11-09-2024, 10:45 PM
31. నా జీవితం క్రిష్ చేతుల్లో 21.0
హాయ్, నా పేరు రష్....
రష్ పార్క్ కి నానిని తీసుకొని వెళ్ళడం కోసం రెడీ అయింది. నానిని తీసుకొని మెట్ల మీద నడుచుకుంటూ వస్తుంది.
క్రిష్ ముందు అందంగా కనపడాలి అని చాలా ప్రయత్నం చేస్తుంది. ఫోన్ లో వీడియోస్ చూస్తూ
పూజ "హాయ్ అక్కా...." అంటూ నవ్వింది.
రష్ కోపంగా చూస్తూ పూజని దాటేసి వెళ్ళిపోయింది.
పూజ తన మొహాన్ని నవ్వు నుండి మాములుగా మారుస్తూ "నువ్వు క్రిష్ కి భార్యవా..... లేక... సందీప్ కి భార్యవా....."
రష్ నడుస్తూ నడుస్తూ ఆగిపోయింది.
పూజ కాన్ఫిడెంట్ గా నడుచుకుంటూ వచ్చి రష్ ముందు నిలబడి "క్రిష్ ని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా వాడుకుంటున్నావ్... నీకు క్రిష్ కి మధ్య ఉన్న సంబంధం పెళ్లి సంబంధం కాదు... అక్రమసంబంధం... మొగుడిని వదిలేసి లేచిపోయిన జంట" అంది.
చుట్టూ చాలా మంది వాళ్ళ సంభాషణ వింటూ గుమికూడారు.
అప్పుడే అక్కడకు వచ్చిన అంకుల్ మరియు ఆంటీ కూడా పూజ మాటలు విన్నారు. అలాగే ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. క్రిష్ మరియు రష్ ల గురించి వాళ్ళు ఇలా ఎప్పుడూ అనుకోలేదు.
రష్ నవ్వుతూ "అవునూ.... నాకు సందీప్ తో పెళ్లి అయింది, పెద్ద రిచ్ ఫ్యామిలీ అని మా నాన్న వాళ్ళు యిచ్చి చేశారు. కాని అతను మగాడు కాదు..... బయటకు చెబితే సూ సైడ్ చేసుకుంటా అని నన్ను బెదిరించి రెండు సంవత్సరాలు ఆపాడు..... మా నాన్న వాళ్ళు కూడా పరువు గురించి ఆలోచించి సందీప్ కే సపోర్ట్ చేశారు. క్రిష్ మా అత్త కొడుకు, చిన్నప్పటి నుండి తెలుసు.... అతనికి చెప్పాను, లేపుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాడు.... మేం హ్యాపీగా ఉన్నాం.... అయితే ఏంటి?" అంది.
పూజ, రష్ అలా రెబల్ గా మాట్లాడుతుంది అని తెలియక బిత్తర పోయింది.
రష్ "సందీప్ గురించి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ కూడా అతన్ని ఇంట్లో కాకుండా అవుట్ హౌస్ లో ఉంచారు....."
పూజ తత్తరపడి మళ్ళి మాట్లాడుతూ "క్రిష్ ఒక స్టూడెంట్.... అందరి స్టూడెంట్స్ లా కాకుండా.... నీ కోసం కష్ట పడి పని చేస్తున్నాడు... ఇదంతా నీ వల్ల...."
రష్ "ఇప్పుడేంటి నీ బాధ.... నా మొగుడు నా కోసం, నా బిడ్డ కోసం కష్ట పడుతూ ఉంటే.... నీ బాధ ఏంటి?"
పూజ "నీ వల్ల చిన్న వయస్సులోనే తండ్రి అయ్యాడు.... లేకపోతే అందరిలా హ్యాపీగా ఉండేవాడు... ఇదంతా నీ వల్ల....."
రష్ "ఒసేయ్ పనికిమాలినదానా... పెళ్ళైన నా మొగుడుకి లైన్ వేస్తూ.... నా మొగుడు ఛీ కొట్టాడు అని.... సిగ్గు లేకుండా నా దగ్గరకు వచ్చి వెధవ వేషాలు వేస్తున్నావ్...." అంటూ ముందు ముందుకు వెళ్ళింది.
పూజ "న... నన్నేం ఛీ కొట్టలేదు.... అసలు నీకు క్రిష్ గురించి ఏం తెలుసు...." అంటూ వెనక్కి అడుగులు వేసింది.
రష్ "అబ్బా.... క్రిష్ నా మేనత్త కొడుకు... చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం.... నాకు తెలియక క్రిష్ గురించి నీకు తెలుస్తుందా.... హా!" అంది.
పూజ "ఏంటి మీద మీదకు వస్తున్నావ్...."
రష్, పూజని చెంప దెబ్బ కొట్టింది.
పూజకి తల చుట్టూ నక్షత్రాలు తిరిగాయి.
