్కనే పూజ కనపడింది, క్రిష్ తో మాట్లాడుతూ కనపడింది.
 
కోపం నషాళానికి అంటుకుంది. చీర బొడ్లో దోపుకొని సరాసరి వెళ్లి క్రిష్ ముందు నిలబడి "సిగ్గు ఉందా... నీ కొడుకు హాస్పిటల్ లో ఉంటే, నీ లవర్ ని మాట్లాడడానికి తెచ్చుకున్నావ్" అని అరిచింది.

చుట్టూ అందరూ చూస్తున్నారు. పూజ ఇబ్బందిగా "వెళ్తున్నా క్రిష్" అని పరుగులాంటి వేగంతో వెళ్ళిపోయింది. క్రిష్ ఆమె వైపు ఇబ్బందిగా చూశాడు.

క్రిష్ కంగారుగా రష్ నోరు మూసి బలవంతంగా పక్కకు తీసుకొని వెళ్ళాడు. రష్ అతని పట్టు నుండి విడబడి అతని చెంప మీద చాచి పెట్టి కొట్టింది.





హాయ్, నా పేరు క్రిష్

సందీప్ ఇదంతా నీ వల్లే.... 

డబ్బు సంపాదించాలి అన్న ఆత్రంలో ఉన్న డబ్బు అంతా షేర్స్ లో పెట్టేశాను. 

నాని కోసం ఖర్చు పెట్టడం కోసం బ్యాంక్ లో డబ్బు లేదు. ఎవరిని అడగాలో అర్ధం కాక పూజని అడిగాను.

వెంటనే హాస్పిటల్ కి వచ్చి యాభై వేలు యిచ్చింది. అంత వద్దు అని చెప్పినా... కాదు అని చెప్పి ఒకప్పుడు నన్ను కాపాడావు అని చెప్పి యిచ్చింది.

యమౌంట్ కౌంటర్ లో కట్టాను. పూజతో నాని గురించి డాక్టర్ చెప్పిన మాటల గురించి మాట్లాడుతూ ఉన్నాను, రష్ వచ్చింది.

అందరి ముందు పరువు తీసేసింది. అసలు దేవుడు దీనికి అందం యిచ్చి ఇంత పెద్ద గొంతు ఎందుకు ఇచ్చాడో.... బహుశా నా మీద కోపం ఏమో...

పూజ దెబ్బకు దడుచుకొని పరుగు లాంటి వేగంతో పరిగెత్తింది. రష్ ని పక్కకు తీసుకొని విషయం చెబుదాం అనుకున్నాను. కొట్టేసింది.




హాస్పిటల్ లో యిద్దరం పక్కపక్కనే ఉన్నా అలిగి నాతో పలకకుండా ఉంది. డబ్బులు ఇస్తే తీసుకుంటుంది. ఫుడ్ ఇస్తే తీసుకొని తింటుంది.

మాట్లాడుతుంటే మాత్రం తల పక్కకు తిప్పెసుకుంటుంది. విసిటింగ్ అవర్ లో వెళ్లి నానిని చూసి వస్తున్నాం.




ఆ రోజు సాయంత్రం నాని గురించి నర్సుతో మాట్లాడుతూ ఉన్నాను. రష్ నా వైపు కోపంగా చూస్తుంది. పరుగున వచ్చి నర్సుకి నాకు మధ్యలో నిలబడి నర్సుతో మాట్లాడింది.

ఈ సారి నా పక్కనే కూర్చుంది. మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తుంది.

నాకు జీవితంలో బాగా వచ్చింది అల్లా రష్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడమే...

క్రిష్ "పూజ డబ్బులు ఇవ్వడం కోసం వచ్చింది" అన్నాను.

రష్ నా వైపు అర్ధం కానట్టు చూసింది.

క్రిష్ "సందీప్ ఏ మధ్య వస్తూ ఉంటే, నేను కూడా డబ్బులు బాగా సంపాదించాలి అని ఆత్రంలో ఉన్న డబ్బు అంతా షేర్స్ లో పెట్టేశాను. తిరిగి రావడం కోసం కనీసం ఒక రోజు పడుతుంది. అందుకే పూజని అప్పు అడిగాను"

రష్ "అసలు నీ దగ్గరకు ఎందుకు వస్తుంది... దానికి నీ మీద కన్ను ఉంది తెలిసు కదా..."

క్రిష్ "తెలుసు...."

