Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
#80
12. నా జీవితం క్రిష్ చేతుల్లో  2.0









హాయ్, నా పేరు కేశవ్



నాలుగో వాడు క్రిష్ ని బెడ్ పై నాలుగు సార్లు పొడిచాడు.

కేశవ్ "చిన్నప్పటి నుండి క్రిష్ ని ఏమని పిలుస్తామో తెలుసా....." అన్నాను.

అప్పటికి కాని చూసుకున్నాడు, ఆ కత్తికి రక్తం లేదు. అనుమానంగా చూస్తూ దుప్పటి తీసేశాడు. అక్కడ అన్ని దిళ్ళు ఉన్నాయి.

ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, పక్క బెడ్ మీద ఉన్న దుప్పటికి ఉన్న చిన్న బొక్క లో నుండి ఒక కన్ను అతన్నే చూస్తూ కనిపించింది.

ఒక్క క్షణం ఆ కత్తి పట్టుకున్న వాడికి భయం వేసింది. ఒళ్లంతా చమటలు పట్టేసాయి. 

కేశవ్ "వాడిని చిన్నప్పటి నుండి మాయగాడు అని పిలుస్తాం. కాని నిజం ఏమినటంటే..."

క్రిష్ ఆ బెడ్ పై నుండి పైకి లేచి ఆ వ్యక్తీ మీద దుప్పటి కప్పాడు. వాడు ఆ దుప్పటి నుండి బయటకు రాగానే, వాడి తల మీద సెలైన్ పెట్టె ఐరన్ రాడ్ తగిలింది.

కేశవ్ "మహా మాయగాడు"

క్రిష్ తల చుట్టూ కట్టు కట్టి ఉంది. ఆరు అడుగుల శరీరం హాస్పిటల్ గ్రీన్ గౌన్ లో తమ వైపు చూడగానే వాళ్లకు కొంత భయం వేసింది.

కేశవ్ "నేను బెట్ గెలిచాను. ఇవ్వాళ రాత్రి అటాక్ చేస్తారని చెప్పాను కదా..." 

క్రిష్ నన్ను ముగ్గురు పట్టుకున్నారు అని సైగ చేసి చూపిస్తూ "నువ్వు వెధవవి అని చెప్పాను కదా బావ" అన్నాడు. 

నీయబ్బా అనుకున్నాను. నన్ను ముగ్గురు పట్టుకొని ఉన్నారు. గట్టిగా కదిలించినా ఎవరూ కదలడం లేదు.

క్రిష్ వైపు హెల్ప్ అన్నట్టు చూశాను.  క్రిష్ చిన్నగా నవ్వాడు.

వాడి నవ్వు చూడగానే నాకు కోపం వచ్చింది. అందుకు కదా రష్ ఎప్పుడు నిన్ను తిడుతూ కొడుతూ ఉంటుంది అనుకున్నా కానీ అప్పుడే గుర్తు వచ్చింది, ఇద్దరు ప్రేమించుకున్నారు.

నన్ను పట్టుకున్న ముగ్గురులో ఒకరు "రేయ్, వాడిని రా మనం పట్టుకోవాల్సింది...." అన్నాడు.

ముగ్గురులో ఒకడు నన్ను వదిలి క్రిష్ ని పట్టుకోడానికి వెళ్ళాడు. నాకు కూడా కొంచెం కంగారు అనిపించింది.

కేశవ్ "రేయ్, క్రిష్  పారిపో..." అన్నాను.

క్రిష్ "సారీ నేను నిన్ను కాపాడతానని మాట ఇచ్చేశాను" అన్నాడు.

అలా క్రిష్ మీదకు మరో వ్యక్తీ వచ్చాడు. క్రిష్ సిద్దంగా ఉండడం తో అతనిని కాలుతో పొట్ట మీద కొట్టడంతో మోకాళ్ళ మీద పడగొట్టి మొహం మీద మూడు సార్లు కొట్టాడు వాడు స్పృహ తప్పాడు.

యిద్దరం బాబాయ్ దగ్గర పోలిస్ ట్రైనింగ్ తీసుకున్నాం. క్రిష్ నా మీద ఎప్పుడు ఓడిపోయినా నాకు తెలుసు వాడు ఏంటి అనేది. 

