Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
#71
11. నా జీవితం ఇక్బాల్ చేతుల్లో  2.0












సందీప్ కి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇక్బాల్ కి ఫోన్ చేయాలి అంటే ఫోన్ ఎక్కడో పడిపోయింది. వేగంగా ఒక మొబైల్ షాప్ కి వెళ్లి ఫోన్ ఆన్ చేసి ఇక్బాల్ కి ఫోన్ చేస్తే రష్ ని వరంగల్ లో వ్యభిచార గృహానికి అమ్మేశాను వెళ్లి తెచ్చుకో అన్నాడు.

సందీప్ కి ఎం చేయాలో అర్ధం కాలేదు. ఎవరికీ ఎం చెప్పాలి, వ్యభిచార గృహంలో ఉంది అంటే, తను అనుకుంటూ ఆగి పోయాడు. రష్ అమాయకపు మొహం కళ్ళ ముందు మెదిలింది, "మీకు పిల్లలు పుట్టక పోయిన పర్లేదు అండి, ఇలాగే లైఫ్ లాంగ్ ఉందాం" అనే మాటలు గుర్తుకు వచ్చాయి. ఒకప్పుడు తనతో చెబితే తన మీద చిన్న చూపుతో అంటుంది అనుకున్నాడు. ఇప్పుడు తను వెళ్ళిపోయాక అర్ధం అవుతుంది, తాను ఏం కోల్పోయాడో. 

రష్ మాట్లాడిన, తనతో నవ్వుకున్న మరియు సరదాగా గడిపిన క్షణాలు గుర్తుకు వస్తూ ఉంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. రష్ అమాయకపు మాటలు గుర్తు వస్తూ ఉంటే, బాధ కలుగుతుంది. ఏం చేయాలో అర్ధం కాక చుట్టూ చూస్తూ, సాయంత్రానికి ఇంటికి వెళ్ళాడు.

కొద్ది సేపూ రష్ తనతో ఉన్నా క్రిష్ గురించి ఆలోచించిన క్షణాలు గుర్తుకు వచ్చాయి, క్రిష్ పేరు చెబితే ఆమె మొహంలో మారిపోయే హావభావాలు గుర్తుకు వచ్చాయి.

ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు.

ఇంట్లో అప్పటికే రష్ ఇంట్లో వాళ్ళు, రష్ కి అన్న వరస కేశవ్ (సబ్ ఇన్స్పెక్టర్) తన వాళ్ళు అందరూ అన్నారు. సందీప్ ని అందరూ రష్ ఎక్కడ అని అడుగుతూ ఉన్నారు.

సందీప్ కి భయం వేసింది, ఏమైనా చెబితే తనని ఏమంటారో అసలు ఎలా మొదలు పెట్టాలో అర్ధం కావడం లేదు.

సందీప్ "మంచి నీళ్ళు కావలి అని అడిగింది. నేను తీసుకు వచ్చే సరికి తను అక్కడ లేదు. ఆ చుట్టూ పక్కల అంతా వెతికాను. ఎక్కడ కనపడలేదు" అన్నాడు.

అందరూ కంగారు పడ్డారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. సందీప్ వాళ్ళ అందరికి దూరంగా వెళ్లి కూర్చున్నాడు. అతని కళ్ళలో కన్నీటి చెమ్మ కనిపిస్తుంది.

రష్ కి ఏమైందో అన్న బాధ ఒక వైపు, తాను ఎక్కడ దొరికిపోతానో అనే బాధ మరో వైపు.

కేశవ్ ముందుకు వెళ్లి సందీప్ ని తీసుకొని వెళ్లి వాళ్లు వాటర్ తీసుకున్న షాప్ దగ్గరకు వెళ్లి అక్కడ CC కెమెరా చూశాడు. అక్కడ రష్ కారు దిగినట్టు చూపిస్తుంది.

