06-09-2024, 10:25 PM
ఇది నాకు over గా, odd గా అనిపించింది అందుకే update లో పెట్టలేదు. Just మీకు చూపిద్దాం అని ఇప్పుడు post చేస్తున్న.
Blooper:-
భరత్ ఇంట్లో,
టోర్నమెంట్ కోసం ఫీస్ కడతాడు అనే ఆనందంలో చెంగులేస్తూ ఇంట్లోకి అడుగుపెట్టి సుశీల ఇంటి వెనక ఉందని బుర్రున వెనక్కి పరిగెత్తి విషయం చెప్పాలనుకున్నాడు. వెనక సుశీల ట్యాంకులో నీళ్లు నింపడానికి బోరింగ్ కి పైపు బిగిస్తూ ఉంది. అది చూసి తను ముందుకు వెళ్లి అందుకొని తను పెడతాను అంటూ తీసుకున్నాడు.
అది బిగించాక సుశీల మోటార్ స్విచ్ వేసింది.
భరత్: అమ్మా నీకోటి చెప్పాలే?
సుశీల: చెప్పు ఏంటో?
భరత్: అదీ గీత టీచర్ ఇరవై వేలు ఇచ్చింది.... అని చెపుతూ గీత ఇచ్చిన డబ్బు జేబులోంచి తీసి చూపించాడు.
అది చూసి సుశీల ఆశ్చర్యపోయింది. దగ్గరకి వచ్చి కంగారుగా భుజాలు పట్టుకుంది.
సుశీల: ఇస్తే ఇలా తీసుకొని వస్తావా, మనకేం వద్దు ఇచ్చిరాపో
భరత్: అమ్మా అలా కాదే, నేను వద్దన్నా మిస్ ఇచ్చింది.
సుశీల: వద్దు అన్నానా, ఇచ్చిరాపో మనకేం అవసరం లేదు వాళ్ళ డబ్బులు.
భరత్: అమ్మ ప్లీస్ ఏ, నేను టోర్నమెంట్ ఆడుతానే, అప్పుడు గెలిస్తే ప్రైజ్ మనీ వస్తాయి.
సుశీల: నువు ఆడకపోయినా ఏం కాదు, మంచిగా చదువుకుంటే చాలు పో ఇచ్చిరాపో..... అంటూ కోపంగా చూసింది.
భరత్: లేదమ్మా, నేను ఆడుతా. టీచర్ పైసలు ఇచ్చింది కదా ఇంకేంది... అని బెట్టు చేశాడు.
సుశీల: వద్దని చెప్పినా కదా, అసలు ఎందుకు ఇచ్చింది నీకు. నువు అసలు నాకు చెప్పకుండా ఎందుకు ఇవాళ టీచర్ దగ్గరకి పోయినవు. ఆవిడ డబ్బులు మనకొద్దు పో.
భరత్: ఏం కాదు అమ్మ. మీరు ఇవ్వరు నాకు. టీచర్ ఇస్తుంది.
సుశీల: మేము ఇవ్వకపోతే టీచర్ దగ్గర తీసుకుంటావా, నిన్ను మంచి కాలేజ్ లో చదివిచడమే కష్టం మనకు. ఇప్పుడు కాలేజీ కూడా ఫీస్ కావాలి. అందుకే నీకు ఇవ్వను అన్నాడు నాన్న. ఈసారి కాకపోతే వచ్చే సంవత్సరం ఇస్తాం. నువు ముందు గీతకి డబ్బులు వాపస్ ఇచ్చి వద్దని చెప్పి ఇంటికిరా.
భరత్: ప్లీస్ అమ్మా ఈసారి ఆడుతానే. ఎగ్జామ్స్ కూడా ఐపోయినాయి. ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి చెప్పు, అదే అక్కడికి పోతే ప్రాక్టీస్ చెయ్యొచ్చు. ప్రైజ్ మనీ యాభై వేలు అమ్మ. నేను మంచిగా ఆడుతా, కావాలంటే మా కాలేజ్ వాళ్ళని అడుగు.
కొడుకుని దగ్గరకి తీసుకొని కౌగిలించుకుంది.
సుశీల: అది కాదు నాన్న, టీచర్ జాలి పడి ఇస్తుంది నీకు, నువు ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదు. చిన్నోడివి కాదు ఇలా వేరేవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అలవాటు ఐతే అప్పులు చేయడం అలవాటు అవుతుంది. నువు ఏదో దేశం పోతా అన్నావు ఏంటి అది?
భరత్: కెనడా
సుశీల: అదే ఎక్కువ, మళ్ళీ ఇప్పుడు ఇరవై వేలు ఎందుకు చెప్పు. ఆగు టీచర్ తో నేను మాట్లాడుతా నా ఫోన్ తేపో.
భరత్: అబ్బా అమ్మా, ఎందుకే, అలా అంటే టీచర్ బాధ పడతది. నేను వద్దన్నా ఒప్పించి ఇచ్చిందే.
ఇంట్లోకి వెళుతూ, సుశీల: నువు ఇక్కడే ఉండు, నేను మాట్లాడుతాను.
భరత్ అక్కడే ఉండిపోయాడు.
సుశీల లోపలికి వచ్చి, ఫోన్ తీసి గీతకి కలిపింది.
గీత: హెల్లో ఆంటీ భరత్ కి డబ్బులు ఇచ్చాను చెప్పానా మీకు, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను.
సుశీల: గీత నేను నీకు ఏం చెప్పాను మొన్న?
గీత: ఆంటీ ఆరోజు పెయింటింగ్ అంత బాగా వేసినందుకు ఏదో దోస్త్ లా వాడికి ముద్దు పెట్టిన అంతే, అన్నీ తప్పుగా చూడకండి.
సుశీల: అది కాదు గీత, మా వైపు నుంచి నువు ఆలోచించావా?
గీత: ఆంటీ నేను మీకు ఆరోజే చెప్పాను, కెనడా కూడా వద్దన్నారు మీరు. నేను ఏం చెప్పాను. భరత్ నాకు ఒక ఫ్రెండ్ లా ఒకేనా, వాడికి ఈ టోర్నమెంట్ అంటే ఇష్టం. ఇంట్లో అమ్మా వాళ్ళు ఇవ్వలేదు అని ఏడ్చాడు తెలుసా. అయినా నేను ఇస్తే తెప్పేంటి ఆంటీ. స్టూడెంట్ కి హెల్ప్ చేస్తున్నా అనుకుంటా అంతే.
సుశీల:.....
గీత: ఆంటీ భరత్ ని మంచిగా ఆడుకొనివ్వండి. ఇప్పుడు పోతే కాలేజీ స్టార్ట్ అయ్యాక ఎక్కువ చదువు మీద పడి ఇలాంటి ఆటలు ఆడే అవకాశమే ఉండదు వాడికి.
సుశీల: హ్మ్...
గీత: చదువుతున్నాడు, ఇవాళ నాతో వచ్చాక, ఎగ్జామ్స్ బాగా రాశాను అని చెప్పాడు. నాకెంత మంచిగా అనిపించిందో తెలుసా. వాడు సంతోషంలో ఉన్నాడు, ఇప్పుడు ఇది వద్దని మనసు కరాబ్ చెయ్యకండి. మీ కొడుకు మీ ఇష్టం ఆంటీ, మంచి మార్కులు రావడం, ఆ ఆటలో గెలవడం, వాడేంత హ్యాపి అవుతాడో ఆలోచించండి.
గీత ఫోన్ పెట్టేసింది.
=======
======