నా వైపు "చూశావా...." అన్నట్టు చూశాడు. నాకు ఎక్కడో ఇగో కొట్టేసింది. అప్పటికే నన్ను ఇద్దరు పట్టుకొని ఉన్నారు.

నేను విసురుగా విదిలించుకొని ఇద్దరి నుండి విడిపించుకున్నాను.

ఒకడిని పట్టుకొని కడుపులో రెండూ సార్లు గుద్ది, మొహం మీద ఒక్కటే కొట్టాను. వాడు స్పృహ తప్పాడు. 

క్రిష్ వైపు చూసినపుడు కేశవ్ "ఒక్క దెబ్బ" అన్నాను.

క్రిష్ చిన్నగా నవ్వి "వాడు మరీ బక్కగా ఉన్నాడు" అన్నాడు.

కేశవ్ "కాని బలంగా ఉన్నాడు" అన్నాను.

ఇద్దరం ఎదురుగా ఉన్న నాలుగో వాడిని చూశాం. 

క్రిష్ మనుసులో ఏముందో అర్ధం అయిపొయింది. క్రిష్ చిన్నగా వాడి దగ్గరకు కదిలాడు.

నేను కూడా వాడి కంటే ముందుగా కదిలాను.

మా ఇద్దరి ఆత్రం చూసి వాడు ప్రాణభయంతో పరిగెత్తాడు.





క్రిష్ ని హాస్పిటల్ లో చూపిస్తున్నాను, బాగానే ఉన్నాడు, ఇద్దరం బయటకు వచ్చేశాం.

క్రిష్ సైలెంట్ గా ఉన్నాడు. ఏమి మాట్లాడడం లేదు. కారు లో నిశ్శబ్దం నాకు చాలా ఇబ్బందిగా ఉంది.

కేశవ్ "రష్ ని ప్రేమించావా...." అని అడిగాను.

క్రిష్ తల ఊపాడు. చెత్తవెధవ నోటితో చెప్పొచ్చు కదా అనుకున్నాను.

కేశవ్ "ఎప్పటి నుండి...."

రెండూ నిముషాల తర్వాత...

క్రిష్ "చిన్నప్పటి నుండి" అన్నాడు. 

ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ అరగంటకి సమాధానం చెప్పినట్టు చాలా లేటుగా చెప్పాడు.

కేశవ్ "మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు అంటే అది నాకు గుండెల్లో పొడిసినట్టు ఉంది" అన్నాను.

క్రిష్ "ఎందుకు?"

కేశవ్ "ఎందుకు అంటావేంటి? మీ ఇద్దరూ నాకు రెండూ కళ్ళు లాగా... తనని చెల్లెలు లాగా.... నిన్ను తమ్ముడులా ఫీల్ అయ్యాను ఇన్ని రోజులు.... మీ ఇద్దరూ నా వెనక ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు అంటే అది మీరు నాకు చేసిన మోసం కాదా..." అన్నాను.

క్రిష్ "ఇక్కడ దించు"

కారు ఆపాను.

క్రిష్ "మేం ఎప్పుడు సీక్రెట్ గా చేయలేదు.... అందరి ముందునే ఉన్నాం"

కేశవ్ "మరి మీ ఇద్దరూ లవ్ లో ఉన్నారని నాకు ఎప్పుడు అనిపించలేదు.... నా ముందు ఎప్పుడు అలా లేరు కదరా..."

క్రిష్ "ఎందుకంటే నువ్వు కళ్ళు ఉన్న గుడ్డోడివి బావా..." అని నవ్వాడు.

నాకు కోపం వచ్చింది. కాని ఇంతలోనే కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు.

కేశవ్ "ఎక్కడకు వెళ్తున్నావ్.... ఇది మీ రూమ్ కాదు కదా..."

క్రిష్ వెనక్కి తిరగకుండానే "నేను ఒకరికి ప్రామిస్ చేశాను" అని అరిచాడు.

కేశవ్ "కనీసం... థాంక్స్ చెప్పవా...... ఇంత హెల్ప్ చేశాను కదా..." అని అరిచాను.

క్రిష్ ముందుకు తిరిగి "థాంక్స్" అని వెనక్కి వెళ్ళిపోయాడు.

క్రిష్ చీకటిలో కలిసిపోయాడు.