సందీప్ కి రష్, నిర్వేద్ కి డైపర్ మార్చడం కోసం దిగింది అని అర్ధం అయింది, తను వేరే దారిలో వచ్చినట్టు ఉంది అందుకే CC కెమెరాలో తను తిరిగి వచ్చినట్టు తెలియడం లేదు.

రామ్మోహన్ (రష్ తండ్రి) "హలో"

కేశవ్ "బాబాయ్, రష్ కారు దిగినట్లు ఉంది. కానీ ఎక్కలేదు"

సందీప్ ఊపిరి పీల్చుకున్నాడు.

రామ్మోహన్ "నాకు తెలుసు ఏం జరిగిందో...."

కేశవ్ "ఏం జరిగింది?"

రామ్మోహన్ "నువ్వు వచ్చేసేయ్... ఇలాంటి పరువు తక్కువ పని చేస్తుంది అని అనుకోలేదు.... ఛీ.... ఛీ.... తను నా కూతురే కాదు" అంటూ కోపంగా అరిచి ఫోన్ కట్టేశాడు.

కేశవ్ కి ఏం చేయాలో అర్ధం కాక, పిన్నికి ఫోన్ చేశాడు.

పిన్ని "హలో... కేశవ్... రష్ దొరికిందా..."

కేశవ్ "లేదు... చూస్తూ ఉంటే తను కావాలనే...."

పిన్ని మౌనంగా ఉంది.

కేశవ్ "పిన్ని"

కేశవ్ "పిన్ని"

కేశవ్ "పిన్ని" అని పిలిచాడు.

పిన్ని "ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని అనుకోలేదు"

కేశవ్ "ఏమయింది పిన్ని..."

పిన్ని "రష్ కి ఈ పెళ్లి ఇష్టం లేదు"

కేశవ్ "రష్ ఎవరినైనా ప్రేమించిందా..."

పిన్ని మౌనంగా ఉంది.

కేశవ్ "పిన్ని"

కేశవ్ "పిన్ని"

కేశవ్ "పిన్ని" అని పిలిచాడు.

పిన్ని "హా... చెప్పూ..."

కేశవ్ "రష్ ప్రేమించిన వ్యక్తీ ఎవరూ?"

పిన్ని "వదిలేసెయ్.... మీ బాబాయ్ మనుషులను పెట్టి వెతికిస్తున్నాడు... దొరుకుతారు.... అయినా వాళ్ళే వస్తారు... ఎక్కడకు పోతారు..."

కేశవ్ "పిన్ని"

పిన్ని "హుమ్మ్"

కేశవ్ "ఏవరది?"

పిన్ని "నువ్వు నమ్మవు..."

కేశవ్ "ఏవరు? పిన్నీ...."

పిన్ని "క్రిష్..."

'క్రిష్' ఆ మాట వింటూనే కేశవ్ షాక్ అయిపోయాడు.

కేశవ్ "ఏం మాట్లాడుతున్నావ్ పిన్నీ... క్రిష్-రష్ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తె బాగ్గుమంటుంది"

పిన్ని మౌనంగా ఉంది.

కేశవ్ "పిన్ని"

పిన్ని "హుమ్మ్"

కేశవ్ "నువ్వు నిజం చెబుతున్నావా!"

పిన్ని "వాళ్ళు ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్ట పడ్డారు...."

కేశవ్ "క్రిష్ చిన్న పిల్లవాడు"

పిన్ని "రష్ కి ప్రేగ్నేన్సి క్రిష్ వల్ల వచ్చింది"

కేశవ్ కి ఒక్కో మాట బులెట్ లా దిగుతుంది.



తనకు తెలిసినంత వరకు రష్ అంటే తనకు ఒక చెల్లెలు అందరి కంటే ఇష్టమైన చెల్లెలు. మరో వైపు క్రిష్ బావమరిది అయినా తమ్ముడులా ఫీల్ అయ్యాడు. ఇద్దరూ చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే వాళ్ళను ఒకరికి ఒకరు కొట్టుకోకుండా చూడడం కేశవ్ బాధ్యత. ముగ్గురు అలాగే పెరిగారు.

