Thread Rating:
  • 12 Vote(s) - 2.42 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: 'నూతన్' పరిచయం
#41
18. పెళ్లి అయిపోయిందా!













(రెస్టారెంట్)  - కొన్ని రోజుల తర్వాత....

ఈషా "పది నిముషాలు కూడా సెక్యూరిటీ ఆఫీసర్ లా కాకుండా నార్మల్ హస్బెండ్ లా ఉండలేవా..."

కేశవ్ ఇబ్బందిగా తల రుద్దుకున్నాడు.

ఈషా "నిన్న ఎంత బాగుంది, ఇద్దరం చేతిలో చేయి వేసుకొని పార్క్ లో నడుస్తూ చల్లని గాలి పీలుస్తూ ఎంత హాయిగా ఉంటుంది"

కేశవ్ "రోజు మార్నింగ్ 5'o క్లాక్ జాగింగ్..."

ఈషా "అది ఎక్సర్సైజ్.... ఇది రొమాంటిక్ వాక్...."

కేశవ్ "తేడా ఏంటి?"

ఈషా ముందుకు జరిగి కేశవ్ చేతులు పట్టుకొని "మనం ఒక డీల్ చేసుకుందాం..... నీకు నలుగురులో ఎలా మాట్లాడాలో తెలియదు... రోమాన్స్ అస్సలు తెలియదు... ఇంటి గురించి అసలు ఏం తెలియదు... అవన్నీ నాకు వదిలేసెయ్... ఓకే... మన ఫ్యూచర్ కోసం... ఓకే..." అంది.

కేశవ్ చిన్నగా నవ్వి "ఎక్కడ బ్రేక్ అప్ అంటావో అని భయపడ్డాను"

ఈషా "ఆ టాపిక్ అసలు రాదు... ఈ జన్మకి మనిద్దరమే..." అంటూ మూతి ముడుచుకొని కూర్చుంది.

కేశవ్ చిన్నగా నవ్వి ఈషా వైపు చూస్తున్నాడు.

ఈషా "ఎందుకు అలా చూస్తున్నావ్...."

కేశవ్ "బాగున్నావ్...." అంటూ చూస్తున్నాడు.

ఈషా చిన్నగా నవ్వి "ఇంకో సారి అలానే చూస్తే... ఈవ్ టీజింగ్ కేసు పెడతా... మా సర్కిల్ లో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు" అంది.

కేశవ్ నవ్వేశాడు.

ఈషా కూడా నవ్వేసింది.

కేశవ్ "వెళ్దామా..."

ఈషా "తినడం... వెళ్ళడమేనా..."

కేశవ్ "ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా.... సైట్ కూడా కొట్టుకోనిచ్చావ్...."

ఈషా "ష్.. ష్.. ష్..  కొంచెం సీరియస్ గా మాట్లాడుకుందామా!"

కేశవ్ గడ్డం కింద చేయి పెట్టుకొని లేజీగా చూస్తూ "చెప్పూ" అన్నాడు.

ఈషా "ఆ రోజు.... మా మేడం కాజల్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలిసి... ఇక్కడ లంచ్ ఏర్పాటు చేశాం"

కేశవ్ "క్రిష్..."

ఈషా "హుమ్మ్"

కేశవ్ "అయితే...."

ఈషా "క్రిష్ ని కొంచెం ఇబ్బంది పెట్టాం... "

కేశవ్ "కొట్టారా..."

ఈషా "అదేం లేదు... ఎవరో స్టూడెంట్.... డైవర్స్ తీసుకున్నా అమ్మాయిని డబ్బు కోసం ట్రాప్ చేశాడు అని..... ఎదో అలా.... అలా...."

కేశవ్ "ఏమయింది?"

ఈషా "ఏంటి? అయ్యేది.... మా మేడం దేవత...."

కేశవ్ "ఏమయింది? "  అని నవ్వాడు.

ఈషా "తనే క్రిష్ దగ్గర రెండూ లక్షలు అప్పు తీసుకుంది అంట...."

