Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
29. నా జీవితం క్రిష్ చేతుల్లో 19.0





హాయ్, నా పేరు క్రిష్...

క్రిష్ ఇంటికి వచ్చే సరికి డోర్ దగ్గర ఎక్స్ట్రా పెయిర్ చెప్పులు చూసి ఆశ్చర్యంగా ఇంట్లోకి వచ్చాడు.

ఎదురుగా ఉన్న మనిషిని చూడగానే క్రిష్ కి గుండెపోటు వచ్చినట్టు అయింది. అక్కడ ఉన్న కుర్చీలో ఎప్పుడూ క్రిష్ మాత్రమే కూర్చుంటాడు. రష్ కి ఎప్పుడూ చెప్పినా పక్కనే ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చుంటుంది. తను లేనపుడు మాత్రమే కుర్చీలో కూర్చుంటుంది. 

కాని ఇప్పుడు సందీప్ (రష్ యొక్క ఎక్స్ హస్బెండ్....) ఆ కుర్చీలో కూర్చొని నానిని ఎత్తుకొని ఆడిస్తూ ఉండే సరికి క్రిష్ కి అతన్ని కొట్టి ఇంట్లో నుండి బయటకు విసిరేయాలని అనిపించింది.

సందీప్ తనని చూస్తూ నవ్వాడు. క్రిష్ పిడికిలి బిగించి కోపంగా అడుగు ముందుకు వేయగానే, మరో పిడుగు పడ్డట్టు అయింది. రష్ నవ్వుతూ వచ్చి ఒక ప్లేట్ లో స్నాక్స్ తీసుకొని వచ్చి సందీప్ చేతికి యిచ్చింది. 

అలాగే అతని చేతి నుండి నానిని తీసుకోబోయింది. సందీప్ అవసరం లేదు అంటూ నానిని ఇవ్వడం లేదు. నాని కూడా నేను రాను అంటూ సందేప్ ఒళ్లో నుండి రావడం లేదు. 

సందీప్ మరియు రష్ ఇద్దరూ నాని చేష్టలు చూస్తూ నవ్వుతూ ఉన్నారు.

కొత్తగా చూసేవాళ్ళకు వాళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీలాగా తను బయట వాడిలాగా అనిపిస్తుంది. 

ఇంతలో స్నాక్స్ లో ఎదో కారం వచ్చి ఉంది. సందీప్ "స్..." అని అరిచాడు, రష్ కంగారుగా "సారీ" అని చెబుతూ వాటర్ యిచ్చింది. 

క్రిష్ తన మనసులో ముందు రోజు రక్తం కారుతున్న తన వైపు చూస్తూ రష్ కోపంగా అరవడం గుర్తుకు వచ్చింది.

రష్ తనతో ప్రేమగా మాట్లాడిన సంఘటన రీసెంట్ క్షణాలలో ఏమి గుర్తుకు రావడం లేదు. 

సెక్స్..... రీసెంట్ గా తనని సెక్స్ కోసం అడిగితే, కూడా తిట్టింది. 

రష్ నన్ను ద్వేషిస్తుంది.

రష్ నన్ను ప్రేమించడం మానేసింది.



మైండ్ వీక్ గా ఉన్నపుడు వచ్చే ఆలోచనలు అన్నీ ఇన్ఫీరియర్ గానే ఉంటాయి.








హాయ్, నా పేరు రష్...

