27-08-2024, 09:35 PM
(This post was last modified: 28-08-2024, 10:15 AM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
18. నా జీవితం క్రిష్ చేతుల్లో 8.0
హలో, నా పేరు రష్
ఈ నా మొగుడు ఏమనుకుంటాడో నాకు తెలియదు, షాపింగ్ చేశాక పే మెంట్ చేసేటపుడు క్రిష్ చేతులు వణికాయి, నేనే ఫోన్ లాక్కొని పే మెంట్ చేశాను. అయినా నేనేం పెద్దగా కొనుక్కోలేదు, క్రిష్ కి, నానికే కొన్నాను, ఇంట్లో అవసరం అయ్యే కొన్ని వస్తువులు కొన్నాను. దానికే అల్లాడి పోతున్నాడు. పైగా లైఫ్ లాంగ్ నేల మీద పడుకొని నా నడుము పచ్చడి చేద్దాం అనుకున్నాడేమో. నేను తీసి వేస్తున్నా సరే, ఎక్కడ నుండి తెచ్చి వేశాడో పెద్ద బాక్స్ కండోం ప్యాకేట్స్ వేశాడు. క్రిష్ ని చూస్తే ఆటూ ఏటో తిరిగి ఈల వేస్తున్నాడు. నేను కూడా పక్కకి తిరిగి తనకు కనబడకుండా చిన్నగా నవ్వి షాపింగ్ కార్ట్ లో ఉంచాను. కాని క్రిష్ నా నవ్వు చూసేసాడు. షాపింగ్ కార్ట్ లో ఉన్న నాని మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు.
అంకుల్ అక్కడ నిలబడి ఉండగా, క్రిష్, నానిని ఎత్తుకొని అతని పక్కనే నిలబడి ఉన్నాడు. నేను హెల్పింగ్ మనుషులకు చూపిస్తూ మంచం పరుపు అన్ని ఇంట్లోకి తెప్పించాను. అలాగే ఇంట్లోకి అవసరం అయ్యే ఇంకొన్ని వస్తువులు కూడా వచ్చాయి. క్రిష్ దిగులుగా ఉంటే, అంకుల్ క్రిష్ భుజం తడుతూ నవ్వుతున్నాడు. కొత్తవి కదా, ఆంటీ వచ్చి కాసేపు కూర్చొని అన్ని చూసింది, క్రిష్ ఊరుకోకుండా రేటు తక్కువే ఆంటీ, అంకుల్ కి మీకు కొనిపెట్టే ఉద్దేశ్యం లేదేమో అన్నాడు. క్రిష్ ఎంత కన్నింగ్ అనేది నాకు బాగా తెలుసు. అంకుల్ దెబ్బ అయిపోయాడు.
ఆంటీ తన ఇంట్లోకి వెళ్ళింది, కాసేపటికి ఆంటీ ఇంట్లో నుండి ఆంటీ కేకలు వినపడ్డాయి. అంకుల్ వస్తూనే క్రిష్ ని చూసి మెట్ల మీదకు అన్నట్టు వేలు చూపించాడు. కొమ్మ మీద వాలే జంట పక్షులు లాగా ఇద్దరూ వెళ్లి ఆ మెట్ల మీద పక్కపక్కనే కూర్చొని ప్రపంచంలో ఉండే కస్టాలు అన్ని మాట్లాడుకుంటారు. కొద్ది సేపటికి ఆంటీ వచ్చింది, ఇద్దరం కాసేపు నవ్వుకుంటూ మాట్లాడుకున్నాం. వెళ్తూ వెళ్తూ మెట్ల మీదకు ఒక సారి ఉరిమి చూసింది. నాకు అర్ధం అయింది, వీళ్ళ సమవేశానికి ఆటంకం వచ్చింది అని. కొద్ది సేపటికి క్రిష్ వస్తాడని అర్ధం అయి వేడి నీళ్ళు బాత్రూంలో పెట్టి వచ్చాను.
మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు కాని, నాకు మాత్రం క్రిష్ బాగా తెలుసు, అలిసిపోతే ఎలా ఉంటాడో, తప్పు చేస్తే ఎలా ఉంటాడో, హ్యాపీ నెస్ లో ఉంటే ఎలా ఉంటాడో, బోరు కొడితే ఎలా ఉంటాడో, నాకు అతని మొహం చూస్తేనే అన్ని అర్ధం అయిపోతుంది. వస్తూనే అలిసిపోయి ఆవలిస్తూ వచ్చాడు, నానిని నా చేతికి యిచ్చి స్నానం చేసి వచ్చాడు. వస్తూనే నేను ఏర్పాటు చేసిన బట్టలు వేసుకొని కిచెన్ లోకి వచ్చి ఎప్పటిలా నా మెడ మీద ముద్దు పెట్టి నా భుజం మీద తల వాల్చి "అయిపోయిందా" అన్నాడు. ముద్దు పెట్టగానే నా శరీరంలో ఉండగానే నరాలు అన్ని కరెంట్ షాక్ కొట్టినట్టు వచ్చినట్టు అనిపించింది. అతని చేతులు నా నడుము చుట్టూ వేసి నా పొట్ట మీదకు వచ్చాయి. ఆ మొరటు చేతులు, పొడవైన అతని వేళ్ళు నా పొట్ట మీద సున్నితంగా పట్టుకుంటే నా బరువు అంతా అతని మీద వేసేయాలని అనిపిస్తుంది. అతని ఊపిరి నా చెవుల వెనక వెచ్చగా తాకుతూ ఉండగానే నా మొహం అంతా ఎర్రగా అయిపొయింది.
క్రిష్ తో గడిపే ప్రతి క్షణం నాకు మధురమైన అనుభవంగానే ఉంటుంది, మా ఇద్దరి తోలి ముద్దు కూడా క్రిష్ కి గుర్తు ఉంది కాని నాకు అలా కాదు, ఆ టైం లో క్రిష్ ఏ డ్రెస్ లో ఉన్నాడు, నన్ను ఎలా పట్టుకున్నాడు, అతని చేతులు నా భుజాలను పట్టుకోవడం, అతని చేతుల నా భుజం పై పెట్టినపుడు ఉండే ఒత్తిడి కూడా నాకు గుర్తు ఉంది. ఈ రాత్రికి ఏం ఉండబోతుందో అర్ధం అయిపొయింది.
నైట్ డిన్నర్ చేశాక మంచం ఎక్కగానే నాని నిద్రపోయాడు. మెల్లగా నానిని పక్కకు జరిపి పిల్లి లా క్రిష్ దగ్గరకు జరిగాను. క్రిష్ అలిసిపోయాను అంటూ కళ్ళు మూసుకున్నాడు. తను అలిసిపోయాడని నాకు కూడా తెలుసు, నేను కూడా ఓవర్ గా ఏమి ఎక్సపర్ట్ చేయలేదు. నేను అతన్ని గట్టిగా హత్తుకొని అలానే పడుకున్నాను. అతని శరీరం యొక్క వేడి నాకు తగులుతూ ఉంటే నాకు హాయిగా అనిపించి నిద్ర పోయాను. కాని నా నిద్ర ఎక్కువ సేపు ఉండదు. మరో నాలుగు గంటలలో నాని నిద్ర లేచి పాలు అని అంటాడు. అందుకే త్వరగా నిద్ర పట్టే పొజిషన్ లో నిద్రపోతున్నాను. అదే అతని కౌగిలి.
హలో, నా పేరు క్రిష్
దొంగ మొహంది... నా డబ్బులన్నీ అవ్వజేసింది. నా సంవత్సరం సంపాదన, ప్చ్.... ప్చ్....
కండోం తో ఓకే అంది కదా... రేపటి నుండి అదే పనిలో ఉంటా...
