03-09-2024, 11:32 PM
Episode 1(A)
అమెరికా లోని ప్రముఖ డల్లాస్ పురం, మూడో వీధి జోసెఫ్ మిఠాయి కొట్టు దాటితే కుడివైపున నాలుగో ఇల్లు.
చాలా విశాలంగా ఉంది చుట్టూ కాళీ స్థలం మధ్యలో ఇల్లు కట్టుకున్నారు, ఇది కూడా ఇప్పుడు అమ్మేసారు ఎందుకంటే ట్రంపు గెలిచాడు, మనోళ్ళని దొబ్బెయమన్నాడు. ఇంక చేసేదేముంది తట్టా బుట్టా సర్దుకోవడమే లోపల అదే జరుగుతుంది.
ఇండియా వెళ్లడం నాకు ఇష్టం లేదే అని బాధతొ చెప్పింది నిధి. కూతురు మాటలు విని సురేఖ నవ్వుతుంటే పక్కనే ఉన్న సురేఖ చెల్లలు గౌరి ఊరుకో అక్కా నువ్వు మరీను పాపం పిల్లలు వాళ్లకేం తెలుసు. ఇండియా బాగుంటుంది నిధి నేను చెపుతా కదా అని తీసుకెళ్ళింది.
అంతా సర్దుకుని తెల్లారి ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటి పెద్ద కోడలు సురేఖ మొగుడు సుభాష్ తో మాట్లాడుతుంది. మీరు చేసేది నాకు నచ్చలేదు అండి, వాడిని మోసం చేస్తున్నారు. ఎవరినీ అన్నాడు సుభాష్
మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉన్నామంటే వాడు అక్కడ గొడ్డులా కష్టపడ్డాడు కాబట్టే కాదంటారా, ఇన్నేళ్లు మన వ్యాపారాలు చూసుకున్నాడు. ఇప్పుడు వాడిని వెళ్లిపొమ్మనటం న్యాయమా, బైటవాళ్ళైతే అనుకోవచ్చు. వాడు మీ మేనల్లుడు. మీ సొంత చెల్లెలి కొడుకు. మొగుడికి నచ్చజెప్పడానికి ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తుంది సురేఖ.
ఏం చేస్తున్నానో నాకు తెలుసు నువ్వు నోరు మూసుకో, నువ్వు చెప్పేది ఎలా ఉందొ తెలుసా అన్నీ వాడికి రాసిచ్చి నేను నా కొడుకు వాడి ముందు అడుక్కు తినాలా
అలా కాదండి, ఉన్నదాంట్లో వాడికి ఓ వాటా ఇవ్వండి. ఇది న్యాయమే కదా
సుభాష్ కోపంగా చూసేసరికి సురేఖ భయపడింది. నువ్వు ఇంకో సారి ఈ విషయాల్లో దూరావు అనుకో చెప్పు తీసుకుని కొడతా, పెట్టింది తిని బుద్దిగా ఉండటమే నీకు మంచిది. అర్ధమైందా అని కోప్పడితే కన్నీళ్లు పెట్టుకుంది సురేఖ.
ఇంకో గదిలొ చిన్న కోడలు గౌరి తన మొగుడు ధీరజ్ తొ కూడా ఇదే విషయంపై మాట్లాడుతుంది.
మీరంటే గౌరవం పోయింది నాకు, వాడు మనకోసం ఎంత చేసాడు. మన వ్యాపారాల కోసం వాడి చదువు కూడా ఆగిపోయింది. ఉన్నపళంగా అన్నీ లాగేసుకుంటే వాడెలా బతుకుతాడు అన్న ఆలోచన కూడా లేదు మీ అన్నాతమ్ముళ్ళకి. సరే వాడు గురించి వదిలెయ్యండి కనీసం మీ చెల్లెలయినా గుర్తుందా, వాడికి అన్యాయం చేసి ఏం మొహం పెట్టుకుని మీ చెల్లితొ మాట్లాడతారు. వాడికి అన్యాయం చేసి మీరు బాగుపడతారనే అనుకుంటున్నారా. గౌరి అడగాలనుకున్నవన్ని అడిగేసింది.
ఏంటే నోరు లెగుస్తుంది, ఎంతలో ఉండాలో అంతలో ఉండు అంటే గౌరి తగ్గలేదు. నేను అక్కని కాదు తగ్గడానికి. మీరు చేసేది తప్పండి, ఇన్నేళ్లు వాడిని వాడి కష్టాన్ని వాడుకుని ఇప్పుడు నిర్ధాక్షిణ్యంగా వదిలేస్తారా ఎంత తప్పు అని భర్త కళ్ళలోకి చూసింది. ధీరజ్ సమాధానం చెప్పలేకపోయాడు, సరే మా అన్నయ్య వాడికి ఎంత రాసిస్తే నేనూ వాడికి అంత రాసిస్తాను. మా అన్న వాడికి ఇవ్వకపోతే నేనూ ఇవ్వను. ఇక విసిగించకు అని ఇంకో వైపు తిరిగి పడుకున్నాడు. గౌరి గది నుంచి బైటికి వచ్చేసరికి సురేఖ కూడా బైటే కనిపించింది.
