Thread Rating:
  • 12 Vote(s) - 2.42 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: 'నూతన్' పరిచయం
#47
19. నూతన్ మరో అమ్మాయిని తీసుకొని వచ్చాడు














త్రిషా "ప్లీజ్ కమిన్...."

సుహాస్ "మళ్ళి ఎపుడువస్తాడు"

త్రిషా "నూతన్ ని ఫేస్ చేయాలని అనుకోకు..."

సుహాస్ "ఓకే..."

త్రిషా "మేఘ దొరికిందా..."

సుహాస్ "వెతుకున్నాం..... అలాగే సెక్యూరిటీ ఆఫీసర్ల చేత కూడా వెతికిస్తున్నాం"

త్రిషా "ఇన్ని రోజులు అయినా కుదరలేదా..."

సుహాస్ కోపంగా "ఓహో... అయితే మీరు ఆ ఇద్దరినీ కనుక్కున్నారా..." అని వెక్కిరించాడు.

త్రిషా "లేదు"

సుహాస్ "సరే..."

త్రిషా "నేను ఇద్దరినీ కనుక్కోవాలి..... నువ్వు ఒక్క అమ్మాయినే కనుక్కోవాలి...."

సుహాస్ "ఆ అమ్మాయి ఎవరికీ కనపడకూడదు అని పారిపోయింది..."

త్రిషా "ఓకే.... అర్గ్యు చేసుకోవద్దు..."

సుహాస్ "సరే... పేరు అయినా కనుక్కున్నారా...."

త్రిషా "ఆర్గ్యుమెంట్ వద్దు అన్నానా...."

సుహాస్ "పేరు కూడా కనుక్కోలేదా..."

త్రిషా సీరియస్ గా చూస్తుంది.

సుహాస్ చిన్నగా నవ్వుతాడు. త్రిషాకి కోపం వస్తుంది.

ఇన్ని రోజుల నుండి విరివిగా కలవడంతో ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్ షిప్ పుట్టింది. అందుకే త్రిషా అంతకు ముందులా యాటిత్యూద్ చూపించడం లేదు.

ఇంతలో త్రిషా ఎదురుగా ఉన్న ఫోన్ మోగుతుంది. 

త్రిషా "హలో...."

వాచ్ మెన్ "మేడం.. నూతన్ గారు వచ్చారు"





నూతన్ వస్తాడు అని త్రిషా తెలివిగా సుహాస్ ని దొంగ దారిలో ఇంట్లోకి రానిస్తుంది, ఇప్పుడు కూడా అదే దారిలో బయటకు వెళ్ళమని చెబుతుంది.

సుహాస్ వెళ్లినట్టు వెళ్లి నూతన్ ని చూడాలని వెనక్కి వచ్చి దాక్కుంటాడు.

సుహాస్ చూస్తూ ఉండగానే, డోర్ తెరుచుకొని ఆరు అడుగుల రెండూ అంగుళాల వ్యక్తీ లోపలకు వచ్చాడు. సూట్ వేసుకొని స్టైల్ గా ఉన్నాడు. 

కాని ఆశ్చర్యం ఏమిటి అంటే, అతని వెనకే ఒకమ్మాయి బ్యాగ్స్ లాక్కొని వస్తుంది. నాకు తెలిసి ఏ మగాడు కూడా అమ్మాయిల చేత మోయించడు. 

కాని నాకు అర్ధం అయింది ఏమిటి అంటే, ఆ కొత్త అమ్మాయి, నూతన్ కి బానిస.

వస్తూనే, త్రిషా నవ్వుతూ "నూతన్.." అంటూ ఎదురు వెళ్ళింది. వెనక ఉన్న అమ్మాయిని చూసి ఆగిపోయింది.

కాని నూతన్ వస్తూనే చిటికే వేశాడు. త్రిషా ప్రవర్తనలో మార్పు వచ్చింది, 35+ వయస్సు ఉన్న సైకియాట్రిక్ డాక్టర్ కానీ నూతన్ చిటికే వేయగానే ఎదో 18 సంవత్సరాల పడుచుపిల్లలాగా ఎగురుతూ "మాస్టర్....!" అని నోరు మొత్తం తెరిచి చెప్పింది. అలాగే "వచ్చారా.... మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యాను" అంటూ అతని గుండెల మీద వాలిపోయింది.

త్రిషాని చూస్తే వేరే అమ్మాయిలా అనిపించింది, చూస్తూనే నా చేయి ఆటోమేటిక్ గా నా నోటిని మూసేసింది. త్రిషా చెబుతూనే ఉన్నా నేను ఎదో అనుకున్నాను. కాని చూస్తూ ఉంటే అర్ధం అవుతుంది. నూతన్ నిజంగా చాలా డేంజర్ పర్సన్.

త్రిషా "మాస్టర్.... తను ఎవరూ...." అని కోపంగా ఆ వచ్చిన అమ్మాయిని చూపించింది.

నేను ఏదైనా సమస్య వస్తుందా అని చూస్తూ ఉన్నాను.

ఆమె కూడా కోపంగా చూస్తూ "నేను అంటే మాస్టర్ కి చాలా ఇష్టం" అంది.

త్రిషా కోపంగా ముందుకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా వచ్చింది.

నూతన్ "ష్.... ష్.... ష్.... మీ ఇద్దరు నాకు ఇష్టమే... త్రిషా తన పేరు కేతిక.... కేతిక తను త్రిషా...." అని పరిచయం చేశాడు.

