23-08-2024, 08:39 PM
23. మేఘ దొరికింది.
(వారం రోజుల తర్వాత)
సుహాస్ మరియు ప్రియాంక ఇద్దరూ వాళ్ళ ఊళ్ళో అమ్మవారి గుడిలో కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు.
ప్రియాంక కళ్ళు నిద్ర లేనట్టు నల్లగా ఉన్నాయి.
సుహాస్ "నిద్ర పట్టడం లేదా.... ఏంటి? అలా ఉన్నావ్..."
ప్రియాంక "ఈ మధ్య కలలు చాలా చండాలంగా వస్తున్నాయ్...."
సుహాస్ "కల అని నువ్వే చెబుతున్నావ్ కదా.... ఇంకా ఏంటి? వదిలేసెయ్...."
ప్రియాంక వాళ్ళ అమ్మ "నేను అదే చెబుతున్నా నాలుగు రోజులు ఆగవే.... అవే పోతాయ్ అంటే.... గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంది"
సుహాస్, ప్రియాంక చెవిలో "నీ ఆరోగ్యం చూసుకోవాలి కదా..."
ప్రియంక "మీకు నేను చెప్పేది ఎందుకు అర్ధం కాదు.... ముందు చూడండి..." అని విసుక్కుంది.
సుహాస్ ఆమెను చూస్తూ గుటకలు మింగాడు.
సుహాస్ "మేఘ, ఎందుకని అంత ఇంపార్టెంట్...."
త్రిషా "నువ్వే ఆలోచించు.... నేను సుమారు ఆరు ఏడూ నెలలుగా మాస్టర్ చెరలో ఉన్నాను. కాని ఎప్పుడూ కూడా అతనితో స్వయంగా మాట్లాడింది లేదు... కానీ మేఘ మాట్లాడింది. తను ఒక పని చేయించుకుంది"
సుహాస్ "నా మీద కోపంతో నా వైఫ్ పేరుని మీ మాస్టర్ కి చెప్పింది"
త్రిషా ఏమి మాట్లాడలేదు.
సుహాస్ "కనీసం తనని అయినా నా చేతులతో చంపే అవకాశం ఇవ్వండి" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
త్రిషా "మనకు ముందు ఆమె నుండి ఇన్ఫర్మేషన్ కావాలి" అంది.
సుహాస్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
కేశవ్ పెళ్లి అయింది, తిరిగి జాబ్ లో జాయిన్ అయ్యాడు.
సుహాస్ తిరిగి సిటీకి వెళ్ళాడు.
సుహాస్ "హ్యాపీ మ్యారేడ్ లైఫ్..."
కేశవ్ "థాంక్యు..."
సుహాస్ "మేఘ మిస్సింగ్ కేస్ ఎక్కడ వరకు వచ్చింది"
కేశవ్ "నువ్వు నాకు ఇంకేమైనా చెప్పాలా.."
సుహాస్ సైలెంట్ గా ఉన్నాడా....
కేశవ్ "మేఘని లవ్ చేస్తున్నావా...."
సుహాస్ "వాట్"
కేశవ్ "సంవత్సరం నుండి మీ వైఫ్ అండ్ సన్ కి దూరంగా ఉన్నావ్"
సుహాస్ "మ్"
కేశవ్ "మేఘ వెళ్ళిపోయాక, నువ్వు మళ్ళి మీ వైఫ్ ని కలిశావ్.... నీకు మేఘకి సంబంధం లేదా..."
సుహాస్ "...."
కేశవ్ "మేఘని కనుక్కోమని నువ్వే మా పై ఆఫీసర్స్ చేత చెప్పించావ్... నీకు మేఘకి సంబంధం లేదా..."
సుహాస్ "...."
కేశవ్ "చెప్పూ"
సుహాస్ "హహ్హహ్హా" అని నవ్వాడు.
కేశవ్, సుహాస్ ని చూసి కోపం వచ్చింది.