చుట్టూ ఉన్న ఇళ్ళలో వాళ్ళు రాత్రిళ్ళు పెద్దగా అరుస్తున్నాం అని బయటకు వచ్చి నా మీద అరుస్తున్నారు, కంప్లైంట్ ఇస్తామని అన్నారు. నేనే సబ్ ఇన్స్పెక్టర్ అని చెబితే ఇంకా చండాలంగా ఉంటుంది అని అక్కడ నుండి వెళ్ళిపోయాను.




పిన్ని "హలో కేశవ్..."

కేశవ్ "హా... పిన్ని చెప్పు...."

పిన్ని "కేశవ్.... రష్ ని వాళ్ళ అత్తారింటి వాళ్ళు బయటకు పోమ్మాన్నారు అంట. "

కేశవ్ "ఏంటి?"

పిన్ని "అవునూ.... తను ఇక్కడకు వస్తే మీ బాబాయ్ ఇంట్లోకి రానివ్వడం లేదు"

కేశవ్ "మరి ఎక్కడ ఉంది?"

పిన్ని "రాత్రి అంతా పాపం ఆ పిల్లాడిని పట్టుకొని గడప దగ్గరే పడుకుంది. తన సంగతి ఒక సారి చూడరా.... నీకు పుణ్యం ఉంటుంది"

కేశవ్ "బాబాయ్ కి ఏమైనా పిచ్చి పట్టిందా...."

పిన్ని "ఏం చేస్తాం.... పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు"

కేశవ్ "సరే, నేను వస్తున్నా ఆగూ.... " అంటూ కారుని అటూ వైపు తిప్పాను.

దారిలో ఒక సిమెంట్ బల్ల మీద ఇద్దరు వ్యక్తులు కనిపించారు.

దగ్గరకు వెళ్తే అర్ధం అయింది ఒకరు క్రిష్, మరొకరు రష్....




రష్ "ఎందుకని పదే పదే వస్తావ్... నా వల్ల నీకు ఎప్పుడూ ఇబ్బందే.... వెళ్లి పో.... "

క్రిష్ బాబుతో ఆడుతున్నాడు.

రష్ "నువ్వు ఇలా వచ్చి మళ్ళి మళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటే, నాకు చాలా సిగ్గుగా ఉంది, వద్దు వెళ్లి పో...." అంటూ బాబుని తిరిగి తన చేతుల్లోకి లాక్కుంది.

క్రిష్ "బాబు పేరు ఏంటి?"

రష్ "నీకు ఎందుకు?"

క్రిష్ "చెప్పూ" అని చిన్నగా అరిచాడు.

రష్ కోపంగా క్రిష్ ని చూస్తూ, అతని భుజం మీద చిన్నగా కొడుతూ "నన్ను అరుస్తావా.... నా మీద అరుస్తావా...." అంది.

క్రిష్ "సరే.... సరే.... సారీ...."

రష్ "నాతో ఇలా గొడవపడడుతూనే ఉంటావా..." అని అరిచింది.

ఇద్దరి మధ్య రెండూ నిముషాల మౌనం...

క్రిష్ "నాతో గొడవపడతావా...."

రష్ "మ్మ్" అంటూ అర్ధం కానట్టు చూసింది.

క్రిష్ "నాతో కలిసి ఒకే ఇంట్లో లైఫ్ లాంగ్ గొడవ పడుతూ ఉంటావా...." అని అడిగాడు.

రష్ "నే... నేను..." అంటూ ఆగిపోయింది.

క్రిష్ "లైఫ్ లాంగ్ నాతో గొడవపడతావా.... ప్లీజ్"

రష్ సంతోషంగా నవ్వింది. కాని క్రిష్ రెండో సారి కూడా "గొడవపడతావా" అని అడిగాడు.

రష్ సంతోషంగా ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ "నేను నీతో గొడవపడే దానిలా కనిపిస్తున్నానా" అంది.

క్రిష్ "ఉమ్మ్.... అవునూ" అన్నాడు.

రష్ "నిన్నూ" అంటూ క్రిష్ భుజం మీద కొరికింది.

క్రిష్ అరవక పోవడంతో ఇంకా గట్టిగా కొరికింది.

కాని రష్ కోపం ప్లేస్ లో జాలి అనిపించి క్రిష్ ని తేరిపార చూసింది.