రష్ పెళ్ళికి ముందు వరకు కూడా ఇద్దరూ ఒకరిని ఒకరు ఎడిపించుకుంటూ ఉన్నారు. అలాంటిది వాళ్ళ గురించి ఇలా ఆలోచించలేక పోయాడు.

ఎదురుగా బాధగా కూర్చున్న సందీప్ ని చూస్తూ ఉంటే, క్రిష్ మీద చాలా కోపం వచ్చేసింది.






రష్ ని తీసుకొని వచ్చి ఒక గదిలో ఉంచారు. రష్ మాట్లాడాలని చూస్తే కొట్టేలా చూస్తున్నారు. అక్కడ స్మెల్ కి వాంతు వచ్చేసింది. గుట్కా, ఆల్కహాల్ మరియు సెక్స్ సెంట్ మిక్స్ అయిన ఆ స్మెల్ పీల్చలేక కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. 

కళ్ళు తెరిచే సరికి పిల్లాడు స్పృహలో లేడు... కనపడిన వాళ్ళ అందిరిని పిల్లాడి కోసం డాక్టర్ ని పిలవమని అడిగింది. చుట్టూ చూసినా ఎవరూ పలకలేదు.

ఒకమ్మాయి వచ్చి రష్ ని పలకరించింది. ఎవరూ చూడకుండా ఫోన్ ఇచ్చింది. ఫోన్ తీసుకొని సందీప్ చేసింది, స్విచ్ ఆఫ్ వస్తుంది, తండ్రి రామ్మోహన్ కి ఫోన్ చేయాలంటే భయం వేసింది, పరువు కోసం చూసే మనిషి తనని ఇలా చూస్తే అసలు ఒప్పుకోడు. కేశవ్ అన్న మీద కూడా నమ్మకం లేదు, నాన్న మాట వింటాడు. అనుకుంటూ అప్రయత్నంగానే క్రిష్ నెంబర్ కి కాల్ చేసింది.

క్రిష్ ఫోన్ ఎత్తి హలో అనగానే ఏడుపు వచ్చేసింది. తన గురించి చెప్పగానే వస్తున్నా అన్నాడు. ఎందుకో తెలియదు క్రిష్ ని నమ్మాలని అనిపించింది.

కొద్ది సేపటికి క్రిష్, తన ఫ్రెండ్స్ తో వచ్చాడు. 

అప్పుడే చూశాను, అతని పేరు నూతన్.... క్రిష్ భయ్యా అని పిలుస్తున్నాడు. అతనికి ఎదో సూపర్ పవర్ ఉన్నట్టు అనిపించింది. 

నూతన్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అక్కడున్న మనుషులు పిచ్చి పట్టిన మనుషుల్లా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. అతను నా వైపు చూస్తే నాకు భయం వేసింది. "ష్" అన్నట్టు నోటికి చూపుడు వేలు చూపించాడు. తల ఊపాను, సరే అన్నట్టు.

క్రిష్ బయట ఉన్న అందరినీ కొట్టి లోపలకు వస్తూ ఉంటే నూతన్ "పడుకోండి" అన్నాడు. అందరూ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పడిపోయారు. రష్ కి నూతన్ ని చూస్తే భయం వేసింది. ఎదో రక్షాసుడు ఏమో అన్నట్టుగా భయం వేసింది.

నూతన్ ని చూస్తూ క్రిష్ లోపలకు వస్తూనే "ఇంతమందిని కొట్టేసావా... థాంక్స్ భయ్యా... నీ టాలెంట్ సూపర్" అంటూ "రష్, రా.... " అంటూ తన చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళాడు. 

క్రిష్ తన చేతిని పట్టుకొని లాగుతుంటే అర్ధం అయింది, క్రిష్ ఇంతకు ముందులా కాదు సన్న బడ్డాడు. నూతన్ మీద భయం కంటే... క్రిష్ మీద దిగులు ఎక్కువయింది.