సుహాస్ మాత్రం పొట్ట పట్టుకొని నవ్వుతూనే ఉన్నాడు.
కేశవ్ "ఎందుకు నవ్వుతున్నావ్...."
సుహాస్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు.
కేశవ్ "సుహాస్..." అని సీరియస్ గా అరిచాడు.
సుహాస్ "సుమారు సంవత్సరం అయింది ఇంత బాగా నవ్వి.... కాసేపు నవ్వనివ్వు" అన్నాడు.
అయిదు నిముషాల తర్వాత...
సుహాస్ "ఇన్స్పెక్టర్ కేశవ్.... అసలేం జరుగుతుందో నువ్వు ఊహించను కూడా లేవు..."
కేశవ్ "చెప్పూ..."
సుహాస్ జరిగింది మొత్తం చెప్పాడు.
కేశవ్ కూడా సుహాస్ నవ్వినట్టు నవ్వబోతాడు.
కాని నవ్వలేక ఆగిపోతాడు.
కేశవ్ ....:
సుహాస్ చెప్పింది నమ్మాలని లేదు, కానీ అతని కళ్ళు అబద్దం చెప్పడం లేదు, అలాగే ఇందులో తన వైఫ్ ని ఇన్వాల్వ్ అయి ఉంది.
ఇందులో వేరే ఏదైనా ఉండి అతన్ని పిచ్చి వాణ్ని చేస్తూ ఉండొచ్చు.
సుహాస్ ఫోన్ మోగింది.
సుహాస్ నా ముందే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు.
సుహాస్ "మేఘ దొరికింది..." అన్నాడు.
సుహాస్...:
కేశవ్ నమ్మడాని నాకు తెలుసు, కాని ఇది నిజం. అందుకే చెప్పేసాను.
ఫోన్ మోగింది. త్రిషా డ్రైవర్...
సుహాస్ "హలో"
డ్రైవర్ "హలో సర్.... మేఘ దొరికింది, ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ చేశాను"
సుహాస్ "మత్తు ఇంజెక్షన్?" అని ఆశ్చర్యంగా అడిగాను.
డ్రైవర్ "సైకియాట్రిక్ డాక్టర్ కి డ్రైవర్ ని కదా సర్... వాటి అవసరం మాకు ఉంటుంది"
సుహాస్ "సరే, ఇప్పుడు ఎక్కడ ఉంది"
డ్రైవర్ "లొకేషన్ పంపించాను... మీరు కూడా రండి.... ఈ అమ్మాయికి మత్తు సరిగ్గా ఎక్కలేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది"
సుహాస్ "సరే పంపు"
కేశవ్ కి మేఘ దొరికింది అని చెప్పాను.
దారిలో త్రిషా ఫోన్ చేసి తనని ఆమె ఆఫీస్ దగ్గరకు తీసుకొని రమ్మంది.
కేశవ్ నేను ఇద్దరం బయలు దేరాం
ఇద్దరం కలిసి సుహాస్ చెప్పిన ప్లేస్ కి వెళ్లాం. అది ఒక పార్కింగ్ ఏరియా, అక్కడ త్రిషా అసిస్టెంట్ నెల మీద రక్తము మడుగులో ఉన్నాడు.
లేపితే ఏం గుర్తు లేదు అంటున్నాడు.
అతన్ని చూడగానే అబ్యులేన్స్ కి ఫోన్ చేసి త్రిషాకి ఇన్ఫార్మ్ చేసి పంపాము.
కేశవ్ సలహా మేరకు అక్కడ ఉన్న CC కెమెరా ఫుటేజ్ చూస్తున్నాము.
అది చూసి నాకు ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి.
కేశవ్ "నువ్వు వశీకరణం ఓన్లీ అమ్మాయిల మీద అన్నావ్ కదా...."
నేను స్క్రీన్ నమ్మలేక నమ్మలేక చూస్తున్నాను.