రష్ వార్నింగ్ ఇస్తున్నట్టు వేలు చూపించి అక్కడ నుండి నానిని ఎత్తుకొని వెళ్ళిపోయింది.
..... రెస్టారెంట్ .....
హాయ్, నా పేరు క్రిష్....
క్రిష్ ఎదురుగా సందీప్ కూర్చొని ఉన్నాడు.
సందీప్ కాఫీ తాగుతూ ఉంటే, క్రిష్ సైలెంట్ గా కూర్చున్నాడు.
సర్వర్ వచ్చి ఏం కావలి అని అడిగాడు. క్రిష్ ఏమి వద్దు అని సైగ చేశాడు.
సందీప్ నవ్వుతూ "అందరికి ఇక్కడ తాగే అర్హత ఉండదు" అన్నాడు.
క్రిష్ పిడికిలి బిగించి కోపంగా చూస్తున్నాడు.
సందీప్ "ఏంటి? కోపం వచ్చిందా...."
క్రిష్ "నాకు ఒక క్యాపచీనో..." అని ఆర్డర్ యిచ్చాడు.
సందీప్ పొగరుగా నవ్వుతూ "రష్ తాళి బొట్టు అమ్మిన డబ్బులేనా...." అన్నాడు.
క్రిష్ ఏమి అర్ధం కాక అయోమయంగా చూశాడు.
సందీప్ తన జేబు లో నుండి ఒక ప్లాస్టిక్ కవర్ తీసి క్రిష్ ముందు పెట్టాడు.
ఆ కవర్ లో రష్ తాళిబొట్టు, గోల్డ్ చెయిన్ ఉంది, అది రష్ కి తను చేయించింది.
క్రిష్ దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, సందీప్ వైపు తిరగి.... "ఇది నీకు ఎక్కడిది" అని అడిగాడు.
సందీప్ "రష్, దీన్ని తాకట్టు పెట్టింది" అని చెప్పి వెళ్ళిపోయాడు.
క్రిష్ పిచ్చి వాడిలా బయటకు వెళ్లి సందీప్ ని పట్టుకొని ఆపి "ఎందుకు?" అని అడిగాడు.
సందీప్ "నాకేం తెలుసు..." అని క్రిష్ ని విడిపించుకొని వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగాడు.
క్రిష్ టెన్షన్ గా తల దించుకొని ఆలోచిస్తూ ఉన్నాడు.
సందీప్ చిన్నగా నవ్వి "రష్, నాతో ఉంటే.... బాగా చూసుకునే వాడిని... కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకునే వాడిని" అని కారులో వెళ్ళిపోయాడు.
క్రిష్ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. క్యాపచీనో కూడా తాగలేదు.
బయటకు వెళ్లి ఆ గొలుసు తాకట్టు పెట్టిన చోటకు వెళ్ళాడు. తాకట్టు పెట్టింది రష్ కాదు... ఇప్పటి వరకు పూజ వెంట పడ్డ రౌడీలు....
క్రిష్ వాళ్ళను వెతుక్కుంటూ వెళ్లి ఒక్కొక్కళ్ళను కొట్టడంతో వాళ్ళు భయపడి "నీ భార్య వచ్చి నీతో ఇంకో సారి గొడవ పడొద్దు అని చెప్పింది... మేం బదులుగా డబ్బు అడిగితే పిచ్చి గొలుసు వేసుకొని ఇది తీసి యిచ్చింది.... అంతే" అని చెప్పాడు.
క్రిష్ కోపంగా రష్ దగ్గరకు బయలు దేరాడు.
పార్క్ లో అందరూ ఉండగా, సరాసరి రష్ దగ్గరకు వెళ్లి చెంప దెబ్బ కొట్టాడు.
రష్ కి పెదవి చివరన అంచు నుండి రక్తం కూడా వచ్చింది.
అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.
క్రిష్ కోపంగా "నేను పోయా అనుకున్నావా.... తాళిబొట్టు ఇచ్చేశావ్ అంట..." అంటూ అతని చేతిలో ఉన్న కవర్ తీసి రష్ ముందు వేశాడు.
రష్ చెంప మీద చేయి పెట్టుకొని ఏడుస్తూ క్రిష్ వెంట ఇంట్లోకి పరిగెత్తింది.
పూజ "తిక్క కుదిరింది.... లేకపోతే.... నన్నే కొడుతుందా...."
సందీప్ "మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను..."
పూజ "బాధ పడకు... నీకు రష్, నాని ఇద్దరూ దక్కుతారు.... నాకు క్రిష్ దక్కుతాడు"
సందీప్ "థాంక్స్..."
పూజ "అయినా" అని సందీప్ ని కింద మీద చూసి "కరెంట్ లేదు కదా.... ఏం చెసుకుంటావ్ రా..... రష్ ని"
సందీప్ చిన్నగా నవ్వి "నా పక్కన పెట్టుకుంటా..... తనే నా గౌరవం" అన్నాడు.
