17-08-2024, 11:55 AM
(16-08-2024, 09:12 PM)3sivaram Wrote:రష్ క్యారక్టర్ ఆలోచన విధానం ఈ కాలంలో చాలా మంది అమ్మాయిలకు వర్తిస్తుంది. ఇలా జరుగుతుంది అని చెప్పడం కాదు. ఆలోచన విధానం అంతే....పెళ్లి అప్పుడు......రష్, క్రిష్ ని ఇష్ట పడింది..... చెప్పలేదు.. కారణం క్రిష్ మనసులో ఏమి ఉందొ తెలియదు. పైగా అప్పటికీ తండ్రి పెళ్లి ఫిక్స్ చేసేశాడు. తండ్రి డెసిషన్ ఫాలో అయిపొయింది.మరిది సునీల్ అప్పుడు......రష్ కి, మరిదితో గడపడం ఇష్టం లేదు... కాని భర్త సందీప్ బెదిరింపుకి భయపడి... ఫాలో అయిపొయింది.ఇంట్లో సునీల్ సంగతి చెప్పలేదు.....దైర్యం తెచ్చుకొని చెప్పాలని అనుకున్నా, అందరూ ఏమనుకుంటారో... తననే తప్పు పడతారు ఏమో అని భయపడింది. ఆ భయాన్ని ఫాలో అయింది.పైన జరిగిన సంగతి....మనసులో క్రిష్ మీద ప్రేమ ఉన్నా, తండ్రి ఆలోచనలతో తన నిర్ణయం మార్చుకొని క్రిష్ ని హార్ష్ గా రిజెక్ట్ చేసేసి క్రిష్ మనసులో స్వార్ధపరురాలుగా ముద్ర పడిపోయింది.
మాములుగా అయితే ఏం చేయాలి..... పెళ్లి అప్పుడు వదిలేయండి, సందీప్ ప్రపోజల్ విని... విడాకులు మొహాన కొట్టి పుట్టింటి వచ్చి షెల్టర్ తీసుకొని.... క్రిష్ కి ప్రపోజ్ చేసి తను కూడా చదువుకొని ఇద్దరూ ఒక పొజిషన్ కి వచ్చాక పెళ్లి చేసుకోవాలి. కాని వాళ్ళు చెప్పిన మాట విని, వీళ్ళు చెప్పిన మాట విని, అటూ అడుగు వేసి ఇటూ అడుగు వేసి త్యాగం చేసినా కూడా క్రిష్ దృష్టిలో చెడ్డ పేరే తెచ్చుకుంది.
బ్రదర్ మీరు తెలిసి రాస్తున్నారో, తెలుసుకుని రాస్తున్నారో లేక ప్రస్తుత సమాజాన్ని, దాని పోకడలను క్షుణ్ణంగా అబ్సర్వ్ చేసి రాస్తున్నారో నాకు తెలియదు గాని..మీరు చెప్పినట్లే నా ఎరికలో ఒకమ్మాయికి జరిగింది అంటే సరిగ్గా రష్ కు లాగే కాదు కానీ చాలా పోలికలున్నాయి
1. తన మనసుమాట వినకపోవడం
2. తల్లితండ్రుల బలవంతంతో చదువు మద్యలో ఆపేసి పెళ్ళి చేసుకోవడం
3. సాడిస్టు భర్తతో పడకుండా పుట్టింటికి వచ్చి మళ్ళీ బలవంతంగా పంపిస్తే ఇష్టం లేకపోయినా తిరిగి మొగుడి వద్దకే వెళ్ళడం
4. మొగుడు చనిపోతే రెండో పెళ్ళివాడితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉండడం (మొడిగా పేరంట్స్ వద్దన్నా)
ఇప్పుడెలా తయారైందంటే, ఎవరు చెప్పినా అది మంచైనా సరే వినకుండా తనిష్టప్రకారం చేయడం
మీ మానసిక విశ్లేషన బావుంది....కొనసాగించు బ్రో
:
:ఉదయ్