కేశవ్ "ఆ నూతన్ మాత్రమే వశీకరణం చేయగలడు అన్నావ్..."
కేశవ్ అడిగిన ప్రశ్నలు నాకు చెంప దెబ్బలు కొట్టినట్టు ఉన్నాయ్....
త్రిషాకి ఫోన్ చేశాను..
త్రిషా "హలో..."
సుహాస్ కోపంగా "కేవలం అమ్మాయిల మీదనే వశీకరణం చేయగలరా..."
త్రిషా "నూతన్ ఎప్పుడూ కూడా....."
సుహాస్ కోపంగా "సరిగ్గా చెప్పూ" అని అరిచాను.
త్రిషా "నా వాచ్ మెన్ నజీర్ ని కూడా వశీకరణం చేసి ఒక రోజు అల్లా ఎండలో గోడకుర్చీ వేయించాడు"
సుహాస్ "నాకు ఎందుకు చెప్పలేదు... మగాళ్ళని కూడా వశీకరణం చేయగలరు అని నాకు ఎందుకు చెప్పలేదు..." అని కోపంగా అడిగాడు.
త్రిషా "నువ్వు భయపడతావు అని...."
సుహాస్ "హా... ఇప్పుడు దైర్యంగా ఊగిపోతున్నాను...."
త్రిషా "ఏమయింది? ఇప్పుడు..... అయినా నూతన్ ని నువ్వు కలిసే అవకాశం లేదు కదా...."
సుహాస్ "చూడండి మేడం... మీరు తెలివిగలవారు అని బిల్డ్ అప్ ఇంకోసారి ఇవ్వకండి..."
త్రిషా "ఏమయింది?"
సుహాస్ గట్టిగా స్వాస్ పీల్చుకొని చెప్పలేక చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు.
త్రిషా "ఏమయింది? ఏమయినా సమస్య.... నా డ్రైవర్ బాగానే ఉన్నాడు అంట... ఇంకేమిటి సమస్య..."
సుహాస్ "మేఘ నీ డ్రైవర్ ని..... పోడుచుకోమంది.... నీ డ్రైవర్ పోడిచేసుకున్నాడు"
త్రిషా "వాట్...."
సుహాస్ "అవునూ...."
త్రిషా "అంటే...."
సుహాస్ "మేఘ నీ లాగా నా లాగా విక్తిం కాదు... తను మాస్టర్..."
త్రిషా "నూతన్ కాక ఇంకా మాస్టర్ లు ఉన్నారా..."
సుహాస్ "ఇప్పుడు ఈమెకి మత్తు మందు ఇచ్చారు.... బయటకు వెళ్ళింది..... ఏం చేస్తుందో ఏంటో..."
కేశవ్ "ఓకే.... ఓకే.... ఓకే.... " అని ఫోన్ మాట్లాడాడు.
సుహాస్ "ఏమయింది?"
కేశవ్ "మేఘ ఇక్కడ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ లోకి వెళ్ళింది"
సుహాస్ "అంతా బాగానే ఉందా" అని అనుమానంగా అడిగాడు.
కేశవ్, సుహాస్ ముందే ఫోన్ లో "దగ్గరలోనే ఉన్నాను, వెళ్తున్నాను"
కేశవ్ మరియు సుహాస్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ ఆ షాపింగ్ మాల్ దగ్గరకు వెళ్ళారు.
షాపింగ్ మాల్ లో అటూ ఇటూ తిరిగుతున్న మేఘ అక్కడున్న ఒకమ్మాయితో "హేయ్... గర్ల్ ఒక ఆట ఆడదామా..." అని అడిగింది.
"ఇప్పుడే అందిన వార్త XXXX షాపింగ్ మాల్ లో కలకలం, ఒకమ్మాయి పై నుండి దూకేసిన ఘటన చోటు చేసుకుంది"
......ఆట మొదలయింది.....