పూజ తల అడ్డంగా ఊపుతూ "క్రిష్ నువ్వు నాకు కావాలి..." అంది.
ఇంతలో ఫోన్ మోగడంతో ఫోన్ చూసింది "నూతన్" అని కనపడింది.
సందీప్ ని వెళ్ళిపొమ్మని చెప్పి... ఫోన్ ఎత్తి దూరం వెళ్ళింది....
పూజ "హలో మాస్టర్...."
నూతన్ "ఎంత వరకు వచ్చింది...."
పూజ "ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.... అందరి మధ్య క్రిష్, రష్ ని చెంప దెబ్బ కొట్టాడు"
నూతన్ "గుడ్.... వెరీ గుడ్.... ఈ సారి ఇంకా ఎక్కువ మంది ముందు వాడి పరువు పోయేలా చూడు...."
పూజ "ఎందుకు సర్... ఇదంతా... మన వాళ్ళకు చెబితే... వాళ్ళు క్రిష్ ని ఏ కాలుకి ఆ కాలు విరిచేస్తారు కదా...."
నూతన్ చిన్నగా నవ్వి "నువ్వు ఎవరూ? నేను ఎవరూ?"
పూజ "మీరు మాస్టర్, నేను స్లేవ్..... మీరు నన్ను వశీకరణం చేసుకొని ఏదైనా చేసుకుంటారు"
నూతన్ నవ్వి "చంపగలను కూడా.... కేవలం నోటి మాటతో నేను చెంపేయగలను.... కాని క్రిష్ నాకు బ్రతికి ఉండాలి.... జీవితాంతం నరకం అనుభవిస్తూ ఉండాలి"
పూజ "కాని క్రిష్ ఎప్పుడూ.... మీ వెంట భయ్యా భయ్యా ని తిరిగుతూ ఉంటాడు కదా... ఎందుకు మీకు అతని మీద అంత కోపం..."
నూతన్ నవ్వి "బాయ్" అని ఫోన్ కట్టేసాడు.
పూజ, మేఘకి ఫోన్ చేసి "నూతన్ కి క్రిష్ కి మధ్య ఉన్న గొడవ ఏంటి? అని అడిగేసింది"
మేఘ "చూడు ఇలా డైరక్ట్ గా అడగకు మాస్టర్ కి తెలిస్తే ప్రాణం తీస్తాడు"
పూజ "అస్సలు.... ఎందుకు అంత కోపం...."
మేఘ "నాకు కూడా కరక్ట్ గా తెలియదు... క్రిష్ కి నూతన్ పవర్ గురించి తెలియదు...."
పూజ "అదే ఎందుకు.... టార్చర్ చేయాలని అనుకున్నప్పుడు క్రిష్ ని వశీకరణం చేసుకొని ఇష్టం వచ్చి నట్టు చేసుకోవచ్చు కదా.... మధ్యలో నా టైం బొక్క"
మేఘ చిన్నగా నవ్వి "మాస్టర్ ఎంత ప్రయత్నించినా క్రిష్, మాస్టర్ కంట్రోల్ లోకి రాలేదు...."
పూజ "వాట్....."
మేఘ "క్రిష్ కి విల్ పవర్.... మైండ్ స్ట్రెంత్ ఎక్కువ.... అందుకే నూతన్ వశీకరణం చేసుకోలేకపోయాడు"
పూజ "ఆడదాన్ని నలుగురులో కొట్టాడు... అది మైండ్ స్ట్రేంత్ ఆ...."
మేఘ "నువ్వు క్రిష్ ని తక్కువ అంచనా వేస్తున్నావ్... తప్పు అందరూ చేస్తారు... దైర్యంగా సారీ కొందరే చెప్పగలరు..."
పూజ పక్కకు తిరిగే సరికి అదే పార్క్ లో క్రిష్, రష్ ముందు మోకాళ్ళ దండ వేసి సారీ చెబుతున్నాడు. ఆమె చేతులు తీసుకొని తన చెంపకు పెట్టుకొని కొట్టుకుంటూ ఉన్నాడు.
చుట్టూ అందరూ వద్దు క్షమించొద్దు అంటున్నారు. కాని రష్ కూడా మోకాళ్ళ మీద పడి పోయి క్రిష్ ని హాగ్ చేసుకుంది.
ఆ రాత్రి కూడా క్రిష్ రష్ ని హాగ్ చేసుకుని పడుకున్నాడు. ఇద్దరూ గాడ నిద్రలో ఉన్నారు.
ఆ రాత్రి మరో చోట పూజ నిద్ర పట్టక.... అటూ ఇటూ తిరుగుతూ.... ఇక ఈ పిల్ల ఆటలు పనికి రావు.... అయితే క్రిష్ ని రష్ ని పూర్తిగా విడగొట్టాలి.... అప్పుడే నాకు నూతన్ నుండి విముక్తి కలుగుతుంది. అనుకుంటూ సందీప్ కి ఫోన్ కి డయల్ చేసింది.