Thread Rating:
  • 12 Vote(s) - 2.42 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: 'నూతన్' పరిచయం
#23
6. సమాధానం దొరుకునా...






సుహాస్ "ఎవరు మీరూ...." (కాజల్ ఆఫీస్ ఫ్రెండ్)

త్రిష "నా పేరు త్రిష నేనొక సైకాలజిస్ట్" అని కార్డ్ యిచ్చింది.

సుహాస్ అనుమానంగా చూస్తూ "చెప్పండి" అంది.

త్రిష "మీ భార్య... ప్రియాంక"

సుహాస్ "లేదు..." అని తలదించుకున్నాడు.

త్రిష తననే గుచ్చి గుచ్చి చూస్తూ ఉండడం తో "పుట్టింటికి వెళ్ళింది"

త్రిష "ఓహ్..."

సుహాస్ "తన అడ్రెస్ ఇస్తాను అక్కడకు వెళ్లి మాట్లాడండి"

త్రిష "ఓకే... ధాంక్స్..." అని అడ్రెస్ తీసుకొని, బయటకు వెళ్లి కార్ లో కూర్చుంది.

సుహాస్ ఆఫీస్ కి రెడీ అవుతున్నాడు.

త్రిష కి ఎదో తేడా అనిపించింది. ఒక సారి కళ్ళు మూసుకొని సుహాస్ ఇంటిని గుర్తు తెచ్చుకొని గమనించింది.

ఇల్లు మొత్తం నీట్ గా లేకుండా.... స్మెల్ వస్తూ.... బట్టలు ఉతక్కుండా ఉంది. కాని అతను మాత్రం టిప్ టాప్ గా రెడీ అయి టక్ చేసుకొని ఉన్నాడు.

పైగా ఎవరూ మీరు ఎందుకు తనని కలవాలని అనుకుంటున్నారు అనే బేసిక్ ప్రశ్నలు అడగను కూడా లేదు.

త్రిష కళ్ళు తెరిచి "యస్" అని తిరిగి అతని ఇంటి దగ్గరకు వెళ్ళింది.

సుహాస్ అప్పుడే గెట్ క్లోజ్ చేస్తూ ఉన్నాడు.

త్రిష అతని వెనకే నిలబడి "నేను మీతో మాట్లాడొచ్చా...." అని అడిగింది.

సుహాస్ "సారీ... నాకు ఆఫీస్ కి టైం అవుతుంది"

త్రిష "మీ ఆఫీస్ కి ఒక గంట లేట్ వెళ్ళండి.... నేను మీతో చాలా ముఖ్య విషయం మాట్లాడాలి" అంది.

సుహాస్ "సారీ ముఖ్యమైన మీటింగ్..." అన్నాడు.

త్రిష "నేను మీ భార్య కోసం వచ్చా అని నాతో మీరు మాట్లాడకూడదు అని అనుకుంటున్నారా..."

సుహాస్ కోపంగా "గెట్ అవుట్" అన్నాడు.

త్రిష మనసులో "ఆమె ఇతన్ని మోసం చేసింది అని నమ్ముతున్నాడు"

త్రిష "తను ఎందుకు ఇలా చేసింది, అని మీరు ఆలోచిస్తున్నారు కదా" అంది.

సుహాస్ మొహం అంతా చిట్లించి "షట్ అప్ అండ్ గెట్ లాస్ట్" అన్నాడు.

త్రిష "మీకు సమాధానం కావాలంటే, అయిదు నిముషాలు ఆలోచించుకొని నాకు కాల్ చేయండి, ఇది నా నెంబర్ అని అతని చేతి మీద ఫోన్ నెంబర్ వేసి యిచ్చింది"

సుహాస్ ఆమె ముందే చేతిని రుద్దుకుని లిఫ్ట్ రాక పోవడంతో కోపంగా మెట్లు దిగుతూ వెళ్తున్నాడు. రెండు అంతస్తులు దిగగానే, గుండెల నిండా బాధ అతన్ని చుట్టేసింది.

