Thread Rating:
  • 40 Vote(s) - 2.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కాలం కలిసొస్తే
Chapter 16


టైం ఎనిమిది కూడా కాకముందే మెలకువ వచ్చేసింది. సరే ఇంకా రెండు గంటలలో నేహా కలుద్దాము అంది. ఫోన్ చేస్తుందిలే అనుకుని లేచాను. వెళ్లి అలా వరండాలో కూర్చున్నాను. నాన్నకి ఆరోజు సెలవు. గార్డెన్లో ఏదో మొక్కల పని చేస్తున్నారు. అలా కూర్చుని ఈనాడు పేపర్ చదువుతున్నాను. ఇంతలో అమ్మ వచ్చింది.

అమ్మ: యేరా నాన్న అప్పుడే లేచేసావు?

నేను: నిద్ర పట్టలేదమ్మా. రాత్రి సరిగ్గా తినలేదు. ఆకలికి అనుకుంట మెలకువ వచ్చింది. సరే ఏకంగా తినేసి పాడుకోవచ్చులే అనుకుని లేచాను

అమ్మ: ఏమి తింటావు? ఉప్మా చేశాను. అది ఒకే నా? లేదంటే నాన్న వెళ్లి ఏదన్న తీసుకొస్తారు. లేదు ఒక అరగంట ఆగుతాను అంటే ఏకంగా అన్నం వండేస్తాను.
అమ్మ హోటల్ లో మెనూ లాగా ఆప్షన్స్ ఇచ్చేసింది. అయితే నాకు అదేమీ ఎక్కలేదు.

నాన్న: అవన్నీ ఎందుకు? వాడికి పూరి మైసూరుబొండ ఉంటే చాలు. అంతే నా?

నాన్నని చూసి నవ్వొచ్చింది. చిన్నప్పటి నుండి నాకు బాగా ఆకలేస్తే నేను తినే టిఫిన్స్ అవి.

నేను: పర్ఫెక్ట్. అంతే నాన్న.

అమ్మ: బంగారు కొండ. సరే అయితే. ముందు కాఫీ తాగు

వెనక్కి తిరిగి చుస్తే మంజు కాఫీ కప్స్ లో తీసుకొచ్చింది. నాలుగు కప్స్. మా ముగ్గురికి తలా ఒకటి ఇచ్చి తాను ఒక కప్ తీసుకుని వరండాలో రెండు అడుగుల దూరం కూర్చుంది.

అమ్మ: ఎందుకే అలా దూరం కూర్చున్నావు? నీకు ఎన్ని సార్లు చెప్పను అలా దూరం కూర్చోకు వచ్చి మాతో కూర్చో అని

అలా అమ్మ కసిరేసరికి మంజు కాస్త ముందుకి జరిగి కూర్చుంది.

మంజు: అయ్యో. అలా కాదక్కా. పొద్దున్న నుంచి పని చేస్తున్నాను కదా. మళ్ళీ చమట పడితే ఆ వాసన వస్తుంది అని.

నేను: చమట అందరికి పడుతుంది మంజు. ఆ వాసన ఎలా ఉంటుందో మాకు తెలుసు. అలా దూరం కూర్చోకు. దా అని ఇంకా దెగ్గరికి రమ్మన్నాను.

మంజు: ఇంకా చాల్లే బేటా. ఇంకా దెగ్గరికి ఓచిననంటే ఇక నీ  మీదెక్కాలి

అమ్మ నేను నవ్వాము. నాన్న ఈలోగా లేచి బయటకి వెళ్లారు నాకోసం టిఫిన్ తేవడానికి.

అమ్మ: అవును మంజు. ఇంతకీ నీ కూతురు ఎలా ఉంది?

మంజు: మంచిగుందక్క. బెంగళూరు మంచిగా ఉందంట ఆమెకి. నన్ను కూడా తోల్కపోతా అంది.

నేను: బెంగళూరు ఎప్పుడెళ్లింది?

మంజు: రెండు వారలు అయితుంది బేటా. అదేదో చేస్తారంట కదా కంపెనీలో చేరే ముందు. గాడి చేయానికి పోయింది.

