28-08-2024, 08:47 PM
(28-08-2024, 06:51 AM)veerannachowdhary8 Wrote: రైల్వే కంపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టినట్లు..రిజర్వేషన్ లిస్ట్ చదివినట్లు అమ్మ 40 నాన్న 50 కొడుకు 30 కోడలు 20 అమ్మమ్మ తాతయ్య బాబాయి పిన్ని చిన్నమ్మ పెద్దమ్మ తోటి కోడలు పక్కింటి కోడలు.... రేయ్ ఏంట్రా ఇది అనిపించేలా స్టార్ట్ చేస్తారు కొంత మంది రైటర్ లు....
ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే రీడర్ అనే వాడు అప్పుడే పుట్టిన పిల్లాడు లాంటి వాడు.. కథ అనేది కొత్త ప్రపంచం... అప్పుడే కళ్ళు తెరిచిన పిల్లాడి మీద.. బాబాయి పిన్ని పెద్దమ్మ చిన్నమ్మ తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ ఒకేసారి పడిపోయి పలకరిస్తే ఎమ్ అవుతుంది... బ్యార్ మని ఏడుస్తాడు...ఇక్కడ జరిగేది కూడా అదే.... సో దయచేసి ఇలాంటి introduction లు మానుకోండి అని మనవి.
వీరన్న గారు,
చాలా బాగా చెప్పారు.. చాలా మంది కథల్లో ఇలానే వాస్తున్నారు.. మొదటే పెద్ద చాంతాడంత లిస్టు పెడతారు, ఎవరికీ గుర్తు ఉంటాయి అన్ని పాత్రలు వాళ్ళ పేర్లు, వయసులు... అందరితోనూ మొదటి పేజ్ లోనే సీన్ లు రాయలేరు కదా.. మరి అప్పుడే అన్నీ చెప్పటం ఎందుకు..
ఇంకా మీ చిన్న పిల్లాడి comparison బాగుంది.. నిజంగానే పిల్లాడు ఏడుస్తాడు అందర్నీ చూసి..
- ghoshvk