రష్ "తెలిసే.... నీ పక్కనే పెట్టుకున్నావా..." అంటూ కోపంగా చూసింది

క్రిష్ "నేను తనకు ఏజెంట్ గా కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేయించాను. లాభం రావడంతో వాళ్ళ ఫెండ్స్ కి పరిచయం చేసింది.. అలా అలా వాళ్ళ ఫ్రెండ్స్ లో నాకు పరిచయం ఏర్పడింది... ఆ కమీషన్ సుమారు వేలల్లో ఉంటుంది"

రష్ "..."

క్రిష్ "నేను చేసిన తప్పు అల్లా ఆ డబ్బు అంతా తిరిగి షేర్స్ లో పెట్టేశాను"

రష్ "కొంచెం ఆ అమ్మాయి గురించి మాట్లాడుతావా..."

క్రిష్ "రష్.... నేను పెళ్లి అయిన వాడిని మాత్రమే కాదు... చాలా అందమైన మంచి అమ్మాయితో పెళ్లి అయిన వాడిని... తను ఎంత ప్రయత్నించినా... ఫలితం ఉండదు అని తనే తెలుసుకుంటుంది"

అందమైన అనే మాట దగ్గరే రష్ మైండ్ పని చేయడం ఆగిపోయింది. గర్వంగా నవ్వుకుంటూ క్రిష్ వైపు చూసింది.

క్రిష్ "ఇప్పుడు నువ్వు చెప్పూ.... సందీప్ ఎందుకు వస్తున్నాడు..."

రష్ "వాడి బొంద... జిడ్డు గాడిలా వస్తున్నాడు... ఇంట్లోకి ఎందుకు పిలిచానా అనిపిస్తుంది... పెద్ద సోది గాడు... వాగుతానే ఉంటాడు... బయటకు పో రా... అని చెప్పలేను.... అర్ధం చేసుకొని చావడు...." అని మోహం అదోలా పెట్టి చెప్పింది.

క్రిష్ సంతోషంగా నవ్వుకున్నాడు. ఆమె మనసులో తనకు తప్ప వేరే ఎవరికీ ప్లేస్ లేదని సంతోషంగా అనిపించింది.

రష్, క్రిష్ ని హత్తుకొని "నేనంటే నీకు ఇష్టమా...."

క్రిష్ "హుమ్మ్... చాలా ఇష్టం.. మరి నీకూ...."

రష్ "నాకు నాని తర్వాత నువ్వే..."

క్రిష్ "తర్వాత... హుమ్మ్" అంటూ చక్కలిగిలి పెట్టాడు.

రష్ నవ్వేసింది. ఇద్దరూ నవ్వుకుంటూ ఉండే సరికి అక్కడ ఉండే చుట్టూ పక్కల వాళ్ళు అపుడే అక్కడకు వచ్చే సరికి ఇద్దరూ మామూలు అయిపోయారు.

రష్ "నాకు కావాల్సింది డబ్బు కాదు... నువ్వు చూపించే ప్రేమ...." అంది.




ఇదంతా దూరం నుండి చూసిన పూజ కోపంగా పళ్ళు నూరుకుంది.

పూజ "ఓహో... అయితే డబ్బు వద్దా.... హుమ్మ్... ఇప్పుడు నీకు డబ్బు విలువ ఏంటో చూపిస్తా" అనుకుంటూ కోపంగా హాస్పిటల్ డైరక్టర్ దగ్గరకు వెళ్ళింది.

డబ్బులు యిచ్చింది.


పూజ "పేషెంట్ నాని వయస్సు 13 నెలలు..... అతనికి తగ్గాలి అంటే... రెండూ లక్షలు అర్జెంట్ గా కావాలి అని చెప్పండి... అలాగే నటించండి..."

డైరక్టర్ "కాని... ఆ అబ్బాయికి తగ్గిపోయింది కదా మేడం.... రేపు డిశ్చార్జ్ అవుతాడు..."

పూజ "టాగూర్ సినిమా చూడలేదా....." అంది.







డాక్టర్లు, నర్సులు నాని ముందు నిలబడి ఎదో పెద్ద ప్రమాదం కనుక్కున్నట్టు నటించారు. 

డాక్టర్ "తలలో బ్లడ్ క్లాట్ అయింది అర్జెంట్ గా రెండూ రోజుల్లో ట్రీట్ చేయాలి... ఆపరేషన్ ఖర్చు మొత్తం కలిపి రెండూ లక్షలు అవుతుంది.. అది కాక ఇంకా చాలా ఉంది" అని చెబుతాడు.

క్రిష్ మరియు రష్ ఇద్దరూ టెన్షన్ గా ఫీల్ అవుతారు.
[+] 8 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 12-09-2024, 08:43 PM



Users browsing this thread: 23 Guest(s)