నాని చంక దిగడం లేదు, ఇంతకు ముందు అయితే, ఆంటీ వాళ్ళ ఇంట్లో వదిలి సరుకుల కోసం వెళ్ళేదాన్ని కానీ అంకుల్ వాళ్ళు లేరు. నాని వేరే ఎవరి దగ్గర ఉండడం లేదు. క్రిష్ కాలేజ్ రెండూ జాబులతో బిజీగా ఉంటున్నాడు. నేను చేసేది కేవలం సరుకులు తెచ్చి వండిపెట్టడం మాత్రమే. నానికి అన్ని వాళ్ళ నాన్న క్రిష్ పోలికలే, వయస్సు రెండూ సంవత్సరాలు అయినా బరువుగా ఉంటున్నాడు. వాడిని ఒక వైపు మోసుకుంటూ మరో వైపు సరుకులు మోసుకుంటూ ఇంటికి వచ్చే సరికి సొంగ పడుతుంది. కొద్ది సేపు ఆగుదాం అంటే, ఎర్రని ఎండలో నడుస్తూ ఉంటే, ఒళ్లంతా ఎర్రగా అయిపొయింది, చమటలు పట్టి చిరాకుగా ఉంది. నానిని తీసుకొని మరో వైపు సరుకుల సంచులు పట్టుకొని నడుచుకుంటూ రోడ్ దాటుతున్నాను. సడన్ గా ఒక కారు వేగంగా వచ్చింది, నా గుండె వేగం పెరిగిపోయింది... నేను, నాని ఇద్దరం.... ఆహ్..., చనిపోతాను అని అనుకునే సమయంలో ఒక వ్యక్తి నన్ను పట్టుకొని వెనక్కి లాగాడు. 

సందీప్ ని ఇంటికి తీసుకొని వచ్చి గౌరవం చేశాను. నా మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే, సందీప్ మరో సారి క్రిష్ జోలికి రాకూడదు అని అనుకోని సందీప్ తో ఉన్న ఈ అనవసరపు శతృత్వాన్ని పెంచుకోకూడదు అని బలంగా అనుకున్నాను.

ఇంతలో క్రిష్ వచ్చాడు, క్రిష్ ఎప్పుడూ ఇంట్లోకి వచ్చినా బాత్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫ్రెష్ అప్ అయి వచ్చి నానిని దగ్గరకు తీసుకొని వెళ్తాడు. ఇద్దరూ కాసేపు ఆడుకుంటారు. కానీ క్రిష్ మొహం పాలి పోయింది. నాకు అర్ధం ఆయింది. సందీప్ ని చూసి క్రిష్ ఎందుకు జలసీ ఫీల్ అవుతున్నాడో నాకు అర్ధం కావడం లేదు. సందీప్ కి అమ్మాయిలు కాదు అబ్బాయిలు అంటే ఇష్టం అనే సంగతి తెలుసు కదా.... తెలియదా....






హాయ్, నా పేరు క్రిష్...


సందీప్ బయటకు వెళ్తూ వెళ్తూ "నేనయితే, నా పెళ్ళాం పిల్లలను ఇంత కష్ట పెట్టను...." అని "హుఫ్" అన్నట్టు వెక్కిరింపుగా నవ్వి వెళ్ళిపోయాడు.

నాకు ఒళ్లంతా తేళ్ళు జెర్రులు పాకినట్టు అనిపించింది.






హాయ్, నా పేరు రష్...

క్రిష్ బయటకు వెళ్లి ఇంకా రాలేదు. రాత్రి ఎప్పటికో వచ్చాడు. తాగి ఉన్నాడు. అరిచేశాను. ఎప్పటిలా తిరగపడకుండా సైలెంట్ గా వెళ్లి రెడీ అయి వచ్చి పడుకున్నాడు.

రష్ "ఏమయింది? మాట్లాడు...."

క్రిష్ "ఇక నుండి మనం పెద్ద వాళ్ళు లాగా ఉందాం.... పోట్లాడుకోకుండా...." అన్నాడు.

రష్ మనసులో "మేమిద్దరం పెద్దగా మాట్లాడుకుంటాం అంతే, అవి నా దృష్టిలో అరుచుకోవడం, పోట్లాడుకోవడం అసలు కాదు"

క్రిష్ కళ్ళలో చూస్తే "సందీప్ నైస్ గా ఉంటాడు..... నేను రఫ్ గా ఉంటాను..... రష్ కి నైస్ గా ఉండడం ఇష్టమేమో... నన్ను నేను మార్చుకోవాలి" అనుకుంటూ వెనక్కి తిరిగి పడుకున్నాడు.

