Thread Rating:
  • 16 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: 'నూతన్' పరిచయం
#30
13. ట్రింగ్... ట్రింగ్... కొత్త సమస్య








త్రిషా "హలో"

సుహాస్ "సారీ మేడం... నేను ప్రియ దగ్గరకు వచ్చేశాను"

త్రిషా "మ్మ్"

సుహాస్ "నిజం తెలిశాక తనని నిందిచడం తప్పు అనిపించింది. అందుకే వచ్చేశాను"

త్రిషా "తనకు నిజం చెప్పావా...."

సుహాస్ "..."

త్రిషా "తనకు నిజం చెప్పావా...."

సుహాస్ "లేదు మేడం.... తన దృష్టిలో నేను ఆమెను అనుమాన పడ్డ భర్తగానే ఉన్నాను"

త్రిషా "నువ్వు నిజం చెప్పూ"

సుహాస్ "లేదు మేడం.... నేను అలా చేయలేను" అంటూ ఫోన్ కట్టేశాను.

ఆమె ఏదో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ నూతన్ కి సంబంధించింది ఏది తిరిగి మా జీవితంలలో తీసుకురాదలుచుకోలేదు.

అంతలోనే.... నా వెనక నుండి ప్రియ "ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నట్టు ఉన్నావ్..." అంది.

వెనక్కి తిరిగి చూశాను, నా వైపు అనుమానంగానో, కోపంగానో కాదు. నవ్వుతు చూస్తుంది.

సుహాస్ "హుమ్మ్... అవునూ.... నన్ను చూడకుండా ఉండలేను అంటుంది" అన్నాను.

ప్రియ మొహంలో ఒక్క క్షణం బాధ మరుక్షణం తిరిగి మాములుగా నవ్వి "ఫాన్స్..." అంది.

సుహాస్ "నాకు అంత సీన్ లేదు..."

ప్రియ నవ్వేసి నా పక్కనే కూర్చొని "పెళ్లి చేసుకున్న పెళ్ళాం.... నాతో మాట్లాడాలి అంటేనే తమరికి కొన్ని రోజులు పట్టింది. అరేంజ్ మ్యారెంజ్ అవ్వకపోయి ఉంటే, తమరికి ఈ జన్మకి పెళ్లి అయ్యేది కాదు" అంది.

తన భుజం చుట్టూ చేయి వేసి "నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధ పడుతున్నావా..."

ప్రియ "బాధ పడుతున్నట్టు కనపడుతున్నానా...."

సుహాస్ "అందంగా కనపడుతున్నావ్.... బెడ్ రూమ్ లోకి వెళ్దామా..."

ప్రియ "ఉష్... అమ్మ చూస్తుంది" అంటూ పైకి లేచింది. ఇంతవరకు తను నాపక్కనే కూర్చున్నప్పుడు రాని వాళ్ళ ఇప్పుడు ఎందుకు వస్తుంది అనుకుంటూ ఉండగానే... వాళ్ళ అమ్మ బయట నుండి వస్తు నన్ను చూసి చిన్నగా నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

నేను ల్యాప్ టాప్ ఓపెన్ చేసుకొని వర్క్ ఫ్రం హోం చేసుకుంటున్నాను. ప్రియ వచ్చి నా పక్కనే ఉన్న వస్తువు ఏడో తీస్తునట్టు వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది.

ఆ రోజు సాయంత్రం వరకు అంతా బాగానే ఉంది. 

పిల్లాడితో ఆడుతూ సరదాగా గడుపుతున్నాను. 

ప్రియ "అవునూ మీ ఫ్రెండ్స్ లో 'నూతన్' అని ఎవరైనా ఉన్నారా..." అని అడిగింది.

ఆ మాటకు నాకు చమటలు పట్టాయి. కాని త్రిషా చెప్పిన దాని ప్రకారం ప్రియకి నూతన్ తెలియ కూడదు.

పైగా నూతన్ ని తిరిగి కలవకపోతే ప్రియ అతనికి సబ్మిట్ అవ్వదు. అందుకే నేను ట్రాన్సఫర్ చేయించుకొని వేరే ఊరు కూడా వెళ్దాం అనుకుంటున్నాను.

కానీ ప్రియకి నూతన్ గుర్తుకు వస్తున్నాడు. 

నూతన్ గుర్తుకు వస్తే.... ఏమయినా చేసుకుంటుందా... అనుకుంటూ ఉంటేనే అరచేతులు చమటలు పట్టేశాయి.

ఇంతలోనే నా కొడుకు "నాన్నా" అనుకుంటూ పడుతూ లేస్తూ వచ్చాడు.

వెనకే చిన్న గిన్నెలో ఫుడ్ తీసుకొని పరుగులాంటి నడకతో వచ్చి వాడి నోట్లో ఫుడ్ పెడుతుంది. 

అవునూ ఇది నా ఫ్యామిలీ, నా హ్యాపీ ఫ్యామిలీ.... 

నేను కాపాడుకోవాలి. నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి.

నూతన్ అయినా ఎవరైనా.... నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి.





రెండూ రోజుల తర్వాత త్రిషాకి ఫోన్ చేశాను.

త్రిషా "హలో"

సుహాస్ "హలో మేడం..."

త్రిషా "ఆమెకు మెమోరీస్ గుర్తుకు వస్తున్నాయా..."

నాకు ఏడుపు వచ్చినంత పని అయింది.

త్రిషా "అందుకే నిజం చెప్పమని చెప్పాను"

సుహాస్ "నేను ఆ పని చేయలేను.... మీరు తనకు ఆ మెమరీస్ గుర్తుకు రాకుండా చేయగలరా..."

త్రిషా చిన్నగా నవ్వి "అలా చేయగలిగితే నాకు నేనే క్యూర్ చేసుకుంటాను కదా..."