ఒక చేతిలో నిర్వేద్ ని ఎత్తుకొని, మరో చేత్తో తన చేయి పట్టుకొని స్పీడ్ గా లాక్కొని వెళ్తున్నాడు. "క్రిష్... క్రిష్... క్రిష్... " అంటూ క్రిష్ వెంట పడి వెళ్ళింది.

నిర్వేద్ ని తీసుకొని వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. క్రిష్ తో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. నిర్వేద్ కి  మామూలు జ్వరం అని చెప్పారు.

ఇన్ని రోజులు ఎందుకో ఒంటరిగా అనిపించింది, సందీప్ వచ్చినా పిల్లాడి మీద అంత ఆసక్తి లేనట్టు ఉండే వాడు. కానీ ఇప్పుడు క్రిష్ హడావిడి చూస్తూ ఉంటే, తన బిడ్డ కోసం తన లాగే కంగారు పడే మనిషి మరొకరు ఉన్నందుకు సంతోషించింది.

నిర్వేద్ కి జ్వరం తగ్గడం తో మామూలు అయ్యాం.

ఆ రాత్రి ఎప్పటికో అంతా హాస్పిటల్ కుర్చీలలో కూర్చొని క్రిష్ భుజం పై తల వాల్చి నిద్ర పోయింది. ఎందుకో తెలియదు... దైర్యంగా అనిపించింది. 



అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావ్.... ఏమయింది? అని ఏమి అడగలేదు..... తెల్లారికి కళ్ళు తెరవగానే "నిర్వేద్ కి తగ్గింది, నువ్వు ఫ్రెష్ అవ్వు, బ్రేక్ ఫాస్ట్ తెస్తాను" అన్నాడు. 

క్రిష్ ని చూస్తే హాగ్ చేసుకోవాలని అనిపిస్తుంది. అదంతా మనసులోనే చంపుకొని "నన్ను సందీప్ ఇంటి దగ్గర వదిలిపెట్టు" అంది.

క్రిష్ కళ్ళలో బాధ స్పష్టంగా కనిపించింది, అది చూసి నా గుండె పిండినట్టు బాధగా అనిపించింది.

క్రిష్ గడ్డం పట్టుకొని "తప్పుగా అనుకోవద్దు... నేనేం తప్పు చేయలేదు" అంటూ తనని అల చూడొద్దు అని చెప్పింది.

క్రిష్, తన గడ్డం పట్టుకున్న చేతిని చిన్నగా తోసేసి "నా బంగారం తప్పు చేయదు" అన్నాడు.

ఇక నన్ను నేను ఆపుకోలేక క్రిష్ ని హత్తుకోవాలని అనుకున్నాను. కానీ సందీప్ గురించి చెప్పి లేని పోనీ ఆలోచనలు రేకెత్తించి క్రిష్ మనసుని చదువు మీద నుండి వేరే వాటి మీదకు మార్చదలుచుకోలేదు.

ఇద్దరం కారులో ఎక్కి సందీప్ ఇంటి ముందు దిగాం.

క్రిష్ తో కలిసి ఉంటే ఎందుకో తెలియదు దైర్యంగా ఉంది.





సందీప్ వాళ్ళ అమ్మ కింగ్ సైజ్ సోఫాలో కూర్చొని ఉంటే, మిగిలిన వాళ్ళు అందరూ అక్కడ ఉన్న చిన్న చిన్న కుర్చీలలో కూర్చున్నారు.

సందీప్ వాళ్ళ అమ్మ ఫోన్ లో "ఆ ఇద్దరూ ఎక్కడ దొరికినా ... ఆ క్రిష్ ని చంపేయండి..." అని చెప్పింది.

పిన్ని భయంగా చూసింది.

సందీప్ వాళ్ళ అమ్మ "ఏంటి? వదిన గారు ఏంటి? సంగతి...."

పిన్ని భయపడింది.

సందీప్ వాళ్ళ అమ్మ నవ్వుతూ "ఏం రామ్మోహన్ ఆ క్రిష్ నీ మేనల్లుడు అంట కదా... చంపేయించేదా..."

