Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
20. నా జీవితం క్రిష్ చేతుల్లో 10.0







హాయ్, నా పేరు రష్

హ్యాపీ బర్త్ డే టూ యు.... హ్యాపీ బర్త్ డే టూ యు.... హ్యాపీ బర్త్ డే డియర్ నాని....  నానికి పుట్టిన రోజు వేడుకలు చేశాము. పొద్దున్నే గుడికి వెళ్లి వచ్చాము. కొత్త బట్టలలో హ్యాపీగా ఉన్నాము. అంకుల్ ఆంటీ లను ఇంకొంత మందిని తీసుకొని వచ్చి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశాము. ఆ రోజు అంతా హాయిగా సంతోషంగా గడిపాను. ఈ రోజు మొత్తం క్రిష్ సెలవు పెట్టి నాతోనే ఉన్నాడు. అలిసిపోయిన మనసు, శరీరం అంతా రీచార్జ్ పొందినట్టు అనిపించింది.

సాయంత్రం అందరం గుడికి వెళ్ళాము, క్రిష్ గుడి మొత్తం చూసి వస్తాను అంటే నేను కూర్చొని నానిని నిద్రబుచ్చుతూ ఉన్నాను. అనుకోకుండా ఒక వ్యక్తీ నా దగ్గరకు వచ్చాడు, నా ఎక్స్.హస్బెండ్ సందీప్. చాలా సన్నబడ్డాడు. 

ఇన్ని రోజులు సందీప్ పిల్లలను కనలేడు అనుకున్నాను కాని కొజ్జ వాడు అని తెలిసి ఆ రోజు షాక్ అయ్యాను. ఇక్బాల్ అతనిని బెదిరించడంతో నన్ను ఇక్బాల్ పక్కలో పడుకోబెట్టాలని అనుకున్నాడు. క్రిష్ కి ఈ విషయం తెలియదు కాబట్టి ఇంకా భూమి మీద రెండూ కాళ్ళతో తిరుగుతున్నాడు. వద్దులే... అనవసరంగా గొడవలు ఏందుకు? క్రిష్ ని ఇందులో లాగాకూడదు. 

సందీప్ దగ్గరకు వచ్చి "నిర్వేద్ కదా" అని అడిగాడు.

రష్ "పేరు మార్చాము.... ఇక నుండి మా కొడుకు పేరు నిర్వేద్ కాదు"

సందీప్ మొహం మాడిపోయింది.

సందీప్ "నన్ను క్షమించు..."

రష్ "ఎలా ఉన్నావ్?" అని అడిగింది.

సందీప్ మొహం వెలిగిపోయింది, రష్ ని చూస్తూ "బాగున్నాను, పిచ్చి పనులు ఏమి చేయకుండా, బిజినెస్ చేసుకుంటూ ఉన్నాను, అంతా బాగుంది... అమ్మ ఇప్పుడిప్పుడే నా మీద కోపం తగ్గించుకుంటుంది. అవుట్ హౌస్ లో ఉంటున్నాను" అన్నాడు.

నాకు కొంచెం బాధ వేసింది, సందీప్ తప్పు ఏమి లేదు కదా... 

అతను మగాడు కాదు అలా అని పెళ్లి కాదని చెప్పలేడు, నా మేడలో తాళి కట్టాడు. ఆ తర్వాత పిల్లల కోసం అని తన తమ్ముడు పక్కలో పడుకోబెట్టాడు, అతని టార్చర్ కి జన్మలో సెక్స్ అంటే భయం వచ్చేసింది. క్రిష్ వల్ల తిరిగి మామూలు అయ్యాను. అయినా క్రిష్ ని మోసం చేసి పంపించేశాను. కాని నేను కష్టాల్లో ఉన్నా అనగానే వచ్చి కాపాడాడు, నా పరువు పోకుండా ఉండడం కోసం తను ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు కూడా అటూ తాళి కట్టిన భర్త, ఇటూ పుట్టింటి వాళ్ళు వదిలేస్తే భారం అని తెలిసినా కూడా బాద్యతగా మోస్తున్నాడు. 

క్రిష్ కి సందీప్ కి తేడా నాకు స్పష్టంగా తెలుస్తుంది. సమస్య వస్తే సందీప్ నన్ను షీల్డ్ లా అడ్డం పెట్టుకొని తను తప్పించుకుంటాడు. కాని క్రిష్ మాత్రం తాను తలకాయ పెట్టేసి నన్ను కాపాడతాడు. 

ఆలోచిస్తూ ఉండగా....

సందీప్ మాట్లాడుతూనే ఉన్నాడు, ఎప్పటి నుండి మాట్లాడుతున్నాడో తెలియదు ".... వ్వు కూడా నా గురించి ఆలోచిస్తున్నావ్ అని నాకు తెలుసు... నం కలిసే దారి కోసం చూస్తున్నాను"

సందీప్ వల్ల క్రిష్ ఇబ్బంది పడకూడదు.