కేశవ్ "హహ్హహ్హ" అని నవ్వాడు.

ఈషా తల దించుకుంది.

కేశవ్ "క్రిష్ చిన్నప్పటి నుండి కూడా డబ్బు సంపాదించాలి, అలా చేయాలి ఇలా చేయాలి అని ఉండే వాడు.... ఫస్ట్ ఇయర్ చదివేటపుడు లక్షన్నర ఫోన్ చేసే ఒక స్కామర్ అమ్మాయి దగ్గర పోగొట్టుకున్నాడు"

ఈషా "మోస పోయాడా....".

కేశవ్ "ప్చ్.... లక్షన్నర సంపాదించాడు... వాళ్ళ అమ్మ వాళ్ళు పంపలేదు.. వాడి అంత వాడే సంపాదించి పంపాడు" అని నవ్వాడు.

ఈషా "అసలు నువ్వు మనిషివేనా..... మీ బావమరిది మోసపోయాడు అంటే నవ్వుతావు ఏంటి?"

కేశవ్ "హుష్.... వాడు మీరు అనుకున్నదాని కంటే మెచ్యూర్... "

ఈషా "నీకు ఎలా తెలుసు..."

కేశవ్ "థర్డ్ ఇయర్ లో పెళ్లి చేసుకొని  ఫోర్త్ ఇయర్ లో విడిపోయారు" (రష్ అవర్ లో వస్తుంది)

ఈషా "రష్... నీకు సిస్టర్ అవుతుంది"

కేశవ్ "నీకు తెలుసా...."

ఈషా "ఎహే.... ఎటు నుండి ఎటు తీసుకోస్తున్నావ్ డిస్కషన్...."

కేశవ్ "ఏమయింది?"

ఈషా "ఏంటి? ఏమయింది? ఆ రోజు నుండే మేఘ కనిపించకుండా పోయింది."

కేశవ్ "వాట్.."

ఈషా "ఇదే రెస్టారెంట్.... ఆ రోజు ఇదిగో ఆన్ లైన్ లో ఫోటో కూడా పెట్టాను.... ఇదిగో చూడు..."

కేశవ్ ఆలోచిస్తూ "బాగుంది" అన్నాడు.

ఈషా, కేశవ్ చేతిని గిచ్చి "ఆ ఫోటో కింద డేట్ చూడు... అక్కడ ఉన్న cc కెమెరాలో డేటా చూడు..... అసలు నీకు సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ ఎలా ఇచ్చారు.. నాకు ఇప్పటికి అర్ధం కాదు"

కేశవ్ ముందుకు జరిగి ఆమె మొహాన్ని రెండూ చేతులతో తీసుకొని పట్టుకొని ముద్దు పెట్టాడు.

కేశవ్ "పర్లేదు నాకు నా పెళ్ళాం ఉంది... ఇలాంటివి గుర్తు చేయడానికి...."

ఈషాకి ఇది తోలి ముద్దు కావడంతో సిగ్గు పడి పోయి "ఓయ్.... ఆఫీసర్... ఇలాంటివి చేసేటపుడు నాకు ముందు చెప్పూ" అంటూ పైకి లేచింది.

ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అయిపోయాయి. 

కేశవ్, ఈషాని తీసుకొని వెళ్లి ఆఫీస్ దగ్గర వదిలిపెట్టాడు.

ఈషా "బాయ్...."

కేశవ్ "ఈవెనింగ్ రెడీగా ఉండు.... అమ్మ నీతో మత్లాడాలి అంది"

ఈషా "నేను రాను.. నువ్వు ఇంటికి అని చెబుతావ్.... తీసుకొని వెళ్లవ్...."

కేశవ్, ఈషా వైపు చూసి "సరే అమ్మ ఫోన్ చేస్తుంది.... ఎత్తూ...." అని వెళ్లి పోయాడు.

ఈషా, కేశవ్ వెళ్ళే వరకు చూసి నార్మల్ అయి ఆఫీస్ లోకి వచ్చింది.




ఈషా "థాంక్స్ సుహాస్..."