రామ్మోహన్ "పరువు తీసిన వాళ్ళు ఉన్నా చచ్చినా నేను పట్టించుకోను" అన్నాడు.

సందీప్ వాళ్ళ అమ్మ "అది.... మగాడిలా సమాధానం చెప్పావ్...." అంది.

పిన్ని అనునయంగా రామ్మోహన్ చేతిని పట్టుకొంది.

రామ్మోహన్, పిన్ని చేతిని విదిలించి కొట్టి "అంతా నీ పెంపకమే ఛీ...." అని చిన్నగా అన్నాడు.

పిన్ని బాధగా కళ్ళు మూసుకుంది.

పిన్ని మనసులో "తిరిగి రావొద్దు రష్... ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి..." అనుకుంది.

కేశవ్ ఫోన్ లో "అన్ని చోట్లా వెతికాను... ఎక్కడా దొరకలేదు" అని రామ్మోహన్ కి చెప్పాడు.

కేశవ్ మనసులో "అసలు ఆ క్రిష్ ఏమనుకున్తున్నాడు" అని అనుకున్నాడు.

సందీప్ అందరిని చూస్తూ "అసలు క్రిష్ ఎక్కడకు వెళ్ళాడు " అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు.

ఇంతలో క్రిష్, రష్ మరియు ఆరు నెలల నిర్వేద్ అక్కడకు వచ్చారు. 

అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.





క్రిష్ మాట్లాడేంతలో సందీప్ వేగంగా వచ్చి క్రిష్ చెంప మీద కొట్టాడు.

ఇంతలో రామ్మోహన్, కేశవ్ అందరూ సందీప్ తమ్ముడు సునీల్ అందరూ బూతులు తిడుతూ క్రిష్ ని కింద పడేసి కొట్టడం మొదలు పెట్టాడు.

ముందు రోజు, అంత మందిని కొట్టి పడేసిన క్రిష్ ఇప్పుడు వీళ్ళ చేత తన్నులు తింటున్నాడు. 

రష్ నోరు తెరిచి ఎదో చెప్పబోతే.... క్రిష్ తల అడ్డంగా ఊపాడు.

క్రిష్ మైండ్ వాయిస్ "వ్యభిచార గృహంలో దొరికింది అనే దాని కంటే.... క్రిష్ మాయమాటలు చెప్పి లేపుకొని వెళ్ళాడు అని అనుకోవడం మంచిది " అనుకుంటున్నాడు.

రష్ ఏడుస్తూ అరుస్తూ చూస్తూ ఉంది. 

సందీప్ పెద్ద ఐరన్ రాడ్ తీసుకొని వచ్చాడు. క్రిష్ కళ్ళు తెరిచి రష్ పెద్దగా అరుస్తూ ఏడవడం చూస్తూ ఉన్నాడు, పిన్ని గట్టిగా ఆమె చేతులు పట్టుకుంది. మోకాళ్ళ మీద పడి పెనుగులాడుతూ "వద్దు... వద్దు..." అంటూ అరుస్తుంది.

రష్ కి క్రిష్ మైండ్ వాయిస్ "ఇన్ని రోజులు... నా మీద ప్రేమ లేదు అన్నట్టు ఉన్నావ్ కదా... నాకు దెబ్బలు తగులుతుంటే... నీకు ఎందుకు ఏడుపు వస్తుంది" అంటూ ఉన్నాడు.

క్రిష్ తల మీద నుండి మొహం మీదకు రక్తం కారింది. సందీప్ మరో దెబ్బ కొట్టడంతో క్రిష్ స్పృహ తప్పి అక్కడే పడిపోయాడు.

ఒక్క క్షణం కాలం స్థంబించినట్టు అనిపించింది. ఏం జరిగిందో అర్ధం కావడానికి ఒక క్షణం పట్టింది.

