25-08-2024, 10:58 AM
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్, నేను గుంటూరు దగ్గర లోని ఒక పల్లెటూరు కి చెందినవాడని. మాది చాలా పేదరిక కుటుంభం. మా నాన్న అమ్మ ఇద్దరూ పొలం పనులకు పోయేవాళ్ళు. నాకు ఒక అక్క. మా అక్క ఇంటర్ వరకు చదివి ఇంట్లో మిషన్ కుట్టేది. మాకు ఒక ఎకరా పొలం ఉంది అంతే. అది 2014 వ సంవత్సరం. అప్పటికి మా అక్కకి 20 సంవత్సరాలు. నేను ఇంటర్ అయిపొయ్యి డిగ్రీ చేరాను. మా అక్క కి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. కట్నం ఎక్కువ అడుగుతుండం వల్ల కొద్దిగా ఇబ్బంది పడేవాడు మా నాన్న. ఉన్న ఎకరా పొలం అమ్మేసి అక్క పెళ్లి చేశాడు. నేను డిగ్రీ కళాశాల లో జాయిన్ అయ్యాను. ఇంటి దగ్గర పరిస్థితి బాగోలేదు అందుకే బాగా చదివాను. 2017 వ సంవత్సరం లో నా డిగ్రీ పూర్తి అయ్యింది. జాబ్ చేయాలి అనుకున్నాను. కానీ మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోరా మన బ్రతుకులు బాగు పడతాయి అని చెప్పాడు. ఎలాగోలా కష్టపడి 2019 వ సంవత్సరం లో బ్యాంక్ జాబ్ తెచ్చుకున్నాను. ట్రైనింగ్ భోపాల్ లో ఇచ్చారు. తరువాత నాకు జాబ్ మహారాష్ట్ర లోని ధూలే లో పోస్ట్ చెయ్యబడింది.మా ఇంట్లో వాళ్ళు సంతోషం గా పంపారు. ఎప్పుడు గుంటూరు తప్ప ఎక్కడకి పోని నేను మహారాష్ట్ర కి పోస్టింగ్ అనగానే ఏదోలా అనిపించింది. తప్పదు కదా అని వెళ్ళాను. జాబ్ లో జాయిన్ అయ్యాను. కానీ అక్కడ నాకు ఉండటానికి ఒక ఇల్లు రెంట్ కి కావాలి. తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. జాయిన్ అయ్యాక మధ్యాహ్నం మా బ్యాంక్ లో పనిచేసే అటెండర్ ని అడిగాను. అతను చూపిస్తా కానీ కమిషన్ ఇవ్వాలి సార్ అన్నాడు. సరే అన్నాను. సాయంత్రం ఒక హోటల్ రూం తీసుకుని ఫ్రెష్ అయ్యి పడుకున్నాను. అసలే మనకి తెలియని ప్రదేశం. భాష అంతగా రాదు. తిండి కూడా నచ్చలేదు. ఎలాగా అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఉదయం ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను. అటెండర్ వచ్చి ఒక ఇల్లు చూసాను లంచ్ టైం లో వెళ్లి చూద్దాం అన్నాడు. సరే అన్నాను. ఇక మధ్యాహ్నం వెళ్ళాను ఇల్లు చూడటానికి. ఇల్లు బాగుంది కానీ రెంట్ ఎక్కువ అని వద్దు అన్నాను. ఇంకో రెండు చూపించాడు. రెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. నాకు వచ్చేదే 25000 రూపాయల జీతం. ఇంటికి కూడా పంపాలి కదా అన్నాను అటెండర్ తో. సరే సార్ తక్కువ లో చూద్దాం అన్నాడు. బ్యాంక్ వెళ్లి పని ముగించుకుని మళ్ళీ హోటల్ కి వెళ్ళాను. ఆఫీస్ వాళ్ళు అంతా బాగానే ఉన్నారు కానీ ఎంత అవసరమో అంతే మాట్లాడుతారు. ఎవరి పని వాళ్ళది. అంతా పెళ్లి అయిన ముసలి వాళ్ళు. ఇక ఎలాగూ రాత్రి పడుకుని ఉదయం అటెండర్ ఫోన్ చేస్తే లేచాను. వాడు తక్కువ రెంట్ కి ఇల్లు చూపించాడు కానీ అది స్లమ్ ఏరియా. అస్సలు బాగోలేదు ఆ ఏరియా. అది కూడా వద్దు అన్నాను. ఇక అతను బాగా ఆలోచించి సార్ ఒక ఇల్లు ఉంది కానీ ఒక రూం మరియు టాయిలెట్ మాత్రమే. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉంటాను అంటేనే చూపిస్తాను అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాను. మీరు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అక్కడ హౌస్ ఓనర్ బావ డీఎస్పీ, ఏమైనా తేడా జరిగితే మిమ్మల్నే కాదు నన్ను కూడా జైలు లో పడేస్తారు అన్నాడు. నాకేం అవసరం లేదు వాళ్ళతో రెంట్ ఇస్తాం ఉంటాం అంతే అన్నాను. అదే సార్ మీరు మంచివారని చెప్పినా ఆ ఇల్లు, సాయంత్రం వెళ్దాం అన్నాడు. సరే అని ఆఫీసు కి వెళ్ళాం. సాయంత్రం బ్యాంక్ నుంచి అలానే ఇల్లు చూడనీకి పోయాం. ఇల్లు చాలా బాగుంది. చుట్టూ కాంపౌండ్, కాంపౌండ్ మీద కూడా తీగల చెట్లు, లోపల అంతా రకరకాల పూల చెట్లు, కొన్ని కూరగాయల చెట్లూ, చాలా బాగుంది. మా అటెండర్ వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. ఒక అమ్మాయి వచ్చింది చెప్పు మోతే (అటెండర్ పేరు) అంది. నమస్కారం అమ్మా, మధ్యాహ్నం చెప్పాను కదా మా సర్ కిరణ్ ఆంధ్ర ఆయనది, మా బ్యాంక్ లో క్లర్క్, ఈయనకే ఇల్లు కావాలి అన్నాడు. సరే చూపించు ఇల్లు అని కీస్ ఇచ్చింది. నేను నమస్తే చెప్తే ఏదో చూసి చూడనట్టు వెళ్ళింది. ఇల్లు చూశాం. క్లీన్ గా ఉంది. మంచి గాలి, ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. రెంట్ తక్కువ అవ్వడం తో సరే అన్నాను. కిందకి వచ్చి ఓకే నాకు అన్నాను. సరే ఎప్పుడు వస్తారు అంది. రేపు ఉదయం వస్తాను అన్నాను. అలాగే అని కీ నాకు ఇచ్చేసి మోతే తో అడ్వాన్స్ రేపు ఉదయం ఇవ్వమని చెప్పింది. వాడు సరే అమ్మా అని చెప్పాడు. ఇక మేము బయటకి వచ్చేసాము.