సుహాస్ "హా... ఈషా చెప్పూ..."

ఈషా "మీరు చెప్పింది వర్క్ అవుట్ అయింది.... మేఘ గురించి చెప్పాక కూల్ అయ్యాడు... ఇప్పుడు బాగానే ఉంటున్నాం...."

సుహాస్ "నాదేం లేదు... చిన్న సలహా అంతే"

ఈషా "చిన్నదే కాని నా జీవితం లో పెద్ద ఇంపాక్ట్ చూపించింది.... చాలా థాంక్స్ సుహాస్...." అని వెళ్ళిపోయింది.

సుహాస్ మనసులో "నా జీవితంలో కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది" అని అనుకున్నాడు.


కేశవ్.... CC కెమెరా చూస్తున్నాడు.

మేఘ నార్మల్ గానే వచ్చింది. అందరితో నవ్వుతూ ఉంది. కానీ ఒకరిని చూసి దాక్కుంది.

కేశవ్ వేరే కెమెరా... వేరే కెమెరా... ఓపెన్ చేసి చూస్తున్నాడు.

ఆ రోజు... ఒక వ్యక్తీ రెస్టారెంట్ లోకి రాగానే అతన్ని చూడగానే మేఘ మారిపోయింది, తప్పించుకుంది.

పారి పోయింది.... ఊరు వదిలి వెళ్లి పోయింది.

ఆ వ్యక్తీ.... అంటూ జూమ్ చేసి చూశాడు. 

తన చేతుల్లో ఉన్న కప్ జారి పడింది.

కెమెరాలో క్రిష్ కానీ కనిపిస్తున్నాడు.




అన్ని కెమెరాలలో అన్ని చూస్తున్నాడు. 

క్రిష్ ని కార్నర్ చేసి గొడవ పడుతున్నారు. 

చూస్తూ ఉంటే, క్రిష్ మాటలతోనే వాళ్ళను భయపెట్టినట్టు అనిపించింది.

మనసులో ఒప్పుకోలేక ఒప్పుకోలేక ఒప్పుకుంటూ "ఇంప్రెసివ్" అనుకున్నాడు.

కాని మేఘ కూర్చున్న టేబుల్ మీద క్రిష్ చిన్నగా టాప్ చేశాడు.

మాములుగా అందరికి అర్ధం కాదు. కాని స్లో మోషన్ లో చూస్తే తెలుస్తుంది.

క్రిష్ కి మేఘ తెలుసు.... అతను చేసిన చిన్న టాప్ సౌండ్ కి ఆమె భయపడిపోయింది.

ఇది సాక్షం కాదు, వాడు అసలు చూడలేదు జనరల్ గా చేయి పెట్టాను అంటాడు.

పైగా మేఘ కూడా ఎవరినో చూసి క్రిష్ అని పొరపాటు పడి ఉండొచ్చు.




రష్ ని వదిలి వెళ్ళాక క్రిష్ సుమారు మూడు నెలలు ఎవరిని కనపడలేదు. ఎక్సామ్స్ అయిపోయాక కాజల్ ని కలిశాడు.

ఈ మూడు నెలలు ఏం చేశావ్?

క్రిష్...... అసలు నువ్వు ఏం చేశావ్?

క్రిష్ పెళ్ళికి కాదు అంటాడు. ఆ మూడు నెలలకు మేఘకి ఏమైనా సంబంధం ఉందా...

ఇవన్ని పిచ్చి ఆలోచనలే.... క్రిష్ కి లింక్ చేయడం పిచ్చితనమే అవుతుంది. 

ఈషా కాలింగ్....




ఈషా "హలో..."

కేశవ్ "హుమ్మ్"

ఈషా "ఎక్కడ ఉన్నావ్...."

కేశవ్ "రెస్టారెంట్..."

ఈషా "సరే, ఆఫీస్ దగ్గరకు రా... నేను కూడా లీవ్ పెట్టాను వెళ్దాం..."

కేశవ్ "ఎక్కడికి?"