గుటకలు మింగాను.

సుహాస్ "వాడు ఎక్కడ దొరుకుతాడు"

త్రిషా "దేనికి..."

సుహాస్ "..."

త్రిషా "చంపేస్తావా...."

సుహాస్ "..."

త్రిషా "చంపేస్తావా...."


సుహాస్ "హుమ్మ్" అన్నాను.

త్రిషా చిన్నగా నవ్వింది. 

సుహాస్ "ఎదో ఒకటి చేయగలను కదా....."

త్రిషా "అతనికి సూపర్ పవర్ ఉంది.... నువ్వు నేను సామాన్యులం.... మనం ఏమి చెయ్యలేం"

పిడికిలి బిగించాను.

సుహాస్ "వేరే దారి లేదా..."

త్రిషా "..."

సుహాస్ "వేరే దారి లేదా..." అని గట్టిగా అడిగాను.

త్రిషా "ఆవేశ పడకు..."

సుహాస్ "మరి ఏం చేయమంటారా..."

త్రిషా "మరో క్లూ దొరికింది"

సుహాస్ "...."

త్రిషా "హలో..."

సుహాస్ "ఏం క్లూ...."

త్రిషా "ఒక అమ్మాయి ఉంది... అతని గ్రిప్ నుండి బయట పడింది... అలా చేయడంలో ఆమెకు ఒకతను హెల్ప్ చేశాడు"

సుహాస్ "ఎవరా అమ్మాయి... అతను ఎవరూ?"

త్రిషా "తెలియదు..... అతను కూడా తెలియదు..... కాని తెలుసుకుంటాను"

సుహాస్ "ఎలా తెలుసు..."

త్రిషా "అతనే చెప్పాడు"

సుహాస్ "గుర్తుకు వచ్చిందా...."

త్రిషా "లేదు..."

సుహాస్ "మరి...."

త్రిషా "నా ఇంట్లో CC కెమెరాలు పెట్టాను, అవి వింటున్నా...." 

సుహాస్ "ఓహో..."

త్రిషా "నా సమస్య నుండి పరిగెత్తలేను.... అందుకే సక్సెస్ అయితే అయ్యాను లేదా పోయాను..... కాని ప్రయత్నిస్తాను"

సుహాస్ "..."

త్రిషా "సుహాస్"

సుహాస్ "హుమ్మ్"


త్రిషా "నేను చనిపోవాలని కూడా అనుకున్నాను... కాని ఈ సారి కాదు... ఎదిరిస్తాను"


సుహాస్ "గుడ్"

త్రిషా "ఈ ఫైట్ లో నాతో ఉంటావా...."


సుహాస్ "నను ఆల్రెడీ ఇందులో ఉన్నాననే అనుకుంటున్నాను"

త్రిషా "థాంక్స్"

సుహాస్ "మీరు ఆ అమ్మాయి, అబ్బాయి గురించి కనుక్కోండి నేను మేఘ గురించి తెలుసుకుంటాను"

త్రిషా "ఓకే..."

సుహాస్ "ఈ సమస్యకి సొల్యుషన్ వెతకాలి" అని అనుకున్నాడు.



సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ కేశవ్ కూర్చొని ఉన్నాడు.

కేశవ్ "ఈ మిస్సింగ్ కేసు ఇంకా అవ్వలేదా..."

కానిస్టేబుల్ "లేదు సర్"

కేశవ్ "ఆ అమ్మాయి పేరు ఏంటి?"

కానిస్టేబుల్ కేసు ఫైల్ ఓపెన్ చేసి చూసి "మేఘ, సర్.... సాఫ్ట్ వేర్" అన్నాడు.

కేశవ్ "ఏం కంపనీ..."

కానిస్టేబుల్ చెప్పిన మాటలు విని కేశవ్ నుదురు ముడుచుకుంది.

తనకు కాబోయే భార్య ఈషా పని చేసేది కూడా అదే కంపనీ....

కానిస్టేబుల్ వెళ్ళగానే...

కేశవ్ తన ఆఫీస్ కి బయలు దేరాడు.

కేశవ్ "హలో"

ఈషా "నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు రావద్దని చెప్పానా..." అని విసుక్కుంది.

కేశవ్ "నేను పని మీద వచ్చాను"

ఈషా "నీకు ఇక్కడ ఏం పని...."

కేశవ్ "మీ ఆఫీస్ లో పని చేసే మేఘ.... మిస్సింగ్ కేస్"

ఈషా "ఓహో..."

కేశవ్ "..."

ఈషా "అంతేలే కేసు కోసం వస్తావు గాని నా కోసం ఎందుకు వస్తావు...." అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది.

కేశవ్ అంతలోనే మారిన ఆమె మాటలకు బిత్తర పోయి ఈషాని చూస్తూ ఉంటే, ఈషా కోపంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.

కేశవ్ "పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుందా" అనుకోని బాధ పడుతూ ఉండగా..... ఈషా నడుస్తూ ఉంటే ఊగుతున్న ఆమె నడుము చూస్తూ "ఇంత బాగుంటుందా..." అనుకోని ఎక్సైట్ అయ్యాడు.



[Image: 399527293-18394764805027902-8495077956682528130-n.jpg]






క్రిష్ లాస్ట్ గర్ల్ ఫ్రెండ్..... అండ్ క్రిష్...


మేఘ.... మేఘ ఆకాష్

[Image: images-q-tbn-ANd9-Gc-R5-FJFa-TC5g-Bn-Vj-...ZXR8k3.jpg]
[+] 10 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: 'నూతన్' పరిచయం - by 3sivaram - 21-08-2024, 01:49 PM



Users browsing this thread: 16 Guest(s)