Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
17. నా జీవితం క్రిష్ చేతుల్లో 7.0





జీవితంలో మన గురించి మరొకరు ఆలోచిస్తే ఆ కిక్కే వేరు, రష్ నాతో మనం అన్నప్పటి నుండి నేను ఊహల్లో తేలిపోతున్నాను. నా మనసులో ఉంది ఒక్కటే, తనని బాగా చూసుకోవాలి, సంతోషంగా చూసుకోవాలి. నాకు వేరే కోరికలు లేవు.


క్రిష్ "హ్యాపీ బార్ట్ డే" అంటూ కొత్త డ్రెస్ తీసుకొని వచ్చి యిచ్చాను. 

రష్ మొత్తం చూసుకుంది, ముందు వెనక మొత్తం చూసుకొని అద్దం ముందు నిలబడి చూసుకొని నవ్వింది మళ్ళి అద్దంలో నుండి నా మొహం చూడగానే వెనక్కి తిరిగి "తీసుకెళ్ళి ఇచ్చేయ్ ఏం బాగాలేదు?" అంది.

క్రిష్ "ఏమయింది?" అన్నాను.

రష్ "ఎందుకు అలా అరుస్తావ్..." అని నా కంటే పెద్దగా అరిచింది.

ఇద్దరం కాసేపు అరుచుకొని, తిట్టుకొని నాని ని తీసుకొని ఎప్పటిలా బయటకు వెళ్ళిపోయాను.

రష్ మొట్టమొదటి సారి బయటకు వచ్చి "క్రిష్..." అని అరిచింది. నేను నానిని తీసుకొని మెట్ల మీద కూర్చున్నాను. నేను తనకు కనబడను లేండి.

అంకుల్ వచ్చి నాకు కంపనీ ఇచ్చాడు.

కొద్ది సేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లేసరికి షాక్... ఇంట్లో రష్ తో పాటు అంకుల్ వాళ్ళ వైఫ్... మా ఎదురు ఇంటి అంటే కూడా ఉంది.

నేను రాగానే ఇద్దరూ మాట్లాడుకోవడం ఆపేశారు. ఆంటీ నా వైపు చూసి చిన్నగా నవ్వి బయటకు వెళ్ళింది.

అన్నట్టు అంకుల్ 60+ రిటైర్డ్, ఆంటీ 55+ నో రిటైర్మెంట్ స్టిల్ హౌస్ వైఫ్.....  మొదట్లో తాతగారు అంటే ఇద్దరూ కోప్పడ్డారు. ఆంటీ అంకుల్ అని పిలవమని డిమాండ్ చేశారు. ఏం చేస్తాం డిమాండ్ ని యాక్సెప్ట్ చేశాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరే ఉంటారు లేండి. పిల్లలు వేరే చోట సెటిల్ అయ్యారు. మా ఇంట్లో నేను, రష్ మా కొడుకు నాని ఉంటాం.

ఆంటీ పక్కకు పిలిచి నాకు ఒకటే చెప్పింది. "రేటు ఎక్కువని బాధ పడుతుంది, తను తనకంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తుంది, తన వల్ల నువ్వు బాధ పడకూడదు అని అనుకుంటుంది" అని చెప్పింది. సైలెంట్ గా ఇంట్లోకి వెళ్లాను.

మా ఇద్దరి మధ్య ఒక సైలెంట్ వార్ జరిగింది. తర్వాత మామూలు అయ్యాం, డ్రెస్ ప్యాక్ చేసి పెట్టింది రిటర్న్ ఇవ్వడం కోసం బయలు దేరాను. బయట జోరున వర్షం పడుతుంది. 

నేను, రష్, ఆంటీ మరియు అంకుల్ అందరం బయటకు వచ్చి వర్షం చూస్తూ ఉన్నాం. రష్, నానిని ఎత్తుకొని ఉంది. 

అంకుల్ "నువ్వు స్టూడెంట్ అన్నావ్ కదా.... డబ్బులు మీ అమ్మ వాళ్ళు పంపుతారా..." అని అడిగాడు.

క్రిష్ "లేదు, వర్క్ చేస్తూ ఉంటాను" రష్ కి కూడా నేను ఏం చేస్తాను అనేది తెలియదు.

అంకుల్ "ఏం వర్క్..."