ఆడదాని ఆలోచన అలానే ఉంటుంది, మగాడి ఆలోచన ఇలానే ఉంటుంది. క్రిష్ అప్పటికే నిత్య దగ్గర లక్షన్నర పోగొట్టుకున్నా కూడా ఏమి అనలేదు. కాని పెళ్ళాం పిల్లలకు అదీ తన ఇంటి కోసం ఖర్చు పెట్టినందుకు ఫీల్ అవుతున్నాడు, అవుతాడు. ఎవరైనా అంతే...
కాని ఒక రైటర్ గా నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే.... ఇదిగో ఈ క్రింది విధంగా ఉంటుంది.
హలో, నా పేరు రష్
నానికి పది రోజుల్లో రెండో సంవత్సరం వస్తుంది.
నానిని తీసుకొని పిల్లల పార్క్ కి వచ్చాను, నాకు ఎలా ఉన్నా సరే ఈ పిల్లల మధ్య ఉంటే మనసు చాలా హాయిగా ఉంటుంది. పైగా రేపు నాని కూడా వీళ్ళతో పాటు ఆడుతూ ఉంటాడు.
క్రిష్ సడన్ గా సినిమాకి వెళ్దామా అన్నాడు. నాకు కూడా వెళ్లాలని అనిపిస్తుంది. సినిమా హాల్ కి వెళ్లి చాలా రోజులు అయింది, రోజులు ఏం కర్మ... ఎపుడో పెళ్లి కాక ముందు వెళ్లాను, తర్వాత సందీప్ తో వెళ్లాను. ఆ మహానుభావుడు, నా వైపు చూసి ఎందుకు నవ్వుతున్నావ్, ఎందుకు అలా ఏడుస్తున్నావ్.... ఇలా చేసి నా పరువు తీయకు అంటూ సినిమా మధ్యలోనే తీసుకొని వచ్చాడు. నాకు సినిమాకి వెళ్ళాలని ఉంది. నిజంగా వెళ్లాలని ఉంది.
నేను కూడా సరే అన్నాను. ఇద్దరం కలిసి నాని వైపు చూశాను. నాని అమాయకంగా మా ఇద్దరినీ మార్చి మార్చి చూశాడు. సారీ నాని మీ అమ్మానాన్నకి కొద్ది సేపు ప్రైవసీ కావాలి అనుకుంటూ నిద్ర బుచ్చి ఆంటీకి యిచ్చి పరుగు పరుగున క్రిష్ తో కలిసి సినిమాకి వెళ్ళిపోయాను.
మళ్ళి చిన్నపిల్లని అయినట్టు అనిపించింది. క్రిష్ నా అల్లరిని సహిస్తాడు, భరిస్తాడు. హాయిగా అరుస్తూ నవ్వుతూ సెంటిమెంట్ సీన్ లో ఏడుస్తూ హాయిగా సినిమా చూసి అయిపోయాక ఇంటికి బయలు దేరాను.
రాత్రికి ఇద్దరం బస్ లో ఇంటికి వచ్చాక, రోడ్డు మీద ఎవరం లేకపోవడంతో క్రిష్ కి మూడ్ వచ్చి నా చేయి పట్టుకొని చిన్నగా రొమాంటిక్ గా నడుస్తున్నాడు. కాని నా మనసు మరో చోట ఉంది, "పదా.... పదా.... నాని నిద్ర లేస్తాడు" అంటూ స్పీడ్ గా క్రిష్ ని తీసుకొని వెళ్తున్నాను.
క్రిష్ "ఎందుకంత తొందర.... నాని ఏమి ఎడవడు... ఒక వేళా ఏడిస్తే అంకుల్ నాకు ఫోన్ చేసేవాడు కదా" అన్నాడు.
రష్ మనసులో "నిజమే ఈ లాజిక్ కూడా ఉంది" అనుకున్నాను.