నేను: లైవ్ ప్రాజెక్ట్. ఇంటర్న్షిప్ అని కూడా అంటారు. వెరీ గుడ్. జాబ్ లో జాయిన్ అయ్యే ముందు చేస్తే చాలా మంచిది.

మంజు: ఏమో బేటా. అంత మీవల్లే. అది మంచిగా చదువుకోవాలె. మంచిగా నీలెక్క ఉద్యోగం చేసుకోవాలె. నాలెక్క కావద్దు అని దేవునికి మొక్కిన. ఉద్యోగం వచ్చింది.

అమ్మ: మేము ఏమి చేశామే పిచ్చిదానా. అంత నీ కష్టం, దాని తెలివి. భగవంతుడి దయ.

నేను: బెంగళూరు లో ఎక్కడుంది?

మంజు: ఏమో బేటా. తెల్వది. ఫ్రెండ్స్ తో పోయింది. ఆమెతోనే చదివే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు కూడా ఆడనే పని చేస్తుర్రు.

అమ్మ: చదువయ్యాక పోస్టింగ్ కూడా బెంగళూరు లోనే అంట రా. ఆ కంపెనీ ఇక్కడ హైదరాబాద్ లో లేదట.

నేను: పోనీ లే అమ్మ. బయట ఉంది, బయట ఉద్యోగం చేస్తే ఆ అనుభవమే వేరు. చాలా మంచిది. కనీసం రెండేళ్లు అయినా ఉండని.

మంజు: ఏమో బేటా. నాకు భయమైతుంది.

అమ్మ: ఏమి భయం లేదు. అది అక్కడికి వెళ్ళాక నువ్వు ఇక్కడికి వచ్చేయి. ఇల్లు అద్దె దేనికి దండగ. ఎలాగూ మేము పైన వేసే పోర్షన్స్ పూర్తి అయిపోతుంది ఇంకో నెల రోజులలో. అప్పుడు నువ్వుకూడా వచ్చేసెయ్యి ఇక్కడే ఉండు. ఒక పోర్షన్ లో నువ్వు ఉండు. పాప వచ్చినప్పుడు ఉండటానికి వేరే రూమ్ కూడా ఉంది.

మంజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది మా అమ్మ చూపే వాత్సల్యం అనే చెప్పచ్చు. మేము ఉంటున్న ఇండిపెండెంట్ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో మూడు బెడ్ రూమ్స్, కిచెన్, ఇంకా హాల్ ఉన్నాయి. ఇప్పుడు పైన ఇంకో రెండు ఒక 2BHK ఇంకో సింగల్ రూమ్ వేస్తున్నాము.

ఆ 2BHK నాకోసమే అని అమ్మానాన్న చెప్పక పోయినా నాకు అర్థం అయింది. ఇప్పుడు పెళ్లి అయ్యాక వేరే ఉండటం మంచిది. ఒకే ఇంట్లో ఉంది తిట్టుకోవడం తన్నుకోవడం కంటే ఇదే నయం అని అమ్మ నాన్న ఫీలింగ్. అందుకని వేరే ఉండేలాగా అలా అని దూరం ఉండకుండా. ఒకవేళ నాకు పెళ్లి అయినా అమ్మాయి వాళ్ళ చుట్టాలు ఎవరన్నా వస్తే ఉంటుంది అని ఇంకో రెండు రూమ్ లు కూడా కట్టిస్తున్నారు. ఇప్పడు అంత అయిపోయి కేవలం కాస్త పెయింట్ పని మిగిలింది. అమ్మ ఇప్పుడు మంజుని అందు[b]లో ఒక రూమ్ లోకి వచ్చేయమంటోంది.[/b]

నేను: అవును మంజు. హాయిగా ఇక్కడే ఉండు. నీ ప్రైవసీ కి మేము ఏమి భంగం కలిగించాము లే అన్నాను.

మంజు చాలా అమాయకంగా అడిగింది. ప్రైవసీ అంటే ఏంటి బేటా అని. నాకు నవ్వు జాలి వచ్చాయి. తనకి అర్థం అయ్యేలాగా చెప్పాను. ఆలా మాట్లాడుతుంటే నాన్న వచ్చారు. అందరికి టిఫిన్ తెచ్చారు.