క్రిష్ "స్టాక్ మార్కెట్..... ఎప్పుడూ చూస్తూ ఉంటూ బుక్ ప్రిపేర్ చేసుకొని నా క్లయింట్ కి చెబుతూ ఉంటాను, ఎప్పుడు కొనాలి అమ్మాలి అని... వాళ్ళ స్టాక్స్ మైంటైన్ చేస్తూ ఉంటాను"

అంకుల్ "ఎంత వస్తుంది?" 

క్రిష్ "ఫుల్ టైం చేస్తే ఎక్కువ వస్తుంది, కాని పార్ట్ టైం పైగా ఒకరి కింద కాబట్టి నెలకు ఒక 15k వస్తాయి. దీంతో పాటు వేరే పార్ట్ టైం జాబ్ చేస్తున్నా... అక్కడ 8k వస్తాయి"

అంకుల్ "ఇందులోకి ఎలా దిగావ్...."

క్రిష్ "నా ఫ్రెండ్ నూతన్ భయ్యా వాళ్ళ రిలేటివ్ ప్రభు అంకుల్ కి కంపనీ ఉండేది.... అందులో ఇన్ బిల్ట్ జిమ్ ఉండేది.... దాని కోసం వెళ్ళే వాళ్ళం.... అలా అలా నేర్చుసుకొని ఇద్దరం అందులోనే వర్క్ చేస్తున్నాం"

అంకుల్ "ఓహో..."

క్రిష్ "నేనెప్పుడు రెంట్ లేట్ చేయలేదు... టైం కి కడుతున్నాను కదా అంకుల్" ఆయన ఓనర్ మేం అద్దెకు ఉంటున్నాం.

అంకుల్ "అదేం లేదు...."

రష్ నా వైపు చూసి న చెవి దగ్గరకు వచ్చి "నిజంగా అంత వస్తుందా..."

క్రిష్ "ఇంకా ఎక్కువే వస్తుంది..... మొత్తం చెబితే... రెంట్ పెంచుతారు" అని చెవి దగ్గర చెప్పాను.

రష్ నా చేతిలో ఉన్న డ్రెస్ కవర్ తీసుకొని "హ్యాపీ బార్ట్ డే చెప్పావ్ కదా... థాంక్స్" అని చెప్పి వెనక్కి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

ఆంటీ కూడా వెనక్కి వాళ్ళ వెళ్ళిపోయింది.

అంకుల్ "నేను చెప్పానా వర్క్ అవుట్ అవుతుంది అని...." అన్నాడు గర్వంగా....

క్రిష్ "అవునూ అంకుల్ తను అలా నా గురించి మాత్రమే ఆలోచించడం నాకు నచ్చలేదు... తన గురించి కూడా తానూ చూసుకోవాలి కదా... వాళ్ళ నాన్న దగ్గర ఉండేటపుడు షాపింగ్ కి వెళ్తే 10k ఖర్చుపెడుతుంది" అన్నాను.

అంకుల్ "నేను నీకు ఫేవర్ చేయలేదు..."

క్రిష్ "లేదు అంకుల్... మీరు నాకు చాలా ఫేవర్ చేశారు" అన్నానో లేదో.... జిగేల్ మనే డ్రెస్ వేసుకొని రష్, నానిని ఎత్తుకొని బయటకు వచ్చింది.

రష్ "వెళ్దామా!" అంది.

షాక్ లో అలానే ఉన్నాను, కేకు కూడా వద్దని అరిచింది. ఇప్పుడు షాపింగ్ అంటుంది. 

రష్ "ఏంటి చూస్తున్నావ్... వెళ్దామా!" అంది.

అంకుల్ "ఎక్కడికి? షాపింగ్ ఆ....." అన్నాడు.

రష్ "అవునంకుల్" అని సమాధానం యిచ్చింది.

అంకుల్ "మంచిది వెళ్లి రండి.... భోజనం కూడా బయట చేయండి... లేట్ అయితే" అన్నాడు.

రష్ చిన్నగా నవ్వి నా చేతిని చుట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళింది. దారి మధ్యలో నా ఫోన్ తీసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసింది.

నేను వెనక్కి తిరిగి చూడగా అంకుల్ విలన్ లా నవ్వుతూ కనిపించాడు.















[Image: pop-art-girl-holding-shopping-bags-88138-217.jpg]





ఇక్కడితో జోక్స్ అయిపోయాయి. 
[+] 11 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 27-08-2024, 05:15 PM



Users browsing this thread: 37 Guest(s)