31-08-2024, 06:05 PM
E3 (స్మాల్ అప్డేట్)
సుమతి తిరిగి వెళ్ళడం కోసం బ్యాగ్ సర్దుకొని ఉంది.
శేఖర్ "అంతా జాగ్రత్తగా సర్డుకున్నావా!"
సుమతి "హుమ్మ్" అంది, ఆమె కళ్ళలో చెమ్మ కనిపిస్తుంది.
నేను ఆమెను అలా చూడలేక, సుమతిని హత్తుకున్నాను.
శేఖర్ "ఎందుకు ఏడుస్తావు... ఇప్పుడు ఏమయింది?"
సుమతి "వాళ్ళను పట్టించాము కదా... ఇంకా అయిపోలేదు అంటావు ఏంటి?" అంటూ నా భుజం మీద మొహం పెట్టి ఏడుస్తుంది.
నేను సుమతిని కొద్ది సేపు ఓదార్చి ముద్దులు హాగ్ లు యిచ్చి, ఆమె పొట్ట మీద చేయి వేసి "మన బిడ్డ బయట ప్రపంచం చూసే లోపు వాడి బర్త్ సర్టిఫికేట్ లో నా పేరు వస్తుంది. ముందుగా నా విడాకులు, తర్వాత నీవి... తర్వాత అందరిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను ఆలిగా మన బిడ్డకి తండ్రిగా కొత్త జీవితం సాగిస్తాను"
సుమతి గట్టిగా హత్తుకొని "ఇంకో రెండూ రోజులు ఆగి వెళ్ళకూడదు.... నాకు నిన్ను వదిలి ఉండాలని లేదు" అంది.
శేఖర్ "అవకాశం, టైమింగ్, మార్కెటింగ్ అన్నింటికీ మించి సరైనా ప్లానింగ్ తో ఇన్ని రోజులు లాక్కోచ్చాం... ఇంకెంత ఇంకొన్నిరోజులు ఓపిక పట్టు.... నేను చూసుకుంటాను" అన్నాను.
ఇంతలో సుమతి ఫోన్ మోగింది. రాజు కాలింగ్.....
సుమతి ఫోన్ వైపు కోపంగా చూస్తూ "నాకు ఈ ఫోన్ ఎత్తాలనే లేదు..."
శేఖర్ "ఫోన్ ఎత్తి మాములుగా, ప్రేమగా మాట్లాడు... బయట విషయం నీకు తెలియదు అన్నట్టు ఉండు..."
సుమతి "సరే..."
శేఖర్ నవ్వుతు సుమతి ఫోన్ లిఫ్ట్ చేశాడు.
రాజు కేవలం సుమతికి ఎలా ఉంది, తనకేమైనా విషయం తెలుసా అనే దాని కోసం ఎంక్వయిరీ ఫోన్ చేశాడు.
సుమతి బాగానే ఉంది, హాస్పిటల్ లో చూపించుకుంటున్నా... బిడ్డని కన్నాక వస్తా అని చెప్పింది.
రాజు బాధ నటిస్తూ "సరే... సరే..." అని చెప్పాడు.
సుమతి కోపంగా "వీడు ఇంకా చూడు... ఎలా నటిస్తూన్నాడో..." అని పళ్ళు నూరింది.
శేఖర్ "నువ్వు రిలాక్స్ గా ఇంటికి వెళ్ళు.... నేను రెండో అధ్యాయం మొదలు పెడతాను"
సుమతి ముద్దు పెట్టి బయటకు వెళ్లి కారులో వాళ్ళ ఇంటికి (పుట్టింటికి) వెళ్ళింది.
శేఖర్ భారంగా శ్వాస తీసుకొని ఇంట్లోకి వచ్చాడు.
వాష్ బేసిన్ లో ఫేస్ వాష్ చేసుకుంటూ అద్దంలో చూస్తూ "రాజు అండ్ అరుణ ........ గెట్ రెడీ ఫర్ రౌండ్ టూ...."
-
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them