(గౌరి)బావ ఏమంటున్నాడు అక్కా అని అడిగితే సురేఖ జరిగింది చెప్పింది. అక్కా పోనీ ఇక్కడ వీళ్ళు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో వాడికి చెపుదామా వాడు జాగ్రత్త పడతాడు కదా అంటే సురేఖ వెంటనే వదినకి ఫోను కొట్టింది, ఇంతలోనే ఏమనుకుందో వెంటనే కట్ చేసింది. ఏమైంది అక్కా
(సురేఖ) మనం చెపితే వదిన తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది, అది కాక వీళ్ళకి తెలిస్తే ఊరుకోరు. మనకిక మనశాంతి ఉండదు.
(గౌరి) అక్కా నా దెగ్గర ఒక ఐడియా ఉంది. ఒక వేళ మన నిధిని వాడికిచ్చి పెళ్లి చేస్తే. అప్పుడు వాడికి కట్నం ఇవ్వాలిగా అప్పుడు వాడికి కూడా న్యాయం జరుగుతుంది. ఏమంటావ్
(సురేఖ) వాడికి అన్యాయం జరుగుతుంటే బాధగా ఉంది కానీ నా కూతురిని ఇచ్చేంత కాదు. తెలిసి తెలిసి ఆస్తి లేనోడికి, చదువు లేనోడికి నా కూతురిని ఎలా ఇవ్వను, నీకూ కూతురుందిగా నీకు అంత బాధగా ఉంటే నీ కూతురిని ఇచ్చి చేసుకో అంది
(గౌరి) నిధి పెద్దది కదా అని అన్నాను అక్కా. అయితే నా కూతురినే ఇస్తాను.
(సురేఖ) ప్రియ చాలా పాష్ గా పెరిగిన పిల్ల, నువ్వు ఏదేదో ఊహించేసుకోకు. ముందు అక్కడికి వెళ్ళని అప్పుడు ఆలోచిద్దాం.
తలుపు దెగ్గర నిలుచున్న నలుగురు పిల్లలు సురేఖ, గౌరి మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నారు. సురేఖ పిల్లలు నిధి, నితిన్. గౌరి పిల్లలు ప్రియా, ప్రవీణ్ నలుగురు గదిలోకి వచ్చేసారు.
(ప్రియ) చూసారా అనయ్యా మన అమ్మలు ఏం ప్లాన్ చేస్తున్నారో
(ప్రవీణ్) అవును, వీళ్ళ ప్లాన్ అస్సలు సక్సెస్ అవ్వకూడదు
(నితిన్) వాడు జస్ట్ పనోడు, పనోడిని పనోడిలానే చూడాలి. అయినా మనం ఏం చెయ్యాలో మనకి తెలుసుగా
అందరూ నిధి వైపు చూసారు. అందరికంటే నిధి యే పెద్దది.
నిధి అందరి వంకా చూసి హా అని ఆవులించి నాకు నిద్రొస్తుంది బాయి అని లోపలికి వెళ్ళిపోయింది.
తెల్లారి ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. అందరూ ఇండియా వచ్చేసారు అక్కడి నుంచి ఊరికి వచ్చేసారు. తన ఇద్దరు అన్నయ్యలు శాశ్వతంగా ఇక్కడే ఉండటానికి వస్తున్నారని మాత్రమే తెలిసిన వసుధ పలకరిద్దామని సంతోషంగా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళింది. లోపల ఎవ్వరు కనిపించలేదు.
(వసుధ) అమ్మా, నాన్నా అన్నయ్యలు ఏరి. ఎవ్వరు కనిపించరే అని అడిగితే వసుధ నాన్న వాళ్ళని నేను నా ఇంట్లోకి రానివ్వలేదు, రానివ్వను కూడా అన్నాడు కఠినంగా. అమ్మా ఏంటి నాన్న అలా అంటాడు, ఏమైందని అడిగింది కంగారుపడుతూ
వసుధ అమ్మ రాజ్యం సరిగ్గా చెప్పలేదు, చెప్పినవన్నీ ఏవేవో చెపుతున్నట్టుగా అనిపించింది వసుధకి. ఇంటికి వచ్చిన వాళ్ళని అలా పంపించేస్తారా మీరు. మీరు ఆగండి పాత ఇంట్లో ఉన్నారా నేనెళ్ళి తీసుకొస్తాను అని ఆనందంగా అన్నయ్యల కోసం పరిగెత్తింది.