అమ్మ: నాకు ఎందుకు తెచ్చారు? అంత ఉప్మా చేశాను. వేస్ట్ అయిపోతుంది

నాన్న: అబ్బా ఏమి కాదులే. నువ్వు నీ ఉప్మా గోల. చక్కగా వేడి వేడి ఇడ్లీ తిను. ఉప్మా వాడు మధ్యాహ్నం తింటాడులే. యేరా?

నేను: నాకేమి ప్రాబ్లెమ్ లేదు. కానియ్యండి.

అందరము డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటున్నాము. టైం ఎనిమిదిన్నర అయింది. నేహా చెప్పిన టైం కి ఇంకో గంటన్నర ఉంది. నేను ఫోన్ చూసాను. మెసేజ్ కూడా పెట్టలేదు. సరే ఏమి చేస్తుందో చూద్దాము. బయటకి రమ్మంటే వెళ్ళాలి. కాకపోతే అమ్మ నాన్న ఆరోజు సాయంత్రం ట్రైన్ కి వైజాగ్ వెళ్ళాలి. ఒక పదిరోజుల పాటు ఏదో పెళ్లి ఇంకా ఎవర్నో కలవాలి అని వెళ్తున్నారు. వాళ్ళని స్టేషన్ లో దింపాలి. ఇలా ఏవో ఆలోచనల నడుమ టిఫిన్ తింటుంటే అమ్మ ఫోన్ మోగింది. చుస్తే నేహా.

మొదట సంకోచించినా, అమ్మ ఫోన్ ఎత్తింది. స్పీకర్లో లేనప్పటికీ నేహా మాట్లాడేది నాకు అర్ధం అవుతోంది.

హలో నేహా.

చెప్పమ్మా.

ఎలా ఉన్నావు.

బావున్నాము.

మీ ఇంట్లో అందరు ఎలా ఉన్నారు?

అంకుల్ బావున్నారు.

మంజు కూడా బావుంది.

వాడా. ఉన్నాడు. ఇంకా నిద్ర లేవలేదు. రాత్రి లేట్ అయింది అని పడుకున్నాడు.

అమ్మ నాగురించి అబద్దం చెప్పింది.

లేదమ్మా. ఈరోజు ఊరెళ్తున్నాము. మళ్ళీ పదిరోజులయ్యాక వస్తాము.

అవునా? సరే అయితే లంచ్ కి వచ్చేయి.

సరే బై.

అమ్మ ఫోన్ పెట్టేసి నానా వైపు నాన్న వైపు చూసింది. నాన్న కోపంగా చూస్తున్నారు. మంజు సైలెంట్ గా తిన్న ప్లేట్స్ అన్ని తీసేసి వంటింట్లోకి వెళ్ళింది.

నాన్న: నేహా వస్తోందా?

అమ్మ: అవును. తాను మళ్ళీ అమెరికా వెళ్ళిపోతోంది. వెళ్లే లోపల ఒకసారి మానని కలుస్తాని ఇంటికి వస్తాను అంది.

నాన్న: ఎందుకట? అవసరమా ఇప్పుడు ఇవన్నీ? అయినా మనల్ని కలవడం దేనికి?

అమ్మ: అదేంటండి అలా మాట్లాడుతారు. మంచి పిల్ల. అందుకే కదా మనము చేసుకోవాలి అనుకున్నాము. ఏదో తలరాత వేరేలాగా ఉండటం వల్ల వేరే ఇంటికి కోడలిగా వెళ్ళింది. అలా అని అమ్మాయిలో మంచితనం పోదు కదా ఉన్నట్టుండి?

నాన్న: అదంతా కాదు. తాను మంచిదే. నాకు కూడా తెలుసు. కానీ వీడు పడ్డ యాతన నుంచి ఇప్పుడే బయట పడుతున్నాడు. మళ్ళీ అవసరమా? అయినా నీకు ఫోన్ చేయడం ఏంటి? మీరిద్దరూ టచ్ లో ఉన్నారా?

అమ్మ: లోకేష్ ఫోన్ ఎత్తట్లేదు అని నాకు చేసింది.

నేను: నాన్న. ఏమి పర్లేదు. నేను మూవ్ ఆన్ అయిపోయాను.

