Thread Rating:
  • 51 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నవ రాత్రులు #Dasara (completed)
#48
-12-


వైజాగ్ చేరుకున్న కార్తీక్ కి మహా లక్ష్మి ఉదంతం తెలిసేక కోపంతో చిన్నా తో .. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అని అడిగితే

కార్తీక్ కి రెడ్ కర్చీఫ్ ఇస్తూ "బావా నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదని అక్క తెప్పిచ్చి నీకివ్వమంది " , అని కూల్ గా సమాధానం చెప్పేసరికి ఇంకాస్త మండింది వాడికి .. ఓపెన్ చేసి చూస్తే .. సేమ్ .. పసుపు , కుంకుమ , నిమ్మకాయ , జుట్టు ..

"చిన్నా .. చెప్పు .. ఇదంతా చేపిస్తుంది దేవి కదా "

"బావా .. అక్క చాలా మంచిది .. చచ్చినోళ్ళు ఎందుకు చచ్చారో కనుక్కుంటే క్లూ దొరుకుద్ది "

"చిన్నా .. రేప్ చేసిన వాళ్ళకి ఎం శిక్ష వేయాలో ఆ చట్టం చూసుకుంటుంది "

"నిజమే .. మాకు అక్క చెప్పిందే చట్టం "

"అంటే ?"

"బావా .. నువ్వు కూడా అందరిలా ఆ చచ్చినోళ్ల మీదనే సానుభూతి చూపిస్తున్నావు .. ఒక్కసారి రేప్ చేసే వాళ్ళ మీద ఫోకస్ పెట్టు .. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఉంటె అందరూ ఉచ్చపోసుకుంటారు "

"చిన్నా .. నువ్వు కూడా దేవి లా మాట్లాడుతున్నావ్ .. "

"బావా .. మంచోళ్ళు కళ్ళు మూసుకుంటే .. చెడ్డోళ్లు విలయతాండవం చేస్తారు .. కానీ ఆ విలయతాండవాన్ని ఆపేదానికే ఈ నెట్వర్క్ "

"అంటే ?"

"అవును బావా .. నెట్వర్క్ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి "

"ఎవరు నడిపిస్తున్నారు ఈ నెట్వర్క్ ని "

"తెలిసీ అడుగుతున్నావా బావా "

"చిన్నా .. అక్కే కాదు నిన్ను కూడా బొక్కలో వేయాల్సివస్తుంది "

"బావా .. ఎప్పటికైనా జైలు జీవితం తప్పదు .. కానీ .. మర్డర్ చేసి జైలుకు వెళ్ళేవాళ్ళకన్నా .. రేప్ చేసి వెళ్ళేవాళ్ళకన్నా .. తప్పుని సరిజేసే క్రమమంలో జైలు కి వెళ్లినా ఇబ్బంది లేదు .. ఎక్కడ పుట్టానో నాకే తెలియదు .. కానీ ఇప్పుడు నాతో వేలమంది సైన్యం ఉంది .. నెట్వర్క్ ఉంది "

"చిన్నా .. నీలో నేర ప్రవుత్తి ఉంది అని అనడం లేదు .. కానీ నేరం చేస్తున్నావ్ "

"బావా .. టైం వేస్ట్ చేయకుండా .. వైజాగ్ లోనే చనిపోయిన విజయ్ ఇంటికెళ్దాం పదా .. "

అరగంటలో సరితా ఇంటి ముందు ఉంటారు

కార్తీక్ లోపలికెళ్ళి విచారించి వచ్చేలోగా .. బయటకొస్తే .. మీడియా కెమెరా .. లైవ్

"సర్ .. ఈ వరస హత్యలు ఎవరు చేస్తున్నారో తెలిసిందా "

"ప్లీజ్ .. నో కామెంట్ "

"ఈ కేసు మీద సెంట్రల్ గవర్నమెంట్ అప్పోయింట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ మీరు .. ఇప్పటికి 7 రోజుల .. రోజు రోజుకి పెరుగుతుంది కౌంట్ "

"ప్లీజ్ .. నేనే ప్రెస్ మీట్ పెడతా "

"అప్పటిదాకా మిగిలిన హత్యల్ని ఆపగలరా "

కార్తీక్ కి మండి .. "కెమెరా ఆఫ్ చెయ్ .. నిజం చెబుతా " , అని అంటే .. లైవ్ కెమెరా ఆఫ్ .. కానీ ఆ మీడియా కి హింట్ ఇచ్చి పిలిపించిన చిన్నా జేబు లోంచి పెన్ కెమెరా ఆన్ చేస్తాడు

"సరే .. బాధ్యత మాకేనా .. మీడియాకు లేదా ?"