ఇద్దరం రోడ్ మీద రాత్రి చంద్రుని వెన్నెలలో నడుచుకుంటూ వెళ్తున్నాము.
హాయిగా గాలి వీస్తూ ఎంజాయ్ చేస్తున్నాము.
సరిగ్గా అప్పుడే ఒక వెహికల్ నుండి ఒకమ్మాయి దూకేసి పరిగెత్తుకుంటూ వచ్చి "ప్లీజ్... కాపాడండి..." అని అడిగింది.
ఇంతలో ఎవరో ముగ్గురు ఆ అమ్మాయి వెంట పడడంతో ఆ అమ్మాయి మమ్మల్ని దాటి పరిగెత్తింది.
క్రిష్ నా భుజం చుట్టూ చేతులు వేశాడు. అప్పుడు అర్ధం అయింది, నా కాళ్ళు చేతులు వణుకున్నాయి, మొహం అంతా చమటలు పట్టేసి భయం అనిపించింది.
క్రిష్ నా వెన్ను చరిచి ఏమి లేదు అని చెప్పాడు. కాని నాకు గతం ఒక్క సారిగా కనపడింది. సందీప్ తమ్ముడు సునీల్ నా మరిది.... నన్ను అత్యంత క్రూరంగా రేప్ చేయడం గుర్తుకు వచ్చింది.
అలాగే ఆగిపోయాను... నిజానికి అప్పటి నుండి సందీప్ నా వంటి మీద చేయి వేసిన (అసభ్యంగా) గట్టిగా అరిచేస్తాను. అలా నా మైండ్ ఎవరిని నన్ను తాకనివ్వకుండా ప్రిపేర్ అయిపొయింది.
ఎవరైనా నా మీద చేయి వేస్తె (అసభ్యంగా) పెద్దగా అరిచేస్తాను, కేకలు పెట్టేస్తాను.
ఒక్క క్రిష్ తప్ప ఎవరిని నేను ఒప్పుకోలేను... ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి కూడా నాలా అయిపోతుందా అనిపించి భయం వేసింది.
క్రిష్ వైపు కళ్ళనీళ్ళతో చూస్తూ ఆ అమ్మాయిని కాపాడమని అడిగాను.
నేను అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాను.
క్రిష్ వెళ్ళాడు. నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. అనవసరంగా క్రిష్ ని పంపానా.... క్రిష్ కి ఏమయినా అవుతుందా అనిపించగానే భయం వేసింది...
ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. కాని కొద్ది సేపటిలోనే ఆ చీకటిలో స్ట్రీట్ లైట్ కాంతిలో క్రిష్ ఆ అమ్మాయిని తీసుకొని వస్తున్నాడు.
హమ్మయ్యా అనుకున్నాను.
దగ్గరకు వచ్చాక ఆ అమ్మాయి థాంక్స్ చెప్పి తనను తానూ పరిచయం చేసుకొని వెళ్ళిపోయింది.
క్రిష్ నేను యిద్దరం తిరిగి ఇంటికి వచ్చాము. నానిని తీసుకొని వచ్చి మాములుగా పడుకొని నిద్ర పోయాం. ఎప్పటిలాంటి రోజుగానే ఉండిపోయింది.
ఒక అమ్మాయిని కాపాడడం మా జీవితాన్ని మారుస్తుంది అని తెలిస్తే జస్ట్ 100 నెంబర్ కి కాల్ చేసి ఊరుకునే దాన్ని...
అన్నట్టు ఆ అమ్మాయి పేరు ................ పూజ.
పూజ..... పూజ హెడ్గే....
కపుల్ మధ్య వచ్చే సమస్య ఒక్కటే......
మూడో మనిషి.....
![[Image: Pooja-Hegde-New-Hot-Images-5.jpg]](https://i.ibb.co/ckN6Hbx/Pooja-Hegde-New-Hot-Images-5.jpg)
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them