కళ్ళు మూసుకున్నా తెరిచినా నవ్వుతున్న తన భార్య మొహమే గుర్తుకు వస్తుంది. గట్టిగా గోడను కొడుతూ "ఎందుకు ప్రియా..... ఎందుకు ఇలా చేశావ్" అంటూ కొద్ది సేపు అలానే నిలబడ్డాడు.

కళ్ళు తుడుచుకొని చేతి మీద ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయాలని చూశాడు. చేతి మీద తొమ్మిది నెంబర్లు మాత్రమె ఉన్నాయి.

సుహాస్ "షిట్" అనుకుంటూ స్పీడ్ గా మెట్లు దిగి ఆమె కార్ దగ్గరకు వెళ్ళాడు. కాని అప్పటికే కార్ అక్కడ నుండి వెళ్లి పోయింది.

సుహాస్ చుట్టూ చూస్తూ తల దించుకొని వెళ్తూ ఉంటే తన భుజం పై చేయి పడింది. వెనక త్రిష ఉంది.

సుహాస్ రొప్పుతూ ఎదో చెప్ప బోతూ ఉంటే, త్రిష "మీ ఆఫీస్ కి కాల్ చేసి వన్ డే... ఎమర్జెన్సి లీవ్ పెట్టండి" అని తన డ్రైవర్ కి ఫోన్ చేయగానే కార్ తీసుకొని వచ్చాడు.

సుహాస్ ఫోన్ మాట్లాడి రాగానే డ్రైవర్ పక్క సీట్ డోర్ తెరిచి ఉంది. వెనక సీట్ లో త్రిష లార్డ్ లా కూర్చొని ఉంటే సుహాస్ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు.

సుహాస్ పరిస్థితి చాలా ఆత్రంగా ఆగలేకుండా ఉన్నాడు. అతని మనసులో ప్రశ్నల సమధానం కోసం అర్రులు జాస్తున్నాడు.

అడగాలా వద్దా అని ఆలోచిస్తూ, ఆత్రం ఆగక వెనక్కి తిరిగి "మేడం"  అని పిలుస్తుంటే.

ఆమె ఫోన్ లో ఎదో ముఖ్యమైనది చదువుతూ "నా క్లినిక్ కి వెళ్తున్నాం, కొంచెం కామ్ డౌన్ అవ్వండి" అని చెప్పింది.

సుహాస్ గుండె సమాధానాల కోసం అర్రులు జాస్తూ ఉంటే, అతని చూపులు గ్లాస్ డోర్ నుండి బయటకు చూస్తున్నాయి.

అతని కంటికి తను తన భార్యతో గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వచ్చాయి.

నా మనసుకి శాంతి కలగాలన్నా... అశాంతికి గురి చేసి మధన పడాలన్నా... అదంతా నువ్వే ప్రియ... అంటూ గ్లాస్ డోర్ నుండి బయటకు చూస్తున్నాడు.

డ్రైవర్ సుహాస్ ని చూస్తూ ఇప్పటి వరకు ఇంత ఆత్రంగా ఉన్నాడు, మేడం కామ్ డౌన్ అనగానే కామ్ అయిపోయాడు అనుకుంటూ పెదవి విరుచుకుంటూ సిటీ రోడ్ పై కార్ ని వేగంగా దూసుకువెళ్తున్నాడు.

కాని అంతకంటే వేగంగా సుహాస్ ఊహలు గతంలోకి ట్రావెల్ చేసి ఆమె మధుర జ్ఞాపకాన్ని తన కళ్ళ ముందు నిలబెట్టాయి.






ప్రియాంక

[Image: 50070880482_aa669c4912_b.jpg]


త్రిష - 'నూతన్' పరిచయం కధలోని 'ప్రధాన పాత్ర' ధారి

[Image: 82f95176cd64698f93317d65fcb9d068.jpg]


సుహాస్ - 'కాజల్' ఆఫీస్ లో పని చేసే వ్యక్తీ ఆమెకు బ్రదర్ లాగా...

[Image: pngtree-flat-man-going-to-office-illustr...463041.png]

















[+] 6 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: 'నూతన్' పరిచయం - by 3sivaram - 21-08-2024, 12:29 PM



Users browsing this thread: 2 Guest(s)