"మధ్యలో మేమేం చేసాం సార్ "

"చచ్చినోళ్ల మీద ఫోకస్ పెట్టి .. డిబేట్స్ పెడుతున్నారు .. కానీ చచ్చిన వాళ్ళింట్లో ఇంకో మరణం కూడా సంభవిస్తుంది .. అయినా మీరు వాటిని పట్టించుకోరు "

"మా దృష్టికి వస్తే తప్పకుండా .. "

"రేప్ చేసినోళ్లని చంపుతున్నారు .. చచ్చిన ప్రతివాడు రేప్ చేసినోడే .. చట్టం శిక్షించే లోగ వాళ్లే శిక్షిస్తున్నారు "

"వాళ్ళు అంటే ?"

"నెట్వర్క్ మనుషులు "

"ఎవరు నడిపిస్తున్నారు ఆ నెట్వర్క్ "

"ఆ పని మీదే ఉన్నా .. ఇక నన్ను వదలండి .. నాకు చాల పనులున్నాయి "

... ... ...


అన్ని టీవీ ల్లో బ్రేకింగ్ న్యూస్ .. రేపిస్టులని చంపేదానికే ఆ వరస హత్యలు .. వీటి వెనక పెద్ద నెట్వర్క్ ఉంది ..

రాజకీయ నాయకులు ఇదే ఛాన్స్ అని ఒకరి మీద ఇంకోరు దుమ్మేస్థి పోతున్నారు

మహిళా సంఘాలు ధర్నాలు చేస్తున్నాయ్ .. రేపిస్టులకి ఇలాంటి శిక్షలే పడాలని .. సెక్యూరిటీ ఆఫీసర్లు అడ్డుకోకూడదని డిమాండ్ .. అలాగే రేప్ కి గురైన కుటుంబాలని ఎక్విరీ పేరుతో టార్చెర్ పెట్టకూడదని డిమాండ్

... ... ...

సాయంత్రానికి ఢిల్లీ నుంచి ఫోన్ కార్తీక్ కి

"కార్తీక్ .. ఇలాంటి వాటిని పబ్లిక్ కి తెలిసేలా చేస్తున్న మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం "

"సర్ .. నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు .. కానీ ఆ నెట్వర్క్ వెనక ఉన్న వాళ్ళని పట్టుకోవాలి "

"ఆ పని నీది కాదు .. నీ ప్లేస్ లో ఇంకో ఆఫీసర్ ని నియమిస్తున్నాం .. యు ఆర్ సస్పెండెడ్ "

.... ... ....

"సారీ బావా .. ఇదంతా నా వల్లే "

"నువ్వేం చేస్తావ్ .. అక్క ఏది చెబితే అది చేయడమేగా నీ పని .. దేవిని కలవాలి అర్జెంట్ గా "

నైట్ ఫ్లైట్ కి విజయవాడ కి చేరుకుంటాడు .. ఎయిర్పోర్ట్ కి వచ్చింది దేవి .. ప్రోటోకాల్ ప్రకారం కాదు .. ప్రేమించిన ఆడదానిగా ..

"థాంక్స్ దేవి .. నిన్ను కలవాలనే అర్జెంట్ గా వచ్చా .. హోటల్ బుక్ చేసావా "

"ఒరేయ్ .. ఇన్నాళ్లు మనకి గవర్నమెంట్ డబ్బులతో హోటల్ బుక్ చేసేవాళ్ళు .. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎంప్లాయిస్ కాముగా "

"నేనంటే ఓకే .. మరి నీకేమైంది ?"

"నెట్వర్క్ అనే పదం పాపులర్ అయింది కదా ... ఇలాంటివి ఇంటలిజెన్స్ ఆపరేషన్స్ లో మాములే .. వాళ్ళిచ్చిన ఫండింగ్ తోనే నెట్వర్క్ నడిపా ఇన్నాళ్లు .. టెర్రరిస్ట్ ల కదలికలు .. అసాంఘిక శక్తుల కదలిక లు .. కనిపెట్టే నెట్వర్క్ .. ప్రతి చోటా మా వాళ్ళు .. చదువుకుంటున్న అమ్మాయలు .. నెలకి 10 వేలు .. మేము చెప్పింది చేయడమే వాళ్ళ పని "

"అంటే .. ఈ రేపిస్టులని చంపుతుంది కూడా మీ నెట్వర్క్ మనుషులేనా "

"కాదు "
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

Like Reply


Messages In This Thread
RE: నవ రాత్రులు #Dasara - by opendoor - 10-09-2024, 05:52 PM



Users browsing this thread: 9 Guest(s)