10-09-2024, 06:39 PM
28. నా జీవితం క్రిష్ చేతుల్లో 18.0
హాయ్, నా పేరు రష్....
ఒకబ్బాయి(10yrs) "అక్కా...." అని పెద్దగా అరుస్తూ రష్ దగ్గరకు వచ్చాడు.
రష్ ఆ అబ్బాయి తల మీద జుట్టు చేరుపుతూ "ఏమయింది? అమ్మా..." అని ప్రేమగా పలకరించింది.
పార్క్ లో కూర్చొని రావడం అలవాటు కావడంతో అక్కడ ఉండే చిన్న పిల్లలు తనకు బాగా అలవాటు పడ్డారు.
ఆ అబ్బాయి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ "అక్కా, క్రిష్ బావా.... హాస్పిటల్ లో ఉన్నాడు... చాలా దెబ్బలు తగిలి రక్తం కూడా వస్తుంది" అని చెప్పాడు.
రష్ కాళ్ళు వణుకుడు వచ్చినట్టు అనిపించింది. కంగారుగా "ఏ..... యే..... ఏ హాస్పిటల్?" అని అడిగింది.
అప్పటి వరకు సరదాగా సంతోషంగా ఉన్న తన జీవితం, ఒక్క నిముషంలోనే కూలిపోయింది. క్రిష్ కి ఏమయిందో అనుకుంటూ కంగారుగా ఆ అబ్బాయి చెప్పిన హాస్పిటల్ కి నానిని తీసుకుని వెళ్ళిపోయింది.
వెళ్తూ ఉన్నంత సేపు చమటలు పట్టేశాయి. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, క్రిష్ ని చూసే వరకు తన గుండె తిరిగి మామూలు అయ్యేలా లేదు.
నానిని తీసుకొని వెళ్తూ మధ్యమధ్యలో చాలా సార్లు ఆగింది తనకు బలం అంతా కరిగిపోయినట్టు అనిపిస్తుంది.
హాస్పిటల్ దగ్గరకు రాగానే, క్రిష్ కాలేజ్ డ్రెస్ లో ఉన్నాడు. తలకు, చేతులకు కట్టు కట్టి ఉంది, మొహం అంతా పీక్కు పోయి ఉంది అయినా మొహంలో నొప్పి కనపడకుండా నవ్వుతూ ఉన్నాడు.
క్రిష్ కళ్ళలోకి చూడగానే క్రిష్ మనసులో అన్న మాటలు వినపడుతున్నాయి "అబ్బా తల దిమ్ముగా ఉంది, రష్ కి తెలియకుండా దాచాలి... ఎలా అబ్బా...."
రష్ కి బాధ, అలుపు, క్రిష్ మాటలు వింటూ ఉంటే, కోపం వచ్చేసింది.
క్రిష్ చుట్టూ చూడగానే దూరంగా తననే చూస్తున్న రష్ ని చూడగానే పరుగున తన దగ్గరకు వెళ్ళాడు.
రష్ ని చూస్తూ ఉంటే, నానిని మోయలేను అన్నట్టు ఉంది, రొప్పుతూ ఉంది.
క్రిష్ నానిని చేతిలోకి తీసుకొని రష్ ని కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఓపెన్ చేసి యిచ్చాడు.
రష్, రొప్పుతూ వాటర్ తాగేసరికి దగ్గు వచ్చింది. క్రిష్ "చిన్నగా..... చిన్నగా..... " అంటూ, రష్ వీపు నిమురుతూ ఓదారుస్తున్నాడు.
ఇంతలో కొంత మంది క్రిష్ కాలేజ్ ఫ్రెండ్స్ కొందరు వచ్చి "ఎవరూ?" అని అడిగారు.
రష్ మనసులో "కాలేజ్ లో చదువుతున్నాడు కదా... తన గురించి దాచాలి" అని ఆలోచించి "నేను" అంటూ ఎదో చెప్పబోయింది.
క్రిష్ మాత్రం రష్ భుజం చుట్టూ చేయి వేసి "నా వైఫ్ రష్, వీడు నా కొడుకు నాని" అని చెప్పాడు.
అందరూ ఆశ్చర్యంగా క్రిష్ ని చూస్తూ ఉన్నారు. రష్, క్రిష్ చొక్కా కిందకు లాగుతూ చెవి దగ్గర "అలా చెప్పావు ఏంటి? అందరూ చూడు ఎలా చూస్తున్నారో..." అంది.
క్రిష్ నవ్వేసి రష్ భుజం చుట్టూ చేయి వేసి "నా వైఫ్ కి సిగ్గు ఎక్కువ..." అన్నాడు.
అందరూ రష్ ని పలకరించి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
క్రిష్ నవ్వుతూ రష్ ని నానిని తీసుకొని ఇంటికి వచ్చాడు.