ఈషా "కాజల్ ఫోన్ చేసింది. క్రిష్, కాజల్ ఇద్దరూ రిజిస్టర్ అఫీస్ దగ్గర ఉన్నారు"

కేశవ్ "ఎందుకు?"

ఈషా "క్రిష్ పెళ్లి చేసుకుందాం అన్నాడు అంట... మళ్ళి ఎక్కడ మనసు మార్చుకుంటాడో అని వెళ్లి పోయారు"

కేశవ్ "వాట్.... మా బావ గాడు పెళ్లి చేసుకుంటున్నాడా...." అని హ్యాపీ ఫీల్ అయ్యాడు.

ఈషా "వస్తున్నావా..."

కేశవ్ "వెంటనే వస్తున్నా..."




పెళ్లి అయిపొయింది.




క్రిష్ "ఇప్పుడు మనిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్"

కాజల్ "హుమ్మ్.... రేపు నీకు ఎక్సాం ఉంది, వెళ్లి చదువుకో... నేను కూడా ఆఫీస్ కి వెళ్తాను"

క్రిష్ "బేబీ..."


ఈషా "బేబీ అంట అని నవ్వుతూ ఉంది"

కేశవ్ కూడా నవ్వుతున్నాడు.


కాజల్ "ఏంటి?"

క్రిష్ "పెళ్లి అయింది కదా..." అని దగ్గరకు నడిచాడు.

కాజల్ తోసేసి "ఎక్సామ్స్ అయ్యే వరకు నా దగ్గరకు రాకు" అంది.

క్రిష్ డిజాప్పాయింట్ గా ఫేస్ పెట్టి "సరే..." అన్నాడు.

కాజల్ "పెళ్లికి లేట్ గా రాకూడదు అని తెలియదు"

క్రిష్ "నీకొక గిఫ్ట్ ఇవ్వాలని లేట్ గా వచ్చాను"

కాజల్ "ఇప్పుడు వద్దు"

క్రిష్ ఒక A4 సైజ్ కవర్ ఇచ్చాడు.

కాజల్ ఓపెన్ చేసి చూసింది.

కాజల్ "ఏంటి? ఇది..."

క్రిష్ "గిఫ్ట్...."

కాజల్ "ఇది మనం ఉంటున్న ఇల్లు.... నా పేరు మీద రాశావా...."

క్రిష్ "అవునూ..."

కాజల్ "అంటే ఆ ఇంటికి ఓనర్ నువ్వా..." అని నోరు తెరిచింది.

క్రిష్ చిన్నగా నవ్వి "ఇక నుండి నువ్వే... ఇల్లే కాదు నాకు కూడా నువ్వే ఓనర్...." అన్నాడు.

కాజల్ కోపంగా చూస్తూ "ఇన్ని రోజులు నా దగ్గర రెంట్ వసూలు చేశావ్ కదా..."

క్రిష్ "అప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వి మాత్రమే..."

కాజల్ "నీ యబ్బా... నా దగ్గర రెంట్ వసూలు చేస్తావా..... నిన్నూ" అంటూ క్రిష్ వెంట పరిగెత్తింది.

క్రిష్ "బేబీ, ఐ లవ్ యు..."

కాజల్ "రేయ్, ఆగూ.... ఆగక పోతే అసలు ఊరుకోను"




ఈషా నవ్వుతూ చూస్తుంది. 

కేశవ్ మనసులో "సడన్ గా నువ్వు ఇంత  రిచ్  ఎలా అయ్యావ్ రా.....  హ్యాపీగానే ఉంది, క్రిష్ చాలా  కష్టాలు పడ్డాడు. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాడు... ఉండాలి..."



కాజల్, క్రిష్ వెంట పడుతుంది.

కేశవ్ మనసులో "క్రిష్ మీద ఒక కన్ను వేయాలి..."



















[Image: d408510b36cfe3e24f544260031ef25c.jpg]
[+] 10 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: క్రిష్ :: 'నూతన్' పరిచయం - by 3sivaram - 22-08-2024, 09:43 PM



Users browsing this thread: 9 Guest(s)