క్రిష్ తలకి కట్టు కట్టుకొని నవ్వుతు హ్యాండ్ సమ్ కనిపిస్తున్నాడు. 

మెల్లగా తల మీద చేయి వేసి నిమురుతూ "నొప్పి తగ్గిందా..." అని అడిగిందా.

క్రిష్ "హాస్పిటల్ లో మందులు మంచివి ఇచ్చారు... ఎప్పుడో తగ్గిపోయింది"

రష్ "ఓహో"

క్రిష్ "దారిలో ఒక సారి హాస్పిటల్ కి వెళ్లి వద్దాం"

రష్ "ఎందుకు? నొప్పి లేదన్నావ్ కదా... ఇంకా నొప్పి ఉంది కదా.... నేను ఏడుస్తా అని నాకు లేదని చెబుతున్నావ్ కదా..."

క్రిష్, రష్ ని చూసి చిన్నగా నవ్వుతూ "కాదు, కుక్క కరిచింది" అంటూ రష్ కొరికిన చోట చూపించాడు.

రష్ కోపంగా "నేను కుక్కనా... హా..." అంటూ క్రిష్ భుజంపై కొట్టింది. 

క్రిష్ నవ్వేసి బాబుని తీసుకొని ముందుకు నడిచాడు.

రష్ "ఉండు వస్తున్నా.... బ్యాగ్ బరువుగా ఉంది" అంటూ పెద్ద బ్యాగ్ ని లాక్కొని వస్తుంది.

క్రిష్ "మోసుకొని రా...."

రష్ స్పీడ్ వచ్చి బాబుని తీసుకొని బ్యాగ్ క్రిష్ భుజానికి తగిలించి, మరో చేతిని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది.



అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటూ వాళ్ళనే చూస్తున్న కేశవ్ చిన్నగా నవ్వుకున్నాడు.

నడుచుకుంటూ తన బాబాయ్ రామ్మోహన్ ఇంట్లోకి వెళ్ళాడు.




రామ్మోహన్ "ఏంటి ఇలా వచ్చావ్...."

కేశవ్ "చిన్నప్పుడు నాకు ఒక మాట చెప్పావ్ గుర్తు ఉందా బాబాయ్...."

రామ్మోహన్ "ఏం మాట...."

కేశవ్ "క్రిష్, రష్ వాళ్ళిద్దరికీ ఏం కాకుండా చూసుకోమని.."

రామ్మోహన్ కోపంగా పళ్ళు నూరాడు.

కేశవ్ "నిన్న రాత్రి క్రిష్ మీద అటాక్ జరిగింది"

పిన్ని "ఏమయింది? ఎలా ఉన్నాడు."

కేశవ్ "బాగానే ఉన్నాడు. ప్రస్తుతం నీ ఇంటి ముందు రాత్రి నుండి పడిగాపులు కాసిన మీ కూతురు రష్ ని కూడా వాడే తీసుకొని వెళ్ళాడు"

రామ్మోహన్ "నా దృష్టిలో ఆ ఇద్దరు చనిపోయారు" అన్నాడు.

కేశవ్ "అలా అనే అనుకోండి..... వాళ్ళ ఇద్దరినీ ఏమైనా ఇబ్బంది పెట్టాలని చూశారో... నిన్ను మీ అల్లుడు సందీప్ ఇద్దరినీ నిలువునా పాతెస్తా...."

రామ్మోహన్ "నేనొక సెక్యూరిటీ ఆఫీసర్ ని" అని కోపంగా అరిచాడు.

కేశవ్ "నేను కూడా.... అలాగే ఇది నా జ్యూరిడిక్షన్.... " అని వెనక్కి వెళ్ళిపోయాడు.

రామ్మోహన్ "నేను నిన్ను పెంచాను రా...."

కేశవ్ "కుక్కలు అనుకునే కదా పెంచావ్...." అన్నాడు.

రామ్మోహన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు.

కేశవ్ "క్రిష్ కి తెలియకపోవచ్చు కానీ.... నాకు తెలుసు, నువ్వేంటో.... వాళ్ళ దగ్గరకు వెళ్లి చూడు... నేనెంటో నీకు తెలిసొస్తుంది" అని వెళ్ళిపోయాడు.






















[+] 10 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 19-08-2024, 02:19 PM



Users browsing this thread: 4 Guest(s)