నేను షాక్ అయ్యాను, నైస్... రఫ్... అలా అని ఏమి లేదు. క్రిష్ నాతొ ఎప్పుడూ అంత రఫ్ గా లేడు. ఎప్పుడూ కూడా నాతో ప్రేమగానే ఉండే వాడు.

చిన్నగా నవ్వుకుంటూ క్రిష్ ని నా వైపుకి లాగాను. రావడం లేదు. మళ్ళి మళ్ళిలాగానే, నా చేయి విదిలించాడు. నాని ఇప్పుడే నిద్ర పోయాడు, గట్టిగా సౌండ్ చేస్తే నాని నిద్ర లేస్తాడేమో అని లాగుతూ ఉంటే క్రిష్ ఇంకా ఇంకా ఎక్కువ చేస్తున్నాడు.

పిడికిలి బిగించి వీపు మీద గుద్దాను. అబ్బా అనుకుంటూ వెనక్కి తిరిగాడు, క్రిష్ కూడా నాని కోసం సౌండ్ చేయకుండా నా వైపు తిరిగి సైగలతోనే పోట్లాడుతున్నాడు. పైగా పళ్ళు నూరుకుంటూ ఉన్నాడు. 

నిజంగా..... నిజంగా..... చాలా ముద్దోస్తున్నాడు.

నాకు క్రిష్ సైగలు చూసి నవ్వొచ్చింది అయినా నవ్వితే ఇంకా కోపం వస్తుంది అని క్రిష్ ని దగ్గరకు లాక్కొని అతని చేతి మీద చేయి తల పెట్టి మరో చేతిని నా మీద వేసుకొని అతని కౌగిలిలో ఒదిగిపోయాను. 

క్రిష్ నా చెవి దగ్గరకు వచ్చి "రాక్షసి" అన్నాడు.

నాకు కోపం రాలేదు, నవ్వొచ్చింది. అది కోపంలోనో, సరదాగానో వచ్చిన నవ్వు కాదు. సంతోషంగా వచ్చిన నవ్వు... క్రిష్ నేను ఏడూ ఎదుగులు వేయక పోయినా మేం వేసే ప్రతి అడుగు మమ్మల్ని దగ్గరకు చేరుస్తూనే ఉంది. ఈ 'రాక్షసి' అనే పదం కూడా మమ్మల్ని దగ్గర చేస్తుంది.





హాయ్, నా పేరు క్రిష్...
సందీప్ అన్న మాటలు నా చెవిలో మళ్ళి మళ్ళి వినపడుతున్నాయి. రష్ వైపు చూశాను, ఇంతకు ముందు చాలా సున్నితంగా ఉండేది. కాని ఇప్పుడు ఎండకు ఎండి బ్యూటి పార్లర్ లకు వెళ్ళక బాగా పాడయిపోయింది. ప్చ్... తనని పెళ్లి చేసుకొని తప్పు చేశానా! అనుకుంటూ గట్టిగా హత్తుకున్నాను.





హాయ్, నా పేరు రష్...

ఎంత కష్ట పడ్డా, అలిసిపోయి సలిసిపోయి ఇలా నా మనిషి కౌగిలిలో నిద్రపోతే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఇదే కదా స్వర్గం అంటే..... క్రిష్ కౌగిలి బిగించగానే, చాలా సెక్యూర్ గా అనిపించింది. 

ఐ లవ్ యు క్రిష్.... ఐ లవ్ యు .... అలానే నిద్రలోకి జారిపోయాను





హాయ్, నా పేరు క్రిష్ ...

రష్ నాతో ఉండడం వల్ల నరకం అనుభవిస్తుంది. తను నన్ను ద్వేషిస్తుందా?

























[Image: Whats-App-Image-2022-10-01-at-17-52-41.jpg]
[+] 9 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 11-09-2024, 12:29 PM



Users browsing this thread: 36 Guest(s)