రష్ "నా హస్బెండ్ క్రిష్ ఎక్కడ ఉన్నాడో కొంచెం చూస్తావా! సందీప్" అని అడిగింది.

సందీప్ "హస్....స్బెండ్....."

రష్ "మేం పెళ్లి చేసుకున్నాం"

సందీప్ గుటకలు మింగాడు.

రష్ పైకి లేచి ముందుకు నడుస్తూ... వెళ్ళబోయింది.

సందీప్ "నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా..."

రష్ "సారీ! నా మొగుడు, నా కొడుకు రోజు సరిపోతుంది... నాకు ఈ మధ్య వేరే ఆలోచనలు చేయలేక పోతున్నాను" అని వెళ్లిపోయాను.

సందీప్ నా వెంట వస్తున్నాడు.

సందీప్ "నేను మగాణ్ణి కాదు అనే కదా..... కాని క్రిష్..." అంటూ ఉండగానే ఇద్దరం ఎదురుగా ఉన్న దృశ్యం చూసి స్టన్ అయ్యాం.

ఎదురుగా క్రిష్ మరియు పూజ నడుచుకుంటూ ఎదురు వస్తున్నారు.

క్రిష్ మనసులో పూజ గురించి ఆలోచన మళ్ళి నా మెదడులో వినపడుతుంది.

సందీప్ "క్రిష్ చాలా పెద్ద మగాడు... కనపడుతుంది.... చూస్తూ ఉంటే అతని మనసులో చాలా మంది పట్టేలా ఉన్నారు. కాని రష్ నా మనసులో ఎప్పటికి నువ్వే....."

రష్ "షట్ అప్..."



ఎదురుగా క్రిష్ కూడా రష్ మరియు సందీప్ ని చూసి స్టన్ అయ్యాడు.

క్రిష్ మనసులో "రష్ ఇంకా సందీప్ ని కలుస్తుందా.... వాడు నన్ను చంపాలని చూశాడు ఆ విషయం తెలిసి కూడా..... నాని పుట్టిన రోజు అనా..."



రష్ మనసులో "ఈ అమ్మాయి పూజని రహస్యంగా గుడిలో కలుస్తున్నాడా.... ఈ మధ్య ఫోన్ లో మెసేజ్ చూసి నవ్వుతున్నాడు. అది పూజనా.... ఎక్కడ వరకు వెళ్ళింది వీళ్ళ విషయం."




ఇంట్లో కోల్డ్ వార్ సాగుతుంది. 

ఇద్దరం మాట్లాడుకోవడం లేదు. మా ఇంటి ఎదురు ఆంటీ అంకుల్ కూడా మా మధ్య ఉన్న తేడాని గమనించి తగ్గట్టుగా ఉన్నారు. 

క్రిష్ పొద్దున్నే లేచి నేను పెట్టిన వేడి నీళ్ళు వదిలేసి చన్నీళ్ళు స్నానం చేసి వెళ్తున్నాడు. 

టిఫెన్ బాక్స్ తీసుకోకుండా వెళ్తున్నాడు. 

అన్నింటి కంటే దారుణం ఇంట్లో డబ్బులు అడిగినా లేవు అని ఇవ్వడం లేదు. నానికి సంబంధించిన పాల పొడి, పాంపర్స్ కోసం కూడా ఇవ్వడం లేదు. 

అంతకు ముందు దాచిన డబ్బులు పెట్టి కొంటున్నాను. 

క్రిష్ ని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు పిన్ని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి "పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, ప్రేమ పెళ్లి అయినా.... మొదట్లో బాగానే ఉంటుంది, కాని ఉండే కొద్ది మగాడు, మొగుడులా ప్రవర్తిస్తాడు.... అప్పుడు తెలుస్తుంది" అని అంది.

సందీప్ గురించి నా గురించి ఏమయినా తప్పుగా అనుకుంటున్నాడా.... నాకు సందీప్ తాకితేనే అరిచేస్తాను అలాంటి ఒక కండీషన్ లో ఉన్నాను అని చెబితే బహుశా నా సమస్య తీరిపోవచ్చు కాని కొత్త సమస్య మొదలవుతుంది. 