దారి పొడవునా రష్ ని సిగ్గరి అని, నలుగురులో మాట్లాడదు అని అంటూ వచ్చాడు. మనసులో మాత్రం "హమ్మయ్యా గొడవ గురించి మాట్లాడలేదు, మ్యాటర్ బాగా డైవర్ట్ చేస్తున్నా" అనుకున్నాడు.
రష్ క్రిష్ చెప్పేది పట్టించుకోకుండా, అతని కళ్ళలోకి చూస్తూ అతని మనసులో ఉన్న మాటలు వింటుంది.
క్రిష్ కాలేజ్ నుండి వస్తూ ఉండగా... అక్కడ కొంత మంది అప్పుడే అక్కడకు వచ్చిన పూజని చూసి ఏడిపిస్తూ ఉండగా, క్రిష్ మరియు కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి ఆ ఏడిపించే వాళ్ళను కొట్టాడు. ఆ అయిన గొడవలో అయిన దెబ్బలే ఇవి....
రష్ ఇంటికి వచ్చాక క్రిష్ ని కూర్చోబెట్టి నడుము మీద చేతులు పెట్టుకొని "చెప్పూ" అంది.
క్రిష్ నవ్వుతూ "ఏంటి?" అన్నాడు.
రష్ సూటిగా తననే చూస్తూ ఉండేసరికి క్రిష్ కి చెప్పక తప్పలేదు.
రష్ కోపం తెచ్చుకుంటుంది అని అనుకున్నాడు. కాని రష్ ఏం మాట్లాడకుండా మాములుగా ఉండే సరికి క్రిష్ రష్ వెంట తిరుగుతూ సారీ చెప్పాడు.
రష్, క్రిష్ ని పట్టుకొని ఏడుస్తూ "నువ్వేమి అందరిలా కాలేజ్ అబ్బాయివి కాదు, ఒక బిడ్డకి తండ్రివి దానికి తగ్గట్టు ఉండు..." అంది.
క్రిష్, రష్ ని ఓదారుస్తూ ఉంటే....
రష్ "నీకు కాని నానికి కానీ ఏదైనా అయితే నేను బ్రతకలేను..... నీ వంటి మీద రక్తం చూడగానే నా ప్రాణం పోయినట్టు అనిపించింది" అంటూ ఏడుస్తూనే ఉంది.
క్రిష్, రష్ ని ఓదారుస్తూ ఉండిపోయాడు.
మరుసటి రోజు.....
పూజ "సారీ అండి.... నా వల్ల మీరూ...." అంటూ కన్సర్న్ గా అడిగింది.
క్రిష్ "పర్లేదు లేండి...."
పూజ "మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి"
క్రిష్ "చెప్పండి...."
పూజ "ఆ రౌడీలు.... మిమ్మల్ని నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నారు..."
క్రిష్ నవ్వేసి "నాకు పెళ్లి అయి, బాబు కూడా ఉన్నాడు... నాకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఏంటి?" అన్నాడు
పూజ "సారీ..... కాని, అందుకనే మీ వెంట పడబోతున్నారు... మీరు జాగ్రత్త..." అని చెప్పి వెళ్ళిపోయింది.
క్రిష్ మొత్తం విషయం అక్కడ ఏరియా ఇన్స్పెక్టర్ కేశవ్ కి చెప్పి ఇంటికి వచ్చాడు.
వారం రోజుల తర్వాత క్రిష్ ని రష్ మళ్ళి హాస్పిటల్ లో చూసింది. ఇప్పుడు ఆమె మోహంలో కంగారు లేదు.
రష్, క్రిష్ ని చూస్తూ "నీకు అసలు బాద్యత ఉందా.... ఎందుకు గొడవలకు వెళ్తున్నావ్..... " అని అరిచేసింది.
క్రిష్ "సారీ" అని ఒకటికి పది సార్లు చెబుతూనే ఉన్నాడు.
రష్ "ఇప్పటికి వారం లో ఇది నాలుగో సారీ..." అంది.
క్రిష్ "సారీ" అని ఒకటికి పది సార్లు చెబుతూనే ఉన్నాడు.
రష్, నానిని తీసుకొని కోపంగా ఇంటికి ఒక్కత్తే వెళ్ళిపోయింది, క్రిష్ డాక్టర్ ని కలిసి వెళ్ళాడు.
దారిలో పూజ కనపడి "సారీ" చెప్పింది, పర్లేదు అని చెప్పి క్రిష్ ఇంటికి నడిచాడు.
రష్ క్రిష్ ఫోన్ లో పూజ మెసేజెస్ చూసింది. క్రిష్ తప్పు చేయడు అనిపిస్తున్నా మనసులో ఎక్కడో ఎదో తెలియని బాధ కప్పేస్తుంది.
![[Image: d4f721734565e2b5687a165ad6e499bf.jpg]](https://i.ibb.co/Yk7nRpH/d4f721734565e2b5687a165ad6e499bf.jpg)
ఒక సారి బాధ, ఒకటికి పది సార్లు తగిలితే అది బాధ కాదు చిరాకు..... ఇది హ్యూమన్ నైజం....