నాన్న అమ్మ ఇద్దరు సైలెంట్ గా నన్నే చూస్తున్నారు. మంజు అందరికి ఇంకో రౌండ్ కాఫీ తెచ్చి అమ్మ పక్క కుర్చీలో కూర్చుంది.

నేను: నేహా విషయంలో నేను బాధ పడ్డాను. రోజు కాకపోయినా, అప్పుడప్పుడు పడుతూనే ఉంటాను. తాను గుర్తొచ్చినప్పుడల్లా అరే మిస్ అయ్యానే అనిపిస్తూనే ఉంటుంది. కానీ నిజాన్ని ఒప్పుకోవాలి. నేను ఒప్పుకున్నాను. మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి కొలీగ్స్ ఉన్నారు. ఇక్కడ నేను బాగా పని చేసి మంచిగా గ్రో అవుతాను అనే నమ్మకం ఉంది. నాకు లేనిదాని గురించి బాధ పడటం కంటే ఉన్న దాంట్లో సంతోషపడటంలో ఉన్న ఆనందం ఏంటో నాకు తెలుసు. కాబట్టి మీరు ఖంగారు పడకండి. నేహా వచ్చినా నాకు ఏమి కాదు. ఒక మంచి ఫ్రెండ్ మళ్ళీ నా జీవితంలోకి వస్తోంది అనుకుంటాను.

నేను మాట్లాడినదానికి అమ్మ నాన్న మంజు ముగ్గురు ఒక నిమిషం సైలెంట్ అయిపోయారు. తరువాత నాన్న నా చెయ్యి పట్టుకున్నారు.

నాన్న: వెరీ గుడ్. చాలా మెచూర్డ్ గా మాట్లాడావు. నీకు ఇబ్బంది లేదు అంటే నాకు ఏమి ఇబ్బంది లేదు.

అమ్మ: నా బంగారు కొండ, ఎవరు చేసుకుంటారో, వారికీ అదృష్టం ఉండాలి. ఎవరో పెట్టి పుట్టింది.

నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని నా రూంలోకి వచ్చాను. నేహా మెసేజ్ వచ్చింది. నేను కాల్ చేసాను.

నేహా: ఏంటి ఇంట్లో సీన్?

నేను: నీ ఎంకమ్మ. ఇలాంటి పనులు చేసేప్పుడు నాకు చెప్పి చెయ్యవే. కాస్త ప్రిపేర్ అయ్యే టైం ఇవ్వు.

నేహా: ఎందుకు? ఎమన్నా గొడవ అయిందా?

నేను: లేదు. అందరు హ్యాపీ. నువ్వు వస్తున్నావు అని ఏవో స్పెషల్స్ కూడా చేస్తోంది అమ్మ.

నేహా: పాపం. ఐ లవ్ హర్.

నేను: అయినా నీ ధైర్యం ఏంటే బాబు? అమ్మ నిన్ను తిట్టి ఉంటే?

నేహా: తిట్టరు. నాకు ఆంటీ గురించి తెలుసు. మహా అయితే వద్దు అమ్మ రాకు అంటారు. అయినా మేము మేము ఫ్రెండ్స్ కదా. నీకెందుకు అంది.

ఒక నిమిషం నా మనసులో ఆనందం బాధ కలిపి వచ్చాయి. నిజంగా నేహా నేను పెళ్లి చేసుకుని ఉంటే అమ్మని ఎంత బాగా చూసుకునేదో కదా అనిపించింది.

నేహా: సరే, నేను స్నానం చేసి బయల్దేరుతాను. నువ్వు కాసేపు నిద్రపో.

నేను: సరే. వెయిటింగ్ ఫర్ యు.

నేహా: మీ టూ.


ఫోన్ పక్కన పెట్టి నేను అలా పడుకున్నాను. కడుపు నిండా తినడం వల్ల మంచి నిద్ర వచ్చేసింది. 

ఇంకా ఉంది. Chapter 17 is coming soon.
Like Reply


Messages In This Thread
RE: కాలం కలిసొస్తే - by sshamdan96 - 22-08-2024, 09:23 PM



Users browsing this thread: Crazy Freak, Potugadu246, Prasanthkumar8790, 30 Guest(s)