భార్యాభర్తల మధ్య ఒక సన్నని లైన్ ఉంటుంది ఆ లైన్ ని ఇద్దరూ పట్టుకొని ఉంటారు. ఇద్దరిలో ఎవరైనా సరే.... మూడో మనిషితో అఫైర్ పెట్టుకుంటే, మరొకరు కూడా పెట్టుకుంటారేమో అన్న భయం ఉంటుంది. నిజానికి చాలా మంది మగాళ్ళు నిజాయితీగా ఉండేది కూడా అందుకే. ఇలా నేను ఇప్పుడు క్రిష్ తో నువ్వు తప్ప వేరే మనిషి నన్ను తాకితే నేను అరిచేసి కళ్ళు తిరిగి పడిపోతాను అని చెబితే... క్రిష్ నన్ను ఉంపుడుగత్తేగా మార్చేసి చాలా మంది ఆడవాళ్ళను ఇంటికి తెచ్చుకోవచ్చు కూడా...




హాయ్, నా పేరు క్రిష్....

పూజని అనుకోకుండా గుడిలో కలిశాను. అయినా నేను ఇప్పుడు పెళ్లి అయిన వాడిని అదే విషయం చెప్పి మాట్లాడడం మొదలు పెట్టాను. నా అదుపులో నేను ఉన్నాను. అయినా నన్ను ఎదో దొంగని చూసినట్టు చూస్తుంది. పైగా గుడికి తన సందీప్ ని పిలిపించుకొని కబుర్లు చెప్పుకుంటుంది. ఛీ.... అసలు ఇలా ఎలా చేస్తుంది. 

డబ్బులు ఇవ్వలేదు.. తనే అడుగుతుంది అని ఎదురుచూస్తున్నాను. కాని అడగడం లేదు బహుశా.... ఆ సందీప్ ఇచ్చాడేమో... తన కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా నేను ఎదురాడ లేదు. మా అమ్మానాన్న కూడా నన్ను వదిలేశారు. ఇంత కష్టపడుతూ ఉంటే, నా వెనక సందీప్ ని ఎలా కలుస్తుంది.

ఇంటికి వెళ్ళాలి అంటేనే కంపరంగా ఉంది.

మళ్ళి తన మొహం చూడాలి.

కానీ ఎన్ని రోజులు ఇలా ఉంటుందో నేను కూడా చూస్తాను. 






ఎదురింటి ఆంటీ మరియు అంకుల్ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. కాని ఇద్దరూ బయట పడలేదు. ఏమి లేదు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు.

ఆ రాత్రి క్రిష్ కి నిద్రలో మెళుకువ వచ్చి చూస్తే రష్ పడుకొని ఏడుస్తూ ఉంది. క్రిష్ కరిగిపోయి రష్ ని హత్తుకున్నాడు.

కాని ఎన్నో సమస్యలు ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.

రష్ మెల్లగా క్రిష్ ని తోసేసి మాట్లాడడం మొదలు పెట్టింది.

ఇంట్లో నాని కోసం కూడా డబ్వులు ఇవ్వడం లేదని, ముందు నెలలో దాచుకున్న డబ్బులు కూడా అయిపోయాయి అని, ఇలా అయితే రేపటి నుండి ఎలా అంటూ ఏడుస్తూ అడుగుతుంది. క్రిష్ సారీ చెబుతూ ఉంటే, వినకుండా ఏడుస్తూనే ఉంటుంది. 

సందీప్ గురించి చెబుతూ అనుకోకుండా కలిశాడు అని నాని మీద ఒట్టు అని చెబుతుంది.

క్రిష్ పశ్చాత్తాప పడి సారీ చెబుతాడు. 

క్రిష్ "నువ్వు నా డబ్బులు ఖర్చు పెట్టావ్ కదా...." అంటాడు.

రష్ కోపంగా క్రిష్ ని లాక్కొని వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలు అన్ని ముందేసి "చూడు చూడు ఇవన్ని కూడా నేను ఇంటి నుండి తెచ్చుకున్నవి.... పైగా రోజు వేసుకునే ఈ చీర చిరిగిపోతే కుట్టుకొని వేసుకుంటున్నాను. నాని పుట్టిన తర్వాత జాకెట్ సైజ్ పెరిగితే.... ఉన్న జాకెట్ లకు టైట్ గా ఉంటుంది అందుకని బయటకు వెళ్లి నా కోసం అవి మాత్రమే కొన్నాం.... పైగా ఇంట్లో చూడు.... నేను షాపింగ్ చేసి ఏం కొన్నాను. మన కోసం కాదా.... అందులో ఎక్కువ నీ కోసం నీ కొడుకు కోసమే కదా...." అని కోపంగా అరిచేస్తుంది. అలాగే ఎద్చేస్తుంది.

క్రిష్ తల దించుకొని సారీ సారీ అంటూ ఉంటాడు.

రష్ "వెళ్ళు.... వెళ్ళు.... నువ్వు పెద్ద మగాడివి కదా.... అందుకే కదా ఆ అమ్మాయి వెంట పడుతున్నావ్..." అంటూ కూర్చొని ఏడుస్తుంది.

క్రిష్ "నేనెప్పుడు వెళ్లాను..." 