ఇద్దరూ నవ్వుతూ నూతన్ చెరో చేతిని చుట్టుకున్నారు. జనరల్ గా ఏ అబ్బాయి కైనా ఇది ఒక కల.

కానీ నిజం ఏంటి అంటే, నూతన్ వాళ్ళ ఇద్దరినీ రెండూ కుక్క పిల్లలు లాగా చూస్తున్నాడు. 

ఇద్దరూ కూడా నూతన్ ని చూసి మురిసిపోతున్నారు.

ఇంతలో వెనక గెట్ దగ్గర పెద్ద సౌండ్ అయింది. 

నూతన్ పరుగులాంటి వేగంతో అక్కడకు వచ్చి చూశాడు. 

చుట్టూ చిక్కటి చీకటిలో కీటకాలు శబ్దాలు కిర్ కిర్ మని వినిపిస్తూ ఉన్నాయి.

సుహాస్ అక్కడ ఉన్న చిన్న ఐరన్ ప్లేట్ లాంటిది కింద పడడంతో అక్కడ ఉన్న సిమెంట్ చేసిన నేలపై పది శబ్దం వచ్చింది. 

నూతన్ అక్కడకు వచ్చి ఆ ఐరన్ ప్లేట్ చేతుల్లోకి తీసుకున్నాడు.

అనుమానంగా చుట్టూ చూస్తున్నాడు. అక్కడ ఉన్న పాత గోతాలు, వెస్ట్ సామాను చూస్తే, దాని వెనక ఎవరో ఉన్నారని అర్ధం అవుతుంది.

నూతన్ "ఎవరూ?" అని అరిచాడు. 

సుహాస్ తన గొంతు బయట పడకుండా, నోటికి చేతిని అడ్డం బలంగా నొక్కి పెట్టుకొని దొరకకూడదు అనుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చున్నాను.

నా గుండె శబ్దం చర్చి గంట లాగా చాలా పెద్దగా నాకే వినిపిస్తుంది. నా నుదుటి నుండి చమటలు బొట్లుగా మొదలయి ధారగా కారిపోతున్నాయి.

నూతన్ తల కూడా తిప్పకుండా కళ్ళతోనే చుట్టూ చూస్తూ గదిలో మరో మనిషి ఉన్నారా అనేది గమనిస్తూ ఉన్నాడు. 

ఒక పులి దాక్కున్న తన వేట కోసం చూస్తున్నట్టు ఉంది. నూతన్ ఒక్కో అడుగు వేస్తూ సుహాస్ దాక్కున్న వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఇంతలో వెనక నుండి క్యూట్ వాయిస్ "మాస్టర్ రండి..." అనుకుంటూ కేతిక వస్తుంది. 

నూతన్ ఆమె అందాన్ని చూసి మైమరచి పోయి ఆమె వెనకే వెళ్ళాడు. సుహాస్ దొరికిన సమయం ఆధారం చేసుకొని మెల్లగా వెళ్లి బయట డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్లాలని చూశాడు.

ఇంతలో లోపల నుండి సౌండ్ వచ్చింది. నూతన్ వేగంగా తన వైపు వస్తున్నాడు. సుహాస్ తిరిగి దాక్కొని ఉన్నాడు.

నూతన్ ఈ సారి అక్కడ మరో వ్యక్తీ ఉన్నాడు అని అర్ధం చేసుకొని అడుగు వేయబోతూ ఉంటే, త్రిషా వచ్చి "ఏమయింది?" అని అడిగింది.

నూతన్ "నా బ్యాగ్ లో గన్ ఉంది తీసుకొని రా..." అన్నాడు.

త్రిషా "సరే మాస్టర్ అని వెళ్ళింది"

ఇంతలో అక్కడ పిల్లి కనపడడంతో నూతన్ ఊపిరి పీల్చుకొని "వద్దులే" అని కేకేశాడు.

సుహాస్ అక్కడ కూర్చొని ఉండగా, లోపల త్రిషా మరియు కేతిక ఇద్దరూ నూతన్ ని బిజీగా ఉంచుతున్నారు.

సుహాస్ ఊపిరి తీసుకొని మామూలు అయి గెట్ తీసుకొని బయటకు వచ్చాడు.

ఫాస్ట్ గా వచ్చి బైక్ ఎక్కి ఇంటికి వచ్చాడు.

అప్పుడు గాని తనకు దడ తగ్గింది.




సుహాస్ ఫోన్ మోగింది.

ప్రియాంక "హలో"

సుహాస్ "చెప్పూ ప్రియ..."

ప్రియాంక "ఎప్పుడోస్తావ్...."

సుహాస్ "ఏమయింది?"

ప్రియాంక "ఈ మధ్య నాకు పీడకలలు వస్తున్నాయి"

సుహాస్ "..."

ప్రియాంక "నా మీద ఏమయినా క్షుద్ర పూజ చేసారేమో అంటున్నారు"

సుహాస్ "..."

ప్రియాంక "మనిద్దరం అమ్మవారి గుడిలో పూజలో కూర్చోవాలంట"

సుహాస్ "..."

ప్రియాంక "నువ్వు వస్తావ్ కదా...."

సుహాస్ "వస్తాను" అని ఫోన్ కట్టేశాడు.

సుహాస్ కోపంగా గట్టిగా అరిచాడు.


















[Image: bengal-tiger-resting-among-green-bush-photo.jpg]
[+] 7 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: 'నూతన్' పరిచయం - by 3sivaram - 23-08-2024, 05:58 PM



Users browsing this thread: 13 Guest(s)