రష్ ఏడుస్తూ మోకాళ్ళ మీదనే నడుచుకుంటూ వెళ్లి క్రిష్ దగ్గరకు వెళ్ళింది, తల అంతా రక్తంతో ఉన్న క్రిష్ ని చూసి పెద్దగా ఏడ్చింది. ఏడుస్తూనే క్రిష్ ని కదిలించింది, ఆమె కన్నీళ్లు అతని మొహం పై పడి క్రిష్ కళ్ళు తెరిచాడు.

క్రిష్ మైండ్ వాయిస్ "నా ఆయుషు కూడా పోసుకొని హ్యాపీగా ఉండు రష్... నన్ను మర్చిపో... లవ్ యు రా..." అనుకున్నాడు.

క్రిష్ కళ్ళు మూసుకుపోయాయి. 

రష్ ఏడుస్తూ ఉన్నా, సందీప్ వాళ్ళ అమ్మ ఆర్డర్ తో రష్ ని అక్కడ నుండి పక్కకు లాక్కెళ్ళిపోయారు. ఏడుస్తూ స్పృహ తప్పింది.





సందీప్ "నువ్వేం చేస్తావో నాకు తెలియదు.... హాస్పిటల్ లో ఉన్నాడు.... ఆ క్రిష్ చావాలి...."

సందీప్ మనసులో "రష్ ని ఎదో ఒకటి చేసి నోరు మూయిస్తా, కానీ వాడు బ్రతికి ఉంటే, నిజం ఎలాగో అలా తెలిసి పోతుంది" అనుకున్నాడు.

ICU లో క్రిష్ కి వైద్యం జరుగుతూ ఉంది. సందీప్ పంపిన మనుషులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ కేశవ్... నిలబడి చూస్తూ ఉన్నాడు.




హాయ్ నా పేరు కేశవ్...

(చిన్నప్పుడు)

కేశవ్ మరియు క్రిష్ ఇద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు. కేశవ్... క్రిష్ కంటే పెద్ద. కేశవ్ తేలికగా క్రిష్ ని కింద పడేసాడు. 

కేశవ్ "ఇప్పటి వరకూ జోక్... ఈ సారి సీరియస్ గా కొడతా చెబుతున్నా.... వెనక్కి తగ్గు... పైకి లేవకు..." అన్నాడు

క్రిష్ రొప్పు తీసుకొని "నేను తగ్గను... నువ్వు ఎన్ని సార్లు కొట్టినా నేను పైకి లేస్తూనే ఉంటా..." అన్నాడు.




(ప్రస్తుతం)

కేశవ్, క్రిష్ ని ICU గ్లాస్ డోర్ నుండి చూస్తూ ఉన్నాడు.

కేశవ్ "రేయ్, క్రిష్... పైకి లేవరా... ఈ ఒక్క సారి పైకి లేవరా...." అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.





ఈ ప్రపంచంలో తప్పును దైర్యంగా ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది.... వాటిని పక్కనోళ్ళ మీద తోసేసేవాళ్ళు చాలా చాలా చాలా ఎక్కువ మంది.

పిన్ని...... జస్ట్ రష్ కి క్రిష్ వల్ల ప్రేగ్నేన్సి వచ్చింది అని చెప్పింది. అది జరిగేటపుడు తాను అక్కడే ఉన్న సంగతి, అందరి అనుమతి ఉన్న సంగతి చెప్పలేదు. తప్పును వాళ్ళ ఇద్దరి మీదకి తోసేసింది.

రామ్మోహన్..... అంతా నీ పెంపకమే అని భార్య మీదకు తోసేసాడు.

సందీప్...... చెప్పాలి అంటే చాలా మాటలు ఉంటాయి, కానీ ఒక్క మాట అన్నింటికీ సమాధానం ఇస్తుంది. పిరికివాడు....




సిచ్యువేషన్ వచినపుడు అందరూ కలిసి ఆ మంచి వాడినే బలి చేస్తారు. 
















[+] 12 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 17-08-2024, 06:27 PM



Users browsing this thread: 17 Guest(s)