రష్ "నిజం చెప్పూ.... ఆ అమ్మాయి గురించి తప్పుగా ఆలోచించలేదు" అని అడిగింది.

క్రిష్ "నిజంగా లేదు.. నిజం నిజం" అంటూ రష్ రెండూ భుజాలు పట్టుకొని అడుగుతున్నాడు. 

క్రిష్ అని మనసులో "ఆ అమ్మాయి గుర్తు చేస్తే కాని నాకు గుర్తు రాలేదు... నేను ఎందుకు ఆలోచిస్తాను. అయినా నాకు ఇంత మంచి, అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని వేరే ఎవరి గురించో ఎందుకు ఆలోచిస్తాను" అని అనుకున్నాడు.

రష్ అతని కళ్ళలోకి చూస్తూ అతని మనసులో మాటలు విన్నది. తన గుండెల్లో ఇన్ని రోజులుగా గూడు కట్టుకున్న బాధ అంతా ఒక్క సారిగా ఎగిరిపోయింది.

క్రిష్, రష్ గడ్డం పట్టుకొని "సారీ.. సారీ.. " అని చెబుతూ ఉన్నాడు.

రష్ క్రిష్ ని హత్తుకొని "ఐ లవ్ యు... " అని పదే... పదే.... చెబుతూ "నన్ను మోసం చేయకు" అని అడుగుతుంది.

క్రిష్, అతని మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే "ఇన్ని రోజుల్లో సెక్స్ చేసుకునే టపుడు తప్పించి, ఈ ఒక్క సారే రష్ ఐ లవ్ యు చెప్పింది" అనుకుంటూ గట్టిగా తిరిగి హత్తుకుంటాడు. 

నాని నిద్ర లేచి ఇద్దరినీ చూస్తూ చప్పట్లు కొడుతున్నాడు. ఇప్పుడు రెండో సంవత్సరం రావడంతో నాని కూడా మాట్లాడుతున్నాడు.

క్రిష్ నవ్వగా, రష్ మొహం అంతా ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయి పోయి ఆ మొహంతోనే సంతోషంగా నవ్వుతూ ఉంది.

క్రిష్ "ఇక నుండి మనం హ్యాపీగా ఉందాం..... సరేనా..."

















[Image: main-qimg-4c995148fa0c3614bf0bde8d5433f994.jpg]


అదే రాత్రి మరో చోట.....


పూజ "హలో...."

నూతన్ "క్రిష్ ని కలిశావా..."

పూజ "హుమ్మ్"

నూతన్ "ఏం చేయాలో తెలుసు కదా...."

పూజ "హుమ్మ్"

నూతన్ "క్రిష్ ని వదిలిపెట్టకు"

పూజ "సరే" అంటూ ఫోన్ కట్టేసి కోపంగా స్టీరింగ్ ని చేతులతో కొడుతుంది.

ఆమె చేతులు ఎర్రగా అయిపోయాయి. కళ్ళ వెంట నీళ్ళు కనపడకుండా ఆపెసుకుంది. 

ఫోన్ ద్వారా మరో కాల్ చేసింది, తనని కిడ్నాప్ చేయబోయిన వ్యక్తులు ఫోన్ ఎత్తారు. క్రిష్ ఫ్యామిలీ ఫోటో పంపింది. 

ఫోన్ "మళ్ళినా మేడం...."

పూజ "ఫ్యామిలీలో ఎవరినీ వదిలిపెట్టకు..."

ఫోన్ "సరే మేడం...."

పూజ ఫోన్ కట్టేసి "సారీ క్రిష్... నువ్వు తప్పుడు వ్యక్తితో స్నేహం చేసావ్..." అనుకుంటూ కార్ నడిపించుకుంటూ వెళ్తుంది.





సందీప్ "హలో...."

ఫోన్ "చెప్పండి సర్..."

సందీప్ "క్రిష్..."

ఫోన్ "అర్ధం అయింది సర్... కాని ప్రస్తుత ఇన్స్పెక్టర్ కేశవ్...."

సందీప్ "అతను రేపు వారం ఊళ్ళో ఉండడు... అప్పటితో పని అయిపోవాలి"

ఫోన్ "సరే సర్..."

సందీప్ "నాకు తెలుసు రష్.... నీ మనసులో నేను ఉన్నా.... క్రిష్ ఉన్నాడు కాబట్టి.... వదులుకోలేక పోతున్నావ్... క్రిష్ లేక పోతే నువ్వు నా దానివి..." అని నవ్వుకుంటున్నాడు.

అవుట్ హౌస్ లో అతని నవ్వు శబ్దం అతనికే రీ సౌండ్ గా వినపడుతుంది వినపడుతుంది.

















[+] 10 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 28-08-2024, 07:37 PM



Users browsing this thread: 21 Guest(s)